< రాజులు~ రెండవ~ గ్రంథము 19 >
1 ౧ వాళ్ళ నివేదిక హిజ్కియా విన్నప్పుడు, తన బట్టలు చింపుకుని గోనెపట్ట కట్టుకుని యెహోవా మందిరానికి వెళ్ళాడు.
Hay được tin ấy, vua Ê-xê-chia xé rách quần áo mình, mặc áo bao, và đi vào đền thờ của Đức Giê-hô-va.
2 ౨ గృహ నిర్వాహకుడైన ఎల్యాకీమునూ, శాస్త్రి షెబ్నానూ, యాజకుల్లో పెద్దలనూ, ప్రవక్త అయిన ఆమోజు కొడుకు యెషయా దగ్గరికి పంపాడు.
Đoạn, người sai Ê-li-a-kim, quan cai đền, Sép-na, thơ ký, và hững thầy tế lễ già hơn hết, mặc bao, đến Ê-sai, thầy tiên tri, con trai A-mốt.
3 ౩ వీళ్ళు గోనెపట్ట కట్టుకుని అతని దగ్గరికి వచ్చి అతనితో “హిజ్కియా చెప్పేదేమంటే, ఇది కష్టం, శిక్ష, దూషణల దినం. పిల్లలు పుట్టే సమయం వచ్చింది, కాని కనడానికి శక్తి లేదు.
Chúng nói với người rằng: Ê-xê-chia nói như vầy: Ngày nay là một ngày tai nạn, sửa phạt, và ô danh; vì đàn bà đã đến k” mãn nguyệt, nhưng thiếu sức đẻ con.
4 ౪ జీవం కలిగిన దేవుణ్ణి దూషించడానికి అష్షూరు రాజైన తన యజమాని పంపిన రబ్షాకే పలికిన మాటలన్నీ నీ దేవుడైన యెహోవా ఒకవేళ విని, నీ దేవుడైన యెహోవా విన్న ఆ మాటలను బట్టి ఆయన అష్షూరురాజును గద్దించొచ్చు. కాబట్టి ఇక్కడ మిగిలి ఉన్న వాళ్ళ కోసం నీవు ప్రార్థన చెయ్యి.”
Có lẽ Giê-hô-va Đức Chúa Trời ông đã nghe các lời của Ráp-sa-kê, mà vua A-si-ri, chủ hắn, đã sai đến đặng phỉ báng Đức Chúa Trời hằng sống, và Giê-hô-va Đức Chúa Trời ông sẽ quở phạt các lời Ngài đã nghe. Vậy, xin hãy cầu nguyện giùm cho những kẻ còn sống.
5 ౫ రాజైన హిజ్కియా సేవకులు యెషయా దగ్గరికి వచ్చినప్పుడు,
Các tôi tớ vua Ê-xê-chia đi đến Ê-sai.
6 ౬ యెషయా వాళ్ళతో “మీ యజమానికి ఈ మాట తెలియజేయండి. యెహోవా చెప్పేదేమంటే, అష్షూరురాజు పనివారు నన్ను దూషిస్తూ పలికిన ఆ మాటలు నీవు విని భయపడొద్దు.
Người nói với chúng rằng: Các ngươi khá đáp với chủ mình thế này: Đức Giê-hô-va phán như vầy: Chớ sợ hãi những lời các ngươi đã nghe các tôi tớ của vua A-si-ri dùng mà phạm đến ta.
7 ౭ అతనిలో ఒక ఆత్మను నేను పుట్టిస్తాను. అతడు అ వదంతి విని తన దేశానికి వెళ్ళిపోతాడు. అతని దేశంలో అతన్ని కత్తితో చంపుతారు” అన్నాడు.
Ta sẽ khiến một thần đến cùng nó, làm cho nó nghe tiếng đồn, và nó sẽ trở về xứ mình; tại đó ta sẽ dùng gươm giết nó.
8 ౮ అష్షూరురాజు లాకీషు పట్టణాన్ని విడిచి వెళ్లి లిబ్నా మీద యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు, రబ్షాకే వెళ్లి అతన్ని కలుసుకున్నాడు.
