< రాజులు~ రెండవ~ గ్రంథము 22 >

1 యోషీయా ఏలడం ఆరంభించినప్పుడు, అతని వయసు ఎనిమిది సంవత్సరాలు. అతడు యెరూషలేములో 31 సంవత్సరాలు ఏలాడు. అతని తల్లి పేరు యెదీదా. ఆమె బొస్కతు ఊరివాడైన అదాయా కూతురు.
Josia var åtta åra gammal, då han vardt Konung, och regerade ett och tretio år i Jerusalem; hans moder het Jedida, Adaja dotter, af Bozkath.
2 అతడు యెహోవా దృష్టిలో యథార్ధంగా నడుస్తూ, కుడి ఎడమలకు తిరగకుండా తన పితరుడు దావీదు చూపించిన దారిలో నడిచాడు.
Han gjorde det godt var för Herranom, och vandrade i allom sins faders Davids väg, och böjde hvarken på högra sidona, eller på den venstra.
3 రాజైన యోషీయా పరిపాలనలో 18 వ సంవత్సరంలో, అతడు మెషుల్లాముకు పుట్టిన అజల్యా కొడుకూ, శాస్త్రి అయిన షాఫానును యెహోవా మందిరానికి వెళ్ళమన్నాడు. రాజు అతనితో,
Uti adertonde årena Konungs Josia, sände Konungen Saphan, Azalia son, Mesullams sons, skrifvaren, bort uti Herrans hus, och sade:
4 “నీవు ప్రధాన యాజకుడైన హిల్కీయా దగ్గరికి వెళ్లి, ద్వారపాలకులు ప్రజల దగ్గర వసూలు చేసి యెహోవా మందిరంలో ఉంచిన డబ్బు మొత్తం ఎంతో లెక్క చూడమని అతనితో చెప్పు.
Gack upp till öfversta Presten Hilkia, att man må få honom de penningar, som till Herrans hus införde äro, och dörravaktarena församlat hafva af folkena;
5 యెహోవా మందిరపు పనికి అధికారులుగా ఉండి పని జరిగించేవాళ్ళ చేతికి ఆ డబ్బు అప్పగించాలి. ఆ తరువాత యెహోవా మందిరంలో శిథిలమైన స్థలాలను బాగుచేయడానికి యెహోవా మందిరపు పనిచేసే కూలివాళ్లకు వారు ఆ డబ్బు ఇవ్వాలి.
Att de måga gifva dem arbetarena, som beställde äro i Herrans hus, och gifva dem som arbeta på Herrans hus, och bota det som förfallet är i husena;
6 వడ్రంగి వాళ్ళకూ, శిల్పకారులకూ, తాపీ పని వాళ్ళకూ, మందిరాన్ని బాగు చెయ్యడానికి మానులు, చెక్కిన రాళ్ళు కొనడానికి ఆ డబ్బు ఇవ్వాలని చెప్పు” అన్నాడు.
Nämliga timbermannom, byggningsmannom, murmästarom, och dem som trä och huggen sten köpa skola, till husets förbättring;
7 ఆ అధికారులు నమ్మకస్థులు గనుక వాళ్ళ చేతికి అప్పగించిన డబ్బు గురించి వాళ్ళ దగ్గర లెక్క తీసుకోవలసిన పని లేదు.
Dock så, att man ingen räkenskap skulle taga af dem för de penningar, som under deras hand antvardade vordo; utan de skulle handla dermed på sina tro.
8 అప్పుడు, ప్రధానయాజకుడైన హిల్కీయా “యెహోవా మందిరంలో ధర్మశాస్త్ర గ్రంథం నాకు దొరికింది” అని షాఫాను అనే శాస్త్రితో చెప్పి ఆ గ్రంథాన్ని, షాఫానుకు అప్పగించాడు. అతడు దాన్ని చదివి
Och öfverste Presten Hilkia sade till skrifvaren Saphan: Jag hafver funnit lagbokena uti Herrans hus; och Hilkia fick Saphan bokena, att han skulle den läsa.
9 రాజు దగ్గరికి తిరిగి వచ్చి “మీ సేవకులు మందిరంలో దొరికిన డబ్బు సమకూర్చి యెహోవా మందిరపు పని విషయంలో అధికారులుగా ఉండి, పని జరిగించేవాళ్ళ చేతికి అప్పగించారు” అని వార్త చెప్పి,
Och skrifvaren Saphan bar henne till Konungen, och bådade honom igen, och sade: Dine tjenare hafva tillhopahemtat de penningar, som i husena funne voro, och hafva utgifvit dem arbetarena, som beställde äro i Herrans hus.
10 ౧౦ “యాజకుడైన హిల్కీయా నాకు ఒక గ్రంథం అప్పగించాడు” అని రాజుతో చెప్పి ఆ గ్రంథం రాజు సముఖంలో చదివాడు.
Och förtäljde skrifvaren Saphan Konungenom, och sade: Hilkia Presten fick mig ena bok; och Saphan las henne för Konungenom.
11 ౧౧ రాజు ధర్మశాస్త్ర గ్రంథంలో ఉన్న మాటలు విన్నప్పుడు తన బట్టలు చింపుకున్నాడు.
Då Konungen hörde orden i lagbokene, ref han sin kläder sönder.
12 ౧౨ తరువాత రాజు యాజకుడైన హిల్కీయా, షాఫాను కొడుకు అహీకాము, మీకాయా కొడుకు అక్బోరు అనే వాళ్ళనూ, షాఫాను అనే శాస్త్రినీ, అశాయా అనే రాజసేవకుల్లో ఒకణ్ణి పిలిచి వాళ్లకు ఇలా ఆజ్ఞాపించాడు.
