< రాజులు~ రెండవ~ గ్రంథము 18 >
1 ౧ ఇశ్రాయేలు రాజు, ఏలా కొడుకు హోషేయ పరిపాలనలో మూడో సంవత్సరంలో యూదా రాజు ఆహాజు కొడుకు హిజ్కియా ఏలడం ఆరంభించాడు.
Roku trzeciego Ozeasza, syna Eli, króla Izraelskiego, królował Ezechyjasz, syn Achaza, króla Judzkiego.
2 ౨ అతడు 25 సంవత్సరాల వయస్సులో ఏలడం ఆరంభించి, యెరూషలేములో 29 సంవత్సరాలు ఏలాడు. అతని తల్లి పేరు అబీ. ఆమె జెకర్యా కూతురు.
Dwadzieścia i pięć lat mu było, gdy począł królować, a dwadzieścia i dziewięć lat królował w Jeruzalemie. Imię matki jego było Abi, córka Zacharyjaszowa.
3 ౩ అతడు తన పూర్వికుడైన దావీదు ఆదర్శాన్ని అనుసరించి, యెహోవా దృష్టిలో ఏది సరైనదో అది చేశాడు.
I czynił co było dobrego przed oczyma Pańskiemi, według wszystkiego, jako czynił Dawid, ojciec jego.
4 ౪ ఉన్నత స్థలాలను తొలగించి, విగ్రహాలను పగలగొట్టి, దేవతా స్తంభాలను పడగొట్టాడు. మోషే చేసిన ఇత్తడి సర్పాన్ని ముక్కలు ముక్కలు చేశాడు. దానికి ఇశ్రాయేలీయులు “నెహుష్టాను” అని పేరు పెట్టి, దానికి ధూపం వేసేవారు.
On zniósł wyżyny, i skruszył bałwany, i powycinał gaje, a pokruszył węża miedzianego, którego był uczynił Mojżesz; bo aż do onych dni Izraelczycy kadzili mu, i nazwał go Nehustan.
5 ౫ అతడు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాలో విశ్వాసం ఉంచినవాడు. అతని తరువాత వచ్చిన యూదా రాజుల్లోనైనా, అతని పూర్వికులైన రాజుల్లోనైనా అతనితో సమానుడు ఒక్కడూ లేడు.
W Panu Bogu Izraelskim ufał; a po nim nie był żaden podobny jemu między wszystkimi królami Judzkimi, i którzy byli przed nim.
6 ౬ అతడు యెహోవాకు నమ్మకంగా ఉండి, ఆయన్ను వెంబడించడంలో వెనుతిరగకుండా, ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నీ పాటిస్తూ ఉన్నాడు.
Bo się trzymał Pana, nie odstępując od niego, a strzegąc przykazania jego, które był przykazał Pan Mojżeszowi.
7 ౭ కాబట్టి, యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు. తాను వెళ్లిన ప్రతిచోటా అతడు జయం పొందాడు. అతడు అష్షూరు రాజుకు లోబడలేదు. అతని మీద తిరగబడ్డాడు.
A Pan był z nim; i we wszystkiem, do czego się obrócił, szczęściło mu się. Wybił się też z mocy królowi Assyryjskiemu, i nie służył mu.
8 ౮ ఇంకా గాజా పట్టణం, దాని సరిహద్దుల వరకూ బురుజులనుండి ప్రాకారాల వరకూ ఫిలిష్తీయులపై దాడి చేశాడు.
Tenże poraził Filistyny aż do Gazy i granic jego, od wieży strażników aż do miasta obronnego.
9 ౯ రాజైన హిజ్కియా పరిపాలనలో నాలుగో సంవత్సరంలో, ఇశ్రాయేలు రాజు ఏలా కొడుకు హోషేయ పరిపాలనలో ఏడో సంవత్సరంలో, అష్షూరురాజు షల్మనేసెరు షోమ్రోను పట్టణంపై దండెత్తి దాన్ని చుట్టుముట్టాడు.
Roku czwartego króla Ezechyjasza, (który był rok siódmy Ozeasza, syna Eli, króla Izraelskiego) wyciągnął Salmanaser, król Assyryjski, przeciwko Samaryi, i obległ ją.