Khi Ráp-sa-kê trở về vua A-si-ri, thấy vua đang vây Líp-na, vì có hay rằng chủ mình đã lìa khỏi La-ki.
9 ౯ అప్పుడు, కూషురాజు తిర్హాకా తన మీద యుద్ధం చెయ్యడానికి వచ్చాడని అష్షూరు రాజు విన్నాడు. అతడు ఇంకొకసారి హిజ్కియా దగ్గరికి వార్తాహరులను పంపాడు.
Vua bèn nghe nói về Tiệt-ha-ca, vua Ê-thi-ô-bi rằng: Kìa, người đã kéo ra đặng giao chiến với ông. Bởi cớ đó, San-chê-ríp lại sai sứ giả đến Ê-xê-chia, và dặn rằng:
10 ౧౦ “యూదారాజు హిజ్కియాతో ఈ విధంగా చెప్పండి. యెరూషలేము అష్షూరురాజు చేతికి చిక్కదు అని చెప్పి నీవు నమ్ముకొన్న నీ దేవుడి వల్ల మోసపోవద్దు.
Các ngươi hãy nói như vầy với Ê-xê-chia, vua Giu-đa, mà rằng: Chớ để cho Đức Chúa Trời, là Đấng ngươi nhờ cậy, phỉnh gạt ngươi, mà nói rằng: Giê-ru-sa-lem sẽ chẳng bị sa vào tay vua A-si-ri.
11 ౧౧ చూడు, అష్షూరు రాజులు అన్ని దేశాలను పూర్తిగా నాశనం చేసిన సంగతి నీకు వినబడింది గదా, నీవు మాత్రం తప్పించుకోగలవా?
Kìa, người đã hay những việc các vua A-si-ri đã làm cho các xứ mà diệt đi hết thảy: còn ngươi, sẽ thoát khỏi nào!
12 ౧౨ నా పూర్వికులు నాశనం చేసిన గోజాను, హారాను, రెజెపు ప్రజలు గానీ, తెలశ్శారులో ఉన్న ఏదెనీయులు గానీ, తమ దేవుళ్ళ సాయం వల్ల తప్పించుకున్నారా?
Các thần của những dân tộc mà tổ phụ ta đã tuyệt diệt, há có giải cứu chúng chăng, là các thần của Gô-xa, Ha-ran, Rết-sép, và dân Ê-đen, ở tại Tê-la-sa?
13 ౧౩ హమాతు రాజు ఏమయ్యాడు? అర్పాదు, సెపర్వియీము, హేన, ఇవ్వా అనే పట్టణాల రాజులు ఏమయ్యారు?” అని వార్త పంపాడు.
Vua Ha-mát, vua Aït-bát, vua thành Sê-phạt-va-im, vua Hê-na, và vua Y-va, đều ở đâu?
14 ౧౪ హిజ్కియా వార్తాహరుల చేతిలోనుంచి ఆ ఉత్తరం తీసుకుని చదివి, యెహోవా మందిరంలోకి వెళ్లి, యెహోవా సన్నిధిలో దాన్ని విప్పి పరిచి,
Ê-xê-chia tiếp đặng thơ ở nơi tay các sứ giả, bèn đọc. Đoạn, người đi lên đền thờ của Đức Giê-hô-va, và mở thơ ra trước mặt Đức Giê-hô-va.
15 ౧౫ యెహోవా సన్నిధిలో ప్రార్థన చేస్తూ “యెహోవా, కెరూబుల మధ్య నివాసం ఉన్న ఇశ్రాయేలీయుల దేవా, భూమినీ ఆకాశాన్ని సృష్టించిన అద్వితీయ దేవా, నీవు లోకంలో ఉన్న అన్ని రాజ్యాలకూ దేవుడవు.
Ê-xê-chia cầu nguyện Đức Giê-hô-va rằng: Oâi, Giê-hô-va Đức Chúa Trời của Y-sơ-ra-ên! Ngài vẫn ngự ở giữa các chê-ru-bin, chỉ một mình Ngài là Đức Chúa Trời của các nước thế gian. Chính Ngài đã làm nên trời và đất.
