< రాజులు~ రెండవ~ గ్రంథము 19 >

1 వాళ్ళ నివేదిక హిజ్కియా విన్నప్పుడు, తన బట్టలు చింపుకుని గోనెపట్ట కట్టుకుని యెహోవా మందిరానికి వెళ్ళాడు.
و واقع شد که چون حزقیای پادشاه این را شنید، لباس خود را چاک زده، وپلاس پوشیده، به خانه خداوند داخل شد.۱
2 గృహ నిర్వాహకుడైన ఎల్యాకీమునూ, శాస్త్రి షెబ్నానూ, యాజకుల్లో పెద్దలనూ, ప్రవక్త అయిన ఆమోజు కొడుకు యెషయా దగ్గరికి పంపాడు.
والیاقیم، ناظر خانه و شبنه کاتب و مشایخ کهنه راملبس به پلاس نزد اشعیا ابن آموص نبی فرستاده،۲
3 వీళ్ళు గోనెపట్ట కట్టుకుని అతని దగ్గరికి వచ్చి అతనితో “హిజ్కియా చెప్పేదేమంటే, ఇది కష్టం, శిక్ష, దూషణల దినం. పిల్లలు పుట్టే సమయం వచ్చింది, కాని కనడానికి శక్తి లేదు.
به وی گفتند: «حزقیا چنین می‌گوید که «امروزروز تنگی و تادیب و اهانت است زیرا که پسران به فم رحم رسیده‌اند و قوت زاییدن نیست.۳
4 జీవం కలిగిన దేవుణ్ణి దూషించడానికి అష్షూరు రాజైన తన యజమాని పంపిన రబ్షాకే పలికిన మాటలన్నీ నీ దేవుడైన యెహోవా ఒకవేళ విని, నీ దేవుడైన యెహోవా విన్న ఆ మాటలను బట్టి ఆయన అష్షూరురాజును గద్దించొచ్చు. కాబట్టి ఇక్కడ మిగిలి ఉన్న వాళ్ళ కోసం నీవు ప్రార్థన చెయ్యి.”
شاید یهوه خدایت تمامی سخنان ربشاقی را که آقایش، پادشاه آشور، او را برای اهانت نمودن خدای حی فرستاده است، بشنود و سخنانی را که یهوه، خدایت شنیده است، توبیخ نماید. پس برای بقیه‌ای که یافت می‌شوند، تضرع نما.»۴
5 రాజైన హిజ్కియా సేవకులు యెషయా దగ్గరికి వచ్చినప్పుడు,
وبندگان حزقیای پادشاه نزد اشعیا آمدند.۵
6 యెషయా వాళ్ళతో “మీ యజమానికి ఈ మాట తెలియజేయండి. యెహోవా చెప్పేదేమంటే, అష్షూరురాజు పనివారు నన్ను దూషిస్తూ పలికిన ఆ మాటలు నీవు విని భయపడొద్దు.
و اشعیابه ایشان گفت: «به آقای خود چنین گویید که خداوند چنین می‌فرماید: از سخنانی که شنیدی که بندگان پادشاه آشور به آنها به من کفرگفته‌اند، مترس.۶
7 అతనిలో ఒక ఆత్మను నేను పుట్టిస్తాను. అతడు అ వదంతి విని తన దేశానికి వెళ్ళిపోతాడు. అతని దేశంలో అతన్ని కత్తితో చంపుతారు” అన్నాడు.
همانا روحی بر او می‌فرستم که خبری شنیده، به ولایت خود خواهد برگشت و اورا در ولایت خودش به شمشیر هلاک خواهم ساخت.»۷
8 అష్షూరురాజు లాకీషు పట్టణాన్ని విడిచి వెళ్లి లిబ్నా మీద యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు, రబ్షాకే వెళ్లి అతన్ని కలుసుకున్నాడు.
