< సమూయేలు~ రెండవ~ గ్రంథము 16 >
1 ౧ దావీదు కొండ అంచుకు అవతల కొంచెం దూరం వెళ్లినప్పుడు మెఫీబోషెతు సేవకుడు సీబా కళ్ళకు గంతలు కట్టిబడి ఉన్న రెండు గాడిదలను తీసుకువచ్చాడు. గాడిదలపై 200 రొట్టెలు, 100 ద్రాక్ష గెలలు, వంద అంజూర ఫలాలున్న కొమ్మలు, ఒక ద్రాక్షారసపు తిత్తి వేయబడి ఉన్నాయి.
Mikor pedig Dávid egy kevéssé alább ment a hegy tetejéről, eleibe jöve Siba, a Mefibóset szolgája, két megnyergelt szamárral, melyeken kétszáz kenyér és száz kötés aszúszőlő és száz csomó füge és egy tömlő bor vala.
2 ౨ రాజు “ఇవి ఎందుకు తెచ్చావు?” అని సీబాను అడిగాడు. అప్పుడు సీబా “రాజు పరివారం ఎక్కడానికి గాడిదలు, పనివారు తినడానికి రొట్టెలు, అంజూర ఫలాల కొమ్మలు, ఎడారిలో అలసిపోయిన వారు తాగడానికి ద్రాక్షారసం తెచ్చాను” అని చెప్పాడు.
És monda a király Sibának: Mit akarsz ezzel? Felele Siba: A szamarak a király háznépéé legyenek, hogy rajtok járjanak; a kenyér pedig és a füge, hogy a szolgák megegyék, és a bor, hogy igyék, a ki megfárad a pusztában.
3 ౩ అప్పుడు రాజు “నీ యజమాని కొడుకు ఎక్కడ ఉన్నాడు?” అని అడిగాడు. సీబా “అయ్యా, ఈరోజు ఇశ్రాయేలీయులు తన తండ్రి రాజ్యాన్ని తనకు తిరిగి ఇప్పిస్తారనుకుని అతడు యెరూషలేములో ఉండిపోయాడు” అని చెప్పాడు.
És monda a király: Hol van most a te uradnak fia? Felele Siba a királynak: Ímé Jeruzsálemben marada, mert azt mondja: Visszaadja ma nékem Izráel háznépe az én atyámnak országát.
4 ౪ అప్పుడు రాజు “మెఫీబోషెతుకు కలిగినదంతా నీకే దక్కుతుంది” అని సీబాతో చెప్పినప్పుడు సీబా “నా ఏలికవైన రాజా, నాపై నీ కనికరం నిలిచి ఉంటుంది గాక. నీకు ఇవే నా నమస్కారాలు” అన్నాడు.
És monda a király Sibának: Ímé minden tied legyen, valamije volt Mefibósetnek. Monda akkor Siba: Meghajtom magamat; vajha kegyelmet találnék előtted, óh uram király!
5 ౫ రాజైన దావీదు బహూరీము దగ్గర కు వచ్చినప్పుడు సౌలు కుటుంబానికి చెందిన గెరా కుమారుడు షిమీ అనేవాడు అక్కడికి వచ్చాడు.
Elméne azután Dávid király Bahurimig, és ímé onnan egy férfi jöve ki a Saul nemzetségéből való, kinek neve Sémei vala, Gérának fia, és kijövén szidalmazza vala őket.
6 ౬ అతడు దావీదు పక్కనే నడుస్తూ “నరహంతకుడా, దుర్మార్గుడా ఛీ పో, ఛీ పో. రాజ్యాధికారం కోసం నువ్వు తరిమివేసిన సౌలు కుటుంబంవారి ఉసురు యెహోవా నీపైకి రప్పించాడు.
És kővel hajigálá Dávidot és Dávid királynak minden szolgáit, jóllehet az egész nép és az erős férfiak mindnyájan az ő jobb és balkeze felől valának.
7 ౭ నీ కుమారుడు అబ్షాలోము చేతికి యెహోవా రాజ్యాన్ని అప్పగించాడు. నువ్వు హంతకుడివి కాబట్టే ఈ మోసంలో చిక్కుకున్నావు” అని దుర్భాషలాడుతూ వచ్చాడు.
