< 2 పేతురు 3 >

1 ప్రియులారా, ఇది నేను మీకు రాస్తున్న రెండవ ఉత్తరం. యథార్ధమైన మీ మనసును పురికొల్పడానికి జ్ఞాపకం చేస్తూ వీటిని రాస్తున్నాను.
Mīļie, jau šo otru grāmatu es jums rakstu, kur caur atgādināšanu jūs pamodināju uz sirds skaidrību.
2 పవిత్ర ప్రవక్తలు పూర్వకాలంలో చెప్పిన మాటలనూ, మన ప్రభువు, రక్షకుడు అయిన యేసు క్రీస్తు మీ అపొస్తలుల ద్వారా ఇచ్చిన ఆజ్ఞనూ మీరు గుర్తు చేసుకోవాలని ఈ ఉత్తరం రాస్తున్నాను.
Ka jums būs pieminēt tos no tiem svētiem praviešiem papriekš sludinātos vārdus un Tā Kunga un Pestītāja pavēlēšanu no mums, tiem apustuļiem.
3 ముందుగా ఇది తెలుసుకోండి, చివరి రోజుల్లో తమ దురాశలను అనుసరించి నడిచే కొందరు బయలుదేరతారు.
Papriekš to ziniet, ka pēdīgās dienās nāks smējēji, staigādami pēc savām pašu kārībām,
4 “ఆయన మళ్ళీ వస్తాడన్న వాగ్దానం ఏమయ్యింది? మా పూర్వీకులు చనిపోయారు, కాని సృష్టి ఆరంభం నుండి అన్ని విషయాలూ ఏమీ మార్పు లేకుండానే జరిగిపోతున్నాయి” అంటూ మిమ్మల్ని ఎగతాళి చేస్తారు.
Un sacīdami: kur ir Viņa atnākšanas apsolīšana? Jo no tā laika, kad tie tēvi ir aizmiguši, visas lietas paliek kā no radīšanas iesākuma.
5 చాలాకాలం కిందట, ఆకాశాన్నీ భూమినీ దేవుడు తన వాక్కు ద్వారా నీళ్ళలో నుండి, నీళ్ళ ద్వారా స్థిరపరిచాడనీ,
Jo tīši tie negrib zināt, ka vecos laikos debesis bijušas un zeme, no ūdens un iekš ūdens pastāvēdama caur Dieva vārdu;
6 ఆయన వాక్కును బట్టే, ఆ రోజుల్లో ఉన్న లోకం వరద నీటిలో మునిగి నాశనం అయ్యిందనీ,
Caur ko tā laika pasaule tapa maitāta ūdens plūdos.
7 అదే వాక్కును బట్టి ఇప్పటి ఆకాశం, భూమి భక్తిహీనులకు జరిగే తీర్పు రోజు వరకు, మంటల్లో నాశనం కావడానికి సిద్ధంగా ఉన్నదనీ వారు ఉద్దేశ పూర్వకంగా మరచిపోతారు.
Bet tās debesis, kas tagad ir un tā zeme caur Viņa vārdu ir glabātas un top ugunij paturētas uz to bezdievīgo cilvēku sodības un nomaitāšanas dienu.
8 కాని ప్రియులారా, ఈ విషయం మరచిపోకండి. ప్రభువు దృష్టికి ఒక్క రోజు వెయ్యి సంవత్సరాలుగా, వెయ్యి సంవత్సరాలు ఒక్క రోజుగా ఉంటాయి.
Bet to jums būs zināt, mīļie, ka viena diena pie Tā Kunga ir kā tūkstoši gadi un tūkstoši gadi kā viena diena.
9 కొంతమంది అనుకుంటున్నట్టు ప్రభువు తాను చేసిన వాగ్దానాల విషయంలో ఆలస్యం చేసేవాడు కాదు గానీ అందరూ మారిన మనసుతో తిరిగి రావాలనీ, ఎవ్వరూ నశించ కూడదనీ కోరుతూ మీ పట్ల చాలా ఓర్పుతో ఉన్నాడు.
Tas Kungs nevilcina to apsolīšanu, kā kādiem šķiet, to esam vilcināšanu, bet Viņš ir lēnprātīgs pret mums, negribēdams, ka kāds pazūd, bet ka visi dodās uz atgriešanos no grēkiem.
10 ౧౦ అయితే, ప్రభువుదినం ఎవరికీ తెలియని విధంగా దొంగ వచ్చినట్టు ఉంటుంది. అప్పుడు ఆకాశాలు మహా ఘోషతో గతించిపోతాయి. పంచభూతాలు మంటల్లో కాలిపోతాయి. భూమి, దానిలో ఉన్నవన్నీ తీర్పుకు గురౌతాయి.
