< సమూయేలు~ రెండవ~ గ్రంథము 14 >

1 రాజు తన మనస్సు అబ్షాలోము పైనే పెట్టుకుని ఉన్నాడని సెరూయా కుమారుడు యోవాబు గ్రహించాడు.
Now Joab son of Zeruiah perceived that the king's heart desired to see Absalom.
2 తెకోవ పట్టణం నుండి ఒక తెలివిగల స్త్రీని పిలిపించాడు. ఆమెతో “చాలాకాలం నుండి ఏడుస్తూ ఉన్నట్టు నటించు, విలాప దుస్తులు వేసుకో. నూనె రాసుకోకుండా ఎంతోకాలంగా విచారంగా ఉన్నట్టు నటిస్తూ
So Joab sent word to Tekoa and had a wise woman brought to him. He said to her, “Please pretend you are a mourner and put on mourning clothes. Please do not anoint yourself with oil, but be like a woman who has mourned a long time for the dead.
3 నీవు రాజు దగ్గరికి వెళ్ళి నేను చెప్పిన విధంగా రాజును వేడుకో” అని చెప్పాడు.
Then go to the king and speak to him about what I will describe.” So Joab told her the words she was to say to the king.
4 అప్పుడు ఆ తెకోవ స్త్రీ రాజు దగ్గరికి వచ్చింది. రాజుకు సాగిలపడి సమస్కారం చేసి “రాజా, నన్ను కాపాడు” అంది.
When the woman from Tekoa spoke to the king, she lay facedown on the ground and said, “Help me, king.”
5 రాజు “నీకేం ఇబ్బంది కలిగింది?” అని అడిగాడు. ఆమె “నా భర్త చనిపోయాడు. విధవరాలిని.
The king said to her, “What is wrong?” She answered, “The truth is that I am a widow, and my husband is dead.
6 నీ దాసిని, నాకు ఇద్దరు కొడుకులు ఉన్నారు. వారు పొలంలో వాదులాడుకుని కొట్టుకున్నారు. వారిని విడదీసేవారు ఎవ్వరూ లేకపోవడంతో వారిలో ఒకడు రెండవవాణ్ణి కొట్టి చంపాడు.
I, your servant, had two sons, and they fought together in the field, and there was no one to separate them. One struck the other and killed him.
7 నా రక్త సంబంధులందరూ నీ దాసిని నామీదికి వచ్చి, ‘తన సోదరుణ్ణి చంపినవాణ్ణి అప్పగించు. వాడు తన సోదరుని ప్రాణం తీసినందుకు మేము వాణ్ణి చంపి వాడికి హక్కు లేకుండా చేస్తాము’ అంటున్నారు. ఈ విధంగా వారు నా భర్త పేరట భూమిపై ఉన్న హక్కును, కుటుంబ వారసత్వాన్ని లేకుండా చేయబోతున్నారు” అని రాజుతో చెప్పింది.
Now the whole clan has risen against your servant, and they say, 'Give into our hand the man who struck his brother, so that we may put him to death, to pay for the life of his brother whom he killed.' So they would also destroy the heir. Thus they will put out the burning coal that I have left, and they will leave for my husband neither name nor descendant on the surface of the earth.”
8 అప్పుడు రాజు “నువ్వు నీ ఇంటికి వెళ్ళు. నీ గురించి ఆజ్ఞ జారీ చేస్తాను” అని చెప్పాడు.
So the king said to the woman, “Go to your house, and I will command something to be done for you.”
9 అప్పుడు ఆ తెకోవ స్త్రీ “నా యజమానివైన రాజా, ఈ విషయంలో రాజుకు, రాజు సింహాసనానికి ఎలాంటి దోషం తగలకూడదు, అది నామీదా, నా కుటుంబం మీదా ఉండుగాక” అని రాజుతో అన్నది. అప్పుడు
The woman of Tekoa replied to the king, “My master, king, may the guilt be on me and on my father's family. The king and his throne are guiltless.”
