< 2 పేతురు 3 >
1 ౧ ప్రియులారా, ఇది నేను మీకు రాస్తున్న రెండవ ఉత్తరం. యథార్ధమైన మీ మనసును పురికొల్పడానికి జ్ఞాపకం చేస్తూ వీటిని రాస్తున్నాను.
Се вже, любі, друге пишу вам посланнє, в котрих, наповідаючи збуджаю чисту думку вашу,
2 ౨ పవిత్ర ప్రవక్తలు పూర్వకాలంలో చెప్పిన మాటలనూ, మన ప్రభువు, రక్షకుడు అయిన యేసు క్రీస్తు మీ అపొస్తలుల ద్వారా ఇచ్చిన ఆజ్ఞనూ మీరు గుర్తు చేసుకోవాలని ఈ ఉత్తరం రాస్తున్నాను.
щоб згадали слова, проречені від сьвятих пророків, і заповідь від нас, яко апостолів Господа і Спаса,
3 ౩ ముందుగా ఇది తెలుసుకోండి, చివరి రోజుల్లో తమ దురాశలను అనుసరించి నడిచే కొందరు బయలుదేరతారు.
се найперш знаючи, що прийдуть в останнї дні ругателї, ходящі по своєму хотїнню,
4 ౪ “ఆయన మళ్ళీ వస్తాడన్న వాగ్దానం ఏమయ్యింది? మా పూర్వీకులు చనిపోయారు, కాని సృష్టి ఆరంభం నుండి అన్ని విషయాలూ ఏమీ మార్పు లేకుండానే జరిగిపోతున్నాయి” అంటూ మిమ్మల్ని ఎగతాళి చేస్తారు.
і скажуть: Де обітниця приходу Його? від коли бо батьки умирають, усе так само пробував від почину створіння.
5 ౫ చాలాకాలం కిందట, ఆకాశాన్నీ భూమినీ దేవుడు తన వాక్కు ద్వారా నీళ్ళలో నుండి, నీళ్ళ ద్వారా స్థిరపరిచాడనీ,
Не знають бо ті, що так хочуть, що небеса були в давнього часу, і земля із води, і в водї постала словом Божим,
6 ౬ ఆయన వాక్కును బట్టే, ఆ రోజుల్లో ఉన్న లోకం వరద నీటిలో మునిగి నాశనం అయ్యిందనీ,
для чого й тогдашнїй сьвіт водою затоплений, погиб;
7 ౭ అదే వాక్కును బట్టి ఇప్పటి ఆకాశం, భూమి భక్తిహీనులకు జరిగే తీర్పు రోజు వరకు, మంటల్లో నాశనం కావడానికి సిద్ధంగా ఉన్నదనీ వారు ఉద్దేశ పూర్వకంగా మరచిపోతారు.
нинїшні ж небеса і земля тим самим словом заховані, і на огонь зберегають ся про день суду й погибелї безбожних людей.
8 ౮ కాని ప్రియులారా, ఈ విషయం మరచిపోకండి. ప్రభువు దృష్టికి ఒక్క రోజు వెయ్యి సంవత్సరాలుగా, వెయ్యి సంవత్సరాలు ఒక్క రోజుగా ఉంటాయి.
Тільки ж одно се нехай не буде перед вами тайне, любі, що один день у Господа, як тисяч лїт, а тисяч лїт, як один день.
9 ౯ కొంతమంది అనుకుంటున్నట్టు ప్రభువు తాను చేసిన వాగ్దానాల విషయంలో ఆలస్యం చేసేవాడు కాదు గానీ అందరూ మారిన మనసుతో తిరిగి రావాలనీ, ఎవ్వరూ నశించ కూడదనీ కోరుతూ మీ పట్ల చాలా ఓర్పుతో ఉన్నాడు.
Не гаїть ся Господь з обітницею, як се декотрі за гайку вважають; а довготерпить вам, не хотячи, щоб хто погиб, а щоб усї до покаяння прийшли.