پس ربشاقی مراجعت کرده، پادشاه آشور را یافت که با لبنه جنگ می‌کرد، زیرا شنیده بود که ازلاکیش کوچ کرده است.۸
9 అప్పుడు, కూషురాజు తిర్హాకా తన మీద యుద్ధం చెయ్యడానికి వచ్చాడని అష్షూరు రాజు విన్నాడు. అతడు ఇంకొకసారి హిజ్కియా దగ్గరికి వార్తాహరులను పంపాడు.
و درباره ترهاقه، پادشاه حبش، خبری شنیده بود که به جهت مقاتله با توبیرون آمده است (پس چون شنید) بار دیگرایلچیان نزد حزقیا فرستاده، گفت:۹
10 ౧౦ “యూదారాజు హిజ్కియాతో ఈ విధంగా చెప్పండి. యెరూషలేము అష్షూరురాజు చేతికి చిక్కదు అని చెప్పి నీవు నమ్ముకొన్న నీ దేవుడి వల్ల మోసపోవద్దు.
«به حزقیا، پادشاه یهودا چنین گویید: «خدای تو که به اوتوکل می‌نمایی، تو را فریب ندهد و نگوید که اورشلیم به‌دست پادشاه آشور تسلیم نخواهدشد.۱۰
11 ౧౧ చూడు, అష్షూరు రాజులు అన్ని దేశాలను పూర్తిగా నాశనం చేసిన సంగతి నీకు వినబడింది గదా, నీవు మాత్రం తప్పించుకోగలవా?
اینک تو شنیده‌ای که پادشاهان آشور باهمه ولایتها چه کرده و چگونه آنها را بالکل هلاک ساخته‌اند، و آیا تو رهایی خواهی یافت؟۱۱
12 ౧౨ నా పూర్వికులు నాశనం చేసిన గోజాను, హారాను, రెజెపు ప్రజలు గానీ, తెలశ్శారులో ఉన్న ఏదెనీయులు గానీ, తమ దేవుళ్ళ సాయం వల్ల తప్పించుకున్నారా?
آیا خدایان امتهایی که پدران من، ایشان راهلاک ساختند، مثل جوزان و حاران و رصف وبنی عدن که در تلسار می‌باشند، ایشان را نجات دادند؟۱۲
13 ౧౩ హమాతు రాజు ఏమయ్యాడు? అర్పాదు, సెపర్వియీము, హేన, ఇవ్వా అనే పట్టణాల రాజులు ఏమయ్యారు?” అని వార్త పంపాడు.
پادشاه حمات کجاست؟ و پادشاه ارفاد و پادشاه شهر سفروایم و هینع و عوا؟»۱۳
14 ౧౪ హిజ్కియా వార్తాహరుల చేతిలోనుంచి ఆ ఉత్తరం తీసుకుని చదివి, యెహోవా మందిరంలోకి వెళ్లి, యెహోవా సన్నిధిలో దాన్ని విప్పి పరిచి,
و حزقیا مکتوب را از دست ایلچیان گرفته، آن را خواند و حزقیا به خانه خداوند درآمده، آن را به حضور خداوند پهن کرد.۱۴
15 ౧౫ యెహోవా సన్నిధిలో ప్రార్థన చేస్తూ “యెహోవా, కెరూబుల మధ్య నివాసం ఉన్న ఇశ్రాయేలీయుల దేవా, భూమినీ ఆకాశాన్ని సృష్టించిన అద్వితీయ దేవా, నీవు లోకంలో ఉన్న అన్ని రాజ్యాలకూ దేవుడవు.
و حزقیا نزدخداوند دعا نموده، گفت: «ای یهوه، خدای اسرائیل که بر کروبیان جلوس می‌نمایی، تویی که به تنهایی بر تمامی ممالک جهان خدا هستی و توآسمان و زمین را آفریده‌ای.۱۵
16 ౧౬ యెహోవా, ఆలకించు. యెహోవా, కళ్ళు తెరచి చూడు. సజీవ దేవుడివైన నిన్ను దూషించడానికి సన్హెరీబు పంపినవాడి మాటలు ఆలకించు.
