< రాజులు~ రెండవ~ గ్రంథము 23 >
1 ౧ అప్పుడు రాజు యూదా పెద్దలనందర్నీ, యెరూషలేము పెద్దలనందర్నీ తన దగ్గరికి పిలిపించి,
Ja kuningas lähetti, ja kaikki vanhimmat Juudasta ja Jerusalemista kokoontuivat hänen tykönsä.
2 ౨ యూదా వాళ్ళందర్నీ, యెరూషలేము కాపురస్థులందర్నీ, యాజకులను, ప్రవక్తలను, తక్కువ వాళ్లైనా, గొప్ప వాళ్లైనా, ప్రజలందర్నీ పిలిచి, యెహోవా మందిరానికి వచ్చి వారు వింటూ ఉన్నప్పుడు, యెహోవా మందిరంలో దొరకిన నిబంధన గ్రంథంలో ఉన్న మాటలన్నీ చదివించాడు.
Ja kuningas meni ylös Herran huoneesen ja kaikki Juudan miehet ja Jerusalemin asuvaiset hänen kanssansa, papit ja prophetat, ja kaikki kansa, pienet ja suuret; ja luettiin heidän korvainsa kuullen kaikki liittokirjan sanat, joka Herran huoneesta löydetty oli.
3 ౩ రాజు ఒక స్తంభం దగ్గర నిలబడి, యెహోవా మార్గాల్లో నడచి, ఆయన ఆజ్ఞలను, కట్టడలను శాసనాలను పూర్ణహృదయంతో, పూర్ణాత్మతో పాటించి, ఈ గ్రంథంలో రాసి ఉన్న నిబంధన సంబంధమైన మాటలన్నీ నెరవేరుస్తామని యెహోవా సన్నిధిలో నిబంధన చేశాడు. ప్రజలందరూ ఆ నిబంధనకు సమ్మతించారు.
Ja kuningas seisoi yhden patsaan tykönä, ja teki liiton Herran edessä, että heidän piti vaeltaman Herran jälkeen ja pitämän hänen käskynsä, todistuksensa ja säätynsä, kaikesta sydämestänsä ja kaikesta sielustansa, että heidän piti pitämän nämät liiton sanat, jotka kirjoitetut olivat tässä kirjassa. Ja kaikki kansa mielistyi siihen liittoon.
4 ౪ రాజు బయలు దేవుడికీ, అషేరా దేవికీ, నక్షత్రాలకూ తయారు చేసిన వస్తువులన్నీ యెహోవా ఆలయంలోనుంచి బయటకు తీసుకు రావాలని ప్రధానయాజకుడు హిల్కీయాకు, రెండో వరుస యాజకులకు, ద్వారపాలకులకు ఆజ్ఞ ఇచ్చాడు. హిల్కీయా వాటిని యెరూషలేము బయట కిద్రోను పొలంలో తగలబెట్టి, ఆ బూడిద బేతేలు ఊరికి పంపేశాడు.
Ja kuningas käski Hilkiaa ylimmäistä pappia, ja pappeja toisesta vuorosta, ja ovenvartioita, ottaa Herran temppelistä kaikkinaiset kalut, jotka Baalille, metsistölle ja kaikelle taivaalliselle sotajoukolle tehdyt olivat; ja hän poltti ne ulkona Jerusalemin edessä Kidronin laaksossa, ja niitten tuhka kannettiin sieltä Beteliin.
5 ౫ ఇంకా యూదా పట్టణాల్లో ఉన్న ఉన్నత స్థలాల్లో, యెరూషలేము చుట్టూ ఉన్న ప్రదేశాల్లో ధూపం వెయ్యడానికి యూదా రాజులు నియమించిన అర్చకులను అంటే బయలుకు, సూర్యచంద్రులకు, గ్రహాలకు, నక్షత్రాలకు ధూపం వేసే వాళ్ళను అతడు తొలగించాడు.