10 ౧౦ అయితే, ప్రభువుదినం ఎవరికీ తెలియని విధంగా దొంగ వచ్చినట్టు ఉంటుంది. అప్పుడు ఆకాశాలు మహా ఘోషతో గతించిపోతాయి. పంచభూతాలు మంటల్లో కాలిపోతాయి. భూమి, దానిలో ఉన్నవన్నీ తీర్పుకు గురౌతాయి.
Прийде ж день Господень, як злодїй в ночі; тодї небеса з шумом перейдуть, первотини ж, розпечені розтоплять ся, і земля і дїла на нїй погорять.
11 ౧౧ ఇవన్నీ ఈ విధంగా నాశనం అయిపోతాయి గనుక మీరు పవిత్ర జీవనం, దైవభక్తి సంబంధమైన విషయాల్లో ఏ విధంగా జీవించాలి?
Коли ж се все зруйнуєть ся, то якими слїд вам бути в сьвятому життю і побожності,
12 ౧౨ దేవుడు వచ్చే రోజు కోసం మీరు ఎదురు చూస్తున్నారు గనుక ఆ రోజు త్వరగా రావాలని ఆశించండి. ఆ దినాన పంచభూతాలు తీవ్రమైన సెగతో కరిగిపోతాయి. ఆకాశంలో ఉన్నవన్నీ మంటల్లో కాలిపోతాయి
дожидаючи й бажаючи скорого приходу Божого дня, котрого небеса, палаючи, рунуть, і первотини, горючи, розтоплять ся?
13 ౧౩ అయినా, ఆయన చేసిన వాగ్దానం కారణంగా కొత్త ఆకాశం, కొత్త భూమి కోసం మనం ఎదురు చూస్తున్నాం. దానిలో నీతిపరులు నివాసం చేస్తారు.
Нових же небес і землї нової по обітницї дожидаємось, в котрих правда домує.
14 ౧౪ కాబట్టి, ప్రియులారా, మీరు వీటి కోసం ఎదురు చూస్తున్నారు గనక ప్రశాంతంగా, ఆయన దృష్టిలో ఏ మచ్చా, కళంకం లేని వారిగా ఉండండి.
Тим то, любі, сього дожидаючи, старайтесь нескверними і чистими явитись перед Ним в упокою,
15 ౧౫ మన ప్రభువు చూపించే సహనం మన రక్షణ కోసమే అని గ్రహించండి. ఆ విధంగానే మన ప్రియ సోదరుడు పౌలు కూడా దేవుడు తనకు ఇచ్చిన జ్ఞానంతో రాశాడు.
а довготерпіннє Господа нашого за спасеннє вважайте; яко ж і любий наш брат Павел по даній йому премудрості писав вам,
16 ౧౬ అతడు ఈ సంగతులను గురించి తన లేఖలన్నిటిలో మాట్లాడుతున్నాడు. అయితే వాటిలో కొన్నిటిని అర్థం చేసుకోవడం కష్టం. పామరులు, నిలకడ లేని కొందరు అనేక ఇతర లేఖనాలను చేసినట్టే వీటిని కూడా వక్రీకరించి, వారి నాశనం వారే తెచ్చుకుంటారు.
яко ж і в усїх листах, говорячи в них про сї речі; в котрих дещо тяжко зрозуміти, що неуки і неутверджені перекручують, як і инші писання, на свою власну погибіль.
17 ౧౭ కాబట్టి ప్రియులారా, ఈ విషయాలు మీకు తెలుసు కాబట్టి అక్రమకారుల మోసం మిమ్మల్ని తప్పు దారి పట్టించి మీ స్థిరత్వం పాడు చేయకుండా జాగ్రత్తపడండి.
Ви ж, любі, знаючи вперед, бережіть ся, щоб і вас не зведено блудом безбожників, і не відпали від свого утвердження;
18 ౧౮ మన ప్రభువు, రక్షకుడు అయిన యేసు క్రీస్తు కృపలో అభివృద్ధి పొందండి. ఆయనకే ఇప్పుడూ, శాశ్వతంగా మహిమ కలుగు గాక! ఆమేన్. (aiōn )
а ростіть в благодаті і знанню Господа нашого і Спаса Ісуса Христа. Йому слава і тепер і по день віка. Амінь. (aiōn )