‌ای خداوند گوش خود را فرا‌گرفته، بشنو. ای خداوند چشمان خودرا گشوده، ببین و سخنان سنحاریب را که به جهت اهانت نمودن خدای حی فرستاده است، استماع نما.۱۶
17 ౧౭ యెహోవా, అష్షూరురాజులు ఆ ప్రజలను, వాళ్ళ దేశాలను పాడు చేసి
‌ای خداوند، راست است که پادشاهان آشور امت‌ها و زمین ایشان را خراب کرده است،۱۷
18 ౧౮ వాళ్ళ దేవుళ్ళను అగ్నిలో వేసిన మాట నిజమే. ఆ రాజ్యాల దేవుళ్ళు నిజమైన దేవుళ్ళు కాదు. అవి మనుషుల చేసిన కర్రలు, రాళ్లే. కాబట్టి వారు వాటిని నాశనం చేశారు.
و خدایان ایشان را به آتش انداخته، زیرا که خدا نبودند، بلکه ساخته دست انسان از چوب وسنگ. پس به این سبب آنها را تباه ساختند.۱۸
19 ౧౯ యెహోవా మా దేవా, లోకంలో ఉన్న మనుషులందరూ నువ్వే నిజంగా అద్వితీయ దేవుడవైన యెహోవావని తెలుసుకునేలా అతని చేతిలోనుంచి మమ్మల్ని రక్షించు” అన్నాడు.
پس حال یهوه، خدای ما، ما را از دست اورهایی ده تا جمیع ممالک جهان بدانند که تو تنهاای یهوه، خدا هستی.»۱۹
20 ౨౦ అప్పుడు ఆమోజు కొడుకు యెషయా హిజ్కియా దగ్గరికి వార్త పంపుతూ “ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా చెప్పేదేమంటే, అష్షూరురాజు సన్హెరీబు విషయంలో నీవు నా ఎదుట చేసిన ప్రార్థన నేను అంగీకరించాను.
پس اشعیا ابن آموص نزد حزقیا فرستاده، گفت: «یهوه، خدای اسرائیل، چنین می‌گوید: آنچه را که درباره سنحاریب، پادشاه آشور، نزدمن دعا نمودی اجابت کردم.۲۰
21 ౨౧ అతని గురించి యెహోవా చెప్పేదేమంటే, సీయోను కుమారి కన్యక నిన్ను తిరస్కరిస్తున్నది. నిన్ను హేళన చేస్తూ ఉంది. యెరూషలేము కుమారి నిన్ను చూసి తల ఊపుతూ ఉంది.
کلامی که خداوند درباره‌اش گفته، این است: آن باکره، دختر صهیون، تو را حقیر شمرده، استهزا نموده است و دختر اورشلیم سر خود را به تو جنبانیده است.۲۱
22 ౨౨ నీవు ఎవర్ని తిరస్కరించావు? ఎవర్ని దూషించావు? నీవు గర్వించి ఎవర్ని భయపెట్టావు?
کیست که او را اهانت کرده، کفر گفته‌ای و کیست که بر وی آواز بلند کرده، چشمان خودرا به علیین افراشته‌ای؟ مگر قدوس اسرائیل نیست؟۲۲
23 ౨౩ ఇశ్రాయేలీయుల పవిత్ర దేవుణ్ణి కాదా? నీ వర్తమానికుల చేత యెహోవాను తిరస్కరించి పలికించిన మాటలు ఇవే గదా. నా రథాల సమూహంతో నేను పర్వత శిఖరాలకూ, లెబానోను కొండల ఎత్తులకూ, ఎక్కాను. ఎత్తుగల దాని దేవదారు వృక్షాలనూ, శ్రేష్ఠమైన సరళ వృక్షాలనూ నరికాను. దూరపు సరిహద్దుల్లో ఉన్న సత్రాల్లోకీ, ఫలాలకు క్షేత్రమైన అడవిలోకీ ప్రవేశించాను.
