< సమూయేలు~ రెండవ~ గ్రంథము 11 >

1 వసంత కాలంలో రాజులు యుద్ధాలకు బయలుదేరే కాలంలో, అమ్మోనీయులను సంహరించి రబ్బా పట్టణాన్ని ఆక్రమించుకోడానికి దావీదు యోవాబునీ తన సేవకులనూ ఇశ్రాయేలు సైన్యమంతటినీ పంపించాడు. దావీదు యెరూషలేములోనే ఉండిపోయాడు.
해가 돌아와서 왕들의 출전할 때가 되매 다윗이 요압과 그 신복과 온 이스라엘 군대를 보내니 저희가 암몬 자손을 멸하고 랍바를 에워쌌고 다윗은 예루살렘에 그대로 있으니라
2 ఒకరోజు సాయంత్రం సమయంలో దావీదు పడక మీద నుండి లేచి రాజభవనం డాబా మీద నడుస్తున్నాడు. డాబాపై నుండి కిందికి చూస్తున్నప్పుడు స్నానం చేస్తూ ఉన్న ఒక స్త్రీ కనిపించింది.
저녁때에 다윗이 그 침상에서 일어나 왕궁 지붕 위에서 거닐다가 그 곳에서 보니 한 여인이 목욕을 하는데 심히 아름다와 보이는지라
3 ఆమె ఎంతో అందంగా ఉంది. ఆమె గురించి వివరాలు తెలుసుకు రమ్మని దావీదు ఒకణ్ణి పంపించాడు. అతడు వచ్చి “ఆమె పేరు బత్షెబ. హిత్తీయుడైన ఊరియా భార్య, ఏలీయాము కూతురు” అని చెప్పాడు.
다윗이 보내어 그 여인을 알아보게 하였더니 고하되 `그는 엘리암의 딸이요 헷 사람 우리아의 아내 밧세바가 아니니이까?'
4 దావీదు తన మనుషులను పంపి ఆమెను తన దగ్గరికి పిలిపించాడు. ఆమె అతని దగ్గరకు వచ్చినప్పుడు ఆమెతో శయనించాడు. ఆమె తనకు కలిగిన మలినం పోగొట్టుకుని తన ఇంటికి తిరిగి వెళ్ళింది.
다윗이 사자를 보내어 저를 자기에게로 데려 오게 하고 저가 그 부정함을 깨끗케 하였으므로 더불어 동침하매 저가 자기 집으로 돌아가니라
5 కొన్ని రోజులకు ఆమె గర్భం ధరించింది. “నేను గర్భవతి నయ్యాను” అని ఆమె దావీదుకు కబురు పంపింది.
여인이 잉태하매 보내어 다윗에게 고하여 가로되 `내가 잉태하였나이다' 하니라
6 దావీదు “హిత్తీయుడైన ఊరియాని నా దగ్గరికి పంపించు” అని ఒక వ్యక్తి ద్వారా యోవాబుకు కబురు చేశాడు.
다윗이 요압에게 기별하여 `헷 사람 우리아를 내게 보내라' 하매 요압이 우리아를 다윗에게로 보내니
7 యోవాబు ఊరియాని దావీదు దగ్గరికి పంపించాడు. జరుగుతున్న యుద్ధ విశేషాలనూ యోవాబు, ఇతర సైనికుల క్షేమ సమాచారాలనూ దావీదు అతణ్ణి అడిగి తెలుసుకున్నాడు.
우리아가 다윗에게 이르매 다윗이 요압의 안부와 군사의 안부와 싸움의 어떠한 것을 묻고
8 తరువాత దావీదు “నువ్వు ఇంటికి వెళ్లి విశ్రాంతి తీసుకో” అని ఊరియాకు అనుమతి ఇచ్చాడు. ఊరియా రాజు నగరం నుండి బయలుదేరాడు. రాజు అతని వెనకాలే అతనికి ఒక బహుమానం పంపించాడు.
저가 또 우리아에게 이르되 `네 집으로 내려가서 발을 씻으라' 하니 우리아가 왕궁에서 나가매 왕의 식물이 뒤따라 가니라
9 అయితే ఊరియా తన ఇంటికి వెళ్ళకుండా రాజు సేవకులతో కలసి రాజనగర గుమ్మం దగ్గర నిద్రపోయాడు.
그러나 우리아는 집으로 내려가지 아니하고 왕궁 문에서 그 주의 신복들로 더불어 잔지라
10 ౧౦ ఊరియా అతని ఇంటికి వెళ్ళలేదన్న సంగతి దావీదుకు తెలిసింది. అప్పుడు దావీదు ఊరియాను పిలిపించి “నువ్వు ప్రయాణం చేసి అలసిపోయావు కదా, ఇంటికి ఎందుకు వెళ్ళలేదు?” అని అడిగాడు.