10 ౧౦ మూడు సంవత్సరాలకు అష్షూరీయులు దాన్ని చేజిక్కించుకున్నారు. హిజ్కియా పరిపాలనలో ఆరో సంవత్సరంలో, ఇశ్రాయేలు రాజు హోషేయ పరిపాలనలో తొమ్మిదో సంవత్సరంలో షోమ్రోను పట్టణం శత్రువుల వశం అయ్యింది.
A wziął ją przy dokończeniu trzeciego roku; roku szóstego Ezechyjasza, (który był rok dziewiąty Ozeasza, króla Izraelskiego) wzięta jest Samaryja.
11 ౧౧ ఇశ్రాయేలు వారు తమ దేవుడైన యెహోవా చెప్పిన మాట వినకుండా ఆయన నిబంధనకూ, ఆయన సేవకుడైన మోషే ఆజ్ఞాపించిన దానంతటికీ లోబడలేదు. వాటిని అతిక్రమించారు.
Tedy przeniósł król Assyryjski Izraela do Assyryi, i osadził nimi Halach i Habor u rzeki Gazan, i miasta Medskie.
12 ౧౨ అష్షూరు రాజు ఇశ్రాయేలు వాళ్ళను అష్షూరు దేశానికి తీసుకెళ్ళి, గోజాను నది దగ్గర ఉన్న హాలహు, హాబోరు అనే పట్టణాల్లో, మాదీయుల పట్టణాల్లో వాళ్ళను ఉంచాడు.
Przeto, iż nie posłuchali głosu Pana Boga swego, ale przestępowali przymierze jego, i tego wszystkiego, co rozkazał Mojżesz, sługa Pański, nie słuchali i nie czynili.
13 ౧౩ హిజ్కియా రాజు పరిపాలనలో 14 వ సంవత్సరంలో అష్షూరురాజు సన్హెరీబు యూదా దేశంలో ఉన్న ప్రాకారాలున్న పట్టాణాలన్నిటి మీద దాడి చేసి వాటిని చేజిక్కించుకున్నాడు.
Potem czternastego roku króla Ezechyjasza ruszył się Sennacheryb, król Assyryjski, przeciw wszystkim miastom Judzkim obronnym, i wziął je.
14 ౧౪ యూదారాజు హిజ్కియా, లాకీషు పట్టణంలో ఉన్న అష్షూరు రాజు దగ్గరికి వార్తాహరులను పంపి “నావల్ల తప్పు జరిగింది. నా దగ్గర నుంచి నీవు వెనక్కి వెళ్ళిపోతే నీవు నా మీద మోపిన దాన్ని నేను భరిస్తాను” అని వార్త పంపించాడు. అష్షూరురాజు 600 మణుగుల వెండి, 60 మణుగుల బంగారం యూదా రాజు హిజ్కియా చెల్లించాలని విధించాడు.
A tak posłał Ezechyjasz, król Judzki, do króla Assyryjskiego, do Lachys, mówiąc: Zgrzeszyłem; odciągnij odemnie, cokolwiek na mię włożysz, poniosę. Tedy włożył król Assyryjski na Ezechyjasza, króla Judzkiego, dań trzy sta talentów srebra, i trzydzieści talentów złota.
15 ౧౫ కాబట్టి హిజ్కియా యెహోవా మందిరంలో, రాజనగరంలో, వస్తువుల రూపంలో ఉన్న వెండి అంతా అతనికి ఇచ్చేశాడు.
I dał Ezechyjasz wszystko srebro, które się znalazło w domu Pańskim i w skarbach domu królewskiego.
16 ౧౬ ఇంకా ఆ కాలంలో హిజ్కియా దేవాలయపు తలుపులకున్న బంగారం, తాను కట్టించిన స్తంభాలకున్న బంగారం తీయించి అష్షూరు రాజుకిచ్చాడు.
Onegoż czasu obłupił Ezechyjasz drzwi domu Pańskiego, i słupy, które samże Ezechyjasz, król Judzki, był obył, a dał je królowi Assyryjskiemu.