És így szóla Sémei szitkozódása közben: Eredj, eredj te vérszopó és istentelen ember!
8 ౮ రాజైన దావీదు ఇరుపక్కలా ప్రజలు, బలాఢ్యులైన వారంతా ఉన్నప్పటికీ అతడు దావీదు మీదా, అతని సేవకుల మీదా రాళ్లు రువ్వాడు.
Megfizet most az Úr néked Saul egész házanépének véréért, a ki helyett te uralkodol; és adta az Úr az országot a te fiadnak, Absolonnak: és ímé te nyomorúságban vagy, mert vérszopó ember vagy!
9 ౯ అప్పుడు సెరూయా కుమారుడు అబీషై “ఈ చచ్చిన కుక్క నా యజమానివి, రాజువు అయిన నిన్ను శపిస్తాడా? నాకు అనుమతి ఇవ్వు, నేను వాడి తల నరుకుతాను” అన్నాడు.
Monda pedig Abisai, Sérujának fia, a királynak: Hogyan szidalmazhatja ez a holt eb az én uramat, a királyt? Majd én elmegyek és fejét veszem.
10 ౧౦ అందుకు రాజు “సెరూయా కొడుకుల్లారా, మీకు నామీద ఎందుకింత అభిమానం? దావీదును శపించమని యెహోవా అతనికి చెప్పి ఉన్నట్టయితే అతణ్ణి శపించయ్యండి. నువ్వు ఇలా ఎందుకు చేస్తున్నావని అడిగేవాళ్ళెవరు?” అని చెప్పాడు.
Monda pedig a király: Mi közöm van veletek, Sérujának fiai? Hadd szidalmazzon, mert az Úr mondotta néki: Szidalmazzad Dávidot; és ki mondhatja néki: Miért míveled ezt?
11 ౧౧ తరువాత అబీషైతో, తన సేవకులందరితో, ఇలా చెప్పాడు. “నా కడుపున పుట్టిన నా కొడుకే నన్ను చంపాలని చూస్తున్నప్పుడు ఈ బెన్యామీయుడు ఇలా చేయడంలో ఆశ్చర్యం ఏముంది? వాడి సంగతి వదిలిపెట్టండి. యెహోవా వాడికి సెలవిచ్చాడు, వాడిని తిట్టనివ్వండి.
És monda Dávid Abisainak és minden szolgáinak: Íme az én fiam, ki az én ágyékomból származott, kergeti az én életemet: hogyne cselekedné tehát e Benjáminita? Hagyjatok békét néki, hadd szidalmazzon; mert az Úr mondotta néki.
12 ౧౨ యెహోవా నా బాధలను పట్టించుకుంటాడేమో, వాడు పెట్టిన శాపాలకు బదులు నాకు మేలు చేస్తాడేమో.”
Netalán reá tekint az Úr az én nyomorúságomra, és jóval fizet még ma nékem az Úr az ő átka helyett.
13 ౧౩ తరువాత దావీదు, అతని మనుషులు బయలుదేరి వెళ్ళిపోయారు. వారు వెళ్తుండగా షిమీ దావీదుకు ఎదురుగా కొండ పక్కనే నడుస్తూ అతని పైకి రాళ్లు రువ్వుతూ, దుమ్మెత్తి పోస్తూ ఉన్నాడు.
És megy vala Dávid és az ő népe az úton, Sémei pedig a hegyoldalon átellenében menvén, mentében átkozódik és köveket hajigál vala ő ellenébe, és port hány vala.
14 ౧౪ రాజు, అతనితో ఉన్నవారంతా బాగా అలసిపోయి ఉండడంవల్ల ఒక చోటికి వచ్చి అలసట తీర్చుకున్నారు.
Eljuta annakutána a király és az egész nép, mely vele vala, Ajefimbe, és ott megnyugovék.
15 ౧౫ అబ్షాలోము, అహీతోపెలు, ఇశ్రాయేలువారంతా యెరూషలేము చేరుకున్నారు.
Absolon pedig és az egész nép, Izráelnek férfiai, bemenének Jeruzsálembe, és Akhitófel is ő vele.
