< రాజులు~ రెండవ~ గ్రంథము 25 >
1 ౧ సిద్కియా పరిపాలనలో తొమ్మిదో సంవత్సరంలో పదో నెల, పదో రోజు బబులోను రాజు నెబుకద్నెజరు, అతని సైన్యం, యెరూషలేము మీదకి వచ్చి దానికి ఎదురుగా శిబిరాల్లో నివాసం చేసి, దాని చుట్టూ ముట్టడి దిబ్బలు కట్టారు.
Un notikās viņa valdības devītajā gadā desmitā mēnesi, desmitā mēneša dienā, tad Nebukadnecars, Bābeles ķēniņš, nāca ar visu savu karaspēku pret Jeruzālemi un apmeta lēģeri pret to un uztaisīja valni ap to.
2 ౨ ఈ విధంగా సిద్కియా రాజు పరిపాలనలో 11 వ సంవత్సరం వరకూ పట్టణం ముట్టడిలో ఉన్నప్పుడు,
Un tā pilsēta palika apstāta līdz ķēniņa Cedeķijas vienpadsmitam gadam.
3 ౩ నాలుగో నెల తొమ్మిదో రోజు అదే సంవత్సరం పట్టణంలో ఘోరమైన కరువు వచ్చింది. దేశ ప్రజలకు ఆహారం లేదు.
Un (ceturtā) mēneša devītā (dienā), kad bads pilsētu pārvarēja un iedzīvotājiem vairs nebija maizes,
4 ౪ కల్దీయులు పట్టణ ప్రాకారాన్ని పడగొట్టినప్పుడు, సైనికులు రాత్రిపూట రాజు తోట దగ్గర రెండు గోడల మధ్యలో ఉన్న ద్వారం మార్గంలో పారిపోయారు.
Tad ielauzās pilsētā, un visi karavīri bēga naktī pa vārtu ceļu starp abiem mūriem pie ķēniņa dārza, (bet Kaldeji bija pilsētai visapkārt) un ķēniņš bēga pa klajuma ceļu.
5 ౫ అయితే కల్దీయులు పట్టణం చుట్టూ ఉన్నారు. రాజు మైదానానికి వెళ్ళే మార్గంలో వెళ్లిపోయాడు. కల్దీయుల సైన్యం రాజును తరిమి, అతని సైన్యం అతనికి దూరంగా చెదరిపోయిన కారణంగా యెరికో మైదానంలో అతన్ని పట్టుకున్నారు.
Un Kaldeju spēks ķēniņam dzinās pakaļ un to panāca Jērikus klajumā, un viss viņa spēks no viņa izklīda.
6 ౬ వారు రాజును పట్టుకుని రిబ్లా పట్టణంలో ఉన్న బబులోను రాజు దగ్గరికి తీసుకుపోయారు. రాజు అతనికి శిక్ష విధించాడు.
Un tie sagrāba ķēniņu un to noveda pie Bābeles ķēniņa uz Riblatu, un turēja tiesu pār viņu.
7 ౭ సిద్కియా చూస్తూ ఉండగానే వారు అతని కొడుకులను చంపి, సిద్కియా కళ్ళు పీకి, ఇత్తడి సంకెళ్లతో అతన్ని బంధించి బబులోను పట్టణానికి తీసుకుపోయారు.
Un tie nokāva Cedeķijas dēlus priekš viņa acīm un izdūra Cedeķijam acis un to saistīja ar divām vara ķēdēm un to noveda uz Bābeli.
8 ౮ ఇంకా బబులోను రాజు నెబుకద్నెజరు పరిపాలనలో 19 వ సంవత్సరంలో ఐదో నెల ఏడో రోజున రాజ దేహసంరక్షకుల అధిపతీ, బబులోనురాజు సేవకుడూ అయిన నెబూజరదాను యెరూషలేముకు వచ్చి
Un piektā mēneša septītā dienā (tas bija ķēniņa Nebukadnecara, Bābeles ķēniņa, deviņpadsmitais gads, ) NebuzarAdans, pils karavīru virsnieks, Bābeles ķēniņa kalps, nāca uz Jeruzālemi
9 ౯ యెహోవా మందిరాన్నీ, రాజనగరునూ, యెరూషలేములో ఉన్న ఇళ్ళన్నీ, గొప్పవాళ్ళ ఇళ్ళన్నీ అగ్నితో తగల బెట్టించాడు.
