< సమూయేలు~ రెండవ~ గ్రంథము 13 >
1 ౧ దావీదు కొడుకు, అబ్షాలోముకు తామారు అనే ఒక అందమైన సోదరి ఉంది. దావీదు కొడుకు, అమ్నోను ఆమెపై కోరిక పెంచుకున్నాడు.
И бысть по сих, и у Авессалома сына Давидова бе сестра добра взором зело, имя же ей Фамарь, и возлюби ю Амнон сын Давидов:
2 ౨ తామారు అవివాహిత కావడంవల్ల ఆమెను ఏమీ చేయలేని స్థితిలో ఉన్న అమ్నోను దిగులు పెంచుకుని తామారును బట్టి చిక్కిపోసాగాడు.
и скорбяше Амнон, яко и разболетися (ему) сестры своея ради Фамары, зане дева бяше сия, и не удобно бе пред очима Амнонима что сотворити ей.
3 ౩ అమ్నోనుకు ఒక స్నేహితుడు ఉన్నాడు. అతడు దావీదు సోదరుడు షిమ్యా కుమారుడు. అతని పేరు యెహోనాదాబు. ఈ యెహోనాదాబు ఎంతో కుటిలమైన బుద్ది గలవాడు. అతడు అమ్నోనుతో,
И бе Амнону друг, имя же ему Ионадав, сын Самаа брата Давидова, и Ионадав муж мудр зело.
4 ౪ “రాజ కుమారుడవైన నువ్వు రోజురోజుకీ చిక్కిపోడానికి కారణం ఏమిటి? విషయం ఏమిటో నాకు చెప్పవా?” అని అడిగాడు. అమ్నోను “నా సోదరుడైన అబ్షాలోము సోదరి తామారుపై కోరిక కలిగి ఉన్నాను” అని చెప్పాడు.
И рече ему (Ионадав): что ти, яко ты тако болиши, сыне царев, утро утро? И не возвещаеши ми? И рече ему Амнон: Фамару сестру Авессалома брата моего аз люблю.
5 ౫ అప్పుడు యెహోనాదాబు “నీకు జబ్బు చేసినట్టు నటించి నీ మంచం మీద పండుకుని ఉండు. నీ తండ్రి నిన్ను చూడడానికి వచ్చినప్పుడు నువ్వు, ‘నా సోదరి తామారు చేతి వంట నేను తినేలా ఆమె వచ్చి నేను చూస్తుండగా వండి నాకు పెట్టేలా ఆమెతో చెప్పు’ అని రాజును అడుగు” అని సలహా ఇచ్చాడు. అమ్నోను జబ్బు చేసినట్టు నటిస్తూ పడక మీద పండుకున్నాడు.
И рече ему Ионадав: лязи на постели твоей и разболися, и внидет отец твой видети тя, и речеши к нему: да приидет ныне Фамарь сестра моя, и да ми даст ясти, и да сотворит пред очима моима снедь, да увижду и вкушу от рук ея.
6 ౬ అమ్నోను జబ్బు పడ్డాడని రాజుకు తెలిసి, అతణ్ణి పరామర్శించేందుకు వచ్చాడు. అప్పుడు అమ్నోను “నా సోదరి తామారు చేతి వంట నేను తినేలా ఆమె వచ్చి నేను చూస్తుండగా నా కోసం రెండు రొట్టెలు చేయమని చెప్పు” అని రాజును అడిగాడు.
И ляже Амнон и разболеся: и вниде царь видети его. И рече Амнон к царю: да приидет ныне Фамарь сестра моя ко мне и да испечет два пряжма пред очима моима, и имам ясти от руку ея.
7 ౭ దావీదు “నీ సోదరుడు అమ్నోను ఇంటికి వెళ్లి అతని కోసం భోజనం తయారుచెయ్యి” అని తామారు ఇంటికి కబురు పంపాడు.
И посла Давид к Фамаре в дом, глаголя: иди ныне в дом Амнона брата твоего и сотвори ему снедь.
8 ౮ తామారు, అమ్నోను ఇంటికి వెళ్ళింది.
И иде Фамарь в дом Амнона брата своего, и той лежаше. И взя тесто, и смеси, и устрои пред очима его, и испече пряжма:
9 ౯ అతడు పండుకుని ఉన్నప్పుడు ఆమె పిండి తీసుకు కలిపి అతని ముందు రొట్టెలు చేసి వాటిని కాల్చి గిన్నెలో పెట్టి వాటిని అతనికి వడ్డించబోయింది. అతడు “నాకు వద్దు” అని చెప్పి, అక్కడ ఉన్నవారితో “ఇక్కడున్న వారంతా నా దగ్గర నుండి బయటకు వెళ్ళండి” అని చెప్పాడు.
и взя сковраду и изложи пред него, и не восхоте ясти. И рече Амнон: изжените вся мужы от мене. И изгнаша вся мужы от него.