Och Konungen böd Hilkia Prestenom, och Ahikam, Saphans sone, och Achbor, Michaja sone, och Saphan skrifvarenom, och Asaja, Konungens tjenare, och sade:
13 ౧౩ “మీరు వెళ్లి, దొరికిన ఈ గ్రంథంలోని మాటలను గురించి నా విషయంలో, ప్రజల విషయంలో, యూదా వాళ్ళందరి విషయంలో, యెహోవాను అడగండి. మన పూర్వికులు తమ విషయంలో రాసి ఉన్న దానంతటి ప్రకారం చెయ్యకుండా ఈ గ్రంథపు మాటలు వినలేదు గనుక యెహోవా కోపాగ్ని మన మీద ఇంత ఎక్కువగా మండుతూ ఉంది” అన్నాడు.
Går bort, och fråger Herran, för mig, för folket, och för hela Juda, om denna bokenes ord, som funnen är; ty det är en stor Herrans vrede, som är upptänd öfver oss; derföre, att våre fäder icke lydt hafva denna bokenes ord, att de måtte gjort allt det derutinnan skrifvet är.
14 ౧౪ కాబట్టి యాజకుడైన హిల్కీయా, అహికాము, అక్బోరు, షాఫాను, అశాయా, స్త్రీ ప్రవక్త హుల్దా దగ్గరికి వచ్చారు. ఈమె వస్త్రశాలకు అధికారి అయిన హర్హషుకు పుట్టిన తిక్వా కొడుకు షల్లూము భార్య. ఈమె యెరూషలేములో రెండో భాగంలో కాపురం ఉంది. ఈమె దగ్గరికి వారు వచ్చి మాటలాడారు.
Då gingo åstad Hilkia Presten, Ahikam, Achbor, Saphan och Asaja, till den Prophetissan Hulda, Sallums hustru, Thikva sons, Harhas sons, klädavaktarens; och hon bodde i Jerusalem i dem andra delenom, och de talade med henne.
15 ౧౫ ఆమె వాళ్ళతో “మిమ్మల్ని నా దగ్గరికి పంపిన వానితో ఈ మాట చెప్పండి.
Men hon sade till dem: Detta säger Herren Israels Gud: Säger dem månne, som eder till mig sändt hafver:
16 ౧౬ యెహోవా చెప్పేదేమంటే, యూదా రాజు చదివించిన గ్రంథంలో రాసి ఉన్న కీడంతా, ఏదీ విడిచి పెట్టకుండా నేను ఈ స్థలం మీదకీ, దాని పౌరుల మీదకీ రప్పిస్తాను.
Så säger Herren: Si, jag skall låta komma olycko öfver detta rum, och dess inbyggare, efter all lagsens ord, som Juda Konung hafver läsa låtit.
17 ౧౭ ఈ ప్రజలు నన్ను విడిచి ఇతర దేవుళ్ళకు ధూపం వేస్తూ చేసిన ప్రతి పనీ నాకు కోపం పుట్టించింది గనుక నా కోపం ఆరిపోకుండా, ఈ స్థలం మీద రగులుకుంటుంది.
Derföre, att de hafva öfvergifvit mig, och rökt andra gudar, förtörnande mig med allt deras handaverk; derföre skall min vrede upptändas emot detta rum, och skall icke utsläckt varda.
18 ౧౮ యెహోవాను సంప్రదించడానికి మిమ్మల్ని పంపిన యూదా రాజుకు ఈ మాట తెలియపరచండి.
Men Juda Konunge, som eder utsändt hafver till att fråga Herran, skolen I så säga: Så säger Herren Israels Gud:
19 ౧౯ ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా చెప్పేదేమంటే, ఈ స్థలం పాడవుతుందని, దాని కాపురస్థులు శాపానికి గురి అవుతారని నేను చెప్పిన మాటలు నీవు ఆలకించి, మెత్తని మనస్సు కలిగి యెహోవా సన్నిధిలో దీనత్వం కలిగి, నీ బట్టలు చింపుకుని నా సన్నిధిలో కన్నీళ్లు కార్చావు గనుక నీవు చేసిన మనవి నేను అంగీకరించాను.
Derföre, att ditt hjerta hafver bevekt sig, af de ord, som, du hört hafver, och hafver ödmjukat dig för Herranom, då du hörde hvad jag sagt hade emot detta rum, och dess inbyggare, att de skulle varda till en förödelse och förbannelse, och hafver rifvit din kläder sönder, och hafver gråtit för mig, så hafver jag ock hört det, säger Herren.
20 ౨౦ నేను నిన్ను నీ పితరుల దగ్గరికి చేరుస్తాను. నీవు ప్రశాంతంగా సమాధికి వెళ్తావు. నేను ఈ స్థలం మీదకి రప్పించే కీడును నీవు నీ కళ్ళతో చూడనే చూడవు. ఇదే యెహోవా వాక్కు” అని చెప్పింది. అప్పుడు, వారు ఈ వార్త రాజు దగ్గరికి తెచ్చారు.
Derföre vill jag samka dig till dina fäder, att du skall samkas i grafvena med frid, och din ögon icke se skola alla denna olyckona, som jag öfver detta rum föra skall. Och de sade Konungenom det igen.

< రాజులు~ రెండవ~ గ్రంథము 22 >