Un sadedzināja Tā Kunga namu un ķēniņa namu un visus Jeruzālemes namus, visus lielos namus viņš sadedzināja ar uguni.
10 ౧౦ ఇంకా నెబూజరదాను దగ్గరున్న కల్దీయుల సైనికులందరూ యెరూషలేము చుట్టూ ఉన్న ప్రాకారాలు పడగొట్టారు.
Un viss Kaldeju spēks, kas bija pie pils karavīru virsnieka, noplēsa Jeruzālemes mūrus visapkārt.
11 ౧౧ పట్టణంలో మిగిలి ఉన్న వాళ్ళనూ, బబులోనురాజు పక్షం చేరిన వాళ్ళనూ, సామాన్య ప్రజల్లో మిగిలిన వాళ్ళనూ నెబూజరదాను బందీలుగా తీసుకెళ్ళాడు గాని,
Un tos atlikušos ļaudis, kas bija atlikuši pilsētā, un tos bēgļus, kas bija aizbēguši pie Bābeles ķēniņa, un tautas atlikumu NebuzarAdans, pils karavīru virsnieks, aizveda.
12 ౧౨ పొలాల్లో, ద్రాక్షతోటల్లో పనిచెయ్యడానికి అందరికన్నా పేదవాళ్లను అక్కడే ఉంచాడు.
Bet no zemniekiem pils karavīru virsnieks citus atlicināja par vīna dārzniekiem un arājiem.
13 ౧౩ ఇంకా యెహోవా మందిరంలో ఉన్న ఇత్తడి స్తంభాలను, పీటలను, యెహోవా మందిరంలో ఉన్న ఇత్తడి సరస్సును, కల్దీయులు ముక్కలుగా కొట్టి, ఆ ఇత్తడిని బబులోను పట్టణానికి తీసుకెళ్ళిపోయారు.
Un Kaldeji salauzīja tos vara stabus Tā Kunga namā un tos krēslus un to vara jūru Tā Kunga nama, un noveda to varu uz Bābeli.
14 ౧౪ సేవ కోసం ఉంచిన పాత్రలు, పారలు, గరిటెలు, దీపాలు ఆర్పే వస్తువులు, ఇతర ఇత్తడి ఉపకారణాలన్నీ వారు తీసుకుపోయారు.
Tie paņēma arī tos podus un tās lāpstas un dakšas un kausus un visus vara rīkus pie Dieva nama kalpošanas.
15 ౧౫ అగ్నిపాత్రలు, గిన్నెలు, మొదలైన వెండి వస్తువులనూ, బంగారు వస్తువులనూ నెబూజరదాను తీసుకెళ్ళిపోయారు.
Un pils karavīru virsnieks paņēma tos ogļu traukus un tās bļodas, kas bija tīra zelta un tīra sudraba,
16 ౧౬ ఇంకా అతడు యెహోవా మందిరానికి సొలొమోను చేయించిన రెండు స్తంభాలనూ, సముద్రాన్నీ, పీటలనూ తీసుకెళ్లిపోయాడు. ఈ ఇత్తడి వస్తువుల ఎత్తు లెక్కకు మించి ఉంది.
Tos divus stabus, to vienu jūru un tos krēslus, ko Salamans bija taisījis Tā Kunga namam. Visu šo trauku varš bija nesverams.
17 ౧౭ ఒక్కొక స్తంభం ఎత్తు 18 మూరలు. దాని పైపీట ఇత్తడిది, పైపీట ఎత్తు మూడు మూరలు. ఇంకా ఆ పైపీట చుట్టూ ఉన్న అల్లికలూ, దానిమ్మ పళ్ళూ ఇత్తడివి. రెండో స్తంభం కూడా మొదటి దాని లాంటిదే.