10 ౧౦ వారంతా బయటికి వెళ్ళిన తరువాత అమ్నోను “నీ చేతి వంటకం నేను తినేలా దాన్ని నా గదిలోకి తీసుకురా” అని చెప్పాడు. తామారు తాను చేసిన రొట్టెలను తీసుకు గదిలో ఉన్న అమ్నోను దగ్గరికి వచ్చింది.
И рече Амнон к Фамаре: внеси ми снедь во внутреннюю храмину, и ям от руку твоею. И взя Фамарь пряжма, яже испече, и внесе Амнону брату своему во внутреннюю храмину,
11 ౧౧ అయితే అతడు ఆమెను పట్టుకుని “నా సోదరీ, రా, నాతో శయనించు” అన్నాడు.
и представи ему да яст. И ят ю, и рече ей: гряди, лязи со мною, сестро моя.
12 ౧౨ ఆమె “అన్నయ్యా, నన్నిలా అవమానపరచొద్దు. ఇలా చేయడం ఇశ్రాయేలీయులకు న్యాయం కాదు. ఇలాంటి జారత్వం లోకి పడిపోవద్దు. ఈ అవమానం నేనెక్కడ దాచుకోగలను?
И рече ему: ни, брате мой, не обругай мене, понеже не сотворится тако во Израили, не сотвори безумия сего:
13 ౧౩ నువ్వు కూడా ఇశ్రాయేలీయుల్లో దుర్మార్గుడిగా మారతావు. దీని గూర్చి రాజుతో మాట్లాడు. అతడు నన్ను నీకిచ్చి వివాహం చేయవచ్చు” అని చెప్పింది.
и аз камо скрыю безчестие мое? И ты будеши яко един от безумных во Израили: и ныне глаголи к царю, да не отлучит мене от тебе.
14 ౧౪ అయినా అతడు ఆమె మాట వినలేదు. పశుబలంతో ఆమెను మానభంగం చేసి అవమానించాడు.
И не восхоте Амнон послушати гласа ея, и преодоле ей, и смири ю, и преспа с нею.
15 ౧౫ అమ్నోను ఇలా చేసిన తరువాత ఆమెను ప్రేమించినంతకంటే ఎక్కువ ద్వేషం ఆమెపై పుట్టింది. ఆమెను “లేచి వెళ్ళిపో” అని చెప్పాడు.
И возненавиде ю Амнон ненавистию великою зело, яко велиим ненавидением возненавиде ю паче любве, еюже любляше ю, и рече ей Амнон: востани и отиди.
16 ౧౬ ఆమె “నన్ను బయటకు తోసివేయడం ద్వారా నాకు ఇప్పుడు చేసిన కీడు కంటే మరి ఎక్కువ కీడు చేసినవాడివి అవుతావు” అని చెప్పింది.
И рече ему Фамарь: (ни, брате, ) яко злоба болши есть последняя паче первыя, юже сотворил еси со мною, еже отслати мене. И не восхоте Амнон слышати гласа ея.
17 ౧౭ అతడు ఆమె మాట వినిపించుకోలేదు. తన పనివాళ్ళలో ఒకణ్ణి పిలిచి “ఈమెను నా దగ్గర నుండి పంపివేసి తలుపులు వెయ్యి” అని చెప్పాడు.
И призва отрока своего, приставника дому своего, и рече ему: отсли ныне сию от мене вон, и заключи двери вслед ея.
18 ౧౮ వివాహం కాని రాజకుమార్తెలు రకరకాల రంగుల చీరలు ధరించేవారు. ఆమె అలాంటి చీర కట్టుకుని ఉన్నప్పటికీ ఆ పనివాడు ఆమెను బయటికి వెళ్లగొట్టి మళ్ళీ రాకుండా ఉండేలా తలుపుకు గడియ పెట్టాడు.
И бе риза на ней испещрена, понеже тако облачахуся дщери царевы, сущыя девицы, во одежды своя. И изведе ю вон слуга его и затвори двери вслед ея.
19 ౧౯ అప్పుడు తామారు తలమీద బూడిద పోసుకుని, కట్టుకొన్న రంగు రంగుల చీర చింపివేసి తలపై చేతులు పెట్టుకుని ఏడుస్తూ వెళ్ళిపోయింది.
И взя Фамарь пепел, и насыпа на главу свою, и одежду испещренную растерза на себе, и возложи руце свои на главу свою, и идущи идяше и вопияше.
20 ౨౦ ఆమె అన్న అబ్షాలోము ఆమెను చూసి “నీ అన్న అమ్నోను నీతో తన వాంఛ తీర్చుకున్నాడు గదా? నా సోదరీ, నువ్వు నెమ్మదిగా ఉండు. అతడు నీ అన్నే గదా, దీని విషయంలో బాధపడకు” అన్నాడు. మానం కోల్పోయిన తామారు అప్పటినుండి అబ్షాలోము ఇంట్లోనే ఉండిపోయింది.
