< రాజులు~ రెండవ~ గ్రంథము 24 >
1 ౧ యెహోయాకీము రోజుల్లో బబులోను రాజు నెబుకద్నెజరు యెరూషలేము మీదకి యుద్ధానికి వచ్చాడు. యెహోయాకీము అతనికి లోబడి మూడు సంవత్సరాలు సేవించిన తరువాత అతని మీద తిరుగుబాటు చేశాడు.
Lúc ấy, Nê-bu-cát-nết-sa, vua Ba-by-lôn đem quân đến đánh Giu-đa. Sau ba năm chịu thần phục, Giê-hô-gia-kim nổi lên chống lại Ba-by-lôn.
2 ౨ యెహోవా అతని మీదకి, తన సేవకులైన ప్రవక్తల ద్వారా తాను చెప్పిన మాట ప్రకారం యూదాదేశాన్ని నాశనం చెయ్యడానికి దాని మీదకి కల్దీయుల సైన్యాలను, సిరియనుల సైన్యాలను, మోయాబీయుల సైన్యాలను, అమ్మోనీయుల సైన్యాలను రప్పించాడు.
Chúa khiến các nước Canh-đê, A-ram, Mô-áp, và Am-môn đem quân đến tàn phá Giu-đa theo lời Chúa Hằng Hữu đã dùng các tiên tri đầy tớ Ngài phán trước.
3 ౩ మనష్షే చేసిన పనుల కారణంగా, అతడు నిరపరాధులను హతం చేసిన కారణంగా, యూదావారు యెహోవా సముఖం నుంచి తొలగి పోయేలా యెహోవా ఇచ్చిన ఆజ్ఞ వల్లే ఇది వాళ్లకు జరిగింది.
Hiển nhiên việc Giu-đa gặp tai họa là do Chúa Hằng Hữu xếp đặt. Ngài muốn đuổi họ đi khỏi mặt Ngài, vì tội lỗi tràn ngập của Ma-na-se,
4 ౪ అతడు నిరపరాధుల రక్తంతో యెరూషలేమును నింపిన కారణంగా, దాన్ని క్షమించడానికి యెహోవాకు మనస్సు లేకపోయింది.
người đã làm cho Giê-ru-sa-lem đầy dẫy máu vô tội, đến độ Chúa Hằng Hữu không tha thứ được nữa.
5 ౫ యెహోయాకీము చేసిన ఇతర పనుల గురించి, అతడు జరిగించిన వాటన్నిటి గురించి, యూదారాజుల చరిత్ర గ్రంథంలో రాసి ఉంది.
Các việc khác của Giê-hô-gia-kim đều được chép trong Sách Lịch Sử Các Vua Giu-đa.
6 ౬ యెహోయాకీము తన పూర్వీకులతోబాటు చనిపోగా అతని కొడుకు యెహోయాకీను అతని స్థానంలో రాజయ్యాడు.
Giê-hô-gia-kim an giấc với tổ tiên, và Giê-hô-gia-kin con vua lên kế vị.
7 ౭ బబులోనురాజు ఐగుప్తు నదికీ, యూఫ్రటీసు నదికీ మధ్య ఐగుప్తురాజు ఆధీనంలో ఉన్న భూమి అంతటినీ పట్టుకొన్న తరువాత, ఐగుప్తురాజు ఇక ఏ ప్రాంతం మీదకీ యుద్ధానికి వెళ్ళలేదు.
Từ khi vua Ba-by-lôn chiếm cả vùng, từ suối Ai Cập cho đến sông Ơ-phơ-rát, là vùng trước kia thuộc Ai Cập, vua Ai Cập không còn lai vãng đến đất Giu-đa nữa.
8 ౮ యెహోయాకీను పరిపాలన ఆరంభించినప్పుడు అతని వయసు 18 సంవత్సరాలు. అతడు యెరూషలేములో మూడు నెలలు ఏలాడు. యెరూషలేమువాడు ఎల్నాతాను కూతురు నెహుష్తా అతని తల్లి.
Giê-hô-gia-kin được mười tám tuổi lúc lên ngôi, cai trị ba tháng tại Giê-ru-sa-lem. Mẹ vua là Nê-hu-ta, con Ên-na-than, ở Giê-ru-sa-lem.
9 ౯ అతడు తన తండ్రి చేసినట్టే చేసి, యెహోవా దృష్టిలో చెడునడత నడిచాడు.
Vua làm điều ác trước mặt Chúa Hằng Hữu, như các vua đời trước.
10 ౧౦ ఆ కాలంలో బబులోను రాజు నెబుకద్నెజరు సేవకులు యెరూషలేము మీదికి వచ్చి పట్టణానికి ముట్టడి వేశారు.
Khi quân Ba-by-lôn do Nê-bu-cát-nết-sa, vua Ba-by-lôn, đích thân chỉ huy kéo đến vây Giê-ru-sa-lem,
11 ౧౧ వారు పట్టణానికి ముట్టడి వేస్తూ ఉన్నప్పుడు, బబులోను రాజు నెబుకద్నెజరు స్వయంగా తానే దాని మీదకి వచ్చాడు.
Vua Nê-bu-cát-nết-sa của Ba-by-lôn đến trước thành, đang khi quân đội của vua đang bao vây nó.
