< రాజులు~ రెండవ~ గ్రంథము 21 >

1 మనష్షే పరిపాలన ఆరంభించినప్పుడు అతని వయసు 12 సంవత్సరాలు. అతడు యెరూషలేములో 55 సంవత్సరాలు ఏలాడు. అతని తల్లిపేరు హెప్సిబా.
Manaşşe on iki yaşında kral oldu ve Yeruşalim'de elli beş yıl krallık yaptı. Annesinin adı Hefsivah'tı.
2 అతడు యెహోవా దృష్టిలో చెడుతనం జరిగిస్తూ, ఇశ్రాయేలీయుల ఎదుట నిలవలేకుండా యెహోవా వెళ్లగొట్టిన ప్రజలు చేసినట్లు అసహ్యమైన పనులు చేస్తూ వచ్చాడు.
RAB'bin İsrail halkının önünden kovmuş olduğu ulusların iğrenç törelerine uyarak RAB'bin gözünde kötü olanı yaptı.
3 తన తండ్రి హిజ్కియా పడగొట్టిన ఉన్నత స్థలాలు అతడు మళ్ళీ కట్టించి, బయలు దేవుడుకు బలిపీఠాలు కట్టించి ఇశ్రాయేలురాజు అహాబు చేసినట్టు దేవతాస్తంభాలు చేయించి, నక్షత్రాలకు మొక్కి, వాటిని పూజిస్తూ ఉన్నాడు.
Babası Hizkiya'nın yok ettiği puta tapılan yerleri yeniden yaptırdı. İsrail Kralı Ahav gibi, Baal için sunaklar kurdu, Aşera putu yaptı. Gök cisimlerine taparak onlara kulluk etti.
4 ఇంకా “నా పేరు యెరూషలేములో శాశ్వతంగా ఉంచుతాను” అని యెహోవా చెప్పిన ఆ యెరూషలేములో అతడు యెహోవా మందిరంలో బలిపీఠాలు కట్టించాడు.
RAB'bin, “Yeruşalim'de bulunacağım” dediği RAB'bin Tapınağı'nda sunaklar kurdu.
5 ఇంకా, యెహోవా మందిరానికి ఉన్న రెండు ప్రాంగణాల్లో ఆకాశ నక్షత్రాలకు అతడు బలిపీఠాలు కట్టించాడు.
Tapınağın iki avlusunda gök cisimlerine tapmak için sunaklar yaptırdı.
6 అతడు తన కొడుకును దహన బలిగా అర్పించి జ్యోతిష్యం, శకునాలు అలవాటు చేసి, చనిపోయిన ఆత్మలతో మాట్లాడే వాళ్ళతో, సోదె చెప్పే వాళ్ళతో సాంగత్యం చేశాడు. ఈ విధంగా అతడు యెహోవా దృష్టిలో ఎంతో చెడుతనం జరిగిస్తూ ఆయనకు కోపం పుట్టించాడు.
Oğlunu ateşte kurban etti; falcılık ve büyücülük yaptı. Medyumlara, ruh çağıranlara danıştı. RAB'bin gözünde çok kötülük yaparak O'nu öfkelendirdi.
7 యెహోవా దావీదుకు, అతని కొడుకు సొలొమోనుకు ఆజ్ఞ ఇచ్చి “ఈ మందిరంలో ఇశ్రాయేలు గోత్రస్దానాల్లో నుంచి నేను కోరుకున్న ఈ యెరూషలేములో నా పేరు ఎల్లకాలం ఉంచుతాను” అని దేన్నీ గురించి చెప్పాడో ఆ యెహోవా మందిరంలో తాను చేయించిన అషేరా రూపాన్ని పెట్టాడు.
Manaşşe yaptırdığı Aşera putunu RAB'bin Tapınağı'na yerleştirdi. Oysa RAB tapınağa ilişkin Davut'la oğlu Süleyman'a şöyle demişti: “Bu tapınakta ve İsrail oymaklarının yaşadığı kentler arasından seçtiğim Yeruşalim'de adım sonsuza dek anılacak.