Astoņpadsmit olektis augsts bija viens stabs un uz tā vara kronis un tas kronis bija trīs olektis augsts, un tīkli un granātāboli apkārt kronim bija visi no vara. Un tāpat bija arī tas otrs stabs ar tiem tīkliem.
18 ౧౮ నెబూజరదాను ప్రధానయాజకుడు శెరాయానూ, రెండో యాజకుడు జెఫన్యానూ, ముగ్గురు ద్వార పాలకులనూ పట్టుకున్నాడు.
Un pils karavīru virsnieks paņēma augsto priesteri Seraju un otru priesteri Cefaniju un trīs sliekšņa sargus.
19 ౧౯ ఇంకా, సైన్యం మీద అధికారిగా ఉన్న వాణ్ణి, పట్టణంలో ఇంకా ఉంటూ రాజుకు సలహాలు ఇచ్చే ఐదుగురినీ, అతడు పట్టుకున్నాడు. రాజు అధికారుల్లో సైన్యాన్ని నియమించే అధికారినీ, ఆ పట్టణంలో ఉన్న ప్రముఖులైన 60 మందినీ బందీలుగా పట్టుకున్నాడు.
Un no pilsētas viņš paņēma vienu kambarjunkuri, kas bija pār karavīriem, un piecus vīrus no tiem, kas vienmēr bija ķēniņa priekšā un kas pilsētā atradās, un karavirsnieka skrīveri, kas zemes ļaudis rīkoja uz karu, un sešdesmit vīrus no zemes ļaudīm, kas pilsētā atradās.
20 ౨౦ నెబూజరదాను వీళ్ళను రిబ్లా పట్టణంలో ఉన్న బబులోను రాజు దగ్గరికి తెచ్చాడు.
Un NebuzarAdans, pils karavīru virsnieks, tos ņēmis noveda pie Bābeles ķēniņa uz Riblatu.
21 ౨౧ బబులోను రాజు హమాతు దేశంలో ఉన్న రిబ్లా పట్టణంలో వాళ్ళను చంపించాడు. ఈ విధంగా శత్రువులు యూదా వాళ్ళను వారి దేశంలోనుంచి తీసుకెళ్ళిపోయారు.
Un Bābeles ķēniņš tos kāva un nokāva Riblatā Hamatas zemē. Tā Jūda tapa aizvests no savas zemes.
22 ౨౨ బబులోను రాజు నెబుకద్నెజరు యూదాదేశంలో ఉండనిచ్చిన వాళ్ళమీద అతడు షాఫానుకు పుట్టిన అహీకాము కొడుకు గెదల్యాను అధిపతిగా నిర్ణయించాడు.
Bet pār tiem ļaudīm, kas bija atlikuši Jūda zemē, ko Nebukadnecars, Bābeles ķēniņš, bija atlicinājis, viņš iecēla Ģedaliju, Aikama dēlu, Safana dēla dēlu.
23 ౨౩ యూదావాళ్ళ సైన్యాధిపతులందరూ, వాళ్ళ ప్రజలందరూ బబులోనురాజు గెదల్యాను అధిపతిగా నియమించిన సంగతి విన్నారు. మిస్పా పట్టణంలో ఉన్న గెదల్యా దగ్గరికి నెతన్యా కొడుకు ఇష్మాయేలు, కారేహ కొడుకు యోహానాను, నెటోపాతీయుడు తన్హుమెతు కొడుకు శెరాయా, ఒక మాయకాతీయునికి పుట్టిన యజన్యా అందరూ కలిసి వచ్చారు.
Kad nu visi kara virsnieki ar saviem vīriem dzirdēja, ka Bābeles ķēniņš Ģedaliju bija iecēlis par valdnieku, tad tie nāca pie Ģedalijas uz Micpu, ar vārdu: Ismaēls, Netanijas dēls, un Johanans, Kareūs dēls, un Seraja, Tanumeta dēls, no Netofas, un Jaēzanija, Maēkata dēls, ar saviem vīriem.