Ja hän otti epäjumalain papit pois, jotka Juudan kuninkaat asettaneet olivat suitsuttamaan korkeuksissa Juudan kaupungeissa ja ympäri Jerusalemia, ja ne jotka suitsuttivat Baalille, auringolle ja kuulle ja planeteille, ja kaikelle taivaalliselle sotajoukolle,
6 ౬ యెహోవా మందిరంలో ఉన్న అషేరాదేవి రూపాన్ని యెరూషలేము బయట ఉన్న కిద్రోను వాగు దగ్గరికి తెప్పించి, కిద్రోను వాగు ఒడ్డున దాన్ని కాల్చి, తొక్కి, బూడిద చేసి, ఆ బూడిదను సామాన్య ప్రజల సమాధుల మీద చల్లాడు.
Ja antoi viedä Astarotin Herran huoneesta, ulos Jerusalemista, Kidronin ojan tykö, ja poltti sen Kidronin ojan tykönä, ja musersi sen tuhaksi, ja heitti sen tuhan kansan lasten hautoihin,
7 ౭ ఇంకా యెహోవా మందిరంలో ఉన్న స్వలింగ సంపర్కుల గదులను పడగొట్టించాడు. అక్కడ స్త్రీలు అషేరాదేవికి వస్త్రాలు అల్లుతున్నారు.
Ja kukisti huorain huoneet, jotka olivat Herran huoneen tykönä, joissa vaimot kutoivat huoneita metsistölle.
8 ౮ యూదా పట్టణంలో ఉన్న యాజకులందర్నీ అతడు బయటకు వెళ్లగొట్టాడు. గెబా మొదలు బెయేర్షెబా వరకూ యాజకులు ధూపం వేసిన ఉన్నత స్థలాలను అతడు అపవిత్రం చేసి, పట్టణ ద్వారానికి ఎడమ వైపు పట్టణపు అధికారి అయిన యెహోషువ గుమ్మం దగ్గర ఉన్న ఉన్నత స్థలాలను పడగొట్టించాడు.
Ja hän kokosi kaikki papit Juudan kaupungeista ja saastutti korkeudet, joissa papit suitsuttivat, Gebasta Bersebaan asti. Ja hän kukisti porttein korkeudet, jotka olivat Josuan kaupungin päämiehen portin vajassa, joka oli vasemmalla puolella kaupungin porttia, sisälle mennessä.
9 ౯ ఆ ఉన్నత స్థలాలమీద యాజకులుగా ఉన్న వారు యెరూషలేములో ఉన్న యెహోవా బలిపీఠం దగ్గర సేవ చెయ్యడానికి అనుమతి లేకపోయినా, తమ ఇతర యాజక సోదరుల్లా వారు కూడా పులియని రొట్టెలు తినే అవకాశం దొరికింది.
Ei kuitenkaan korkeutten papit uhranneet koskaan Herran alttarilla Jerusalemissa, vaan söivät kaltiaista leipää veljeinsä keskellä.
10 ౧౦ ఎవరూ తన కొడుకునైనా, కూతుర్నైనా మొలెకుకు దహనబలి ఇవ్వకుండా బెన్ హిన్నోము అనే లోయలో ఉన్న తోఫెతు అనే ఆ ప్రదేశాన్ని అతడు అపవిత్రం చేశాడు.
Hän saastutti myös Tophetin, joka on Hinnomin lasten laaksossa, ettei yksikään käyttäisi poikaansa ja tytärtänsä tulessa Molokille;
11 ౧౧ ఇదే కాకుండా, అతడు యూదా రాజులు సూర్యునికి ప్రతిష్ఠించిన గుర్రాలను మంటపంలో నివసించే పరిచారకుడైన నెతన్మెలకు గది దగ్గర, యెహోవా మందిరపు ద్వారం దగ్గర నుంచి వాటిని తీసివేసి, సూర్యునికి ప్రతిష్ఠించిన రథాలను అగ్నితో కాల్చేశాడు.