8 ఇంకా “ఇశ్రాయేలీయులకు నేను ఆజ్ఞాపించిన దానంతటినీ నా సేవకుడు మోషే వాళ్లకు రాసి ఇచ్చిన ధర్మశాస్త్రాన్నీ వారు పాటిస్తే, వాళ్ళ పితరులకు నేనిచ్చిన దేశంలో నుంచి వాళ్ళ పాదాలు ఇంక తొలగి పోనివ్వను” అని యెహోవా చెప్పిన మాట వినకుండా
Buyruklarımı dikkatle yerine getirir ve kulum Musa'nın kendilerine verdiği Kutsal Yasa'yı tam uygularlarsa, İsrail halkının ayağını bir daha atalarına vermiş olduğum ülkenin dışına çıkarmayacağım.”
9 ఇశ్రాయేలీయుల ఎదుట నిలబడకుండా యెహోవా నాశనం చేసిన ప్రజలు జరిగించిన చెడుతనాన్ని మించిన చెడుతనం చేసేలా మనష్షే వాళ్ళను పురిగొల్పాడు.
Ama halk kulak asmadı. Manaşşe onları öylesine yoldan çıkardı ki, RAB'bin İsrail halkının önünde yok ettiği uluslardan daha çok kötülük yaptılar.
10 ౧౦ అయితే, యెహోవా తన సేవకులైన ప్రవక్తల ద్వారా మాట్లాడుతూ,
RAB, kulları peygamberler aracılığıyla şöyle dedi:
11 ౧౧ “యూదా రాజు మనష్షే ఈ అసహ్యమైన పనులు చేసి, తన ముందున్న అమోరీయులను మించిన చెడునడత కనుపరచి, తాను పెట్టుకొన్న విగ్రహాల వల్ల యూదావారు పాపం చెయ్యడానికి కారకుడయ్యాడు.
“Yahuda Kralı Manaşşe bu iğrenç işleri yaptığı, kendisinden önceki Amorlular'dan daha çok kötülük ettiği, putlar dikerek Yahudalılar'ı günaha sürüklediği için İsrail'in Tanrısı RAB, ‘Yeruşalim'in ve Yahuda'nın başına öyle bir felaket getireceğim ki, duyanların hepsi şaşkına dönecek’ diyor,
12 ౧౨ కాబట్టి, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా చెప్పేదేమంటే, వినేవాళ్ళకు రెండు చెవులూ గింగురుమనేంత కీడు యెరూషలేము మీదకీ, యూదావాళ్ళ మీదకీ రప్పిస్తాను.
13 ౧౩ నేను షోమ్రోనును కొలిచిన నూలు, అహాబు కుటుంబీకులను సరి చూసిన మట్టపు గుండు యెరూషలేము మీద సాగలాగుతాను. ఒకడు పళ్ళెం తుడిచేటప్పుడు దాన్ని బోర్లించి తుడిచినట్టు నేను యెరూషలేమును తుడిచివేస్తాను.
‘Samiriye'yi ve Ahav'ın soyunu nasıl cezalandırdımsa, Yeruşalim'i cezalandırırken de aynı ölçü ipini, aynı çekülü kullanacağım. Bir adam tabağını nasıl temizler, silip yüzüstü kapatırsa, Yeruşalim'i de öyle silip süpüreceğim.
14 ౧౪ ఇంకా, నా స్వాస్ధ్యంలో మిగిలిన వాళ్ళను నేను తోసివేసి, వాళ్ళ శత్రువుల చేతికి వాళ్ళను అప్పగిస్తాను.
Halkımdan sağ kalanları terk edeceğim ve düşmanlarının eline teslim edeceğim. Yeruşalim halkı yağmalanıp ganimet olarak götürülecek.
15 ౧౫ వారు తమ పూర్వికులు ఐగుప్తు దేశంలోనుంచి వచ్చిన రోజునుంచి ఈ రోజు వరకూ నా దృష్టికి కీడు చేసి నాకు కోపం పుట్టిస్తున్నారు గనుక వారు తమ శత్రువులందరివల్ల దోపిడీకి గురై నష్టం పొందుతారు.”
Çünkü gözümde kötü olanı yaptılar. Atalarının Mısır'dan çıktığı günden bugüne kadar beni öfkelendirdiler.’”