16 ౧౬ యెహోవా, ఆలకించు. యెహోవా, కళ్ళు తెరచి చూడు. సజీవ దేవుడివైన నిన్ను దూషించడానికి సన్హెరీబు పంపినవాడి మాటలు ఆలకించు.
Hỡi Đức Giê-hô-va! hãy nghiêng tai Ngài và nghe. Hỡi Đức Giê-hô-va! hãy mở mắt Ngài ra và xem. Cầu Chúa hãy nghe các lời mà San-chê-ríp sai nói, đặng phỉ báng Đức Chúa Trời hằng sống.
17 ౧౭ యెహోవా, అష్షూరురాజులు ఆ ప్రజలను, వాళ్ళ దేశాలను పాడు చేసి
Đức Giê-hô-va ôi! quả thật các vua A-si-ri đã diệt các dân tộc, và phá hoang địa phận chúng nó,
18 ౧౮ వాళ్ళ దేవుళ్ళను అగ్నిలో వేసిన మాట నిజమే. ఆ రాజ్యాల దేవుళ్ళు నిజమైన దేవుళ్ళు కాదు. అవి మనుషుల చేసిన కర్రలు, రాళ్లే. కాబట్టి వారు వాటిని నాశనం చేశారు.
ném các thần chúng nó vào lửa; nhưng chẳng phải là thần, chẳng qua là công việc của tay người ta làm ra bằng gỗ và bằng đá; nên chúng hủy diệt các thần ấy.
19 ౧౯ యెహోవా మా దేవా, లోకంలో ఉన్న మనుషులందరూ నువ్వే నిజంగా అద్వితీయ దేవుడవైన యెహోవావని తెలుసుకునేలా అతని చేతిలోనుంచి మమ్మల్ని రక్షించు” అన్నాడు.
Vậy bây giờ, hỡi Giê-hô-va Đức Chúa Trời của chúng tôi ôi! hãy giải cứu chúng tôi khỏi tay San-chê-ríp, hầu cho muôn nước trên đất biết rằng chỉ một mình Giê-hô-va là Đức Chúa Trời.
20 ౨౦ అప్పుడు ఆమోజు కొడుకు యెషయా హిజ్కియా దగ్గరికి వార్త పంపుతూ “ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా చెప్పేదేమంటే, అష్షూరురాజు సన్హెరీబు విషయంలో నీవు నా ఎదుట చేసిన ప్రార్థన నేను అంగీకరించాను.
Ê-sai, con trai A-mốt, sai nói với Ê-xê-chia rằng: Giê-hô-va Đức Chúa Trời của Y-sơ-ra-ên phán như vầy: Ta có nghe lời ngươi cầu nguyện cùng ta về việc San-chê-ríp, vua A-si-ri.
21 ౨౧ అతని గురించి యెహోవా చెప్పేదేమంటే, సీయోను కుమారి కన్యక నిన్ను తిరస్కరిస్తున్నది. నిన్ను హేళన చేస్తూ ఉంది. యెరూషలేము కుమారి నిన్ను చూసి తల ఊపుతూ ఉంది.
Này là lời Đức Giê-hô-va đã phán về hắn. Gái đồng trinh Si-ôn khinh dể, chê cười ngươi; con gái Giê-ru-sa-lem đã lắc đầu theo ngươi.
22 ౨౨ నీవు ఎవర్ని తిరస్కరించావు? ఎవర్ని దూషించావు? నీవు గర్వించి ఎవర్ని భయపెట్టావు?
Ngươi phỉ báng và sỉ nhục ai? Cất tiếng lên cùng ai? Thật ngươi đã trừng con mắt nghịch với Đấng Thánh của Y-sơ-ra-ên!
23 ౨౩ ఇశ్రాయేలీయుల పవిత్ర దేవుణ్ణి కాదా? నీ వర్తమానికుల చేత యెహోవాను తిరస్కరించి పలికించిన మాటలు ఇవే గదా. నా రథాల సమూహంతో నేను పర్వత శిఖరాలకూ, లెబానోను కొండల ఎత్తులకూ, ఎక్కాను. ఎత్తుగల దాని దేవదారు వృక్షాలనూ, శ్రేష్ఠమైన సరళ వృక్షాలనూ నరికాను. దూరపు సరిహద్దుల్లో ఉన్న సత్రాల్లోకీ, ఫలాలకు క్షేత్రమైన అడవిలోకీ ప్రవేశించాను.