Ja otti pois hevoset, jotka Juudan kuninkaat auringolle asettaneet olivat Herran huoneen sisällekäymiseen, NetanMelekin kamaripalvelian majan tykönä, joka oli esikaupungissa; ja auringon rattaat poltti hän tulessa,
12 ౧౨ ఇంకా యూదా రాజులు చేయించిన ఆహాజు మేడ గది మీద ఉన్న బలిపీఠాలనూ, యెహోవా మందిరపు రెండు ప్రాంగణాల్లో మనష్షే చేయించిన బలిపీఠాలనూ, రాజు పడగొట్టించి ముక్కలు ముక్కలుగా చేయించి ఆ చెత్త అంతా కిద్రోను వాగులో పోయించాడు.
Niin myös alttarit, jotka kattoin päällä Ahaksen salissa olivat, jotka Juudan kuninkaat tehneet olivat. Ja ne alttarit, jotka Manasse tehnyt oli kahdessa Herran huoneen pihassa, särki kuningas, ja pakeni sieltä, ja heitti heidän tuhkansa Kidronin ojaan.
13 ౧౩ యెరూషలేము ఎదుట ఉన్న నాశనం అనే పర్వతపు కుడివైపు అష్తారోతు దేవత అనే సీదోనీయుల విగ్రహానికీ, కెమోషు అనే మోయాబీయుల విగ్రహానికీ, మిల్కోము అనే అమ్మోనీయుల విగ్రహానికీ ఇశ్రాయేలు రాజు సొలొమోను కట్టించిన ఉన్నత స్థలాలను రాజు అపవిత్రం చేశాడు.
Ja ne korkeudet, jotka Jerusalemin edessä olivat, oikialla puolella Maskitin vuorta, jotka Salomo Israelin kuningas rakentanut oli Astarotille Zidonin kauhistukselle, ja Kamokselle Moabin kauhistukselle, ja Milkomille Ammonin lasten kauhistukselle, ne saastutti myös kuningas.
14 ౧౪ ఆ రూపాలను ముక్కలుగా కొట్టించి, అషేరాదేవి రూపాన్ని పడగొట్టించి వాటి స్థానాలను మనుషుల ఎముకలతో నింపాడు.
Ja särki patsaat, ja hävitti metsistöt, ja täytti heidän siansa ihmisten luilla,
15 ౧౫ బేతేలులో ఉన్న బలిపీఠాన్ని, ఉన్నత స్థలాన్ని, అంటే, ఇశ్రాయేలువారు పాపం చెయ్యడానికి కారకుడైన నెబాతు కొడుకు యరొబాము కట్టించిన ఆ ఉన్నత స్థలం, బలిపీఠం అతడు పడగొట్టించాడు. ఆ ఉన్నత స్థలాన్ని కాల్చి పొడి అయ్యేలా తొక్కించి, అషేరాదేవి రూపాన్ని కాల్చేశాడు.
Niin myös Betelin alttarin, sen korkeuden, minkä Jerobeam Nebatin poika tehnyt oli, joka Israelin saatti syntiä tekemään; hän kukisti sen alttarin ja korkeuden, ja poltti myös metsistön.
16 ౧౬ యోషీయా అటు తిరిగి, అక్కడ పర్వత ప్రాంతంలో సమాధులను చూసి, కొందరిని పంపి, సమాధుల్లో ఉన్న ఎముకలను తెప్పించి, దైవజనుడు యెహోవా మాట చాటించి చెప్పిన ప్రకారం వాటిని బలిపీఠం మీద కాల్చి దాన్ని అపవిత్రం చేశాడు.
Ja Josia käänsi itsensä ja näki ne haudat, jotka olivat vuorella, lähetti ja antoi ottaa luut haudoista, ja poltti ne alttarilla ja saastutti sen, Herran sanan jälkeen, jonka Jumalan mies huutanut oli, joka nämät niin ennen puhunut oli.
17 ౧౭ అప్పుడు అతడు “నాకు కనబడుతున్న ఆ సమాధి ఎవరిది?” అని అడిగాడు. పట్టణం వారు “అది యూదా దేశం నుంచి వచ్చి నీవు బేతేలులో ఉన్న బలిపీఠానికి చేసిన పనులు ముందుగా తెలిపిన దైవ ప్రవక్త సమాధి” అని చెప్పారు.
