< సమూయేలు~ రెండవ~ గ్రంథము 15 >
1 ౧ ఇది జరిగిన తరువాత అబ్షాలోము ఒక రథాన్ని, కొన్ని గుర్రాలను సిద్దం చేసుకున్నాడు. తన ముందు పరుగెత్తడానికి ఏభైమంది సైనికులను ఏర్పాటు చేసుకున్నాడు.
Después de esto, aconteció que Absalón consiguió una carroza y caballos, y 50 hombres para que corrieran delante de él.
2 ౨ పొద్దున్నే లేచి బయలుదేరి పట్టణ ద్వార గుమ్మం దారి దగ్గర ఒకవైపున కూర్చుని ఉండేవాడు. తమ వివాదాల పరిష్కారం కోసం తీర్పుల కోసం రాజు దగ్గర వచ్చే ప్రజలను కనిపెట్టి వారిని పిలిచేవాడు. వారిని “నువ్వు ఏ ఊరివాడివి?” అని క్షేమ సమాచారాలు తెలుసుకొనేవాడు. “నీ దాసుడనైన నేను ఇశ్రాయేలు గోత్రాల్లో ఫలానా గోత్రానికి చెందినవాణ్ణి” అని వాడు చెప్పినప్పుడు,
Absalón se levantaba temprano y se colocaba junto al camino en la puerta. A cualquiera que tenía un pleito y acudía al rey para que aplicara juicio, Absalón lo llamaba y le decía: ¿De qué ciudad eres? Y él decía: Tu esclavo es de una de las tribus de Israel.
3 ౩ అబ్షాలోము “నీ వివాదం సవ్యంగా, న్యాయంగా ఉన్నది గానీ దాన్ని విచారణ చేసేందుకు రాజు దగ్గర సరి అయిన విచారణకర్త ఒక్కడు కూడా లేడు.
Entonces Absalón le decía: Mira, tu causa es buena y justa, pero no tienes quien escuche de parte del rey.
4 ౪ నేను ఈ దేశానికి న్యాయాధిపతిగా ఉంటే ఎంత బాగుండేది. అప్పుడు వివాదాలు పరిష్కరించుకోవడానికి అంతా నా దగ్గరికి వస్తారు, నేను వారికి న్యాయం జరిగిస్తాను” అని చెబుతూ వచ్చాడు.
Y Absalón decía: ¡Oh, que alguno me designara juez en la tierra, pues entonces todo hombre que tenga un pleito o una causa podría venir a mí y yo le haría justicia!
5 ౫ ఎవరైనా తనకు నమస్కారం చేయడానికి తన దగ్గరికి వస్తే అతడు తన చెయ్యి చాపి వారిని పట్టుకుని ముద్దు పెట్టుకొనేవాడు.
Acontecía que cuando alguien se acercaba para inclinarse ante él, [Absalón] extendía su mano, lo agarraba y lo besaba.
6 ౬ తీర్పు కోసం రాజు దగ్గరికి వచ్చే ఇశ్రాయేలీయులందరి పట్లా అబ్షాలోము ఈ విధంగా చేసి ఇశ్రాయేలీయులనందరినీ తనవైపు ఆకర్షించుకున్నాడు.
Absalón trataba a todo Israel de este modo cuando acudían al rey para que juzgara. Así Absalón robaba los corazones de los hombres de Israel.
7 ౭ ఆ విధంగా నాలుగేళ్ళు గడచిన తరువాత అబ్షాలోము రాజు దగ్గరికి వచ్చాడు. “నీ దాసుడనైన నేను అరాము దేశంలోని గెషూరులో ఉన్నప్పుడు ‘యెహోవా నన్ను యెరూషలేముకు తిరిగి రప్పిస్తే నేను ఆయనను సేవిస్తాను’ అని మొక్కుకున్నాను. కాబట్టి
Después de cuatro años, aconteció que Absalón dijo al rey: Te ruego que me permitas ir a Hebrón a cumplir un voto que hice a Yavé.
8 ౮ నేను హెబ్రోనుకు వెళ్ళి యెహోవాకు నేను మొక్కుబడి తీర్చుకొనడానికి నాకు అనుమతి ఇవ్వు” అని అడిగాడు.
Porque cuando estaba en Gesur, en Siria, tu esclavo juró y dijo: Si Yavé ciertamente me devuelve a Jerusalén, entonces serviré a Yavé.
9 ౯ అప్పుడు రాజు “క్షేమంగా వెళ్లి రండి” అని అతనికి అనుమతి ఇచ్చాడు. అతడు లేచి హెబ్రోనుకు బయలుదేరాడు.
Y el rey le dijo: Vé en paz. Así que se levantó y se fue a Hebrón.
