< సమూయేలు~ రెండవ~ గ్రంథము 22 >

1 యెహోవా తనను సౌలు బారి నుండి, తన శత్రువులందరి నుండి తప్పించిన రోజున దావీదు యెహోవాకు ఈ పాట పాడాడు. అతడిలా ప్రార్థించాడు.
當上主救達味脫離了仇敵和撒烏耳的毒手時,達味向上主唱了詩歌說:
2 యెహోవా నా ఆశ్రయ శిల, నా కోట, నా రక్షకుడు.
「上主,我的盤石,我的保障,我的避難所;
3 నా ఆశ్రయ శిల, నేను ఆయన సంరక్షణలో ఉంటాను. నా డాలు, నా రక్షణ కొమ్ము, నా సురక్ష. ఆశ్రయస్థానం. హింస నుండి నన్ను కాపాడేవాడు.
天主是我所倚靠的盤石,是我的盾牌,我的大救主,我的堡壘,我的藏身處。我的救主,是你救我脫離了強暴。
4 స్తుతికి అర్హుడైన యెహోవాకు నేను మొర్రపెట్టాను. నా శత్రువుల చేతిలోనుండి నేను తప్పించుకుంటాను.
我一呼求應受頌揚的上主,我便獲救,脫離了我的仇敵。
5 మృత్యుకెరటాలు నన్ను చుట్టుకున్నాయి. భక్తిహీనుల వరద పొంగు నన్ను ముంచెత్తింది.
死亡的波濤圍繞我,凶險的急流驚嚇我,
6 పాతాళ పాశాలు నన్ను కట్టి వేశాయి. మరణపు ఉచ్చులు నన్ను చిక్కించుకున్నాయి. (Sheol h7585)
陰府的繩索纏住中我,死亡的羅網絆住我; (Sheol h7585)
7 నా దురవస్థలో నేను యెహోవాకు మొర్ర పెట్టాను. నా దేవునికి విన్నవించుకున్నాను. ఆయన తన ఆలయంలో నా ఆక్రోశం విన్నాడు. నా మొర్ర ఆయన చెవులకు చేరింది.
在急難中我呼求上主,向我的天主呼號,衪由殿中聽了我的聲音,我的呼聲達入衪耳中。
8 అప్పుడు భూమి కంపించింది. అదిరింది. పరమండలపు పునాదులు వణికాయి. ఆయన కోపానికి అవి కంపించాయి.
因衪盛大作,大地震動戢慄,上主的基礎動盪搖撼,
9 ఆయన ముక్కుపుటాల్లో నుంచి నుండి పొగ లేచింది. ఆయన నోట నుండి జ్వాలలు వచ్చాయి. అవి నిప్పు కణాలను రగిల్చాయి.
由衪的鼻孔湧出濃煙,由衪的口中噴出烈火,由衪的身上射出火炭,
10 ౧౦ ఆకాశాన్ని చీల్చి ఆయన దిగి వచ్చాడు ఆయన పాదాల కింద చిక్కటి చీకటి కమ్మి ఉంది.
使天低垂親自降下,在衪的腳下濃雲密佈。
11 ౧౧ ఆయన కెరూబును అధిరోహించి వచ్చాడు. గాలి రెక్కల మీద స్వారీ చేస్తూ కనిపించాడు.
衪乘坐革魯賓飛騰,藉著風的翼羽翱翔。
12 ౧౨ అంధకారాన్ని తన చుట్టూ గుడారంగా చేసుకున్నాడు. దట్టమైన కారుమబ్బులను ఆకాశంలో రాశి పోశాడు.
衪四周以黑暗做帷幔,以豪雨濃雲為帳幕。
13 ౧౩ ఆయన సన్నిధి మెరుపుల్లోనుండి అగ్ని కణాలు కురిశాయి.
閃電在衪前閃爍,紅炭發出了火光。
14 ౧౪ యెహోవా ఆకాశం నుండి గర్జించాడు. సర్వోన్నతుడు భీకర ధ్వని చేశాడు.
上主由高天興雷,至高者發出了呼聲。
15 ౧౫ తన బాణాలు వేసి శత్రువులను చెదరగొట్టాడు. ఉరుములు కురిపించి వారిని కకావికలు చేశాడు.
衪射出羽箭,使敵人四散,發閃電,使敵人驚擾。
16 ౧౬ యెహోవా యుధ్ధ ధ్వనికి ఆయన ముక్కుపుటాల నుండి వెలువడిన సెగకి భూగోళం పునాది రాళ్లు బయట పడ్డాయి.
上主的呵斥一發,鼻孔的怒氣一出,蒼海的海低即出現,大地的地基也外露。
17 ౧౭ పైనుండి చెయ్యి చాపి ఆయన నన్ను పట్టుకున్నాడు. నురగలు కక్కుతున్న జలరాసుల్లో నుండి నన్ను బయటికి తీశాడు.