به واسطه رسولانت، خداوند را اهانت کرده، گفته‌ای: به کثرت ارابه های خود بر بلندی کوهها و به اطراف لبنان برآمده‌ام و بلندترین سروهای آزادش و بهترین صنوبرهایش را قطع نموده، به بلندی اقصایش و به درختستان بوستانش داخل شده‌ام.۲۳
24 ౨౪ నేను బావులు తవ్వి, పరుల నీళ్లు పానం చేశాను. నా అరకాలి కింద నేను ఐగుప్తు నదులన్నిటినీ ఎండిపోజేశాను.
و من، حفره کنده، آب غریب نوشیدم و به کف پای خود تمامی نهرهای مصر را خشک خواهم کرد.۲۴
25 ౨౫ నేనే పూర్వకాలంలోనే దీన్ని కలగచేశాననీ, పురాతన కాలంలోనే దీన్ని నిర్ణయించాననీ నీకు వినబడలేదా? ప్రాకారాలున్న పట్టణాలను నీవు పాడు దిబ్బలుగా చెయ్యడం నావల్లే జరిగింది.
آیا نشنیده‌ای که من این را از زمان سلف کرده‌ام و از ایام قدیم صورت داده‌ام و الان، آن را به وقوع آورده‌ام تا توبه ظهور آمده و شهرهایی حصاردار را خراب نموده، به توده های ویران مبدل سازی؟۲۵
26 ౨౬ కాబట్టి వాటి కాపురస్థులు బలహీనులై జడిసి, విభ్రాంతి పొంది, పొలంలో ఉన్న గడ్డిలా, కాడలు లేని చేలలా అయ్యారు.
از این جهت، ساکنان آنها کم قوت بوده، ترسان و خجل شدند، مثل علف صحرا و گیاه سبز و علف پشت بام و مثل غله‌ای که پیش از رسیدنش پژمرده شود، گردیدند.۲۶
27 ౨౭ నీవు కూర్చోవడం, బయలుదేరడం, లోపలికి రావడం, నా మీద వేసే రంకెలూ అన్నీ నాకు తెలుసు.
«اما من نشستن تو را و خروج و دخولت وخشمی را که بر من داری، می‌دانم.۲۷
28 ౨౮ నా మీద నీవు వేసే రంకెలూ, నీవు చేసిన గొడవ నా చెవుల్లో పడింది గనుక నా గాలాన్ని నీ ముక్కుకు తగిలిస్తాను. నా కళ్ళెం నీ నోట్లో పెట్టి నిన్ను మళ్ళిస్తాను. నీవు వచ్చిన దారిలోనే నిన్ను మళ్ళిస్తాను.
چونکه خشمی که بر من داری و غرور تو، به گوش من برآمده است. بنابراین مهار خود را به بینی تو ولگام خود را به لبهایت گذاشته، تو را به راهی که آمده‌ای، برخواهم گردانید.۲۸
29 ౨౯ హిజ్కియా, నీకిదే సూచన. ఈ సంవత్సరంలో దానంతట అదే పండే ధాన్యం, రెండో సంవత్సరంలో దాని నుంచి వచ్చే ధాన్యం మీరు తింటారు. మూడో సంవత్సరంలో మీరు విత్తనం విత్తి చేలు కోస్తారు. ద్రాక్షతోటలు నాటి వాటి ఫలం అనుభవిస్తారు.
«و علامت، برای تو این خواهد بود که امسال غله خودرو خواهید خورد و سال دوم آنچه از آن بروید و در سال سوم بکارید و بدرویدو تاکستانها غرس نموده، میوه آنها را بخورید.۲۹
30 ౩౦ యూదా వంశంలో తప్పించుకొన్న శేషం ఇంకా కిందకు వేరు తన్ని పైకి ఎదిగి ఫలిస్తారు.