10 ౧౦ అబ్షాలోము తన గూఢచారులను పిలిచి “మీరు బూర శబ్దం విన్నప్పుడు, ‘అబ్షాలోము హెబ్రోనులో పరిపాలిస్తున్నాడు’ అని కేకలు వేయాలని అన్ని ఇశ్రాయేలీయుల గోత్రాల వారిని సిద్ధపరచండి” అని చెప్పి పంపించాడు.
Pero Absalón envió mensajeros por todas las tribus de Israel, a decir: Al oír el sonido de la corneta, dirán: ¡Absalón reina en Hebrón!
11 ౧౧ అబ్షాలోము ఆహ్వానం మేరకు యెరూషలేములో నుండి 200 మంది విందు కోసం బయలుదేరారు. వీరంతా జరగబోయే విషయాలు ఏమీ తెలియని అమాయకులు.
Con Absalón salieron de Jerusalén 200 hombres como invitados, que en su ingenuidad iban sin saber algo [del motivo].
12 ౧౨ బలి అర్పించాలని గిలో గ్రామ నివాసి అహీతోపెలును పిలిపించాడు. ఇతడు దావీదు సలహాదారుడు. అబ్షాలోము దగ్గర కూడుకొన్న జన సమూహం మరీ ఎక్కువ కావడంవల్ల జరుగుతున్న కుట్ర మరింత బలపడింది.
Mientras ofrecía los sacrificios, Absalón envió a buscar a Ahitofel gilonita, consejero de David, desde Gilo su ciudad. La conspiración fue fuerte, pues aumentaba el pueblo a favor de Absalón.
13 ౧౩ ఇశ్రాయేలీయులు అబ్షాలోము పక్షం చేరిపోయారని దావీదుకు కబురు అందింది.
Entonces un mensajero fue a David y dijo: ¡Los corazones de los hombres de Israel se van tras Absalón!
14 ౧౪ దావీదు యెరూషలేములో ఉన్న తన సేవకులకందరికీ ఇలా ఆజ్ఞ ఇచ్చాడు “అబ్షాలోము చేతిలో నుండి మనం తప్పించుకుని బతకలేము. మనం పారిపోదాం పదండి. అతడు హఠాత్తుగా వచ్చి మనలను పట్టుకుని, మనకు కీడు చేయక ముందే, నగరంలో హత్యాకాండ జరిపించకముందే మనం త్వరగా వెళ్లిపోదాం రండి.”
David dijo a todos sus esclavos que estaban con él en Jerusalén: ¡Levántense y huyamos, porque ninguno de nosotros escapará de Absalón! ¡Dense prisa en salir, no sea que se apresure, nos alcance y derrame la calamidad sobre nosotros, y destruya la ciudad a filo de espada!
15 ౧౫ అప్పుడు రాజు సేవకులు ఇలా చెప్పారు “అయ్యా, వినండి. నువ్వు మమ్మల్ని ఏలేవాడివి. మాకు రాజువు. నువ్వు చెప్పినట్టు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము.”
Los esclavos contestaron al rey: ¡Mira, tus esclavos están para cualquier cosa que nuestro ʼadón el rey disponga!
16 ౧౬ అప్పుడు రాజు నగరాన్ని కనిపెట్టుకుని ఉండడానికి తన పదిమంది ఉపపత్నులను ఉంచి, తన కుటుంబాన్ని వెంటబెట్టుకుని కాలినడకన బయలుదేరాడు.
Entonces el rey salió con toda su casa tras él. Pero el rey dejó a diez mujeres concubinas para que cuidaran la casa.
17 ౧౭ రాజు, అతని కుటుంబం బయలుదేరి బెత్మెర్హాకుకు వచ్చి అక్కడ సేదదీర్చుకున్నారు.
El rey salió con todo el pueblo tras él, y se detuvieron en la última casa.
18 ౧౮ కెరేతీయులు, పెలేతీయులు, గాతు నుండి వచ్చిన ఆరు వందలమంది గిత్తీయులు రాజుకు ముందుగా నడిచారు. రాజు సేవకులంతా అతనికి రెండు వైపులా నడిచారు.
Todos sus esclavos pasaron a su lado: Todos los cereteos, los peleteos y los geteos, 600 hombres que seguían tras él desde Gat, pasaron delante del rey.
19 ౧౯ గిత్తీయుడైన ఇత్తయితో రాజు “నువ్వు నివసించేందుకు స్థలం కోరి వచ్చిన విదేశీయుడివి. మాతో కలసి ఎందుకు వస్తున్నావు? వెనక్కు వెళ్లి రాజ భవనంలో ఉండు.
Entonces el rey dijo a Itai geteo: ¿Por qué vienes tú también con nosotros? Vuelve y quédate con el [otro] rey, porque tú eres un extranjero y también un desterrado de tu lugar.