Ja hän sanoi: mikä haudan merkki tämä on, jonka minä näen? Ja kaupungin kansa sanoi hänelle: se on sen Jumalan miehen hauta, joka Juudasta tuli ja huusi näitä, joita sinä tehnyt olet alttarille Betelissä.
18 ౧౮ అందుకతడు “దాన్ని తప్పించండి. ఎవరూ అతని ఎముకలను తీయకూడదు” అని చెప్పాడు. వారు అతని ఎముకలను, షోమ్రోను పట్టణం నుంచి వచ్చిన ప్రవక్త ఎముకలను ముట్టుకోలేదు.
Ja hän sanoi: anna hänen maata, ja älkään yksikään liikuttako hänen luitansa. Näin tulivat hänen luunsa vapahdetuksi sen prophetan luiden kanssa, joka Samariasta tullut oli.
19 ౧౯ ఇంకా, ఇశ్రాయేలు రాజులు షోమ్రోను పట్టణాల్లో ఏ ఉన్నతస్థలాల్లో మందిరాలు కట్టించి యెహోవాకు కోపం పుట్టించారో, ఆ మందిరాలన్నిటినీ యోషీయా తీసేసి, తాను బేతేలులో చేసినట్టే వాటికీ చేశాడు.
Ja Josia pani myös kaikki korkeutten huoneet Samarian kaupungista pois, jotka Israelin kuninkaat tehneet olivat vihaa kehoittaaksensa, ja teki heidän kanssansa peräti niinkuin hän Betelissä tehnyt oli.
20 ౨౦ అక్కడ అతడు ఉన్నతస్థలాలకు నియామకం అయిన యాజకులు అందరినీ బలిపీఠాల మీద చంపించి, వాటిమీద మనుషుల ఎముకలను తగలబెట్టించి, యెరూషలేముకు తిరిగి వచ్చాడు.
Ja hän tappoi kaikki korkeutten papit, jotka siellä olivat alttareilla, ja poltti ihmisten luut niiden päällä, ja palasi Jerusalemiin.
21 ౨౧ అప్పుడు రాజు “నిబంధన గ్రంథంలో రాసి ఉన్న ప్రకారంగా మీ దేవుడైన యెహోవాకు పస్కా పండగ ఆచరించండి” అని ప్రజలందరికీ ఆజ్ఞాపించాడు.
Ja kuningas käski kaikkea kansaa ja sanoi: pitäkäät Herralle Jumalallenne pääsiäistä, niinkuin kirjoitettu on tämän liiton kirjassa,
22 ౨౨ ఇశ్రాయేలీయులకు న్యాయం తీర్చిన న్యాయాధిపతులున్న రోజుల నుంచి, ఇశ్రాయేలు రాజుల కాలం, యూదా రాజుల కాలం వరకూ ఎన్నడూ జరగనంత వైభవంగా ఆ సమయంలో పస్కా పండగ జరిగింది.
Sillä ei yhtään pääsiäistä ollut niin pidetty kuin tämä, tuomarien ajasta, jotka olivat tuominneet Israelia, ja kaikkein Israelin kuningasten ja Juudan kuningasten aikana.
23 ౨౩ ఈ పండగ రాజైన యోషీయా పరిపాలన 18 వ సంవత్సరంలో యెరూషలేములో యెహోవాకు జరిగింది.
Mutta kahdeksantenatoistakymmenentenä kuningas Josian vuonna pidettiin tämä pääsiäinen Herralle Jerusalemissa.
24 ౨౪ ఇంకా మృతులతోనూ ఆత్మలతోనూ మాట్లాడే వాళ్ళను, సోదె చెప్పే వాళ్ళను, గృహ దేవుళ్ళను, విగ్రహాలను, యూదాదేశంలో, యెరూషలేములో, కనబడిన విగ్రహాలన్నిటినీ యోషీయా తీసేసి, యెహోవా మందిరంలో యాజకుడైన హిల్కీయాకు దొరికిన గ్రంథంలో రాసి ఉన్న ధర్మశాస్త్ర విధులను స్థిరపరచడానికి ప్రయత్నం చేశాడు.