12 ౧౨ అప్పుడు యూదారాజు యెహోయాకీను, అతని తల్లి, అతని సేవకులు, అతని కింద అధిపతులూ, అతని పరివారం, బయలుదేరి బబులోనురాజు దగ్గరికి వచ్చినప్పుడు బబులోను రాజు పరిపాలనలో ఎనిమిదో సంవత్సరంలో యెహోయాకీనును చెరపట్టుకున్నాడు.
Vua Giê-hô-gia-kin của Giu-đa cùng với mẹ vua, các cận thần, các tướng lãnh, và các triều thần ra đầu hàng vua Ba-by-lôn. Vua Ba-by-lôn bắt Giê-hô-gia-kin sau khi lên ngôi được tám năm.
13 ౧౩ ఇంకా అతడు యెహోవా మందిరపు ధననిధిలో ఉన్న వస్తువులు, రాజు ఖజానాలో ఉన్న సొమ్ము పట్టుకుని ఇశ్రాయేలు రాజు సొలొమోను యెహోవా ఆలయానికి చేయించిన బంగారపు ఉపకరణాలన్నీ, యెహోవా చెప్పిన విధంగా ముక్కలుగా చేయించి తీసుకెళ్ళిపోయాడు.
Người Ba-by-lôn chở về nước tất cả bảo vật của Đền Thờ và hoàng cung. Họ bóc hết vàng bọc các dụng cụ trong Đền Thờ từ đời Sa-lô-môn. Những việc này xảy ra đúng như lời Chúa Hằng Hữu phán trước.
14 ౧౪ ఇంకా, అతడు దేశపు ప్రజల్లో అతి పేదవారు తప్ప ఇంక ఎవరూ లేకుండా యెరూషలేము పట్టణమంతట్లో ఉన్న అధిపతులూ, పరాక్రమవంతులూ పదివేలమందినీ, వీళ్ళు కాకుండా కంసాలివాళ్ళను, కమ్మరివాళ్ళను బందీలుగా తీసుకుపోయాడు.
Vua Nê-bu-cát-nết-sa bắt đi mọi người dân Giê-ru-sa-lem, tất cả tướng lãnh, và những chiến sĩ dũng mãnh, thợ mộc, và thợ rèn—gồm tất cả là 10.000 người bị đem đi lưu đày. Ngoại trừ những người nghèo khổ cùng cực trong xứ.
15 ౧౫ అతడు యెహోయాకీను రాజు తల్లిని, రాజు భార్యలను, అతని పరివారాన్ని, దేశంలో ఉన్న గొప్పవాళ్ళను యెరూషలేము నుంచి బబులోను పట్టణానికి బందీలుగా తీసుకు వెళ్ళాడు.
Vậy Vua Nê-bu-cát-nết-sa bắt vua Giê-hô-gia-kin đem về Ba-by-lôn cùng với thái hậu, hoàng hậu, các thái giám, và hoàng tộc trong thành Giê-ru-sa-lem,
16 ౧౬ ఏడు వేలమంది పరాక్రమవంతులను, వెయ్యిమంది కంసాలివాళ్ళను, కమ్మరివాళ్ళను, యుద్ధంలో ఆరితేరిన శక్తిమంతులందర్నీ బబులోనురాజు బందీలుగా బబులోను పట్టణానికి తీసుకొచ్చాడు.
luôn cả 7.000 lính thiện chiến và 1.000 thợ đủ loại, kể cả thợ mộc và thợ rèn. Đó là những người mà vua Ba-by-lôn bắt lưu đày sang Ba-by-lôn
17 ౧౭ ఇంకా బబులోను రాజు యెహోయాకీను బాబాయి మత్తన్యాకు సిద్కియా అనే మారుపేరు పెట్టి అతని స్థానంలో రాజుగా నియమించాడు.
Vua Ba-by-lôn đặt Mát-ta-nia, chú của Giê-hô-gia-kin, lên làm vua và đổi tên là Sê-đê-kia.
18 ౧౮ సిద్కియా పరిపాలన ఆరంభించినప్పుడు అతనికి 21 సంవత్సరాలు. అతడు యెరూషలేములో 11 సంవత్సరాలు ఏలాడు.
Sê-đê-kia được mười tám tuổi lúc lên ngôi, cai trị mười một năm tại Giê-ru-sa-lem. Mẹ vua là Ha-mu-ta, con Giê-rê-mi ở Líp-na.
19 ౧౯ అతని తల్లి లిబ్నా ఊరివాడు యిర్మీయా కూతురు హమూటలు. యెహోయాకీము చేసినట్టే సిద్కియా చేసి, యెహోవా దృష్టిలో చెడునడత నడిచాడు.
Vua làm điều ác trước mặt Chúa Hằng Hữu như Giê-hô-gia-kim đã làm.
20 ౨౦ సిద్కియా బబులోనురాజు మీద తిరుగబాటు చేశాడు. యూదావాళ్ళ మీద, యెరూషలేమువాళ్ళ మీద యెహోవాకు ఉన్న కోపం కారణంగా ఆయన తన సముఖంలోనుంచి వాళ్ళను తోలివేయడానికి ఇది దోహదం చేసింది.
Những việc này xảy ra vì Chúa Hằng Hữu nổi giận cùng người Giê-ru-sa-lem ra và Giu-đa, cho đến khi Chúa đuổi họ khỏi nơi Ngài ngự và đem họ đi lưu đày. Sê-đê-kia nổi loạn chống vua Ba-by-lôn. Sau đó, Sê-đê-kia nổi lên chống lại vua Ba-by-lôn.