20 ౨౦ నిన్ననే వచ్చిన నీకు, ఎక్కడి వెళ్తామో తెలియని మాతో కలసి ఈ తిరుగులాట ఎందుకు? నువ్వు నీ సహోదరులను తీసుకుని వెనక్కు వెళ్ళిపో. యెహోవా నీకు తన సత్యం, కనికరం నీపై చూపుతాడు గాక” అని చెప్పాడు.
Llegaste ayer, ¿y hoy te haré vagar con nosotros mientras voy sin rumbo? Regresa y devuelve a tus hermanos. La misericordia y la verdad sean contigo.
21 ౨౧ అప్పుడు ఇత్తయి “నేను చనిపోయినా, బ్రతికినా యెహోవా మీద ఒట్టు, నా ఏలిక, రాజు అయిన నీ జీవం మీద ఒట్టు. నా రాజువైన నువ్వు ఎక్కడ ఉంటావో ఆ స్థలం లోనే నీ దాసుడనైన నేనూ ఉంటాను” అని రాజుతో చెప్పాడు.
Pero Itai respondió al rey: ¡Vive Yavé y vive mi ʼadón el rey que dondequiera que esté mi ʼadón el rey, sea para muerte o para vida, tu esclavo estará allí!
22 ౨౨ అప్పుడు దావీదు “ఆలాగైతే నువ్వు మాతో కూడ రావచ్చు” అని చెప్పినప్పుడు గిత్తీయుడైన ఇత్తయి, అతని పరివారమంతా దావీదును వెంబడించారు.
David respondió a Itai: ¡Ven y pasa adelante! E Itai geteo pasó con todos sus hombres y con todos los niños que estaban con él.
23 ౨౩ వారు కొనసాగిపోతూ ఉన్నప్పుడు ప్రజలంతా బాగా రోదించారు. ఈ విధంగా వారంతా రాజుతో కలసి కిద్రోనువాగు దాటి ఎడారి వైపు ప్రయాణమై వెళ్ళారు.
Todo el país lloraba a gran voz y todo el pueblo cruzó el torrente de Cedrón. También el rey cruzó con toda la gente que cruzaba rumbo al camino de la región despoblada.
24 ౨౪ సాదోకు, లేవీయులంతా దేవుని నిబంధన మందసాన్ని మోస్తూ దావీదు దగ్గర ఉన్నారు. వారు దేవుని మందసాన్ని కిందికి దించారు. పట్టణంలోనుండి బయలుదేరిన ప్రజలంతా దాటిపోయే వరకూ అబ్యాతారు అక్కడే నిలబడి ఉన్నాడు.
Ciertamente también Sadoc cruzó y todos los levitas que estaban con él. Cargaban el Arca del Pacto de ʼElohim. Ellos asentaron el Arca de ʼElohim hasta que todo el pueblo terminó de salir de la ciudad. Entonces Abiatar subió.
25 ౨౫ అప్పుడు రాజు సాదోకును పిలిచి “దేవుని మందసాన్ని తిరిగి పట్టణంలోకి తీసుకువెళ్ళు. యెహోవా దృష్టికి నేను దయ పొందితే ఆయన నన్ను తిరిగి రప్పించి
Luego el rey dijo a Sadoc: Haz que vuelva el Arca de ʼElohim a la ciudad. Si hallé gracia ante Yavé, Él me hará volver y me permitirá verla en su morada.
26 ౨౬ దానినీ, అది ఉండే స్థలాన్నీ నాకు చూపిస్తాడు. నీపట్ల నాకు దయ లేదని చెప్పినట్టయితే అది ఆయన ఇష్టం. ఆయన దృష్టికి ఏది అనుకూలమో దానినే నా విషయంలో జరిగిస్తాడు” అని చెప్పాడు.
Pero si dice: No me complazco en ti, aquí estoy. Que haga de mí lo que le parezca bien.
27 ౨౭ అతడు యాజకుడైన సాదోకుతో ఇంకా ఇలా చెప్పాడు. “దీర్ఘదర్శివైన సాదోకూ, నీకు మంచి జరుగుతుంది. నువ్వు నీ కొడుకు అహిమయస్సునూ, అబ్యాతారుకు కొడుకు యోనాతానునూ వెంటబెట్టుకుని పట్టణం వెళ్ళు.
Dijo además el rey al sacerdote Sadoc: ¿No eres tú el vidente? Vuelve a la ciudad en paz, y regresen los dos hijos de ustedes: tu hijo Ahimaas y Jonatán, hijo de Abiatar.
28 ౨౮ నేను చెప్పేది విను, నీ నుండి నాకు కచ్చితమైన కబురు వచ్చేదాకా నేను అరణ్యంలో నది తీరాల దగ్గర వేచి ఉంటాను.”