Ja Josia perkasi kaikki noidat, merkkein tulkitsiat, kuvat ja epäjumalat, ja kaikki kauhistukset, jotka nähtiin Juudan maalla ja Jerusalemissa; että hän pitäis lain sanat, jotka kirjassa kirjoitetut olivat, jonka pappi Hilkia löysi Herran huoneesta.
25 ౨౫ అతనికి పూర్వం పరిపాలించిన రాజుల్లో అతని వలే పూర్ణహృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణబలంతో యెహోవా వైపు తిరిగి మోషే నియమించిన ధర్మశాస్త్రం ప్రకారం చేసిన వాడు ఒక్కడూ లేడు. అతని తరువాత కూడా అతని వంటివాడు ఒక్కడూ లేడు.
Hänen vertaisensa ei ollut yksikään kuningas ennen häntä, joka niin kaikesta sydämestänsä, kaikesta sielustansa ja kaikesta voimastansa itsensä käänsi Herran tykö, kaiken Moseksen lain jälkeen; ja hänen jälkeensä ei tullut myöskään hänen kaltaistansa.
26 ౨౬ అయినా, మనష్షే యెహోవాకు పుట్టించిన కోపం వల్ల ఆయన కోపాగ్ని ఇంకా చల్లారకుండా, యూదా మీద మండుతూనే ఉంది.
Ei kuitenkaan kääntynyt Herra vihansa suuresta julmuudesta, jolla hän Juudan päälle vihoitettu oli, kaikkein kehoitusten tähden, joilla Manasse hänen kehoittanut oli.
27 ౨౭ కాబట్టి యెహోవా “నేను ఇశ్రాయేలు వాళ్ళను వెళ్లగొట్టినట్టు యూదా వాళ్ళను నా సముఖానికి దూరం చేసి, నేను కోరుకొన్న యెరూషలేము పట్టణాన్నీ, నా పేరును అక్కడ ఉంచుతానని నేను చెప్పిన మందిరాన్నీ నేను విసర్జిస్తాను” అనుకున్నాడు.
Ja Herra sanoi: minä heitän myös Juudan pois minun kasvoini edestä, niinkuin minä Israelin heittänyt olen, ja hylkään tämän kaupungin, jonka minä valinnut olen, Jerusalemin, ja sen huoneen, josta minä puhunut olen: minun nimeni on oleva siellä.
28 ౨౮ యోషీయా చేసిన ఇతర పనులు గురించి, అతడు చేసిన దానినంతటిని గురించి, యూదారాజుల చరిత్ర గ్రంథంలో రాసి ఉంది.
Mitä enempi Josiasta sanomista on, ja kaikista mitä hän tehnyt on: eikö se ole kirjoitettu Juudan kuningasten aikakirjassa?
29 ౨౯ అతని కాలంలో ఐగుప్తురాజు ఫరో నెకో అష్షూరురాజుతో యుద్ధం చెయ్యడానికి యూఫ్రటీసు నది దగ్గరికి వెళ్తూ ఉన్నప్పుడు తనను యుద్ధంలో ఎదుర్కోడానికి వచ్చిన రాజైన యోషీయాను మెగిద్దో దగ్గర చంపాడు.
Hänen ajallansa matkusti Pharao Neko, Egyptin kuningas, Assyrian kuningasta vastaan Phratin virran tykö; mutta kuningas Josia meni häntä vastaan, ja se tappoi hänen Megiddossa, sittekuin hän oli nähnyt hänen.
30 ౩౦ అతని సేవకులు అతని శవాన్ని రథం మీద ఉంచి, మెగిద్దో నుంచి యెరూషలేముకు తీసుకొచ్చి, అతని సమాధిలో పాతిపెట్టారు. అప్పుడు దేశ ప్రజలు యోషీయా కొడుకు యెహోయాహాజుకు పట్టాభిషేకం చేసి, అతని తండ్రి స్థానంలో అతన్ని రాజుగా చేశారు.
Ja hänen palveliansa veivät hänen kuolleena pois Megiddosta, ja veivät hänen Jerusalemiin ja hautasivat hänen omaan hautaansa. Ja maan kansa otti Joahaksen Josian pojan, voitelivat ja tekivät hänen kuninkaaksi isänsä siaan.