10 ౧౦ రాజు “ఎవడైనా ఈ విషయంలో నీకేమైనా ఇబ్బంది కలిగిస్తే వాణ్ణి నా దగ్గరికి తీసుకురా. ఇక వాడు నీకు అడ్డు రాడు” అని ఆమెతో చెప్పాడు.
The king replied, “Whoever says anything to you, bring him to me, and he will not touch you anymore.”
11 ౧౧ అప్పుడు ఆమె “హత్యకు ప్రతిగా హత్య చేసేవాడు నా కుమారుడికి ఏ హానీ తలపెట్టకుండా ఉండేలా రాజవైన నువ్వు నీ దేవుడైన యెహోవాను ప్రార్థించు” అని మనవి చేసింది. అప్పుడు రాజు “యెహోవా మీద ఒట్టు, నీ కొడుకు తలవెంట్రుకల్లో ఒక్కటి కూడా నేలపై పడదు” అని చెప్పాడు.
Then she said, “Please, may the king call to mind Yahweh your God, so that the avenger of blood will not destroy anyone further, so that they will not destroy my son.” The king replied, “As Yahweh lives, not one hair of your son will fall to the ground.”
12 ౧౨ అప్పుడు ఆ స్త్రీ “నా యజమానివైన నీతో ఇంకొక మాట చెప్పుకోడానికి నీ దాసిని, నాకు దయచేసి అనుమతి ఇవ్వండి” అంది. రాజు “ఏమిటో చెప్పు” అన్నప్పుడు.
Then the woman said, “Please let your servant speak a further word to my master the king.” He said, “Speak on.”
13 ౧౩ ఆ స్త్రీ “రాజు తాను చెప్పిన మాట ప్రకారం తన సొంతమనిషినే తిరిగి రానివ్వకుండా దోషం చేసిన వాడవుతున్నాడు. దేవుని ప్రజలైన వారికి వ్యతిరేకంగా నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు?
So the woman said, “Why then have you devised such a thing against the people of God? For in saying this thing, the king is like someone who is guilty, because the king has not brought back home again his banished son.
14 ౧౪ మనమంతా చనిపోతాం, మనం నేలపై ఒలికిపోయి తిరిగి ఎత్తలేని నీళ్లలాగా ఉన్నాం. దేవుడు ప్రాణాలు తీయడు. వెళ్ళగొట్టిన వారు తనకు దూరంగా కాకుండా ఉండేలా ఆయన మార్గం చూపుతాడు.
For we all must die, and we are like water spilled on the ground, which cannot be gathered up again. But God will not take away life; instead, he finds a way for those who were driven away to be restored.
15 ౧౫ మావాళ్ళు నన్ను భయపెట్టారు కాబట్టి నేను దీన్ని గురించి నా ఏలికవైన నీతో మాట్లాడాలని వచ్చాను. రాజు తన దాసిని, నా విన్నపం ఆలకించి,
Now then, seeing that I have come to speak this thing to my master the king, it is because the people have made me afraid. So your servant said to herself, 'I will now speak to the king. It may be that the king will perform the request of his servant.
16 ౧౬ దేవుని స్వాస్థ్యం అనుభవించకుండా నన్నూ, నా కొడుకునీ అంతం చేయాలని చూసేవారి చేతిలో నుండి నన్ను కాపాడతాడని అనుకొన్నాను.
Perhaps the king will listen to me and deliver his servant from the hand of the man who would destroy me and my son together, out of the inheritance God gave us.'
17 ౧౭ నా ఏలికవైన నువ్వు చెప్పిన మాట నీ దాసినైన నాకు సమాధానకరంగా ఉంటుందని భావిస్తున్నాను. ఏలినవాడవైన నీకు నీ దేవుడైన యెహోవా తోడుగా ఉన్నాడు కనుక నువ్వు దేవదూత లాగా మంచి చెడులను వివేచించగలవు” అంది.
