< సమూయేలు~ రెండవ~ గ్రంథము 14 >
1 ౧ రాజు తన మనస్సు అబ్షాలోము పైనే పెట్టుకుని ఉన్నాడని సెరూయా కుమారుడు యోవాబు గ్రహించాడు.
А Йоав, син Церуї, пізнав, що царе́ве серце прихили́лося до Авесалома.
2 ౨ తెకోవ పట్టణం నుండి ఒక తెలివిగల స్త్రీని పిలిపించాడు. ఆమెతో “చాలాకాలం నుండి ఏడుస్తూ ఉన్నట్టు నటించు, విలాప దుస్తులు వేసుకో. నూనె రాసుకోకుండా ఎంతోకాలంగా విచారంగా ఉన్నట్టు నటిస్తూ
І послав Йоав до Теко́ї, і взяв звідти мудру жінку, та й сказав до неї: „Удавай жало́бу, і вберись у жало́бні шати, і не намащуйся оливою, і будеш, як та жінка, що багато днів у жало́бі за померлим.
3 ౩ నీవు రాజు దగ్గరికి వెళ్ళి నేను చెప్పిన విధంగా రాజును వేడుకో” అని చెప్పాడు.
І при́йдеш ти до царя, та й скажеш до нього таке то слово“. І Йоав поклав ці слова в її уста.
4 ౪ అప్పుడు ఆ తెకోవ స్త్రీ రాజు దగ్గరికి వచ్చింది. రాజుకు సాగిలపడి సమస్కారం చేసి “రాజా, నన్ను కాపాడు” అంది.
І говорила та текоїтянка до царя, і впала на обличчя своє на землю, і вклонилася та й сказала: „Поможи, ца́рю!“
5 ౫ రాజు “నీకేం ఇబ్బంది కలిగింది?” అని అడిగాడు. ఆమె “నా భర్త చనిపోయాడు. విధవరాలిని.
І сказав до неї цар: „Що́ тобі?“А та відказала: „Та я жінка вдова, а чоловік мій помер.
6 ౬ నీ దాసిని, నాకు ఇద్దరు కొడుకులు ఉన్నారు. వారు పొలంలో వాదులాడుకుని కొట్టుకున్నారు. వారిని విడదీసేవారు ఎవ్వరూ లేకపోవడంతో వారిలో ఒకడు రెండవవాణ్ణి కొట్టి చంపాడు.
А в невільниці твоєї двоє синів. І посвари́лися вони оби́два в полі, а рятівника́ між ними не було, — і вдарив один одно́го, та й убив його.
7 ౭ నా రక్త సంబంధులందరూ నీ దాసిని నామీదికి వచ్చి, ‘తన సోదరుణ్ణి చంపినవాణ్ణి అప్పగించు. వాడు తన సోదరుని ప్రాణం తీసినందుకు మేము వాణ్ణి చంపి వాడికి హక్కు లేకుండా చేస్తాము’ అంటున్నారు. ఈ విధంగా వారు నా భర్త పేరట భూమిపై ఉన్న హక్కును, కుటుంబ వారసత్వాన్ని లేకుండా చేయబోతున్నారు” అని రాజుతో చెప్పింది.
А ось увесь рід устав на невільницю твою та й кажуть: Видай убійника свого брата, і ми вб'ємо його за душу його брата, якого він убив, і вигубимо також спадкоє́мця. І пога́сять вони останню і́скру мою, яка позоста́лася, щоб не лишити моє́му чоловікові ані йме́ння, ані наща́дків на поверхні землі“.
8 ౮ అప్పుడు రాజు “నువ్వు నీ ఇంటికి వెళ్ళు. నీ గురించి ఆజ్ఞ జారీ చేస్తాను” అని చెప్పాడు.
І сказав цар до тієї жінки: „Іди до свого дому, а я накажу́ про тебе“.
9 ౯ అప్పుడు ఆ తెకోవ స్త్రీ “నా యజమానివైన రాజా, ఈ విషయంలో రాజుకు, రాజు సింహాసనానికి ఎలాంటి దోషం తగలకూడదు, అది నామీదా, నా కుటుంబం మీదా ఉండుగాక” అని రాజుతో అన్నది. అప్పుడు
І сказала та текоїтянка до царя: „На мене, пане мій ца́рю, той гріх, та на дім мого батька, а цар та трон його невинні“.
