< 2 పేతురు 1 >

1 యేసు క్రీస్తుకు బానిస, అపొస్తలుడు అయిన సీమోను పేతురు, మన దేవుడూ, రక్షకుడూ అయిన యేసు క్రీస్తు నీతిని బట్టి మాకు సమానంగా అమూల్యమైన విశ్వాసాన్ని పొందినవారికి రాస్తున్న సంగతులు.
Симон Петър, слуга и апостол Исус Христов, на вас, които чрез правдата на нашия Бог и Спасител Исус Христос сте получили еднаква с нас скъпоценна вяра:
2 దేవునిలో, మన ప్రభువైన యేసులో పూర్తి జ్ఞానం ద్వారా మీకు కృప, శాంతి విస్తరించు గాక!
Благодат и мир да ви се умножи чрез познаването на Бога и на Исуса, нашия Господ.
3 తన మహిమనుబట్టి, మంచి గుణాన్నిబట్టి మనలను పిలిచిన దేవుడు తన జ్ఞానం ద్వారా, తన శక్తి మూలంగా మనం జీవం, దైవభక్తి కలిగి జీవించడానికి కావలసినవన్నీ ఇచ్చాడు.
Понеже Неговата божествена сила ни е подарила всичко що е потребно за живота и за благочестието, чрез познаването на Този, Който ни е призовал чрез Своята слава и сила:
4 వీటిని బట్టే ఆయన మనకు అమూల్యమైన గొప్ప వాగ్దానాలు ఇచ్చాడు. ఈ వాగ్దానాల మూలంగా, లోకంలో ఉన్న దుర్మార్గపు కోరికల నాశనగుణం నుండి తప్పించుకుని మీరు తన స్వభావంలో పాలిభాగస్థులు కావాలన్నదే దేవుని ఉద్దేశం.
чрез които се подариха скъпоценните нам и твърде големи обещания, за да станете чрез тях участници на божественото естество, като сте избягали от произлязлото от страстите разтление в света;
5 ఈ కారణంగా మీరు పూర్తి భక్తి శ్రద్ధలు కలిగి, మీ విశ్వాసానికి మంచి గుణం, మంచి గుణానికి జ్ఞానం,
то по самата тая причина положете всяко старание и прибавете на вярата си добродетел, на добродетелта си благоразумие,
6 జ్ఞానానికి ఆశల అదుపు, ఆశల అదుపుకు ఓర్పు, ఓర్పుకు భక్తి,
на благоразумието си себеобуздание, на себеобузданието си твърдост, на твърдостта си благочестие,
7 భక్తికి సోదర ప్రేమ, సోదర ప్రేమకు దైవ ప్రేమ జోడించండి.
на благочестието си братолюбие, и на братолюбието си любов.
8 ఇవి మీలో నిలిచి ఉండి వృద్ధి చెందినపుడు, మన ప్రభు యేసు క్రీస్తును గురించిన జ్ఞానంలో మందకొడిగా, నిష్ఫలంగా ఉండరు.
Защото ако тия добродетели се намират у вас и изобилват, те ви правят да не сте безделни нито безплодни в познаването на нашия Господ Исус Христос.
9 కాని ఈ గుణాలు లేనివాడు, తాను గతంలో చేసిన పాపాలనుండి దేవుడు శుభ్రపరిచాడని మరచిపోతాడు. అతడు దూరదృష్టి లేని గుడ్డివాడు.
Но оня, у когото те не се намират, е сляп, късоглед, и е забравил, че е бил очистен от старите си грехове.
10 ౧౦ కాబట్టి సోదరులారా, మీ పిలుపును, మీ ఎన్నికను స్థిరం చేసుకోడానికి పూర్తి శ్రద్ధ కలిగి ఉండండి. అప్పుడు మీరు ఎన్నడూ తడబడరు.
Затова, братя, постарайте се още повече да затвърдявате вашето призвание и избиране; защото като вършите тия добродетели, никога няма да изпаднете.