16 ౧౬ ఇంకా మనష్షే యెహోవా దృష్టిలో చెడునడత నడిచి, యూదావాళ్ళను పాపంలో దింపడమే కాకుండా యెరూషలేమును ఈ మూల నుంచి ఆ మూల వరకూ రక్తంతో నిండేలా నిరపరాధుల రక్తాన్ని ఒలికించాడు.
Manaşşe RAB'bin gözünde kötü olanı yaparak Yahudalılar'ı günaha sürüklemekle kalmadı, Yeruşalim'i bir uçtan öbür uca dolduracak kadar çok sayıda suçsuzun kanını döktü.
17 ౧౭ మనష్షే చేసిన ఇతర పనుల గురించి, అతడు చేసిన దానంతటి గురించి, అతని దోషం గురించి యూదారాజుల చరిత్ర గ్రంథంలో రాసి ఉంది.
Manaşşe'nin krallığı dönemindeki öteki olaylar, bütün yaptıkları ve işlediği günahlar Yahuda krallarının tarihinde yazılıdır.
18 ౧౮ మనష్షే తన పూర్వీకులతో బాటు చనిపోయిన తరువాత, ఉజ్జా తోటలో తన ఇంటి దగ్గర అతణ్ణి సమాధి చేశారు. అతని కొడుకు ఆమోను అతని స్థానంలో రాజయ్యాడు.
Manaşşe ölüp atalarına kavuşunca, sarayının Uzza adındaki bahçesine gömüldü. Yerine oğlu Amon kral oldu.
19 ౧౯ ఆమోను పరిపాలన ఆరంభించినప్పుడు అతని వయస్సు 22 సంవత్సరాలు. అతడు యెరూషలేములో రెండు సంవత్సరాలు ఏలాడు. అతని తల్లి పేరు మెషుల్లెమెతు. ఆమె యొట్బ ఊరివాడైన హారూసు కూతురు.
Amon yirmi iki yaşında kral oldu ve Yeruşalim'de iki yıl krallık yaptı. Annesi Yotvalı Harus'un kızı Meşullemet'ti.
20 ౨౦ అతడు తన తండ్రి మనష్షే నడిచినట్టు యెహోవా దృష్టిలో చెడునడత నడిచాడు.
Amon da babası Manaşşe gibi RAB'bin gözünde kötü olanı yaptı.
21 ౨౧ తన పితరుల దేవుడైన యెహోవాను వదిలిపెట్టి, యెహోవా మార్గంలో నడవకుండా, తన తండ్రి ప్రవర్తించినట్టు తానూ ప్రవర్తిస్తూ,
Babasının yürüdüğü yollarda yürüdü, aynı putlara taptı ve hizmet etti.
22 ౨౨ తన తండ్రి పూజించిన విగ్రహాలను తానూ పూజించాడు.
Atalarının Tanrısı RAB'bi terk etti, O'nun yolunda yürümedi.
23 ౨౩ ఆమోను సేవకులు అతని మీద కుట్రచేసి అతన్ని రాజనగరులో చంపారు.
Kral Amon'un görevlileri düzen kurup onu sarayında öldürdüler.
24 ౨౪ దేశ ప్రజలు రాజైన ఆమోను మీద కుట్ర చేసిన వాళ్ళందర్నీ చంపి, అతని స్థానంలో అతని కొడుకు యోషీయాకు పట్టాభిషేకం చేశారు.
Ülke halkı Amon'a düzen kuranların hepsini öldürdü. Yerine oğlu Yoşiya'yı kral yaptı.
25 ౨౫ ఆమోను చేసిన ఇతర పనుల గురించి యూదారాజుల చరిత్ర గ్రంథంలో రాసి ఉంది.
Amon'un krallığı dönemindeki öteki olaylar ve yaptıkları Yahuda krallarının tarihinde yazılıdır.
26 ౨౬ ఉజ్జా తోటలో అతనికి ఉన్న సమాధిలో అతణ్ణి సమాధి చేశారు. అతని కొడుకు యోషీయా అతని స్థానంలో రాజయ్యాడు.
Amon Uzza bahçesinde kendi mezarına gömüldü. Yerine oğlu Yoşiya kral oldu.

< రాజులు~ రెండవ~ గ్రంథము 21 >