< 2 పేతురు 1 >
1 ౧ యేసు క్రీస్తుకు బానిస, అపొస్తలుడు అయిన సీమోను పేతురు, మన దేవుడూ, రక్షకుడూ అయిన యేసు క్రీస్తు నీతిని బట్టి మాకు సమానంగా అమూల్యమైన విశ్వాసాన్ని పొందినవారికి రాస్తున్న సంగతులు.
IET ngai Simon Petrus ladu o wanporon en Iesus Kristus ong irail, me paikier poson kasampwal ota dueta kit, me kitail aleer ki pung en atail Kot o Saunkamaur Iesus Kristus.
2 ౨ దేవునిలో, మన ప్రభువైన యేసులో పూర్తి జ్ఞానం ద్వారా మీకు కృప, శాంతి విస్తరించు గాక!
Mak o popol en roklang komail ki erpit en Kot o Iesus atail Kaun.
3 ౩ తన మహిమనుబట్టి, మంచి గుణాన్నిబట్టి మనలను పిలిచిన దేవుడు తన జ్ఞానం ద్వారా, తన శక్తి మూలంగా మనం జీవం, దైవభక్తి కలిగి జీవించడానికి కావలసినవన్నీ ఇచ్చాడు.
Song en manaman en Kot karos, me itar ong maur o lelapok, kisakis dong kitail er, ki kupurkong en i, me kotin molipe kitail ki pein a lingan o manaman.
4 ౪ వీటిని బట్టే ఆయన మనకు అమూల్యమైన గొప్ప వాగ్దానాలు ఇచ్చాడు. ఈ వాగ్దానాల మూలంగా, లోకంలో ఉన్న దుర్మార్గపు కోరికల నాశనగుణం నుండి తప్పించుకుని మీరు తన స్వభావంలో పాలిభాగస్థులు కావాలన్నదే దేవుని ఉద్దేశం.
Ni mepukat a kotin kisakis ki dong kitail inau lapalapia o kasampwalia kan, pwen kare ong komail maur en Kot, o tang wei sanger me sued akan, me mi sappa ki inong sued.
5 ౫ ఈ కారణంగా మీరు పూర్తి భక్తి శ్రద్ధలు కలిగి, మీ విశ్వాసానికి మంచి గుణం, మంచి గుణానికి జ్ఞానం,
Komail ari nantiong eta, kida sar mau ni omail poson, o ni sar mau lolekong.
6 ౬ జ్ఞానానికి ఆశల అదుపు, ఆశల అదుపుకు ఓర్పు, ఓర్పుకు భక్తి,
O ni lolekong koton, o ni koton kanongama, o ni kanongama lelapok.
7 ౭ భక్తికి సోదర ప్రేమ, సోదర ప్రేమకు దైవ ప్రేమ జోడించండి.
O ni lelapok limpok ong saulang kan, o ni limpok ong saulang kan limpok ong amen amen.
8 ౮ ఇవి మీలో నిలిచి ఉండి వృద్ధి చెందినపుడు, మన ప్రభు యేసు క్రీస్తును గురించిన జ్ఞానంలో మందకొడిగా, నిష్ఫలంగా ఉండరు.
Pwe ma mepukat mi re omail, o pwaida re omail, komail ap sota pan tanganga de so wa ni lolekongki atail Kaun Iesus Kristus.
9 ౯ కాని ఈ గుణాలు లేనివాడు, తాను గతంలో చేసిన పాపాలనుండి దేవుడు శుభ్రపరిచాడని మరచిపోతాడు. అతడు దూరదృష్టి లేని గుడ్డివాడు.
A me sota pwaisaneki mepukat, nan i maskun, o a kin dedam sili wasa, aki a monokela a wideud sang ni dip a dip en mas.
10 ౧౦ కాబట్టి సోదరులారా, మీ పిలుపును, మీ ఎన్నికను స్థిరం చేసుకోడానికి పూర్తి శ్రద్ధ కలిగి ఉండండి. అప్పుడు మీరు ఎన్నడూ తడబడరు.
Ri ai ko, i me komail nantiong katengedi omail paeker o pilipil, pwe ma komail pan wiada mepukat, komail sota pan pupedi.