10 ౧౦ రాజు “ఎవడైనా ఈ విషయంలో నీకేమైనా ఇబ్బంది కలిగిస్తే వాణ్ణి నా దగ్గరికి తీసుకురా. ఇక వాడు నీకు అడ్డు రాడు” అని ఆమెతో చెప్పాడు.
І сказав цар: „Того, хто буде говорити на тебе, приведе́ш його до мене, і він більш уже не за́йме тебе“.
11 ౧౧ అప్పుడు ఆమె “హత్యకు ప్రతిగా హత్య చేసేవాడు నా కుమారుడికి ఏ హానీ తలపెట్టకుండా ఉండేలా రాజవైన నువ్వు నీ దేవుడైన యెహోవాను ప్రార్థించు” అని మనవి చేసింది. అప్పుడు రాజు “యెహోవా మీద ఒట్టు, నీ కొడుకు తలవెంట్రుకల్లో ఒక్కటి కూడా నేలపై పడదు” అని చెప్పాడు.
Та вона відказала: „Нехай згадає цар Господа, Бога свого, щоб не помно́жити на згубу ме́сника за кров та щоб вони не погубили мого сина“. А він відказав: „ Як живий Господь, — не впаде́ на землю й волоси́на сина твого́!“
12 ౧౨ అప్పుడు ఆ స్త్రీ “నా యజమానివైన నీతో ఇంకొక మాట చెప్పుకోడానికి నీ దాసిని, నాకు దయచేసి అనుమతి ఇవ్వండి” అంది. రాజు “ఏమిటో చెప్పు” అన్నప్పుడు.
І сказала та жінка: „Нехай но невільниця твоя скаже слово до свого пана царя!“А він відказав: „Говори!“
13 ౧౩ ఆ స్త్రీ “రాజు తాను చెప్పిన మాట ప్రకారం తన సొంతమనిషినే తిరిగి రానివ్వకుండా దోషం చేసిన వాడవుతున్నాడు. దేవుని ప్రజలైన వారికి వ్యతిరేకంగా నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు?
І сказала та жінка: „А чому ти так думаєш проти Божого народу? Бо цар, коли сказав таке слово, сам себе обвинува́тив, бо цар не верта́є свого вигна́нця.
14 ౧౪ మనమంతా చనిపోతాం, మనం నేలపై ఒలికిపోయి తిరిగి ఎత్తలేని నీళ్లలాగా ఉన్నాం. దేవుడు ప్రాణాలు తీయడు. వెళ్ళగొట్టిన వారు తనకు దూరంగా కాకుండా ఉండేలా ఆయన మార్గం చూపుతాడు.
Бо ми конче помремо, і ми як та вода, вилита на землю, що її не зібрати. Та Бог не знищить душі, і Він заду́мав не відвернути від Се́бе віді́гнаного.
15 ౧౫ మావాళ్ళు నన్ను భయపెట్టారు కాబట్టి నేను దీన్ని గురించి నా ఏలికవైన నీతో మాట్లాడాలని వచ్చాను. రాజు తన దాసిని, నా విన్నపం ఆలకించి,
І оце тепер прийшла я сказати панові моєму цареві оцю справу, бо той наро́д настра́шив мене. І сказала твоя невільниця: Нехай скажу́ я цареві, — може виконає цар слово своєї невільниці.
16 ౧౬ దేవుని స్వాస్థ్యం అనుభవించకుండా నన్నూ, నా కొడుకునీ అంతం చేయాలని చూసేవారి చేతిలో నుండి నన్ను కాపాడతాడని అనుకొన్నాను.
Бо цар вислухає, щоб урятува́ти свою невільницю з руки того чоловіка, що хоче ви́губити мене та мого сина ра́зом із Божого спа́дку.
17 ౧౭ నా ఏలికవైన నువ్వు చెప్పిన మాట నీ దాసినైన నాకు సమాధానకరంగా ఉంటుందని భావిస్తున్నాను. ఏలినవాడవైన నీకు నీ దేవుడైన యెహోవా తోడుగా ఉన్నాడు కనుక నువ్వు దేవదూత లాగా మంచి చెడులను వివేచించగలవు” అంది.