Ngươi đã nhờ các sứ giả mình nhạo báng Chúa, mà rằng: Ta đem nhiều xe, lên chót núi, đến đỉnh rất xa của Li-ban; ta sẽ đốn những cay bá hương cao hơn hết, và cây tòng tốt nhất của nó; ta sẽ đến cõi xa hơn hết, tức rừng rậm của nó.
24 ౨౪ నేను బావులు తవ్వి, పరుల నీళ్లు పానం చేశాను. నా అరకాలి కింద నేను ఐగుప్తు నదులన్నిటినీ ఎండిపోజేశాను.
Ta đã đào giếng, uống nước của đất lạ; dưới bàn chân ta sẽ làm cạn sông Ê-díp-tô.
25 ౨౫ నేనే పూర్వకాలంలోనే దీన్ని కలగచేశాననీ, పురాతన కాలంలోనే దీన్ని నిర్ణయించాననీ నీకు వినబడలేదా? ప్రాకారాలున్న పట్టణాలను నీవు పాడు దిబ్బలుగా చెయ్యడం నావల్లే జరిగింది.
Sự này ta đã làm từ lâu, việc này ta đã định từ thời cổ, ngươi há chẳng nghe đến sao? Bây giờ, ta khiến cho sự đó xảy đến, để cho ngươi phá hoang các thành kiên cố ra đống hư nát.
26 ౨౬ కాబట్టి వాటి కాపురస్థులు బలహీనులై జడిసి, విభ్రాంతి పొంది, పొలంలో ఉన్న గడ్డిలా, కాడలు లేని చేలలా అయ్యారు.
Vì vậy, dân sự của các thành ấy đều yếu đuối, bị sợ hãi và hổ thẹn; chúng giống như cây cỏ xanh ngoài đồng, tỉ như cây cỏ trên nóc nhà, khác nào lúa mì đã héo trước khi cọng chưa thành.
27 ౨౭ నీవు కూర్చోవడం, బయలుదేరడం, లోపలికి రావడం, నా మీద వేసే రంకెలూ అన్నీ నాకు తెలుసు.
Nơi ngươi ngồi, lúc ngươi đi ra, đi vào, và sự giận dại ngươi đối cùng ta, ta đã biết hết.
28 ౨౮ నా మీద నీవు వేసే రంకెలూ, నీవు చేసిన గొడవ నా చెవుల్లో పడింది గనుక నా గాలాన్ని నీ ముక్కుకు తగిలిస్తాను. నా కళ్ళెం నీ నోట్లో పెట్టి నిన్ను మళ్ళిస్తాను. నీవు వచ్చిన దారిలోనే నిన్ను మళ్ళిస్తాను.
Bởi ngươi giận dại cùng ta, và vì lời kiêu ngạo ngươi đã thấu đến tai ta, ắt ta sẽ xỏ cái vòng nơi mũi ngươi, để khớp nơi môi miếng ngươi. Đoạn, ta sẽ khiến ngươi trở về theo con đường mà ngươi đã đi đến.
29 ౨౯ హిజ్కియా, నీకిదే సూచన. ఈ సంవత్సరంలో దానంతట అదే పండే ధాన్యం, రెండో సంవత్సరంలో దాని నుంచి వచ్చే ధాన్యం మీరు తింటారు. మూడో సంవత్సరంలో మీరు విత్తనం విత్తి చేలు కోస్తారు. ద్రాక్షతోటలు నాటి వాటి ఫలం అనుభవిస్తారు.
Hỡi Ê-xê-chia, nhờ dấu hiệu này ngươi nhìn biết rằng lời này sẽ ứng nghiệm: Năm nay, các ngươi sẽ ăn vật hột giống rớt xuống, sanh ra; năm thứ nhì, ăn vật tự mọc lên; nhưng năm thứ ba, các ngươi sẽ gieo và gặt, trồng nho và ăn trái nó.