11 ౧౧ దీని ద్వారా మన ప్రభువు, రక్షకుడు అయిన యేసు క్రీస్తు రాజ్యంలోకి ఘనమైన ప్రవేశం మీకు దొరుకుతుంది. (aiōnios g166)
Понеже така ще ви се даде голям достъп във вечното царство на нашия Господ и Спасител Исус Христос. (aiōnios g166)
12 ౧౨ వీటి గురించి మీకు ముందే తెలిసినా, మీరు అంగీకరించిన సత్యంలో స్థిరంగా ఉన్నా ఈ సంగతులు మీకు ఎప్పుడూ గుర్తు చేస్తూనే ఉంటాను.
Затова всякога ще бъда готов да ви напомням за тия работи, ако и да ги знаете и да сте утвърдени в истината, която сега държите.
13 ౧౩ నేను ఈ శరీరం అనే గుడారంలో ఉన్నంత వరకూ ఇవి మీకు గుర్తు చేయడం మంచిదని భావిస్తున్నాను.
И мисля, че е право, докато съм в тая телесна хижа, да ви подтиквам чрез напомняне;
14 ౧౪ మన ప్రభు యేసు క్రీస్తు ముందుగానే నాకు వెల్లడి చేసిన ప్రకారం నేను త్వరలోనే ఈ శరీరం వదిలేస్తానని నాకు తెలుసు.
понеже зная, че скоро ще напусна хижата си, както ми извести нашият Господ Исус Христос.
15 ౧౫ నేను చనిపోయిన తరువాత కూడా మీరు వీటిని ఎప్పుడూ గుర్తు చేసుకునేలా శ్రద్ధ తీసుకుంటాను.
Даже ще се постарая щото вие и след смъртта ми, да можете всякога да помните тия работи.
16 ౧౬ ఎందుకంటే, మన ప్రభు యేసు క్రీస్తు శక్తిని, ఆయన రాకడను గురించి చాకచక్యంగా అల్లిన కల్పనా కథలను మేము మీకు చెప్పలేదు, ఆయన గొప్పదనాన్ని కళ్ళారా చూసిన వారుగా చెప్పాం.
Защото, когато ви обявихме силата и пришествието на нашия Господ Исус Христос, ние не следвахме хитроизмислени басни, а бяхме очевидци на Неговото величие.
17 ౧౭ ఆయన మన తండ్రి అయిన దేవుని నుండి ఘనత, మహిమ పొందగా, “ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన విషయంలో నేను ఆనందిస్తున్నాను” అనే గొప్ప మహిమగల దైవస్వరం వచ్చినప్పుడు,
Защото Той прие от Бога Отца почест и слава, когато от великолепната слава дойде от Него такъв глас: Този е Моят възлюбен Син, в Когото е Моето благоволение.
18 ౧౮ ఆయనతో మేము ఆ పవిత్ర పర్వతం మీద ఉండి పైనుండి వచ్చిన ఆ స్వరాన్ని స్వయంగా విన్నాం.
Тоя глас чухме сами ние, че дойде от небето, когато бяхме с Него на светата планина.
19 ౧౯ ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్కు మనకు ఉంది. తెల్లవారి వేకువచుక్క మీ హృదయాల్లో ఉదయించే వరకూ ఆ వాక్కు చీకట్లో వెలుగు ఇచ్చే దీపంలా ఉంది. ఆ వెలుగును మీరు లక్ష్యపెడితే మీకు మేలు.
И така, пророческото слово повече се потвърждава за нас; и вие добре правите, че внимавате на него, като на светило, което свети в тъмно място, догде се зазори, и зорницата изгрее в сърцата ви.
20 ౨౦ లేఖన ప్రవచనాలు మనిషి ఊహల్లో నుండి పుట్టలేదని మీరు ముందుగా గ్రహించాలి.
И това да знаете преди всичко, че никое пророчество в писанието не е частно на пророка обяснение на Божията воля:
21 ౨౧ ప్రవచనం ఎప్పుడూ మనిషి ఉద్దేశంలో నుండి పుట్టలేదు, పరిశుద్ధాత్మతో నిండిన మనుషులు దేవుని మూలంగా మాట్లాడగా వచ్చింది.
защото никога не е идвало пророчество от човешка воля, но [светите] човеци са говорили от Бога; движими от Святия Дух.

< 2 పేతురు 1 >