17 ౧౭ కాని, అష్షూరు రాజు తర్తాను, రబ్సారీసు, రబ్షాకేనులను లాకీషు పట్టణం నుంచి యెరూషలేములో ఉన్న హిజ్కియా రాజుపైకి పెద్ద సైన్యంతో పంపాడు. వారు యెరూషలేముపై దండెత్తి చాకిరేవు మార్గంలో ఉన్న మెరక కొలను కాలవ దగ్గర ప్రవేశించి, అక్కడ ఉండి రాజును పిలిపించాడు.
Wszakże posłał król Assyryjski Tartana, i Rabsarysa, i Rabsacesa z Lachys do króla Ezechyjasza z wielkiem wojskiem do Jeruzalemu. Którzy wyciągnąwszy przyjechali ku Jeruzalemowi, a przyciągnąwszy przyszli i położyli się u rur sadzawki wyższej, która jest podle drogi brukowanej na polu blecharzowem.
18 ౧౮ హిల్కీయా కొడుకూ, గృహ నిర్వాహకుడూ అయిన ఎల్యాకీము, శాస్త్రి షెబ్నా, రాజ్య లేఖనాల అధికారి అయిన ఆసాపు కొడుకు యోవాహు వాళ్ళ దగ్గరికి వెళ్ళారు.
A gdy wołali na króla, wyszedł do nich Elijakim, syn Helkijaszowy, przełożony nad domem, i Sobna pisarz, i Joach syn Asafowy, kanclerz.
19 ౧౯ అప్పుడు రబ్షాకే వాళ్ళతో అష్షూరురాజు హిజ్కియాతో చెప్పమన్నది ఈ విధంగా వినిపించాడు. “నీకున్న ఈ ధైర్యానికి ఆధారం ఏంటి?
I rzekł do nich Rabsaces: Proszę powiedzcie Ezechyjaszowi: Tak mówi król wielki, król Assyryjski: Co to za ufność, na której się wspierasz?
20 ౨౦ యుద్ధం విషయంలో నీ ఆలోచన, నీ బలం అన్నీ వట్టి మాటలే. నా మీద తిరుగుబాటు చెయ్యడానికి నీకు ధైర్యం ఇచ్చింది ఎవరు?
Mówiłeś: (aleć to słowa daremne) Rady i mocy mam dosyć do wojny. A teraz w kimże ufasz, żeś mi się sprzeciwił?
21 ౨౧ నలిగిన రెల్లులాంటి ఈ ఐగుప్తును నమ్ముకుంటున్నావు. కాని, ఎవరైనా దాని మీద ఆనుకుంటే అది అతని చేతికి గుచ్చుకుని లోపలికి దిగుతుంది. అతన్ని నమ్ముకున్న వాళ్ళందరికీ ఐగుప్తురాజు ఫరో అలాంటివాడే.
Oto teraz spolegasz na Egipcie, jako na lasce trzcinnej, i to nałamanej, którą jeźliby się kto podpierał, tedy wnijdzie w rękę jego i przekole ją. Takić jest Farao, król Egipski, wszystkim, co w nim ufają.
22 ౨౨ మా దేవుడు యెహోవాను మేము నమ్ముకుంటున్నాము, అని ఒకవేళ మీరు నాతో చెప్తారేమో. యెరూషలేములో ఉన్న ఈ బలిపీఠం దగ్గర మాత్రమే మీరు నమస్కారం చెయ్యాలని యూదా వాళ్ళకూ, యెరూషలేము వాళ్ళకూ ఆజ్ఞ ఇచ్చి, హిజ్కియా ఎవరి ఉన్నత స్థలాలూ, బలిపీఠాలూ పడగొట్టాడో ఆయనే గదా యెహోవా?
A jeźli mi rzeczecie: W Panu Bogu naszym ufność mamy: azaż nie ten jest, którego zniósł Ezechyjasz wyżyny i ołtarze? i rozkazał Judzie i Jeruzalemowi, mówiąc: Przed tym ołtarzem kłaniać się będziecie w Jeruzalemie.
23 ౨౩ కాబట్టి, నా యజమాని అష్షూరు రాజు పక్షంగా నిన్ను సవాలు చేస్తున్నాను. చాలినంత మంది రౌతులు నీ దగ్గర ఉంటే రెండువేల గుర్రాలు నేను నీకిస్తాను.