Bet Tā Kunga diena nāks kā zaglis naktī; tad debesis ar rūkšanu zudīs un tie pirmie pasaules sākumi no karstuma izkusīs, un zeme un tie darbi iekš tās sadegs.
11 ౧౧ ఇవన్నీ ఈ విధంగా నాశనం అయిపోతాయి గనుక మీరు పవిత్ర జీవనం, దైవభక్తి సంబంధమైన విషయాల్లో ఏ విధంగా జీవించాలి?
Tad nu, ja viss tas izkūst, cik ļoti tad jums pienākas staigāt svētā dzīvošanā un dievbijāšanā,
12 ౧౨ దేవుడు వచ్చే రోజు కోసం మీరు ఎదురు చూస్తున్నారు గనుక ఆ రోజు త్వరగా రావాలని ఆశించండి. ఆ దినాన పంచభూతాలు తీవ్రమైన సెగతో కరిగిపోతాయి. ఆకాశంలో ఉన్నవన్నీ మంటల్లో కాలిపోతాయి
Gaidot un steidzoties uz tās Dieva dienas atnākšanu, kur debesis degdamas zudīs un tie pirmie pasaules sākumi no karstuma izkusīs.
13 ౧౩ అయినా, ఆయన చేసిన వాగ్దానం కారణంగా కొత్త ఆకాశం, కొత్త భూమి కోసం మనం ఎదురు చూస్తున్నాం. దానిలో నీతిపరులు నివాసం చేస్తారు.
Bet mēs gaidām pēc Viņa apsolīšanas jaunas debesis un jaunu zemi, kur taisnība mājo.
14 ౧౪ కాబట్టి, ప్రియులారా, మీరు వీటి కోసం ఎదురు చూస్తున్నారు గనక ప్రశాంతంగా, ఆయన దృష్టిలో ఏ మచ్చా, కళంకం లేని వారిగా ఉండండి.
Tādēļ, mīļie, kad jūs šās lietas gaidāt, darbojaties, ka neapgānīti un bezvainīgi no Viņa topat atrasti iekš miera;
15 ౧౫ మన ప్రభువు చూపించే సహనం మన రక్షణ కోసమే అని గ్రహించండి. ఆ విధంగానే మన ప్రియ సోదరుడు పౌలు కూడా దేవుడు తనకు ఇచ్చిన జ్ఞానంతో రాశాడు.
Un turiet mūsu Kunga lēnprātību par glābšanu, tā kā arī mūsu mīļais brālis Pāvils jums ir rakstījis pēc tās gudrības, kas tam dota,
16 ౧౬ అతడు ఈ సంగతులను గురించి తన లేఖలన్నిటిలో మాట్లాడుతున్నాడు. అయితే వాటిలో కొన్నిటిని అర్థం చేసుకోవడం కష్టం. పామరులు, నిలకడ లేని కొందరు అనేక ఇతర లేఖనాలను చేసినట్టే వీటిని కూడా వక్రీకరించి, వారి నాశనం వారే తెచ్చుకుంటారు.
Kā arī visās grāmatās, kur viņš par šīm lietām runā, no kurām citas grūti saprotamas, ko tie neizmācītie un nestiprinātie pārgroza, tā kā arī tos citus rakstus, sev pašiem par pazušanu.
17 ౧౭ కాబట్టి ప్రియులారా, ఈ విషయాలు మీకు తెలుసు కాబట్టి అక్రమకారుల మోసం మిమ్మల్ని తప్పు దారి పట్టించి మీ స్థిరత్వం పాడు చేయకుండా జాగ్రత్తపడండి.
Tad nu jūs, mīļie, to papriekš zinādami, sargājaties, ka jūs caur to neganto cilvēku pievilšanu līdz novesti neizkrītat no sava stipruma.
18 ౧౮ మన ప్రభువు, రక్షకుడు అయిన యేసు క్రీస్తు కృపలో అభివృద్ధి పొందండి. ఆయనకే ఇప్పుడూ, శాశ్వతంగా మహిమ కలుగు గాక! ఆమేన్. (aiōn g165)
Bet pieaugat mūsu Kunga un Pestītāja Jēzus Kristus žēlastībā un atzīšanā. Tam lai ir gods gan tagad gan mūžīgos laikos! Āmen. (aiōn g165)

< 2 పేతురు 3 >

The Great Flood
The Great Flood