혹이 다윗에게 고하여 가로되 `우리아가 그 집으로 내려가지 아니하였나이다' 다윗이 우리아에게 이르되 `네가 길 갔다가 돌아온 것이 아니냐? 어찌하여 네 집으로 내려가지 아니하였느냐?'
11 ౧౧ అందుకు ఊరియా “మందసమూ, ఇశ్రాయేలువారూ యూదావారూ గుడారాల్లో ఉంటున్నారు. నా అధికారి యోవాబూ, మా రాజువైన నీ సేవకులూ బాహ్య ప్రదేశంలో ఉండగా నేను తింటూ, తాగుతూ నా భార్యతో గడపడానికి ఇంటికి వెళ్ళాలా? నీ మీద, నీ ప్రాణం మీద ఒట్టు, నేను అలా ఎంత మాత్రం చేయలేను” అని దావీదుతో అన్నాడు.
우리아가 다윗에게 고하되 `언약궤와 이스라엘과 유다가 영채 가운데 유하고 내 주 요압과 내 왕의 신복들이 바깥 들에 유진하였거늘 내가 어찌 내 집으로 가서 먹고 마시고 내 처와 같이 자리이까? 내가 이 일을 행치 아니하기로 왕의 사심과 왕의 혼의 사심을 가리켜 맹세하나이다'
12 ౧౨ అప్పుడు దావీదు “ఈరోజు కూడా నువ్వు ఇక్కడే ఉండు. రేపు నిన్ను పంపిస్తాను” అని ఊరియాతో చెప్పాడు. ఊరియా ఆ రోజు, తరువాతి రోజు యెరూషలేములో ఉండిపోయాడు.
다윗이 우리아에게 이르되 `오늘도 여기 있으라 내일은 내가 너를 보내리라' 우리아가 그 날에 예루살렘에 유하니라 이튿날
13 ౧౩ ఈలోగా దావీదు ఊరియాను భోజనానికి పిలిపించాడు. దావీదు అతడు బాగా తిని, తాగి మత్తుడయ్యేలా చేశాడు. సాయంత్రమయ్యాక అతడు బయలుదేరి వెళ్లి మళ్ళీ తన ఇంటికి వెళ్ళకుండా రాజు సేవకుల మధ్య నిద్రపోయాడు.
다윗이 저를 불러서 저로 그 앞에서 먹고 마시고 취하게 하니 저녁 때에 저가 나가서 그 주의 신복으로 더불어 침상에 눕고 그 집으로 내려가지 아니하니라
14 ౧౪ తెల్లవారిన తరువాత దావీదు “యుద్ధం భీకరంగా జరుగుతున్న చోట ఊరియాను ముందు వరుసలో నిలబెట్టి అతడు చనిపోయేలా చేసి అక్కడి నుండి వెళ్ళిపో” అని
아침이 되매 다윗이 편지를 써서 우리아의 손에 부쳐 요압에게 보내니
15 ౧౫ యోవాబుకు ఉత్తరం రాయించి దాన్ని ఊరియా చేత పంపించాడు.
그 편지에 써서 이르기를 `너희가 우리아를 맹렬한 싸움에 앞세워 두고 너희는 뒤로 물러가서 저로 맞아 죽게 하라' 하였더라
16 ౧౬ యోవాబు అమ్మోనీయుల పట్టాణాన్ని ఆక్రమించే సమయంలో యుద్ధం భీకరంగా జరిగే స్థలాన్ని గుర్తించి ఆ స్థలానికి ఊరియాను పంపాడు.
요압이 그 성을 살펴 용사들의 있는 줄을 아는 그 곳에 우리아를 두니
17 ౧౭ ఆ పట్టణం వారు బయటికీ వచ్చి యోవాబుతో యుద్ధం చేసినప్పుడు కొందరు దావీదు సేవకులతో పాటు హిత్తీయుడైన ఊరియా కూడా చనిపోయాడు.
성 사람들이 나와서 요압으로 더불어 싸울 때에 다윗의 신복 중 몇 사람이 엎드러지고 헷 사람 우리아도 죽으니라
18 ౧౮ యోవాబు ఈ యుద్ధ సమాచారాన్ని ఒక సైనికుడి ద్వారా దావీదుకు తెలియజేశాడు.
요압이 보내어 전쟁의 모든 일을 다윗에게 고할새
19 ౧౯ యోవాబు ఆ సైనికుడితో “యుద్ధ సమాచారం రాజుకు చెప్పిన తరువాత రాజు కోపం తెచ్చుకుని ‘మీరు యుద్ధం తీవ్రంగా జరుగుతున్న పట్టణానికి దగ్గరగా ఎందుకు వెళ్లారు?
