< రాజులు~ రెండవ~ గ్రంథము 20 >
1 ౧ ఆ రోజుల్లో, హిజ్కియాకు జబ్బు చేసి చావుబతుకుల్లో ఉన్నాడు. ఆమోజు కొడుకూ ప్రవక్త అయిన యెషయా అతని దగ్గరికి వచ్చి “నీవు చనిపోతున్నావు. ఇక బ్రతకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకోమని యెహోవా చెప్తున్నాడు” అని చెప్పాడు.
Naqueles dias, Hezekiah estava doente e morrendo. Isaías, o profeta filho de Amoz, veio até ele e lhe disse: “Javé diz: 'Ponha sua casa em ordem, pois você morrerá e não viverá'”.
2 ౨ హిజ్కియా తన ముఖాన్ని గోడవైపు తిప్పుకుని,
Então ele virou seu rosto para a parede e rezou a Javé, dizendo:
3 ౩ “యెహోవా, యథార్థ హృదయంతో, సత్యంతో నీ సన్నిధిలో నేనెలా నడుచుకున్నానో, నీ దృష్టిలో అనుకూలంగా అంతా నేనెలా జరిగించానో కృపతో జ్ఞాపకం చేసుకో” అని కన్నీళ్ళతో యెహోవాను ప్రార్థించాడు.
“Lembre-se agora, Javé, eu lhe imploro, como eu caminhei diante de você em verdade e com um coração perfeito, e fiz o que é bom à sua vista”. E Hezekiah chorou amargamente.
4 ౪ యెషయా మధ్య ప్రాంగణంలోనుంచి అవతలకు వెళ్లకముందే యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై,
Antes de Isaías ter saído para a parte central da cidade, a palavra de Javé veio a ele, dizendo:
5 ౫ “నీవు మళ్ళీ నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా దగ్గరికి వెళ్లి, అతనితో ఇలా చెప్పు. నీ పితరుడు దావీదుకు దేవుడైన యెహోవా నీకు చెప్పేదేమంటే, నీవు కన్నీళ్లు విడవడం చూశాను. నేను నీ ప్రార్థన అంగీకరించాను. నేను నిన్ను బాగు చేస్తాను. మూడో రోజు నీవు యెహోవా మందిరానికి ఎక్కి వెళ్తావు.
“Volte para trás e diga a Ezequias, o príncipe do meu povo: 'Javé, o Deus de Davi, seu pai, diz: “Ouvi a sua oração. Eu vi suas lágrimas. Eis que eu te curarei”. No terceiro dia, você irá até a casa de Iavé.
6 ౬ ఇంకొక 15 సంవత్సరాల ఆయుష్షు నీకు ఇస్తాను. ఇంకా నా కోసం, నా సేవకుడైన దావీదు కోసం ఈ పట్టణాన్ని నేను కాపాడుతూ, నిన్నూ, ఈ పట్టాణాన్నీ, అష్షూరు రాజు చేతిలో పడకుండా నేను విడిపిస్తాను” అన్నాడు.
Acrescentarei a seus dias quinze anos. Eu te entregarei a ti e a esta cidade da mão do rei da Assíria. Defenderei esta cidade por mim e pelo meu servo Davi””.
7 ౭ తరువాత యెషయా “అంజూరపుపళ్ళ ముద్ద తెప్పించండి” అని చెప్పాడు. వారు దాన్ని తెచ్చి కురుపు మీద వేసిన తరువాత అతడు బాగు పడ్డాడు.
Isaías disse: “Pegue um bolo de figos”. Eles o pegaram e colocaram em ebulição, e ele se recuperou.
8 ౮ “యెహోవా నన్ను స్వస్థపరుస్తాడు అనడానికీ, నేను మూడో రోజు ఆయన మందిరానికి ఎక్కి వెళ్తాననడానికీ, సూచన ఏంటి?” అని హిజ్కియా యెషయాను అడిగాడు. యెషయా
Hezekiah disse a Isaías: “Qual será o sinal de que Javé me curará e que eu subirei à casa de Javé no terceiro dia?
9 ౯ “తాను చెప్పిన మాట యెహోవా నెరవేరుస్తాడు అనడానికి ఆయన ఇచ్చిన సూచన ఏమంటే, నీడ పది మెట్లు ముందుకు నడవాలా? లేక అది పదిమెట్లు వెనక్కు నడవాలా?” అన్నాడు.
Isaías disse: “Este será o sinal para você de Javé, que Javé fará o que ele falou: a sombra deve avançar dez passos, ou retroceder dez passos”?
10 ౧౦ అందుకు హిజ్కియా “నీడ పది మెట్లు ముందుకు నడవడం తేలికే. కాని నీడ పది గడులు వెనక్కి నడవాలి” అన్నాడు.
Hezekiah respondeu: “É uma coisa leve para a sombra dar dez passos à frente. Não, mas deixe a sombra voltar dez passos para trás”.
11 ౧౧ ప్రవక్త అయిన యెషయా యెహోవాను ప్రార్థించగా ఆయన ఆహాజు గడియారపు పలక మీద పది మెట్లు ముందుకు నడిచిన నీడ పది మెట్లు వెనక్కి వెళ్ళేలా చేశాడు.
Isaías, o profeta, chorou a Javé; e trouxe a sombra dez passos para trás, através dos quais ela tinha descido sobre o relógio de sol de Ahaz.
