< రాజులు~ రెండవ~ గ్రంథము 1 >
1 ౧ అహాబు చనిపోయిన తరువాత మోయాబు దేశం ఇశ్రాయేలు రాజ్యంపై తిరుగుబాటు చేసింది.
Och de Moabiter föllo af ifrån Israel, då Achab död var.
2 ౨ అప్పుడే అహజ్యా షోమ్రోనులోని తన మేడగది కిటికీలో నుండి కింద పడి గాయపడ్డాడు. అప్పుడతడు దూతలను పిలిచి “మీరు ఎక్రోను దేవుడు బయల్జెబూబు దగ్గరికి వెళ్ళి ఈ గాయం మాని బాగుపడతానో లేదో కనుక్కుని రండి” అని వారికి చెప్పి పంపించాడు.
Och Ahasia föll genom gallren i sinom sal i Samarien, och vardt krank; och sände ut bådskap, och sade till dem: Går bort, och fråger BaalSebub, den guden i Ekron, om jag skall vederfås af denna krankheten.
3 ౩ కానీ యెహోవా దూత తిష్బీ వాడైన ఏలీయాతో ఇలా అన్నాడు. “నీవు లేచి సమరయ రాజు పంపిన దూతలను కలుసుకో. వారికిలా చెప్పు. ఎక్రోను దేవుడైన బయల్జెబూబును సంప్రదించడానికి వెళ్తున్నారా? ఇశ్రాయేలులో అసలు దేవుడనే వాడు లేడనుకున్నారా?
Men Herrans Ängel sade till Elia den Thisbiten: Statt upp, och gack emot Konungens bådskap i Samarien, och säg till dem: Är nu ingen Gud i Israel, att I behöfven gå bort, och fråga BaalSebub, Ekrons gud?
4 ౪ సరే, యెహోవా ఇలా చెప్తున్నాడు. నీవు కచ్చితంగా ఎక్కిన పడుకున్న పడక దిగకుండానే చనిపొతావు.” ఏలీయా వారికిలా చెప్పి వెళ్ళిపోయాడు.
Derföre, så säger Herren: Du skall icke komma utaf sängene, der du dig på lagt hafver; utan skall döden dö. Och Elia gick sin väg.
5 ౫ తరువాత ఆ దూతలు రాజు దగ్గరికి తిరిగి వచ్చేశారు. రాజు “మీరు ఎందుకు తిరిగి వచ్చారు?” అని అడిగాడు.
Och då båden igenkommo till honom, sade han till dem: Hvi kommen I igen?
6 ౬ వారు ఇలా అన్నారు “ఒక వ్యక్తి మాకు ఎదురయ్యాడు. అతడు మాతో మిమ్మల్ని పంపిన రాజు దగ్గరకి తిరిగి వెళ్ళండి. అతనితో ఇలా చెప్పండి. యెహోవా చెప్పేదేమిటంటే ఎక్రోను దేవుడైన బయల్జెబూబును సంప్రదించడానికి దూతలను పంపుతున్నావా? ఇశ్రాయేలులో దేవుడు లేడనుకున్నావా? కాబట్టి నీవు ఎక్కిన మంచం ఇక దిగవు. కచ్చితంగా చనిపోతావు, అని చెప్పాడు.”
De sade till honom: En man kom upp emot oss, och sade till oss: Går tillbaka igen till Konungen, som eder utsändt hafver, och säger till honom: Detta säger Herren: Är nu ingen Gud i Israel, att du skall sända bort, och fråga BaalSebub, Ekrons gud? Derföre skall du icke komma af sängene, der du hafver lagt dig uppå; utan skall döden dö.
7 ౭ అప్పుడు రాజు “మిమ్మల్ని కలుసుకుని ఈ మాటలు చెప్పినవాడు ఎలా ఉన్నాడు?” అని అడిగాడు.
Han sade till dem: Hurudana var den mannen, som eder mötte, och sade detta till eder?
8 ౮ అందుకు వారు “అతడు గొంగళి కట్టుకుని తోలు నడికట్టు పెట్టుకుని ఉన్నాడు” అన్నారు. అప్పుడు రాజు “ఆ వ్యక్తి తిష్బీ వాడైన ఏలీయానే” అన్నాడు.
De sade till honom: Mannen var luden, och en lädergjord om hans länder. Han sade: Det är Elia den Thisbiten.
9 ౯ అప్పుడు రాజు యాభై మంది సైనికులతో ఒక అధికారిని ఎలీయా దగ్గరికి పంపించాడు. ఎలీయా ఒక కొండ మీద కూర్చుని ఉన్నాడు. ఆ అధికారి ఎలీయా ఉన్న చోటికి కొండ ఎక్కి వచ్చాడు. అతడు ఎలీయాతో “ఇదిగో, దేవుని మనిషీ, రాజు నిన్ను దిగి రమ్మంటున్నాడు” అన్నాడు.
Och han sände bort till honom en höfvitsman öfver femtio, med de samma femtio. Och då han kom upp till honom, si, då satt han uppe på bergena; och han sade till honom: Du Guds man, Konungen säger: Du skall komma ned:
10 ౧౦ అందుకు ఏలీయా “నేను దేవుని మనిషినే అయితే ఆకాశం నుండి అగ్ని కురిసి నిన్నూ నీ యాభై మందినీ కాల్చి వేస్తుంది గాక” అన్నాడు. అప్పుడు ఆకాశం నుండి అగ్ని కురిసి ఆ అధికారినీ అతనితో ఉన్న యాభై మందినీ కాల్చి వేసింది.