Przetoż teraz zaręcz się królowi Assyryjskiemu, panu memu, a dam ci dwa tysiące koni; będzieszli mógł mieć jezdnych tak wiele do dnich?
24 ౨౪ అలా ఐతే నీవు నా యజమాని సేవకుల్లో అతి తక్కువ వాడైన ఒక్క అధిపతినైనా ఎలా ఎదిరించగలవు? రథాలూ, రౌతులూ పంపుతాడని ఐగుప్తురాజును నీవు ఆశ్రయించావు గదా!
I jakoż się ty możesz oprzeć hetmanowi jednemu najmniejszemu z sług pana mego? choć pokładasz nadzieję w Egipcie dla wozów i jezdnych.
25 ౨౫ యెహోవా ఇష్టం లేకుండానే ఈ దేశంపై యుద్ధం చేసి నాశనం చెయ్యడానికి నేను వచ్చానా? ‘ఆ దేశంపై దాడి చేసి నాశనం చెయ్యి’ అని యెహోవాయే నాకు ఆజ్ఞ ఇచ్చాడు” అన్నాడు.
Nadto, czy bez woli Pańskiej przyciągnąłem przeciw temu miejscu, abym je zburzył? Pan mówi do mnie: Idź do tej ziemi, a spustosz ją.
26 ౨౬ రబ్షాకేతో హిల్కీయా కొడుకు ఎల్యాకీము, షెబ్నా, యోవాహు ఇలా అన్నారు. “నీ దాసులమైన మాకు సిరియా భాష తెలుసు గనుక ఆ భాషలో మాట్లాడండి. ప్రాకారాల మీద ఉన్న ప్రజలకు తెలిసిన యూదుల భాషలో దయచేసి మాట్లాడొద్దు” అన్నారు.
Tedy rzekł Elijakim, syn Helkijaszowy, i Sobna, i Joach do Rabsacesa: Proszę mów do sług twoich po syryjsku, boć rozumiemy; a nie mów z nami po żydowsku, gdzie słyszy lud, który jest na murze.
27 ౨౭ రబ్షాకే “ఈ మాటలు చెప్పడానికి నీ యజమాని దగ్గరకూ, నీ దగ్గరికి మాత్రమేనా నా యజమాని నన్ను పంపింది? త్వరలో మీతో పాటు తమ మలం తిని తమ మూత్రం తాగాల్సిన ఈ ప్రాకారాల మీద కూర్చున్న వాళ్ళ దగ్గరికి కూడా నన్ను పంపాడు గదా” అని చెప్పాడు.
Którym odpowiedział Rabsaces: Azaż mię do pana twego, albo do ciebie przysłał Pan mój, abym te słowa mówił? Azaż nie do tych mężów, którzy siedzą na murze, aby jedli łajna swoje, i pili mocz swój z wami.
28 ౨౮ అతడు పెద్ద స్వరంతో యూదుల భాషలో “మహారాజైన అష్షూరురాజు చెప్పిన మాటలు వినండి. రాజు చెప్పదేమంటే,
A tak stanąwszy Rabsaces wołał głosem wielkim po żydowsku, a mówiąc rzekł: Słuchajcie słów króla wielkiego, króla Assyryjskiego.
29 ౨౯ హిజ్కియా వల్ల మోసపోకండి. నా చేతిలోనుంచి మిమ్మల్ని విడిపించడానికి అతనికి శక్తి చాలదు.
Tak mówi król: Niech was nie zwodzi Ezechyjasz; bo was nie będzie mógł wyrwać z ręki mojej.
30 ౩౦ యెహోవా పేరట మిమ్మల్ని నమ్మించి, ‘యెహోవా మనలను విడిపిస్తాడు, ఈ పట్టణం అష్షూరురాజు చేతికి చిక్కదు’ అని హిజ్కియా చెప్తున్నాడు.
A niech wam nie rozkazuje ufać Ezechyjasz w Panu, mówiąc: Pewnie nas wyrwie Pan, a nie będzie podane to miasto w ręce króla Assyryjskiego.