И рече к ней Авессалом брат ея: еда Амнон брат твой бысть с тобою? И ныне, сестро моя, умолчи, яко брат твой есть: не полагай на сердцы твоем еже глаголати слово сие. И седе Фамарь вдовствующи в дому Авессалома брата своего.
21 ౨౧ ఈ సంగతి రాజైన దావీదుకు తెలిసింది. అతడు తీవ్రమైన కోపం తెచ్చుకున్నాడు.
И слыша царь Давид вся словеса сия, и разгневася зело, и не опечали духа Амнона сына своего, понеже любляше его, яко первенец бе ему.
22 ౨౨ అబ్షాలోము తన సోదరుడైన అమ్నోనుతో మంచిచెడ్డలేమీ మాటలాడకుండా మౌనంగా ఉన్నాడు. అయితే తన సోదరి తామారును మానభంగం చేసినందుకు అతనిపై పగ పెంచుకున్నాడు.
И не глагола Авессалом со Амноном ни о добре, ни о зле, понеже возненавиде Авессалом Амнона того ради, понеже Фамару сестру его обругал.
23 ౨౩ రెండేళ్ళ తరువాత అబ్షాలోముకు గొర్రెలబొచ్చు కత్తిరించే కాలం వచ్చింది. ఎఫ్రాయిముకు దగ్గర బయల్హాసోరులో అబ్షాలోము రాజకుమారులనందరినీ విందుకు పిలిచాడు.
И бысть по двух летех дний, и беша стригуще (овцы) Авессаломовы (раби) в Веласоре близ Ефрема: и призва Авессалом вся сыны царевы.
24 ౨౪ అబ్షాలోము రాజు దగ్గరికి వచ్చి “రాజా, వినండి. నీ దాసుడనైన నాకు గొర్రెల బొచ్చు కత్తిరించే సమయం వచ్చింది. రాజవైన నువ్వూ నీ సేవకులూ విందుకు రావాలని నీ దాసుడనైన నేను కోరుతున్నాను” అని మనవి చేసుకున్నాడు.
И прииде Авессалом ко царю и рече: се, ныне стригут рабу твоему, да идет убо царь и отроцы его с рабом твоим.
25 ౨౫ అప్పుడు రాజు “నా కుమారా, మమ్మల్ని పిలవొద్దు. మేము రాకూడదు. మేమంతా వస్తే అదనపు భారంగా ఉంటాం” అని చెప్పాడు. రాజు అలా చెప్పినప్పటికీ అబ్షాలోము తప్పకుండా రావాలని రాజును బలవంతపెట్టాడు.
И рече царь ко Авессалому: ни, сыне мой, да не пойдем вси мы, и да не отяготим тя. И нуждаше его: и не восхоте (царь) ити, и благослови его.
26 ౨౬ అయితే దావీదు వెళ్లకుండా అబ్షాలోమును దీవించి పంపాడు. అప్పుడు అబ్షాలోము “నువ్వు రాలేకపోతే నా సోదరుడు అమ్నోను మాతో కలసి బయలుదేరేలా అనుమతి ఇవ్వు” అని రాజుకు మనవి చేశాడు. “అతడు నీ దగ్గరికి ఎందుకు రావాలి?” అని దావీదు అడిగాడు.
И рече Авессалом к нему: аще же ни, поне да идет с нами Амнон брат мой. И рече ему царь: почто идет с тобою Амнон?
27 ౨౭ అబ్షాలోము అతణ్ణి బతిమిలాడాడు. రాజు అమ్నోను, తన కొడుకులంతా అబ్షాలోము దగ్గరకు వెళ్ళవచ్చని అనుమతి ఇచ్చాడు.
И принуди его Авессалом, и отпусти с ним Амнона и вся сыны царевы. И сотвори Авессалом пир, якоже творит пир царь.
28 ౨౮ ఈలోగా అబ్షాలోము తన పనివాళ్ళను పిలిచి “నేను మీకు ఆజ్ఞాపిస్తున్నాను. అమ్నోను బాగా ద్రాక్షారసం తాగి మత్తెక్కి ఉన్న సమయంలో అతణ్ణి చంపమని నేను మీకు చెప్పినప్పుడు మీరు భయపడకుండా అతణ్ణి చంపివేయండి. ధైర్యం తెచ్చుకుని పౌరుషం చూపించండి” అని చెప్పాడు.
И заповеда Авессалом отроком своим, глаголя: видите егда возблажает сердце Амноне от вина, и реку вам: поразите Амнона, и умертвите его: не убойтеся, яко не аз ли есмь повелеваяй вам? Мужайтеся и будите в сыны силы.