31 ౩౧ యెహోయాహాజు పరిపాలన ఆరంభించినప్పుడు అతని వయసు 23 సంవత్సరాలు. అతడు యెరూషలేములో మూడు నెలలు ఏలాడు. అతని తల్లి పేరు హమూటలు. ఆమె లిబ్నా ఊరి వాడు యిర్మీయా కూతురు.
Kolmen ajastajan vanha kolmattakymmentä oli Joahas, kuin hän tuli kuninkaaksi, ja hallitsi kolme kuukautta Jerusalemissa. Hänen äitinsä nimi oli Hamutal, Jeremian tytär Libnasta.
32 ౩౨ ఇతడు తన పూర్వికులు చేసినదానంతటి ప్రకారం చేసి యెహోవా దృష్టిలో చెడునడత నడిచాడు.
Ja hän teki pahaa Herran edessä, niinkuin hänen esi-isänsä tehneet olivat.
33 ౩౩ ఫరో నెకో ఇతడు యెరూషలేములో పరిపాలన చెయ్యకుండా హమాతు దేశంలో ఉన్న రిబ్లా పట్టణంలో అతన్ని బంధకాల్లో ఉంచాడు. దేశం మీద 50 మణుగుల వెండినీ, రెండు మణుగుల బంగారాన్నీ కప్పం విధించాడు.
Mutta Pharao Neko sitoi hänen kiinni Riblatissa Hamatin maalla, ettei hän hallitsisi Jerusalemissa, ja pani sakkoveron maan päälle, sata leiviskää hopiaa ja leiviskän kultaa.
34 ౩౪ యోషీయా కొడుకు ఎల్యాకీమును అతని తండ్రి యోషీయా స్థానంలో నియమించి, అతనికి యెహోయాకీము అని మారుపేరు పెట్టాడు. కాని అతడు యెహోయాహాజును ఐగుప్తు దేశానికి తీసుకెళ్ళినప్పుడు అతడు అక్కడ చనిపోయాడు.
Ja Pharao Neko teki Eliakimin Josian pojan kuninkaaksi, hänen isänsä Josian siaan, ja muutti hänen nimensä Jojakimiksi; mutta Joahaksen hän otti ja vei Egyptiin, siellä hän kuoli.
35 ౩౫ యెహోయాకీము ఫరో ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం దేశం మీద పన్ను నిర్ణయించి, ఆ వెండి బంగారాలను ఫరోకు చెల్లిస్తూ వచ్చాడు. అతడు దేశ ప్రజల దగ్గర నుంచి వారికి నిర్ణయించిన ప్రకారం వసూలు చేసి ఫరో నెకోకు చెల్లిస్తూ వచ్చాడు.
Ja Jojakim antoi Pharaolle hopian ja kullan; kuitenkin laski hän maan verolliseksi, antamaan hopiaa Pharaon käskyn jälkeen: itsekunkin maakunnan kansan teki hän verolliseksi voimansa perästä hopiaan ja kultaan, Pharao Nekolle antaaksensa.
36 ౩౬ యెహోయాకీము పరిపాలన ఆరంభించినప్పుడు 25 సంవత్సరాల వయస్సు గలవాడు. అతడు యెరూషలేములో 11 సంవత్సరాలు ఏలాడు. అతని తల్లి పేరు జెబూదా. ఆమె రూమా ఊరి వాడు పెదాయా కూతురు.
Viidenkolmattakymmenen ajastajan vanha oli Jojakim, kuin hän kuninkaaksi tuli, ja hallitsi yksitoistakymmentä ajastaikaa Jerusalemissa: hänen äitinsä nimi oli Zebuda, Pedajan tytär Rumasta.
37 ౩౭ ఇతడు కూడా తన పూర్వికులు చేసినట్టు చేసి, యెహోవా దృష్టిలో చెడు నడత నడిచాడు.
Ja hän teki pahaa Herran edessä, niinkuin hänen isänsäkin tehneet olivat.