24 ౨౪ గెదల్యా వాళ్ళతో, వాళ్ళ ప్రజలతో ప్రమాణం చేసి “కల్దీయులకు మనం దాసులం అయ్యామని భయపడొద్దు. దేశంలో నివాసం ఉండి, బబులోను రాజును మీరు సేవిస్తే, మీకు మేలు కలుగుతుంది” అని చెప్పాడు.
Un Ģedalija tiem un viņu vīriem zvērēja un uz tiem sacīja: nebīstaties no Kaldeju kalpiem, paliekat zemē un kalpojiet Bābeles ķēniņam, tad jums labi klāsies.
25 ౨౫ అయితే ఏడో నెలలో రాజ కుటుంబానికి చెందిన ఎలీషామాకు పుట్టిన నెతన్యా కొడుకు ఇష్మాయేలు పదిమంది మనుషులను పిలుచుకొచ్చి గెదల్యా మీద దాడి చేసినప్పుడు అతడు చనిపోయాడు. ఇంకా మిస్పాలో అతని దగ్గరున్న యూదులనూ, కల్దీయులనూ, అతడు హతం చేశాడు.
Bet septītā mēnesī nāca Ismaēls, Netanijas dēls, Elišama dēla dēls, no ķēniņa dzimuma, un desmit vīri ar viņu, un tie kāva Ģedaliju, ka tas nomira, līdz ar tiem Jūdiem un Kaldejiem, kas pie viņa bija Micpā.
26 ౨౬ అప్పుడు చిన్నవాళ్ళూ, గొప్పవాళ్ళూ, ప్రజలందరూ, సైన్యాధిపతులూ లేచి కల్దీయుల భయం చేత ఐగుప్తు దేశానికి పారిపోయారు.
Tad visi ļaudis cēlās, ir mazi, ir lieli līdz ar kara virsniekiem, un gāja uz Ēģipti; jo tie bijās no Kaldejiem. -
27 ౨౭ యూదారాజు యెహోయాకీను బందీగా ఉన్న 37 వ సంవత్సరంలో 12 వ నెల 27 వ రోజున బబులోను రాజు ఎవీల్మెరోదకు తాను పరిపాలన ఆరంభించిన సంవత్సరంలో, చెరసాలలో నుంచి యూదా రాజు యెహోయాకీనును బయటకు తెప్పించాడు.
Un trīsdesmit septītā gadā pēc tam, kad Jojaķins, Jūda ķēniņš, bija aizvests, divpadsmitā mēnesī, divdesmit septītā mēneša dienā, Evil-Merodaks, Bābeles ķēniņš, tai gadā, kad palika par ķēniņu, paaugstināja Jojaķina, Jūda ķēniņa, galvu no cietuma nama.
28 ౨౮ అతనితో దయగా మాట్లాడి, అతని పీఠాన్ని బబులోనులో తన దగ్గరున్న రాజుల పీఠాలకన్నా ఎత్తు చేశాడు.
Un viņš runāja laipnīgi ar to un lika viņa krēslu pār visiem ķēniņu krēsliem, kas pie viņa bija Bābelē.
29 ౨౯ అతడు తన చెరసాల బట్టలు తీసేసి వేరే వస్త్రాలు వేసుకుని తాను బ్రతికిన రోజులన్నీ రాజు బల్ల మీద రాజుతో భోజనం చేస్తూ వచ్చాడు.
Un viņš pārmija viņa cietuma drēbes, un tas ēda vienmēr viņa priekšā, kamēr dzīvoja.
30 ౩౦ ఇంకా అతడు బ్రతికినంత కాలం, క్రమం తప్పకుండా అతని భోజన భత్యం అతనికి అందుతూ ఉంది.
Un viņš tam nosprieda uzturam dienišķu daļu, ko tas ikdienas dabūja no ķēniņa, kamēr dzīvoja.