16 ౧౬ దావీదుతో స్నేహంగా ఉన్న అర్కీయుడు హూషై అనేవాడు అబ్షాలోము దగ్గరికి వచ్చాడు. అబ్షాలోమును చూసి “రాజు సదాకాలం జీవిస్తాడు గాక, రాజు సదాకాలం జీవిస్తాడు గాక” అని చెప్పాడు.
Mikor pedig az Arkeából való Khúsai, a Dávid barátja bement Absolonhoz, monda Khúsai Absolonnak: Éljen a király, éljen a király!
17 ౧౭ అప్పుడు అబ్షాలోము “నీ స్నేహితునికి నువ్వు చేసే ఉపకారమిదేనా? నీ స్నేహితునితో కలసి ఎందుకు వెళ్ళలేదు?” అని అడిగాడు.
És monda Absolon Khúsainak: Ez-é a barátod iránti szereteted? Miért nem mentél el barátoddal?
18 ౧౮ హూషై “యెహోవా, ఈ ప్రజలు, ఇశ్రాయేలీయులంతా ఎవరు రాజుగా ఉండాలని కోరుకుంటారో నేను అతని పక్షం వహిస్తాను. అతని దగ్గరే ఉంటాను.
Felele Khúsai Absolonnak: Nem, hanem a kit az Úr és ez a nép választ, és az Izráelnek minden fiai: azé leszek és azzal maradok.
19 ౧౯ నేనెవరికి సేవ చేయాలి? నీ తండ్రి కుమారుడికి నేను సేవ చేయాలి గదా. నీ తండ్రికి చేసినట్టు నీకు కూడా సేవ చేస్తాను” అని అబ్షాలోముతో చెప్పాడు.
Azután ugyan kinek szolgálnék örömestebb, mint az én barátom fiának? A mint szolgáltam a te atyádnak, szintén olyan leszek te hozzád is.
20 ౨౦ తరువాత అబ్షాలోము అహీతోపెలును పిలిపించాడు. “మనం ఏ ఏ పనులు చెయ్యాలో ఆలోచిద్దాం” అన్నాడు.
Monda pedig Absolon Akhitófelnek: Adjatok tanácsot, mit cselekedjünk?
21 ౨౧ అప్పుడు అహీతోపెలు “నీ తండ్రి బయలుదేరినప్పుడు ఇంటికి కాపలా ఉంచిన నీ తండ్రి ఉపపత్నులతో నువ్వు శయనించడం వల్ల నువ్వు నీ తండ్రికి మరింత అసహ్యుడవయ్యావని ఇశ్రాయేలీయులంతా తెలుసుకొంటారు. అప్పుడు నీ పక్షం వహించిన వారందరికీ ధైర్యం పెరుగుతుంది” అన్నాడు.
Felele Akhitófel Absolonnak: Menj be a te atyádnak ágyasaihoz, a kiket itthon hagyott, hogy őriznék a házat: és megérti az egész Izráel, hogy te atyád előtt gyűlöltté tetted magadat, és annál inkább megerősödnek mindazoknak kezeik, a kik melletted vannak.
22 ౨౨ తరువాత వారు మేడపైన అబ్షాలోముకు గుడారం వేశారు. ఇశ్రాయేలీయులకందరికీ తెలిసేలా అతడు తన తండ్రి ఉపపత్నులతో లైంగికంగా కలిశాడు.
Sátort vonának azért Absolonnak a tetőn, és beméne Absolon az ő atyjának ágyasaihoz, az egész Izráelnek szeme láttára.
23 ౨౩ ఆ రోజుల్లో అహీతోపెలు ఏదైనా ఆలోచన చెప్పితే అది దేవుని దగ్గర విచారణ చేయగా వచ్చినట్టుగా ఉండేది. దావీదు, అబ్షాలోము కూడా అలాగే భావించేవారు.
És Akhitófel tanácsa, melyet adott, olyannak tekintetett abban az időben, mintha valaki az Isten szavát kérdezte volna; olyan volt Akhitófelnek minden tanácsa mind Dávid előtt, mind Absolon előtt.