31 ౩౧ హిజ్కియా చెప్పిన మాట మీరు నమ్మవద్దు. అష్షూరురాజు చెప్పేదేమంటే, నాతో సంధి చేసుకుని మీరు బయటికి నా దగ్గరికి వస్తే, మీలో ప్రతి మనిషీ తన సొంత ద్రాక్షచెట్టు ఫలం, తన అంజూరపు చెట్టు ఫలం తింటూ, తన సొంత బావిలో నీళ్లు తాగుతాడు.
Nie słuchajcie Ezechyjasza. Albowiem tak mówi król Assyryjski: Uczyńcie ze mną przymierze, a wynijdźcie do mnie, a jedzcie każdy z winnicy swojej i każdy z figi swojej, i pijcie każdy wodę z studnicy swojej,
32 ౩౨ ఆ తరువాత మీరు చనిపోకుండా బ్రతికేలా మేము వచ్చి మీ దేశం లాంటి దేశానికీ, అంటే గోదుమలు, ద్రాక్షారసం ఉన్న దేశానికీ, ఆహారం, ద్రాక్షచెట్లు ఉన్న దేశానికీ, ఒలీవ నూనె, తేనె ఉన్న దేశానికీ మిమ్మల్ని తీసుకు పోతాము. అక్కడ మీరు సుఖంగా ఉంటారు. కాబట్టి, యెహోవా మిమ్మల్ని విడిపిస్తాడని హిజ్కియా మీకు బోధించే మాటలు వినొద్దు.
Aż przyjdę a pobiorę was do ziemi podobnej ziemi waszej, do ziemi żyznej i obfitującej winem, do ziemi chleba i winnic, do ziemi drzew oliwnych, i oliwy, i miodu; i będziecie żyli, a nie pomrzecie. Nie słuchajcież Ezechyjasza; bo was zwodzi, mó wiąc: Pan was wybawi.
33 ౩౩ వివిధ ప్రజల దేవుళ్లలో ఎవరైనా తమ దేశాన్ని అష్షూరురాజు చేతిలోనుంచి విడిపించారా?
Izaż mogli bogowie narodów wybawić każdy ziemię swoję, z ręki króla Assyryjskiego?
34 ౩౪ హమాతు దేవుళ్ళు ఏమయ్యారు? అర్పాదు దేవుళ్ళు ఏమయ్యారు? సెపర్వయీము దేవుళ్ళు ఏమయ్యారు? హేన ఇవ్వా అనే వాళ్ళ దేవుళ్ళు ఏమయ్యారు? (షోమ్రోను దేశపు) దేవుళ్ళు మా చేతిలోనుంచి షోమ్రోనును విడిపించారా?
Gdzież jest bóg Emat i Arfad? gdzież jest bóg Sefarwaim, Ana i Awa? izali wyrwali Samaryję z rąk moich?
35 ౩౫ మా చేతిలోనుంచి యెహోవా యెరూషలేమును విడిపిస్తాడు అనడానికి, వివిధ దేశాల దేవుళ్లలో ఎవరైనా తమ దేశాన్ని మా చేతిలోనుంచి విడిపించిన సందర్భం ఉందా?” అన్నాడు.
Któryż jest między wszystkimi bogi tych ziem, któryby wyrwał ziemię swoję z ręki mojej? A miałby Pan wyrwać Jeruzalem z ręki mojej?
36 ౩౬ అయితే అతనికి జవాబు ఇవ్వొద్దని రాజు చెప్పిన కారణంగా ప్రజలు ఏమాత్రం మాట్లాడకుండా మౌనంగా ఉన్నారు.
Ale milczał lud, i nie odpowiedzieli mu słowa; bo takie było rozkazanie królewskie, mówiąc: Nie odpowiadajcie mu.
37 ౩౭ గృహ నిర్వాహకుడైన హిల్కీయా కొడుకు ఎల్యాకీము, శాస్త్రి షెబ్నా, రాజ్య లేఖనాల అధిపతి ఆసాపు కొడుకు యోవాహు, బట్టలు చింపుకుని హిజ్కియా దగ్గరికి వచ్చి, రబ్షాకే పలికిన మాటలన్నీ తెలియజేశారు.
Przyszedł tedy Elijakim, syn Helkijaszowy, przełożony domu, i Sobna pisarz, i Joach, syn Asafowy, kanclerz, do Ezechyjasza, rozdarłszy szaty swe, i oznajmili mu słowa Rabsacesowe.