І сказала твоя невільниця: Нехай станеться слово мого пана царя на втіху мені, бо мій пан цар як Ангол Божий, і розуміє добре та зле. А Господь, Бог твій, буде з тобою!“
18 ౧౮ అప్పుడు రాజు “నేను నిన్ను అడిగే విషయం ఎంతమాత్రం దాచిపెట్టకుండా నాకు చెప్పు” అని ఆ స్త్రీతో అన్నాడు. ఆమె “నా యజమానివైన రాజా, ఏమిటో అడుగు” అంది.
А цар відповів та й сказав до тієї жінки: „Не заховай передо мною нічого, про що́ я спитаю тебе“. І сказала та жінка: „Нехай же говорить пан мій цар!“
19 ౧౯ రాజు “ఇదంతా యోవాబు నీకు చెప్పి పంపాడా?” అని అడిగాడు. అప్పుడు ఆమె ఇలా చెప్పింది “నా ఏలికవైన రాజా, నీ మీద ఒట్టు, చెప్పినదంతా తప్పకుండా గ్రహించడానికి నా యజమానివైన నీలాంటి రాజు తప్ప ఇంకెవ్వరూ లేరు. నీ సేవకుడు యోవాబు ఈ మాటలన్నిటినీ నీ దాసినైన నాకు నేర్పించాడు.
І цар сказав: „Чи не Йоавова рука з тобою в усьому цьому?“І відповіла та жінка та й сказала: „ Як жива душа моя, пане мій царю, — не можна відхилитися ані право́руч, ані ліво́руч від усього, що́ говорив мій пан цар, бо твій раб Йоа́в — він наказав мені це, і він уклав в уста твоєї невільниці всі ці слова́.
20 ౨౦ జరుగుతున్న పరిస్థితులను మార్చడానికి నీ సేవకుడు యోవాబు ఇలా చేశాడు. ఈ లోకంలో సమస్తాన్నీ గ్రహించడానికి నా రాజువైన నువ్వు దేవదూతలకుండే జ్ఞానం ఉన్నవాడవు.”
Щоб змінити вигляд тієї справи, раб твій Йоав зробив оцю річ. А пан мій мудрий, як мудрий Божий Ангол, щоб знати про все, що на землі“.
21 ౨౧ అప్పుడు రాజు యోవాబును పిలిచి “విను, నువ్వు చెప్పినది నేను అంగీకరించాను” అని చెప్పి,
І сказав цар до Йоава: „Ось зробив ти цю річ, тож піди, поверни́ того юнака́, Авесало́ма!“
22 ౨౨ “యువకుడైన అబ్షాలోమును రప్పించండి” అని ఆజ్ఞ ఇచ్చాడు. అప్పుడు యోవాబు సాష్టాంగపడి నమస్కారం చేసి రాజును కీర్తించాడు. “రాజువైన నువ్వు నీ దాసుడనైన నా మనవి అంగీకరించినందుకు నా ఏలికవైన నీ ద్వారా నేను అనుగ్రహం పొందానని నాకు తెలిసింది” అని చెప్పి, గెషూరుకు వెళ్లి
І впав Йоав на обличчя своє на землю, і поклонився, та й поблагослови́в царя. І сказав Йоав: „Сьогодні раб твій пізнав, що знайшов ласку в оча́х твоїх, пане мій ца́рю, бо цар виконав проха́ння свого́ раба“.
23 ౨౩ అబ్షాలోమును యెరూషలేముకు వెంటబెట్టుకుని వచ్చాడు.
І встав Йоав і пішов до Ґешуру, і привів Авесало́ма до Єрусалиму.
24 ౨౪ అయితే రాజు “అతడు నాకు ఎదుట పడక తన ఇంటికి వెళ్ళిపోవాలి” అని చెప్పాడు. అబ్షాలోము రాజుకు తన ముఖం చూపించకుండా తన ఇంటికి వెళ్ళిపోయాడు.
А цар сказав: „Нехай він ве́рнеться до свого дому, але́ обличчя мого не побачить“. І вернувся Авесалом до дому свого, та царсько́го обличчя не бачив.
25 ౨౫ ఇశ్రాయేలీయులందరిలో అబ్షాలోము అంతటి అందమైనవాడు ఎవ్వరూ లేరు. అరికాలు మొదలు నడినెత్తి వరకూ అతనిలో ఎలాంటి లోపమూ లేదు.
А такого вродли́вого мужа, як Авесалом, не було в усьому Ізраїлі, щоб був так дуже хва́лений, — від стопи ноги його й аж до ве́рху голови́ його не було в ньо́му ва́ди.