Miren, yo me detendré en los vados de la región despoblada hasta que venga palabra de parte de ustedes para informarme.
29 ౨౯ అప్పుడు సాదోకు, అబ్యాతారు దేవుని మందసాన్ని యెరూషలేముకు తీసుకువెళ్ళి అక్కడ ఉండిపోయారు.
Entonces Sadoc y Abiatar llevaron el Arca de ʼElohim de regreso a Jerusalén y se quedaron allí.
30 ౩౦ దావీదు తన తల కప్పుకుని, ఏడుస్తూ, చెప్పులు లేకుండా నడుచుకొంటూ ఒలీవ చెట్ల కొండ ఎక్కుతూ వెళ్ళాడు. అతనితో ఉన్నవారంతా తలలు కప్పుకుని ఏడుస్తూ కొండ ఎక్కారు.
David subió la cuesta de los Olivos. Y mientras la subió, lloraba, tenía la cabeza cubierta e iba descalzo. Y todo el pueblo, cada uno que estaba con él, cubrió su cabeza y lloraban mientras subían.
31 ౩౧ అంతలో ఒకడు వచ్చి “అబ్షాలోము చేసిన కుట్రలో అహీతోపెలుకు కూడా పాత్ర ఉంది” అని దావీదుకు చెప్పాడు. అప్పుడు దావీదు “యెహోవా, అహీతోపెలు పథకాలను చెడగొట్టు” అని ప్రార్థన చేశాడు.
Uno informó a David: Ahitofel está entre los que conspiraron con Absalón. Entonces David exclamó: ¡Oh Yavé, te ruego que entorpezcas el consejo de Ahitofel!
32 ౩౨ దేవుణ్ణి ఆరాధించే ఒక స్థలం ఆ కొండమీద ఉంది. వాళ్ళు అక్కడికి వచ్చినప్పుడు అర్కీయుడైన హూషై తన పైదుస్తులు చింపుకుని, తలపై దుమ్ము పోసుకుని వచ్చి రాజు దర్శనం చేసుకున్నాడు.
Ocurrió que cuando David llegó a la cumbre de la montaña donde solía postrarse ante ʼElohim, ahí le salió a encontrarlo Husai arquita, con la túnica rasgada y tierra sobre su cabeza.
33 ౩౩ రాజు “నువ్వు నాతో ఉంటే నాకు భారంగా ఉంటుంది.
David le dijo: Si pasas conmigo serás una carga para mí,
34 ౩౪ నువ్వు తిరిగి పట్టణానికి వెళ్లి, అబ్షాలోముతో ‘రాజా, ఇంతవరకూ నీ తండ్రికి సేవచేసినట్టు ఇకనుండి నీకూ సేవ చేస్తాను’ అని చెప్పి అతని దగ్గర చేరి, నా తరపున పనిచేస్తూ అహీతోపెలు అబ్షాలోముతో కలసి చేసే కుట్రలు భగ్నం చేయగలవు.
pero si vuelves a la ciudad y dices a Absalón: ¡Oh rey! Yo seré tu esclavo, así como fui esclavo de tu padre, ahora también soy esclavo tuyo. Entonces frustrarás el consejo de Ahitofel a mi favor.
35 ౩౫ అక్కడ యాజకులైన సాదోకు, అబ్యాతారు నీకు సహాయకులుగా ఉంటారు. కనుక రాజ నగరంలో జరుగుతున్న విషయాలు నీకు వినిపిస్తే వాటిని యాజకుడైన సాదోకుతో, అబ్యాతారుతో చెప్పు.
¿Los sacerdotes Sadoc y Abiatar no estarán allí contigo? Por tanto, toda palabra que oigan en la casa del rey la declararán a los sacerdotes Sadoc y Abiatar.
36 ౩౬ వారి ఇద్దరు కొడుకులు సాదోకు కొడుకు అహిమయస్సు, అబ్యాతారుకు కొడుకు యోనాతాను అక్కడ ఉన్నారు. నీకు తెలిసిన విషయాలన్నీ వారి ద్వారా నాకు తెలియపరచు” అని చెప్పి అతణ్ణి పంపించాడు.
Mira, están con ellos sus dos hijos: Ahimaas, el de Sadoc, y Jonatán, el de Abiatar. Por medio de ellos me informarán todo lo que oigan.
37 ౩౭ అందువల్ల దావీదు స్నేహితుడు హూషై యెరూషలేము పట్టణానికి బయలుదేరాడు. ఆ సమయానికి అబ్షాలోము యెరూషలేము చేరుకున్నాడు.
Así Husai, amigo de David, fue a la ciudad, y Absalón entró en Jerusalén.