29 ౨౯ అబ్షాలోము ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం వారు అమ్నోనును చంపేశారు. రాజకుమారులంతా భయపడి లేచి తమ కంచరగాడిదెలు ఎక్కి పారిపోయారు.
И сотвориша отроцы Авессаломли Амнону, якоже заповеда им Авессалом. И восташа вси сынове царевы, и вседе кийждо на мска своего, и бежаша.
30 ౩౦ వారు దారిలో ఉండగానే “ఒక్కడు కూడా మిగలకుండా రాజకుమారులందరినీ అబ్షాలోము చంపివేశాడు” అన్న వార్త దావీదుకు అందింది.
И бысть, сущым им на пути, и слух дойде до Давида, глаголя: изби Авессалом вся сыны царевы, и не избысть от них ни един.
31 ౩౧ అతడు లేచి తన బట్టలు చించుకుని నేలపై పడి ఉన్నాడు. అతని సేవకులంతా తన బట్టలు చించుకుని రాజు దగ్గర నిలబడి ఉన్నారు.
И воста царь, и растерза ризы своя, и ляже на земли, и вси отроцы его предстоящии ему растерзаша ризы своя.
32 ౩౨ దీని చూసిన దావీదు సోదరుడు షిమ్యా కొడుకు యెహోనాదాబు “రాజా, రాజకుమారులైన యువకులందరినీ వారు చంపారని నువ్వు అనుకోవద్దు. అమ్నోను ఒక్కడినే చంపారు. ఎందుకంటే, అతడు అబ్షాలోము సహోదరి తామారును మానభంగం చేసినప్పటి నుండి అతడు అమ్నోనును చంపాలన్న పగతో ఉన్నాడని అతని మాటలనుబట్టి గ్రహించవచ్చు.
И рече Ионадав, сын Самаа брата Давидова, и рече: да не речет господин мой царь, яко вся отроки сыны царевы уби, но Амнон есть един убиен, яко той из уст Авессалому не исхождаше, отнележе обруга сестру его Фамару:
33 ౩౩ కాబట్టి మా రాజువైన నువ్వు నీ కొడుకులంతా చనిపోయారని భావించి విచారపడవద్దు. అమ్నోను మాత్రమే చనిపోయాడు” అని చెప్పాడు.
и ныне да не полагает господин мой царь словесе на сердцы своем, глаголя: вси сынове царевы умроша: яко Амнон един умре.
34 ౩౪ కాపలా కాసేవాడు ఎదురుచూస్తూ ఉన్నప్పుడు అతని వెనక, కొండ పక్కన దారిలో నుండి వస్తున్న చాలమంది కనబడ్డారు.
И побеже Авессалом. И воздвиже отрок страж очеса своя и виде: и се, людие мнози идуще путем вслед его со страны гор в низхождение. И прииде страж и возвести царю и рече: мужы видех от пути Оронска со страны горы.
35 ౩౫ వారు పట్టణంలోకి రాగానే యెహోనాదాబు “అదిగో రాజకుమారులు వచ్చారు. నీ దాసుడనైన నేను చెప్పినట్టుగానే జరిగింది” అని రాజుతో అన్నాడు.
И рече Ионадав ко царю: се, сынове царевы приходят: по словеси раба твоего, тако бысть.
36 ౩౬ అతడు తన మాటలు ముగించగానే రాజకుమారులు వచ్చి గట్టిగా ఏడవడం మొదలుపెట్టారు. ఇది చూసి రాజు, అతని సేవకులంతా కూడా ఏడ్చారు.
И бысть егда сконча глаголя, и се, сынове царевы приидоша и воздвигоша глас свой и плакаша: и сам царь и вси отроцы его плакаша плачем великим зело.
37 ౩౭ ఇది జరిగిన తరువాత అబ్షాలోము అక్కడినుంచి పారిపోయి గెషూరు రాజు అమీహూదు కొడుకు తల్మయి దగ్గరికి చేరుకున్నాడు. దావీదు ప్రతిరోజూ తన కొడుకు కోసం శోకిస్తూ ఉండిపోయాడు.
И Авессалом убеже, и прииде ко Фолму сыну Емиуда, царю Гедсурску, в землю Хамаахадску. И плакаше Давид царь о сыне своем вся дни.
38 ౩౮ అబ్షాలోము పారిపోయి గెషూరు వచ్చి అక్కడ మూడేళ్ళు గడిపాడు.
И Авессалом убеже, и иде в Гедсур, и бе тамо три лета.
39 ౩౯ అమ్నోను ఇక చనిపోయాడు గదా అని రాజైన దావీదు అతని గూర్చి ఓదార్పు పొంది అబ్షాలోమును చంపాలన్న ఆలోచన మానుకున్నాడు.
И остави царь Давид изыти вслед Авессалома, яко утешися о Амноне, яко умре.