Elia svarade höfvitsmannen öfver femtio, och sade till honom: Är jag en Guds man, så falle eld af himmelen, och upptäre dig och dina femtio. Då föll eld af himmelen, och upptärde honom och hans femtio.
11 ౧౧ ఆహాజు రాజు మరో యాభై మంది సైనికులతో ఇంకో అధికారిని పంపించాడు. ఇతడు కూడా ఎలీయాతో “ఇదిగో, దేవుని మనిషీ, రాజు నిన్ను త్వరగా దిగి రమ్మంటున్నాడు” అన్నాడు.
Och han sände åter en: annan höfvitsman öfver femtio till honom, med hans femtio: Han sade till honom: Du Guds man, detta säger Konungen: Kom snarliga ned.
12 ౧౨ అందుకు ఏలీయా “నేను దేవుని మనిషినే అయితే ఆకాశం నుండి అగ్ని కురిసి నిన్నూ నీ యాభై మందినీ కాల్చి వేస్తుంది గాక” అని జవాబిచ్చాడు. అప్పుడు ఆకాశం నుండి అగ్ని కురిసి ఆ అధికారినీ అతనితో ఉన్న యాభై మందినీ కాల్చి వేసింది.
Elia svarade, och sade: Är jag en Guds man, så falle eld af himmelen, och upptäre dig och dina femtio. Då föll Guds eld af himmelen, och upptärde honom och hans femtio.
13 ౧౩ అయినా రాజు మూడోసారి మరో యాభై మంది సైనిక బృందాన్ని పంపించాడు. వీళ్ళ అధికారి కొండ పైకి వెళ్ళాడు. ఇతడు ఎలీయా ఎదుట మోకాళ్ళపై వంగి ప్రాధేయ పూర్వకంగా “దేవుని మనిషీ, నిన్ను వేడుకుంటున్నాను. నీ దృష్టిలో నా ప్రాణాన్నీ, నీ సేవకులైన ఈ యాభై మంది ప్రాణాలనూ విలువైనవిగా ఉండనీ.
Då sände han ännu den tredje höfvitsmannen öfver femtio, med hans femtio. Då han kom upp till honom, böjde han sin knä för Elia, och bad honom, och sade till honom: Du Guds man, låt mina själ, och dina tjenares, dessa femtios själar, något aktade varda för dig.
14 ౧౪ ఇంతకు ముందు వచ్చిన ఇద్దరు అధికారులనూ, వాళ్ళ సైనికులనూ నిజంగానే ఆకాశం నుండి దిగి వచ్చిన అగ్ని కాల్చివేసింది. కానీ ఇప్పుడు నా ప్రాణం నీ దృష్టికి విలువైనదిగా ఉండనీ” అన్నాడు.
Si, elden är fallen af himmelen, och hafver upptärt de första två höfvitsmän öfver femtio, med deras femtio; men nu låt mina själ något aktad varda för dig.
15 ౧౫ అప్పుడు యెహోవా దూత ఎలీయాతో “దిగి అతనితో కూడా వెళ్ళు. అతనికి భయపడకు” అని చెప్పాడు. కాబట్టి ఎలీయా లేచి అతనితో కూడా రాజు దగ్గరికి వెళ్ళాడు.
Då sade Herrans Ängel till Elia: Gack ned med honom, och frukta dig intet för honom. Han stod upp, och gick ned med honom till Konungen.
16 ౧౬ తరువాత ఎలీయా అహజ్యాతో ఇలా అన్నాడు. “నీవు ఎక్రోను దేవుడైన బయల్జెబూబు దగ్గరికి దూతలను పంపించావు. ఈ సంగతులు అడిగి తెలుసుకోడానికి ఇశ్రాయేలులో దేవుడు లేడనుకున్నావా? కాబట్టి ఇప్పుడు నీవు పండుకున్న మంచం పైనుండి దిగవు. కచ్చితంగా చనిపోతావు.”
Och han sade till honom: Så säger Herren: Derföre, att du sände bådskap bort, och lät fråga BaalSebub, Ekrons gud, likasom ingen Gud vore i Israel, hvilkens ord man fråga kunde, så skall du icke komma af sängene, der du hafver lagt dig uppå; utan skall döden dö.
17 ౧౭ ఏలీయా పలికిన యెహోవా మాట ప్రకారం ఆహాజు రాజు చనిపోయాడు. అతనికి కొడుకు లేడు. అందుచేత అతని స్థానంలో అతని సోదరుడైన యెహోరాము రాజు అయ్యాడు. యూదా రాజు యెహోషాపాతు కొడుకు యెహోరాము పాలన రెండవ సంవత్సరంలో ఇది జరిగింది.
Alltså blef han död, efter Herrans ord, det Elia talat hade. Och Joram vardt Konung i hans stad, i andra årena Jorams, Josaphats sons, Juda Konungs; ty han hade ingen son.
18 ౧౮ అహజ్యా గూర్చిన ఇతర సంగతులు ఇశ్రాయేలు రాజుల చరిత్ర గ్రంథంలో రాసి ఉన్నాయి.
Hvad nu mer af Ahasia sägandes är, hvad han gjort hafver, si, det är skrifvet i Israels Konungars Chrönico.