Then your servant prayed, 'Yahweh, please let the word of my master the king give me relief, for as an angel of God, so is my master the king in telling good from evil.' May Yahweh your God be with you.”
18 ౧౮ అప్పుడు రాజు “నేను నిన్ను అడిగే విషయం ఎంతమాత్రం దాచిపెట్టకుండా నాకు చెప్పు” అని ఆ స్త్రీతో అన్నాడు. ఆమె “నా యజమానివైన రాజా, ఏమిటో అడుగు” అంది.
Then the king answered and said to the woman, “Please do not hide from me anything that I will ask you.” The woman replied, “Let my master the king now speak.”
19 ౧౯ రాజు “ఇదంతా యోవాబు నీకు చెప్పి పంపాడా?” అని అడిగాడు. అప్పుడు ఆమె ఇలా చెప్పింది “నా ఏలికవైన రాజా, నీ మీద ఒట్టు, చెప్పినదంతా తప్పకుండా గ్రహించడానికి నా యజమానివైన నీలాంటి రాజు తప్ప ఇంకెవ్వరూ లేరు. నీ సేవకుడు యోవాబు ఈ మాటలన్నిటినీ నీ దాసినైన నాకు నేర్పించాడు.
The king said, “Is not the hand of Joab with you in all this?” The woman answered and said, “As you live, my master the king, no one can escape to the right hand or to the left from anything that my master the king has spoken. It was your servant Joab who commanded me and told me to say these things that your servant has spoken.
20 ౨౦ జరుగుతున్న పరిస్థితులను మార్చడానికి నీ సేవకుడు యోవాబు ఇలా చేశాడు. ఈ లోకంలో సమస్తాన్నీ గ్రహించడానికి నా రాజువైన నువ్వు దేవదూతలకుండే జ్ఞానం ఉన్నవాడవు.”
Your servant Joab has done this to change the course of what is happening. My master is wise, like the wisdom of an angel of God, and he knows everything that is happening in the land.”
21 ౨౧ అప్పుడు రాజు యోవాబును పిలిచి “విను, నువ్వు చెప్పినది నేను అంగీకరించాను” అని చెప్పి,
So the king said to Joab, “Look now, I will do this thing. Go then, and bring the young man Absalom back.”
22 ౨౨ “యువకుడైన అబ్షాలోమును రప్పించండి” అని ఆజ్ఞ ఇచ్చాడు. అప్పుడు యోవాబు సాష్టాంగపడి నమస్కారం చేసి రాజును కీర్తించాడు. “రాజువైన నువ్వు నీ దాసుడనైన నా మనవి అంగీకరించినందుకు నా ఏలికవైన నీ ద్వారా నేను అనుగ్రహం పొందానని నాకు తెలిసింది” అని చెప్పి, గెషూరుకు వెళ్లి
So Joab lay facedown on the ground in honor and gratitude to the king. Joab said, “Today your servant knows that I have found favor in your eyes, my master, king, in that the king has performed the request of his servant.”
23 ౨౩ అబ్షాలోమును యెరూషలేముకు వెంటబెట్టుకుని వచ్చాడు.
So Joab arose, went to Geshur, and brought Absalom back to Jerusalem.
24 ౨౪ అయితే రాజు “అతడు నాకు ఎదుట పడక తన ఇంటికి వెళ్ళిపోవాలి” అని చెప్పాడు. అబ్షాలోము రాజుకు తన ముఖం చూపించకుండా తన ఇంటికి వెళ్ళిపోయాడు.
The king said, “He may return to his own house, but he may not see my face.” So Absalom returned to his own house, but did not see the king's face.
25 ౨౫ ఇశ్రాయేలీయులందరిలో అబ్షాలోము అంతటి అందమైనవాడు ఎవ్వరూ లేరు. అరికాలు మొదలు నడినెత్తి వరకూ అతనిలో ఎలాంటి లోపమూ లేదు.
Now in all Israel there was no one praised for his handsomeness more than Absalom. From the sole of his foot to the top of his head there was no blemish in him.