30 ౩౦ యూదా వంశంలో తప్పించుకొన్న శేషం ఇంకా కిందకు వేరు తన్ని పైకి ఎదిగి ఫలిస్తారు.
Hễ giống gì thoát khỏi, còn lại của dân tộc Giu-đa, dưới sẽ châm rễ xuống, trên sẽ kết bông trái lên.
31 ౩౧ ఆ మిగిలిన వారు యెరూషలేములోనుంచి బయలు దేరుతారు. తప్పించుకొన్నవారు సీయోను కొండలోనుంచి బయలు దేరుతారు. సైన్యాలకు అధిపతి అయిన యెహోవా ఆసక్తి దీన్ని నెరవేరుస్తుంది.
Vì sẽ có phần sót lại từ Giê-ru-sa-lem mà ra, kẻ thoát khỏi từ núi Si-ôn mà đến; lòng sốt sắng của Đức Giê-hô-va sẽ làm nên việc ấy.
32 ౩౨ కాబట్టి అష్షూరు రాజు గురించి యెహోవా చెప్పేదేమంటే, అతడు ఈ పట్టణంలోకి రాడు. దానిమీద ఒక్క బాణమైనా వెయ్యడు. ఒక్క డాలైనా దానికి చూపించడు. దాని ఎదుట ముట్టడి దిబ్బ కట్టడు.
Bởi cớ đó, Đức Giê-hô-va phán về vua A-si-ri như vầy: Nó sẽ không vào thành này, chẳng xạ tên trong nó, cũng chẳng kéo đến giơ khiên lên trước mặt nó, và chẳng đắp lũy nghịch nó.
33 ౩౩ ఈ పట్టణం లోపలికి రాకుండా, తాను వచ్చిన దారిలోనే అతడు తిరిగి వెళ్ళిపోతాడు. ఇదే యెహోవా వాక్కు.
Đức Giê-hô-va phán: Nó sẽ trở về theo con đường nó đã đi đến, không vào trong thành này.
34 ౩౪ నా నిమిత్తమూ, నా సేవకుడైన దావీదు నిమిత్తమూ, నేను ఈ పట్టణాన్ని కాపాడి రక్షిస్తాను.”
Vì tại cớ ta và Đa-vít, kẻ tôi tớ ta, ta sẽ binh vực thành này đặng cứu nó.
35 ౩౫ ఆ రాత్రే యెహోవా దూత బయలుదేరి అష్షూరు వాళ్ళ శిబిరంలోకి వెళ్లి 1, 85,000 మందిని హతం చేశాడు. ఉదయాన ప్రజలు లేచి చూసినప్పుడు వాళ్ళందరూ శవాలై చచ్చి పడి ఉన్నారు.
Trong đêm đó, có một thiên sứ của Đức Giê-hô-va đi đến trong dinh A-si-ri, và giết một trăm tám mươi lăm ngàn người tại đó. Sáng ngày mai, người ta thức dậy, bèn thấy quân ấy, kìa, chỉ là thây đó thôi.
36 ౩౬ అష్షూరురాజు సన్హెరీబు వెనక్కి తిరిగి, నీనెవె పట్టణానికి వెళ్ళిపోయి అక్కడ నివసించాడు.
San-chê-ríp, vua A-si-ri, bèn trở về, ở tại Ni-ni-ve.
37 ౩౭ అతడు నిస్రోకు అనే తన దేవుడు మందిరంలో మొక్కుతూ ఉన్నప్పుడు, అతని కొడుకులు అద్రమ్మెలెకు, షరెజెరు కత్తితో అతన్ని చంపి అరారాతు దేశంలోకి తప్పించుకు పారిపోయారు. అప్పుడు అతని కొడుకు ఏసర్హద్దోను అతని స్థానంలో రాజయ్యాడు.
Một ngày kia, người thờ lạy tại trong chùa Nít-róc, thần của mình, thì A-tra-mê-léc và Sa-rết-se giết người bằng gươm, đoạn chúng nó trốn trong xứ A-ra-rát. Ê-sạt-ha-đôn, con trai người, kế vị người.