衪由高處伸手將我拉住,由大水中將我提出。
18 ౧౮ బలవంతులైన పగవారి నుండి, నన్ను ద్వేషించే వారినిండి, నన్ను లొంగదీసుకునే వారి నుండి ఆయన నన్ను రక్షించాడు.
救我脫離了我的勁敵,擺脫了強於我的仇人。
19 ౧౯ విపత్కర సమయంలో వారు నా మీదికి వచ్చారు. కానీ యెహోవా నాకు అండగా ఉన్నాడు.
他們在我困厄之日,襲擊了我,然而上主卻作了我的後盾;
20 ౨౦ యెహోవా విశాలమైన చోటికి నన్ను తోడుకుని వచ్చాడు. నేనంటే ఆయనకు ఇష్టం గనక ఆయన నన్ను రక్షించాడు.
衪引我步坦途,因喜愛我而救了我。
21 ౨౧ నా నీతినిబట్టి ఆయన నాకు ప్రతిఫలమిచ్చాడు. నా నిర్దోషత్వాన్ని బట్టి నాకు పూర్వ క్షేమ స్థితి కలిగించాడు.
上主照我的正義酬報了我,按我雙手的清白報答了我;
22 ౨౨ ఎందుకంటే యెహోవా మార్గాలను నేను అనుసరిస్తున్నాను. నా దేవుని నుండి వైదొలగి దుర్మార్గంగా ప్రవర్తించలేదు.
因我遵行了上主的正道,沒有作惡離棄我的天主。
23 ౨౩ ఆయన న్యాయవిధులన్నీ నా కళ్ళెదుటే ఉన్నాయి. ఆయన కట్టడల నుండి ఎప్పుడూ దారి తొలగ లేదు.
衪的一切法令在我前,我未曾違過衪的誡命;
24 ౨౪ ఆయన దృష్టికి నిర్దోషిగా ఉన్నాను. పాపానికి దూరంగా ఉన్నాను.
我衪前常保成全,自知提防各種不義。
25 ౨౫ నా నీతినిబట్టి యెహోవా నాకు పూర్వ క్షేమస్థితి కలిగించాడు తన దృష్టిలో నా నిర్దోషత్వాన్ని బట్టి నాకు ప్రతిఫలమిచ్చాడు.
因此,上主照我的正義,我在衪的純潔,賞報了我。
26 ౨౬ నమ్మదగిన వారికి నీవు నమ్మదగిన వాడిగా ఉంటావు. యథార్థవంతుల పట్ల నీవు యథార్థవంతుడవుగా ఉంటావు.
仁慈的人,你待他仁慈;正直的人,你待他正直;
27 ౨౭ నిష్కళంకుల యెడల నీవు నిష్కళంకంగా ఉంటావు. వక్ర బుద్ది గలవారి యెడల వికటంగా ఉంటావు.
純的人,你待他純樸;乖戾的人,你待他乖戾。
28 ౨౮ యాతన పడే వారిని రక్షిస్తావు గర్విష్ఠులకు విరోధివై వారిని అణచి వేస్తావు.
卑微的人,你必拯救;傲慢的人,你必睥視。
29 ౨౯ యెహోవా, నీవు నాకు దీపం. యెహోవా నా చీకటిని వెలుగుగా మార్చు.
上主,你是我的火炬,我的天主,照明我的黑暗。
30 ౩౦ నీ సహాయంతో నేను అడ్డుకంచెలు అధిగమిస్తాను. నా దేవుని సహాయంతో నేను ప్రాకారాలను దాటుతాను.
仗著你,我衝入了敵營;靠著我的天主,我跳過了牆垣。
31 ౩౧ దేవుని మార్గం పరిపూర్ణం యెహోవా వాక్కు నిర్మలం ఆయన అండజేరిన వారికందరికి ఆయన డాలు.
天主的道路是完善的;上主的言語是純淨的;凡投衪的人,衪怍他們的後盾。
32 ౩౨ యెహోవా తప్ప దేవుడేడి? మన దేవుడు తప్ప ఆశ్రయదుర్గమేది?
上主以外,還有誰是天主﹖除我的的天主外,還有誰的盤石﹖
33 ౩౩ దేవుడు నాకు బలమైన కోట. ఆయన తన మార్గాల్లో యథార్థవంతులను నడిపిస్తాడు.
是天主賜我毅力,使我一路順利,
34 ౩౪ ఆయన నా కాళ్లు జింకకాళ్లవలె చేస్తాడు. పర్వతాలపై నన్ను నిలుపుతాడు.
使我的腳快如鹿蹄,使我屹立高地,
35 ౩౫ నా చేతులకు యుద్ధం నేర్పేవాడు ఆయనే నా బాహువులు ఇత్తడి విల్లును ఎక్కుబెడతాయి.