26 ౨౬ అతడు ఏడాదికొకసారి తన తలవెంట్రుకలు కత్తిరిస్తూ ఉంటాడు. ఆ వెంట్రుకల బరువు ఆనాటి కొలతను బట్టి దాదాపు రెండు కిలోగ్రాముల బరువు ఉండేది.
А коли він голив свою голову, — а голив він щороку, бо тяжке́ було волосся на ньому, тому голив його — то ва́жив воло́сся голови своєї на двісті шеклів царсько́ї ваги.
27 ౨౭ అబ్షాలోముకు ముగ్గురు కొడుకులు, ఒక కూతురు ఉన్నారు. అతని కూతురి పేరు తామారు. ఆమె అత్యంత సౌందర్యవతి.
І народи́лися Авесаломові троє синів та одна дочка́, а ім'я́ їй Тама́ра. Вона була жінка вродли́ва з ви́гляду.
28 ౨౮ అబ్షాలోము రాజును చూడకుండా పూర్తిగా రెండేళ్ళు యెరూషలేములోనే ఉండిపోయాడు.
І сидів Авесало́м в Єрусалимі два роки ча́су, а царсько́го обличчя не бачив.
29 ౨౯ రాజు దగ్గరికి యోవాబును పంపించడానికి అబ్షాలోము అతనికి కబురు పంపాడు. అయితే యోవాబు రాలేదు. రెండవసారి అతణ్ణి పిలిపించినప్పటికీ అతడు రాలేదు. అబ్షాలోముకు కోపం వచ్చింది.
І послав Авесало́м до Йоа́ва, щоб послати його до царя, та він не хотів прийти до нього. І послав він іще другий раз, та той не хотів прийти.
30 ౩౦ తన పనివారిని పిలిచి “యోవాబు పొలం నా పొలం దగ్గరే ఉన్నది గదా. అతని పొలంలో యవల పంట కోతకు వచ్చి ఉంది. మీరు వెళ్లి ఆ పంటను తగలబెట్టండి” అని చెప్పాడు. అబ్షాలోము పనివాళ్ళు ఆ పంటలు తగలబెట్టారు.
І сказав він до своїх слуг: „Погляньте на Йоавову діля́нку поля, що поруч мого, а в нього там ячмінь, — ідіть і підпаліть його огнем“. І Авесаломові слу́ги підпалили ту діля́нку поля огнем.
31 ౩౧ ఇది తెలిసిన యోవాబు అబ్షాలోము ఇంటికి వచ్చి “నీ పనివాళ్ళు నా పంటలు ఎందుకు తగలబెట్టారు?” అని అడిగాడు.
Тоді Йоав устав і прийшов до Авесалома до дому, та й сказав йому: „Нащо слу́ги твої підпалили огнем ту мою діля́нку поля?“
32 ౩౨ అబ్షాలోము యోవాబుతో ఇలా అన్నాడు “గెషూరు నుండి నేను రావడంవల్ల ఉపయోగం ఏమిటి? నేను అక్కడే ఉండడం మంచిదని నీ ద్వారా రాజుకు చెప్పించడానికి నీకు కబురు పంపాను. నేను రాజును కలుసుకోవాలి. నాలో ఏమైనా నేరం కనిపిస్తే రాజు నాకు మరణశిక్ష విధించవచ్చు” అన్నాడు.
І сказав Авесалом до Йоава: „Я ж посилав до тебе, говорячи: Прийди сюди, і нехай я пошлю́ тебе до царя сказати: Чого я прийшо́в із Ґешу́ру? Добре було б мені ще лишатися там. А тепер нехай я побачу царське́ обличчя, а якщо є на мені гріх, то нехай уб'є мене“.
33 ౩౩ అప్పుడు యోవాబు రాజు దగ్గరికి వచ్చి ఆ విషయం రాజుకు చెప్పినప్పుడు, రాజు అబ్షాలోమును పిలిపించాడు. అతడు రాజు దగ్గరికి వచ్చి రాజు ముందు సాష్టాంగపడి నమస్కారం చేశాడు. రాజు అబ్షాలోమును దగ్గరికి తీసుకుని ముద్దు పెట్టుకున్నాడు.
І прийшов Йоав до царя, і розповів йому те. І покликав він Авесало́ма, а той прийшов до царя та й поклонився йому обличчям своїм до землі. А цар поцілував Авесалома...