< రాజులు~ రెండవ~ గ్రంథము 20 >

1 ఆ రోజుల్లో, హిజ్కియాకు జబ్బు చేసి చావుబతుకుల్లో ఉన్నాడు. ఆమోజు కొడుకూ ప్రవక్త అయిన యెషయా అతని దగ్గరికి వచ్చి “నీవు చనిపోతున్నావు. ఇక బ్రతకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకోమని యెహోవా చెప్తున్నాడు” అని చెప్పాడు.
Тими днями смертельно захворі́в був Єзекія. І прийшов до нього Іса́я, Амо́сів син, пророк, і сказав до нього: „Так сказав Господь: Заряди своїм домом, бо ти вмреш, а не ви́дужаєш“.
2 హిజ్కియా తన ముఖాన్ని గోడవైపు తిప్పుకుని,
А той відвернув обличчя своє до стіни, і помолився до Господа, говорячи:
3 “యెహోవా, యథార్థ హృదయంతో, సత్యంతో నీ సన్నిధిలో నేనెలా నడుచుకున్నానో, నీ దృష్టిలో అనుకూలంగా అంతా నేనెలా జరిగించానో కృపతో జ్ఞాపకం చేసుకో” అని కన్నీళ్ళతో యెహోవాను ప్రార్థించాడు.
„О, Господи, згадай же, що я ходив перед лицем Твоїм правдою та ці́лим серцем, і робив я добре в оча́х Твоїх“. І заплакав Єзекія ревним плаче́м.
4 యెషయా మధ్య ప్రాంగణంలోనుంచి అవతలకు వెళ్లకముందే యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై,
І сталося, Ісая не вийшов ще з сере́дини міста, а до нього було Господнє слово, говорячи:
5 “నీవు మళ్ళీ నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా దగ్గరికి వెళ్లి, అతనితో ఇలా చెప్పు. నీ పితరుడు దావీదుకు దేవుడైన యెహోవా నీకు చెప్పేదేమంటే, నీవు కన్నీళ్లు విడవడం చూశాను. నేను నీ ప్రార్థన అంగీకరించాను. నేను నిన్ను బాగు చేస్తాను. మూడో రోజు నీవు యెహోవా మందిరానికి ఎక్కి వెళ్తావు.
„Вернися, і скажеш до Єзекії, володаря Мого народу: Так сказав Господь, Бог батька твого Давида: Почув Я молитву твою, побачив Я сльозу́ твою! Ось Я вилікую тебе, — третього дня зі́йдеш ти до Господнього дому!
6 ఇంకొక 15 సంవత్సరాల ఆయుష్షు నీకు ఇస్తాను. ఇంకా నా కోసం, నా సేవకుడైన దావీదు కోసం ఈ పట్టణాన్ని నేను కాపాడుతూ, నిన్నూ, ఈ పట్టాణాన్నీ, అష్షూరు రాజు చేతిలో పడకుండా నేను విడిపిస్తాను” అన్నాడు.
І до днів твоїх Я дода́м п'ятнадцять літ, і з руки асирійського царя врятую тебе та це місто, й обороню́ це місто ради Себе та ради раба Свого Давида“.
7 తరువాత యెషయా “అంజూరపుపళ్ళ ముద్ద తెప్పించండి” అని చెప్పాడు. వారు దాన్ని తెచ్చి కురుపు మీద వేసిన తరువాత అతడు బాగు పడ్డాడు.
А Ісая сказав: „Візьміть грудку фіґ“. І взяли́ й поклали на того гнояка́, — і він ви́дужав...
8 “యెహోవా నన్ను స్వస్థపరుస్తాడు అనడానికీ, నేను మూడో రోజు ఆయన మందిరానికి ఎక్కి వెళ్తాననడానికీ, సూచన ఏంటి?” అని హిజ్కియా యెషయాను అడిగాడు. యెషయా
І сказав Єзекія до Ісаї: „Який знак, що Господь мене ви́лікує, і що я третього дня зійду́ до Господнього дому?“
9 “తాను చెప్పిన మాట యెహోవా నెరవేరుస్తాడు అనడానికి ఆయన ఇచ్చిన సూచన ఏమంటే, నీడ పది మెట్లు ముందుకు నడవాలా? లేక అది పదిమెట్లు వెనక్కు నడవాలా?” అన్నాడు.
І сказав Ісая: „Ось тобі знак той від Господа, що Господь зробить ту річ, про яку говорив: Чого хочеш, — щоб пішла тінь уперед на десять ступені́в, чи щоб верну́лася на десять ступені́в?“
10 ౧౦ అందుకు హిజ్కియా “నీడ పది మెట్లు ముందుకు నడవడం తేలికే. కాని నీడ పది గడులు వెనక్కి నడవాలి” అన్నాడు.
І сказав Єзекія: „Легко тіні похили́тися вперед на десять ступені́в; ні, — а нехай тінь ве́рнеться назад на десять ступені́в!“
11 ౧౧ ప్రవక్త అయిన యెషయా యెహోవాను ప్రార్థించగా ఆయన ఆహాజు గడియారపు పలక మీద పది మెట్లు ముందుకు నడిచిన నీడ పది మెట్లు వెనక్కి వెళ్ళేలా చేశాడు.
І кли́кнув пророк Ісая до Господа, і Він заверну́в тінь на ступеня́х, де вона спускалася на ступені́ Ахазові, на десять ступені́в...