教導我手作戰,使臂膊能開銅弓。
36 ౩౬ నీవు నీ రక్షణ డాలును నాకు అందిస్తావు. నీ అనుగ్రహం నన్ను గొప్పచేస్తుంది.
你你的救生盾賜了我,你的長甲作了我的掩護。
37 ౩౭ నా పాదాల కింద స్థలం విశాలం చేస్తావు. అందువల్ల నా కాళ్ళు జారవు.
你為我的腳步拓寬了路,我的腳從未顛簸。
38 ౩౮ నా శత్రువులను తరిమి నాశనం చేస్తాను. వారిని నాశనం చేసేదాకా నేను వెనుదిరగను.
我追趕仇敵,消滅他們;不滅絕他們,決不返回。
39 ౩౯ నేను వారిని మింగి వేశాను. ముక్కలుచెక్కలు చేశాను. వారిక లేవలేరు. వారు నా కాళ్ళ కింద ఉన్నారు.
我將他們打得一蹶不振,盡都倒斃在我腳下
40 ౪౦ నడికట్టు బిగించి కట్టినట్టు యుద్ధం కోసం నాకు బలాన్ని ధరింపజేస్తావు. నా మీదికి లేచిన వారిని నీవు అణచివేస్తావు.
你賜我毅力勇作戰,把我的對手屈伏我下,
41 ౪౧ నా శత్రువుల మెడలను నా ముందు వంచావు. నన్ను ద్వేషించే వారిని నేను సమూలనాశనం చేస్తాను.
使我的敵人在 前轉背而逃,使我殲滅了一切仇恨我的人。
42 ౪౨ వారు సహాయం కోసం అరిచారు. కానీ రక్షించే వాడు ఎవడూ లేడు. వారు యెహోవా కోసం ఎదురు చూసినా ఆయన వారికి జవాబియ్యడు.
他們呼號,卻無人施救;呼號上主,也不獲應允。
43 ౪౩ నేను నేల దుమ్ము లాగా వారిని పొడి చేస్తాను. వీధిలోని బురదలాగా నేను వారిని వెదజల్లి అణగదొక్కుతాను.
我搗碎他們地上的灰塵,踐踏他們像道上的泥土。
44 ౪౪ నా స్వజనుల కలహాల్లో నుండి కూడా నీవు నన్నువిడిపించావు. ప్రజల అధికారిగా నన్ను నిలిపావు. నేను ఎరుగని ప్రజానీకం నన్ను సేవిస్తారు.
你由百姓的叛亂中救拔了我,立我做了列國的首領;我不知道的人民竟給我服役;
45 ౪౫ పరదేశులు గత్యంతరం లేక నాకు లోబడతారు. వారు నన్నుగూర్చి వింటే చాలు, నాకు విధేయులౌతారు.
外邦的子民諂媚奉承我,一聽到是我,即服從我;
46 ౪౬ అన్యులు వణకుతూ తమ భద్రమైన స్థలాలు విడిచి వస్తారు.
外的子民驚惶失色,戰戰兢兢走的堡壘。
47 ౪౭ యెహోవా సజీవుడు. నాకు అండ అయిన వాడికి స్తుతి. నా విముక్తి శిల అయిన దేవుడు ఘనత నొందుగాక.
上主萬歲! 願我的盤石受讚美,願救我的的天主受頌揚!
48 ౪౮ ఆయన నా పక్షంగా ప్రతీకారం చేసే దేవుడు జాతులను నాకు లోబరిచేవాడు ఆయనే.
天主是你為我報了仇,使萬民屈伏於我,
49 ౪౯ ఆయనే నా శత్రువుల చేతిలో నుండి నన్ను విడిస్తాడు. నా మీద దాడి చేసే వారి కంటే ఎత్తుగా నీవు నన్ను హెచ్చిస్తావు. హింసాత్మకుల నుండి నన్ను కాపాడుతావు.
是你救我脫離了我的仇敵,提拔我凌駕我的對手之上,救我脫免了強暴的人。
50 ౫౦ కాబట్టి యెహోవా, జాతుల మధ్య నీకు కృతజ్ఞతలు చెల్లిస్తాను. నీ నామానికి స్తుతి పాడుతాను.
為此,上主! 我要在異民中稱謝你,歌頌你的聖名。
51 ౫౧ తాను నియమించిన రాజుకు ఆయన గొప్ప విజయాన్నిస్తాడు. తాను అభిషేకించిన దావీదుకు అతని సంతానానికి నిబంధన విశ్వసనీయత చూపే వాడు ఆయన.
因為衪使自己的君大獲勝利,對自己的受傅者達味和他的子孫,廣施仁慈,直到永遠」。

< సమూయేలు~ రెండవ~ గ్రంథము 22 >