그 사자에게 명하여 가로되 `전쟁의 모든 일을 네가 왕께 고하기를 마친 후에
20 ౨౦ గోడపైకి ఎక్కి వాళ్ళు బాణాలు వేస్తారని మీకు తెలియదా?
혹시 왕이 노하여 네게 말씀하기를 너희가 어찌하여 성에 그처럼 가까이 가서 싸웠느냐? 저희가 성 위에서 쏠 줄을 알지 못하였느냐?
21 ౨౧ ఎరుబ్బెషెతు కొడుకు అబీమెలెకు ఎలా చనిపోయాడు? తేబేసు దగ్గర ఒక స్త్రీ తిరగలి రాయిని గోడపై నుండి అతని మీద వేయడం వల్లనే గదా అతడు చనిపోయింది? ప్రాకారం దగ్గరికి మీరెందుకు వెళ్ళారు?’ అని అడిగితే, నువ్వు, ‘తమ సేవకుడైన ఊరియా కూడా చనిపోయాడు’ అని చెప్పు” అని చెప్పి ఆ సైనికుణ్ణి పంపాడు.
여룹베셋의 아들 아비멜렉을 쳐 죽인 자가 누구냐? 여인 하나가 성에서 맷돌 윗짝을 그 위에 던지매 저가 데벳스에서 죽지 아니하였느냐? 어찌하여 성에 가까이 갔더냐? 하시거든 네가 말하기를 왕의 종 헷 사람 우리아도 죽었나이다 하라'
22 ౨౨ యోవాబు పంపిన సైనికుడు వచ్చి దావీదుకు విషయమంతా చెప్పాడు.
사자가 가서 다윗에게 이르러 요압의 모든 보낸 일을 고하여
23 ౨౩ ఎలాగంటే “వారి సైనికులు మమ్మల్ని తరుముతూ యుద్ధభూమిలో మాకు ఎదురు పడినప్పుడు మేము వారిని సరిహద్దుల వరకూ తరిమి గెలిచాము.
가로되 `그 사람들이 우리보다 승하여 우리를 향하여 들로 나온고로 우리가 저희를 쳐서 성문 어귀까지 미쳤더니
24 ౨౪ అప్పుడు గోడలపై నుండి విలుకాళ్ళు తమ సైనికులపై బాణాలు కురిపించారు. రాజు సేవకుల్లో కొందరితో సహా తమరి సేవకుడు, హిత్తీయుడైన ఊరియా కూడా చనిపోయాడు.”
활 쏘는 자들이 성 위에서 왕의 신복들을 향하여 쏘매 왕의 신복 중 몇사람이 죽고 왕의 종 헷 사람 우리아도 죽었나이다'
25 ౨౫ అప్పుడు దావీదు “నువ్వు యోవాబుతో ఈ మాట చెప్పు. ‘జరిగినదాన్ని బట్టి నువ్వు బాధపడవద్దు. కత్తి ఒకసారి ఒకరిని, మరోసారి మరొకరిని చంపుతుంది. పట్టణం మీద యుద్ధం మరింత తీవ్రతరం చేసి దాన్ని ఓడించు’ అని యోవాబుకు ధైర్యం చెప్పు” అని ఆ సైనికునికి చెప్పి పంపించాడు.
다윗이 사자에게 이르되 `너는 요압에게 이같이 말하기를 이 일로 걱정하지 말라 칼은 이 사람이나 저 사람이나 죽이느니라 그 성을 향하여 더욱 힘써 싸워 함락시키라 하여 너는 저를 담대케 하라' 하니라
26 ౨౬ ఊరియా భార్య బత్షెబ తన భర్త చనిపోయిన సంగతి విని విలపించింది.
우리아의 처가 그 남편 우리아의 죽었음을 듣고 호곡하니라
27 ౨౭ విలాప సమయం ముగిసిన తరువాత దావీదు తన మనుషులను పంపి ఆమెను తన భవనానికి రప్పించుకున్నాడు. ఆమె దావీదుకు భార్యగా ఉండి ఒక కొడుకును కన్నది. అయితే దావీదు చేసిన ఈ పని యెహోవా దృష్టిలో పాపంగా నిలిచిపోయింది.
그 장사를 마치매 다윗이 보내어 저를 궁으로 데려 오니 저가 그처가 되어 아들을 낳으니라 다윗의 소위가 여호와 보시기에 악하였더라

< సమూయేలు~ రెండవ~ గ్రంథము 11 >