26 ౨౬ అతడు ఏడాదికొకసారి తన తలవెంట్రుకలు కత్తిరిస్తూ ఉంటాడు. ఆ వెంట్రుకల బరువు ఆనాటి కొలతను బట్టి దాదాపు రెండు కిలోగ్రాముల బరువు ఉండేది.
When he cut the hair of his head at the end of every year, because it was heavy on him, he weighed his hair; it would weigh about two hundred shekels, which is measured by the weight of the king's standard.
27 ౨౭ అబ్షాలోముకు ముగ్గురు కొడుకులు, ఒక కూతురు ఉన్నారు. అతని కూతురి పేరు తామారు. ఆమె అత్యంత సౌందర్యవతి.
To Absalom were born three sons and one daughter, whose name was Tamar. She was a beautiful woman.
28 ౨౮ అబ్షాలోము రాజును చూడకుండా పూర్తిగా రెండేళ్ళు యెరూషలేములోనే ఉండిపోయాడు.
Absalom lived two full years in Jerusalem, without seeing the king's face.
29 ౨౯ రాజు దగ్గరికి యోవాబును పంపించడానికి అబ్షాలోము అతనికి కబురు పంపాడు. అయితే యోవాబు రాలేదు. రెండవసారి అతణ్ణి పిలిపించినప్పటికీ అతడు రాలేదు. అబ్షాలోముకు కోపం వచ్చింది.
Then Absalom sent word for Joab to send him to the king, but Joab would not come to him. So Absalom sent word a second time, but Joab still did not come.
30 ౩౦ తన పనివారిని పిలిచి “యోవాబు పొలం నా పొలం దగ్గరే ఉన్నది గదా. అతని పొలంలో యవల పంట కోతకు వచ్చి ఉంది. మీరు వెళ్లి ఆ పంటను తగలబెట్టండి” అని చెప్పాడు. అబ్షాలోము పనివాళ్ళు ఆ పంటలు తగలబెట్టారు.
So Absalom said to his servants, “See, Joab's field is near mine, and he has barley there. Go and set it on fire.” So Absalom's servants set the field on fire.
31 ౩౧ ఇది తెలిసిన యోవాబు అబ్షాలోము ఇంటికి వచ్చి “నీ పనివాళ్ళు నా పంటలు ఎందుకు తగలబెట్టారు?” అని అడిగాడు.
Then Joab arose and came to Absalom at his house, and said to him, “Why have your servants set my field on fire?”
32 ౩౨ అబ్షాలోము యోవాబుతో ఇలా అన్నాడు “గెషూరు నుండి నేను రావడంవల్ల ఉపయోగం ఏమిటి? నేను అక్కడే ఉండడం మంచిదని నీ ద్వారా రాజుకు చెప్పించడానికి నీకు కబురు పంపాను. నేను రాజును కలుసుకోవాలి. నాలో ఏమైనా నేరం కనిపిస్తే రాజు నాకు మరణశిక్ష విధించవచ్చు” అన్నాడు.
Absalom answered Joab, “Look, I sent word to you saying, 'Come here so I may send you to the king to say, “Why did I come from Geshur? It would be better for me to still be there. Now therefore let me see the king's face, and if I am guilty, let him kill me.”'”
33 ౩౩ అప్పుడు యోవాబు రాజు దగ్గరికి వచ్చి ఆ విషయం రాజుకు చెప్పినప్పుడు, రాజు అబ్షాలోమును పిలిపించాడు. అతడు రాజు దగ్గరికి వచ్చి రాజు ముందు సాష్టాంగపడి నమస్కారం చేశాడు. రాజు అబ్షాలోమును దగ్గరికి తీసుకుని ముద్దు పెట్టుకున్నాడు.
So Joab went to the king and told him. When the king called for Absalom, he came to the king and bowed low to the ground before the king, and the king kissed Absalom.

< సమూయేలు~ రెండవ~ గ్రంథము 14 >