11 ౧౧ దీని ద్వారా మన ప్రభువు, రక్షకుడు అయిన యేసు క్రీస్తు రాజ్యంలోకి ఘనమైన ప్రవేశం మీకు దొరుకుతుంది. (aiōnios )
Pwe i me komail pan pedelongki peren nan wei soutuk en atail Kaun o Saunkamaur Iesus Kristus. (aiōnios )
12 ౧౨ వీటి గురించి మీకు ముందే తెలిసినా, మీరు అంగీకరించిన సత్యంలో స్థిరంగా ఉన్నా ఈ సంగతులు మీకు ఎప్పుడూ గుర్తు చేస్తూనే ఉంటాను.
I me i pan kataman kin komail ansau karos, menda ma komail asa mepukat, o komail keleki melel.
13 ౧౩ నేను ఈ శరీరం అనే గుడారంలో ఉన్నంత వరకూ ఇవి మీకు గుర్తు చేయడం మంచిదని భావిస్తున్నాను.
I lamelame, a pung, i en kataman kin komail o kamanga komail da, arain ai pan mimieta nan im pwal wet.
14 ౧౪ మన ప్రభు యేసు క్రీస్తు ముందుగానే నాకు వెల్లడి చేసిన ప్రకారం నేను త్వరలోనే ఈ శరీరం వదిలేస్తానని నాకు తెలుసు.
Pwe i asa, eten i pan pwilikidi war ai duen atail Kaun Iesus Kristus kotin masani ong ia er.
15 ౧౫ నేను చనిపోయిన తరువాత కూడా మీరు వీటిని ఎప్పుడూ గుర్తు చేసుకునేలా శ్రద్ధ తీసుకుంటాను.
A i pan nantiong, pwe komail en poden tamatamanda mepukat murin ai samala.
16 ౧౬ ఎందుకంటే, మన ప్రభు యేసు క్రీస్తు శక్తిని, ఆయన రాకడను గురించి చాకచక్యంగా అల్లిన కల్పనా కథలను మేము మీకు చెప్పలేదు, ఆయన గొప్పదనాన్ని కళ్ళారా చూసిన వారుగా చెప్పాం.
Pwe se so idauenda kasoi widing ni at padaki ong komail duen manaman en atail Kaun Iesus Kristus, o a kotin pan sapaledo, a pein kit kilanger a lingan.
17 ౧౭ ఆయన మన తండ్రి అయిన దేవుని నుండి ఘనత, మహిమ పొందగా, “ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన విషయంలో నేను ఆనందిస్తున్నాను” అనే గొప్ప మహిమగల దైవస్వరం వచ్చినప్పుడు,
Pwe ni a kotin aleer wau o lingan sang ren Kot Sam ni ansau ngil eu peidido sang nan lingan lapalap katitiki: Iet nai Ol kompok, me I kin peren kida.
18 ౧౮ ఆయనతో మేము ఆ పవిత్ర పర్వతం మీద ఉండి పైనుండి వచ్చిన ఆ స్వరాన్ని స్వయంగా విన్నాం.
Ngil wet, me peidido sang nanlang, se ronger ni at iang i mimieda pon dol saraui.
19 ౧౯ ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్కు మనకు ఉంది. తెల్లవారి వేకువచుక్క మీ హృదయాల్లో ఉదయించే వరకూ ఆ వాక్కు చీకట్లో వెలుగు ఇచ్చే దీపంలా ఉంది. ఆ వెలుగును మీరు లక్ష్యపెడితే మీకు మేలు.
Ari masan en kokop me pung melel re atail, o meid mau, komail en kasampwaleki dueta marain eu, me kin dakareda wasa rotorot lao ran pasang o usu ran pan pwara dang mongiong omail.
20 ౨౦ లేఖన ప్రవచనాలు మనిషి ఊహల్లో నుండి పుట్టలేదని మీరు ముందుగా గ్రహించాలి.
Iet me komail en asa mas: Sota kokop nan puk saraui me tapida sang ren aramas.
21 ౨౧ ప్రవచనం ఎప్పుడూ మనిషి ఉద్దేశంలో నుండి పుట్టలేదు, పరిశుద్ధాత్మతో నిండిన మనుషులు దేవుని మూలంగా మాట్లాడగా వచ్చింది.
Pwe sota man kokop pwili sang ni insen en aramas amen, pwe aramas saraui en Kot akan kokopada mokimokidedi Ngen saraui.