12 ౧౨ ఆ కాలంలో బబులోనురాజు, బలదాను కొడుకు అయిన బెరోదక్ బలదాను హిజ్కియా జబ్బుగా ఉన్నాడన్న విషయం తెలిసి, ఉత్తరం రాసి కానుకలు ఇచ్చి రాయబారులను అతని దగ్గరికి పంపాడు.
Того ча́су послав Беродах-Бал'адан, син Бал'аданів, вавилонський цар, листа́ та дару́нка до Єзекії, бо прочув був, що Єзекія захворі́в.
13 ౧౩ వర్తమానికులు వచ్చారన్న మాట హిజ్కియా విని వాళ్ళను లోపలికి రప్పించి, తన రాజనగరంలోనూ, రాజ్యంలోనూ ఉన్న అన్ని వస్తువుల్లో, దేనినీ దాచకుండా, తన వస్తువులు ఉన్న కొట్టూ, వెండి బంగారాలూ, సుగంధ ద్రవ్యాలూ, సువాసన తైలం, ఆయుధశాల, తన వస్తువుల్లో ఉన్నవన్నీ వాళ్లకు చూపించాడు.
І вислухав їх Єзекія, і показав їм усю скарбни́цю свою, — і срібло, і золото, і па́хощі, і добру оливу, і всю зброївню свою, і все, що знахо́дилося в його скарбницях. Не було речі, якої не показав би їм Єзекія в домі своїм та в усім володі́нні своїм.
14 ౧౪ తరువాత ప్రవక్త అయిన యెషయా హిజ్కియా రాజు దగ్గరికి వచ్చి “ఆ మనుషులు ఏమన్నారు? నీ దగ్గరికి ఎక్కడ నుంచి వచ్చారు?” అని అడిగాడు. హిజ్కియా “బబులోను అనే దూరదేశం నుంచి వారు వచ్చారు” అని చెప్పాడు.
І прийшов пророк Іса́я до царя Єзекії та й сказав до нього: „Що́ говорили ці люди? І звідки вони прийшли до тебе?“А Єзекія сказав: „Вони прийшли з далекого кра́ю, з Вавилону“.
15 ౧౫ “నీ ఇంట్లో వారు ఏమేమి చూశారు?” అని అతడు అడిగాడు. హిజ్కియా “నా వస్తువుల్లో దేన్నీ దాచకుండా నా ఇంట్లో ఉన్నవన్నీ నేను వాళ్లకు చూపించాను” అన్నాడు.
І той сказав: „Що́ вони бачили в домі твоїм?“І Єзекія сказав: „Усе, що в домі моїм, вони бачили, — не було речі, якої не показав би я їм у скарбни́цях своїх“,
16 ౧౬ అప్పుడు యెషయా హిజ్కియాతో “యెహోవా చెప్పే మాట విను.
I сказав Ісая до Єзекії: „Послухай Господнього слова:
17 ౧౭ రానున్న రోజుల్లో ఏమీ మిగులకుండా నీ రాజనగరులో ఉన్నవన్నీ, ఈ రోజు వరకూ నీ పూర్వికులు సమకూర్చి దాచిపెట్టినదంతా, వారు బబులోను పట్టణానికి తీసుకుని వెళ్ళిపోతారని యెహోవా చెప్తున్నాడు.
Ось прихо́дять дні, і все, що́ в домі твоєму, і що були зібрали батьки твої аж до цього дня, буде ви́несене до Вавилону. Нічого не позоста́неться, говорить Господь!
18 ౧౮ ఇంకా నీ కడుపున పుట్టిన నీ కొడుకుల సంతతిని వారు బబులోను రాజు నగరానికి తీసుకు వెళ్తారు. అక్కడ వారు నపుంసకులు అవుతారు” అన్నాడు.
А з синів твоїх, що вийдуть із тебе, яких ти поро́диш, де́кого заберуть, — і вони будуть є́внухами в палатах вавилонського царя!“
19 ౧౯ అందుకు హిజ్కియా “నీవు తెలియజేసిన యెహోవా ఆజ్ఞ ప్రకారం జరగడం మంచిదే. నా కాలంలో మాత్రం సమాధానం, స్థిరత్వం ఉంటాయి కదా?” అని యెషయాతో అన్నాడు.
І сказав Єзекія до Ісаї: „Добре Господнє слово, яке ти сказав!“І подумав собі: „Так, мир та безпека буде за моїх днів!“
20 ౨౦ హిజ్కియా చేసిన ఇతర పనులు గురించీ, అతని పరాక్రమం అంతటి గురించీ, అతడు కొలను తవ్వించి, కాలువ వేయించి పట్టణంలోకి నీళ్లు రప్పించిన దాన్ని గురించీ, యూదారాజుల చరిత్ర గ్రంథంలో రాసి ఉంది.
А решта діл Єзекії та вся лица́рськість його, і як він зробив ста́ва та водотя́га, і впровадив воду до міста, — ото вони написані в Книзі Хроніки Юдиних царів.
21 ౨౧ హిజ్కియా తన పూర్వీకులతోబాటు చనిపోయాడు. అతని కొడుకు మనష్షే అతని స్థానంలో రాజయ్యాడు.
І спочив Єзекія зо своїми батьками, а замість нього зацарював син його Манасі́я.

< రాజులు~ రెండవ~ గ్రంథము 20 >