و بقیه‌ای که از خاندان یهودا رستگار شوند، باردیگر به پایین ریشه خواهند زد و به بالا میوه خواهند‌آورد.۳۰
31 ౩౧ ఆ మిగిలిన వారు యెరూషలేములోనుంచి బయలు దేరుతారు. తప్పించుకొన్నవారు సీయోను కొండలోనుంచి బయలు దేరుతారు. సైన్యాలకు అధిపతి అయిన యెహోవా ఆసక్తి దీన్ని నెరవేరుస్తుంది.
زیرا که بقیه‌ای از اورشلیم ورستگاران از کوه صهیون بیرون خواهند آمد. غیرت یهوه این را بجا خواهد آورد.۳۱
32 ౩౨ కాబట్టి అష్షూరు రాజు గురించి యెహోవా చెప్పేదేమంటే, అతడు ఈ పట్టణంలోకి రాడు. దానిమీద ఒక్క బాణమైనా వెయ్యడు. ఒక్క డాలైనా దానికి చూపించడు. దాని ఎదుట ముట్టడి దిబ్బ కట్టడు.
«بنابراین خداوند درباره پادشاه آشورچنین می‌گوید که «به این شهر داخل نخواهد شدو به اینجا تیر نخواهد انداخت و در مقابلش با سپرنخواهد آمد و منجنیق را در‌پیش آن بر نخواهدافراشت.۳۲
33 ౩౩ ఈ పట్టణం లోపలికి రాకుండా, తాను వచ్చిన దారిలోనే అతడు తిరిగి వెళ్ళిపోతాడు. ఇదే యెహోవా వాక్కు.
به راهی که آمده است به همان برخواهد گشت و به این شهر داخل نخواهد شد. خداوند این را می‌گوید.۳۳
34 ౩౪ నా నిమిత్తమూ, నా సేవకుడైన దావీదు నిమిత్తమూ, నేను ఈ పట్టణాన్ని కాపాడి రక్షిస్తాను.”
زیرا که این شهر راحمایت کرده، به‌خاطر خود و به‌خاطر بنده خویش داود، آن را نجات خواهم داد.»۳۴
35 ౩౫ ఆ రాత్రే యెహోవా దూత బయలుదేరి అష్షూరు వాళ్ళ శిబిరంలోకి వెళ్లి 1, 85,000 మందిని హతం చేశాడు. ఉదయాన ప్రజలు లేచి చూసినప్పుడు వాళ్ళందరూ శవాలై చచ్చి పడి ఉన్నారు.
پس فرشته خداوند در آن شب بیرون آمده، صد و هشتاد و پنج هزار نفر از اردوی آشور را زدو بامدادان چون برخاستند، اینک جمیع آنهالاشه های مرده بودند.۳۵
36 ౩౬ అష్షూరురాజు సన్హెరీబు వెనక్కి తిరిగి, నీనెవె పట్టణానికి వెళ్ళిపోయి అక్కడ నివసించాడు.
و سنحاریب، پادشاه آشور کوچ کرده، روانه گردید و برگشته، درنینوی ساکن شد.۳۶
37 ౩౭ అతడు నిస్రోకు అనే తన దేవుడు మందిరంలో మొక్కుతూ ఉన్నప్పుడు, అతని కొడుకులు అద్రమ్మెలెకు, షరెజెరు కత్తితో అతన్ని చంపి అరారాతు దేశంలోకి తప్పించుకు పారిపోయారు. అప్పుడు అతని కొడుకు ఏసర్హద్దోను అతని స్థానంలో రాజయ్యాడు.
و واقع شد که چون او درخانه خدای خویش، نسروک عبادت می‌کرد، پسرانش ادرملک و شرآصر او را به شمشیر زدند، و ایشان به زمین آرارات فرار کردند و پسرش آسرحدون به‌جایش سلطنت نمود.۳۷

< రాజులు~ రెండవ~ గ్రంథము 19 >