12 ౧౨ ఆ కాలంలో బబులోనురాజు, బలదాను కొడుకు అయిన బెరోదక్ బలదాను హిజ్కియా జబ్బుగా ఉన్నాడన్న విషయం తెలిసి, ఉత్తరం రాసి కానుకలు ఇచ్చి రాయబారులను అతని దగ్గరికి పంపాడు.
Naquele tempo Berodach Baladan, filho de Baladan, rei da Babilônia, enviou cartas e um presente a Ezequias, pois tinha ouvido dizer que Ezequias tinha estado doente.
13 ౧౩ వర్తమానికులు వచ్చారన్న మాట హిజ్కియా విని వాళ్ళను లోపలికి రప్పించి, తన రాజనగరంలోనూ, రాజ్యంలోనూ ఉన్న అన్ని వస్తువుల్లో, దేనినీ దాచకుండా, తన వస్తువులు ఉన్న కొట్టూ, వెండి బంగారాలూ, సుగంధ ద్రవ్యాలూ, సువాసన తైలం, ఆయుధశాల, తన వస్తువుల్లో ఉన్నవన్నీ వాళ్లకు చూపించాడు.
Ezequias ouviu-os e mostrou-lhes todo o depósito de suas preciosidades - a prata, o ouro, as especiarias e o óleo precioso, e a casa de sua armadura, e tudo o que foi encontrado em seus tesouros. Não havia nada em sua casa, ou em todo seu domínio, que Hezekiah não lhes mostrasse.
14 ౧౪ తరువాత ప్రవక్త అయిన యెషయా హిజ్కియా రాజు దగ్గరికి వచ్చి “ఆ మనుషులు ఏమన్నారు? నీ దగ్గరికి ఎక్కడ నుంచి వచ్చారు?” అని అడిగాడు. హిజ్కియా “బబులోను అనే దూరదేశం నుంచి వారు వచ్చారు” అని చెప్పాడు.
Então o profeta Isaías veio ao rei Ezequias e lhe disse: “O que estes homens disseram? De onde eles vieram até você”? Hezekiah disse: “Eles vieram de um país distante, mesmo da Babilônia”.
15 ౧౫ “నీ ఇంట్లో వారు ఏమేమి చూశారు?” అని అతడు అడిగాడు. హిజ్కియా “నా వస్తువుల్లో దేన్నీ దాచకుండా నా ఇంట్లో ఉన్నవన్నీ నేను వాళ్లకు చూపించాను” అన్నాడు.
Ele disse: “O que eles viram em sua casa”? Hezekiah respondeu: “Eles viram tudo o que há em minha casa. Não há nada entre meus tesouros que eu não tenha mostrado a eles”.
16 ౧౬ అప్పుడు యెషయా హిజ్కియాతో “యెహోవా చెప్పే మాట విను.
Isaías disse a Hezekiah: “Escutai a palavra de Javé”.
17 ౧౭ రానున్న రోజుల్లో ఏమీ మిగులకుండా నీ రాజనగరులో ఉన్నవన్నీ, ఈ రోజు వరకూ నీ పూర్వికులు సమకూర్చి దాచిపెట్టినదంతా, వారు బబులోను పట్టణానికి తీసుకుని వెళ్ళిపోతారని యెహోవా చెప్తున్నాడు.
'Eis que vêm os dias em que tudo o que está em sua casa, e tudo o que seus pais guardaram até hoje, será levado para a Babilônia. Nada restará”, diz Javé.
18 ౧౮ ఇంకా నీ కడుపున పుట్టిన నీ కొడుకుల సంతతిని వారు బబులోను రాజు నగరానికి తీసుకు వెళ్తారు. అక్కడ వారు నపుంసకులు అవుతారు” అన్నాడు.
'Eles tirarão alguns de seus filhos que emitirão de você, que você será pai; e eles serão eunucos no palácio do rei da Babilônia'”.
19 ౧౯ అందుకు హిజ్కియా “నీవు తెలియజేసిన యెహోవా ఆజ్ఞ ప్రకారం జరగడం మంచిదే. నా కాలంలో మాత్రం సమాధానం, స్థిరత్వం ఉంటాయి కదా?” అని యెషయాతో అన్నాడు.
Então Hezekiah disse a Isaías: “A palavra de Javé que você falou é boa”. Ele disse ainda: “Não é assim, se a paz e a verdade estiverem em meus dias?”
20 ౨౦ హిజ్కియా చేసిన ఇతర పనులు గురించీ, అతని పరాక్రమం అంతటి గురించీ, అతడు కొలను తవ్వించి, కాలువ వేయించి పట్టణంలోకి నీళ్లు రప్పించిన దాన్ని గురించీ, యూదారాజుల చరిత్ర గ్రంథంలో రాసి ఉంది.
Agora o resto dos atos de Ezequias, e todas as suas forças, e como ele fez a piscina, e o conduto, e trouxe água para a cidade, não estão escritos no livro das crônicas dos reis de Judá?
21 ౨౧ హిజ్కియా తన పూర్వీకులతోబాటు చనిపోయాడు. అతని కొడుకు మనష్షే అతని స్థానంలో రాజయ్యాడు.
Ezequias dormiu com seus pais, e Manassés seu filho reinou em seu lugar.