< రాజులు~ రెండవ~ గ్రంథము 17 >

1 యూదారాజు ఆహాజు పరిపాలనలో 12 వ సంవత్సరంలో ఏలా కొడుకు హోషేయ షోమ్రోనులో ఇశ్రాయేలును ఏలడం ఆరంభించి, తొమ్మిది సంవత్సరాలు ఏలాడు.
Дванадцятого року Ахаза, Юдиного царя, зацарював над Ізраїлем у Самарії Осі́я, син Елин, на дев'ять років.
2 అతడు తన పూర్వికులైన ఇశ్రాయేలు రాజులు చేసినంత చెడుతనం చెయ్యకపోయినా, యెహోవా దృష్టిలో చెడుతనమే జరిగించాడు.
І робив він зле в Господніх оча́х, тільки не так, як ті Ізраїлеві царі, що були перед ним.
3 అతని మీద అష్షూరురాజు షల్మనేసెరు యుద్ధానికి రాగా, హోషేయ అతనికి దాసోహమై కప్పం కట్టేవాడిగా అయ్యాడు.
На нього вийшов Салманасар, цар асирійський, і Осі́я став йому за раба́, і давав йому дани́ну.
4 అతడు ఐగుప్తు రాజు సో దగ్గరికి వార్తాహరులను పంపి, ఇంత వరకూ తాను ప్రతి సంవత్సరం చేస్తున్నట్టు అష్షూరు రాజుకు కప్పం కట్టడం ఆపి వేశాడు. హోషేయ చేసిన కుట్ర అష్షూరు రాజు తెలుసుకుని అతనికి సంకెళ్లు వేయించి ఖైదు చేశాడు.
Та асирійський цар знайшов в Осі́ї змову, що він посилав послів до Со, єгипетського царя, та не прино́сив асирійському цареві данини, як рік-у-рік те робив був. І замкнув його асирійський цар, і зв'язав його в в'язни́чому домі.
5 అష్షూరురాజు దేశమంతటి మీదకీ, షోమ్రోను మీదకీ వచ్చి మూడు సంవత్సరాలు షోమ్రోనును ముట్టడించాడు.
І вийшов асирійський цар на ввесь Край, і прийшов до Самарії, й обляга́в її три роки.
6 హోషేయ పరిపాలనలో తొమ్మిదో సంవత్సరంలో అష్షూరు రాజు షోమ్రోను పట్టణాన్ని చెరపట్టి ఇశ్రాయేలు వాళ్ళను అష్షూరు దేశంలోకి బందీలుగా తీసుకువెళ్ళాడు. గోజాను నది దగ్గర ఉన్న హాలహు, హాబోరు అనే చోటా, మాదీయుల పట్టణాల్లోనూ వాళ్ళను ఉంచాడు.
Дев'ятого року Осі́ї асирійський цар здобув Самарію, та й вигнав Ізраїля до Асирії, і осадив їх у Халаху, і в Хаворі над річкою Ґозан, і в містах Мідії.
7 ఎందుకంటే, ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో నుంచీ, ఐగుప్తు రాజు ఫరో బలం నుంచీ, తమను విడిపించిన తమ దేవుడైన యెహోవా దృష్టిలో పాపం చేసి ఇతర దేవుడు పట్ల భయభక్తులు కనపరిచారు.
І сталося, коли Ізраїлеві сини грішили проти Господа, Бога свого, що ви́провадив їх з єгипетського кра́ю з руки фараона, єгипетського царя, і боя́лися інших богів,
8 తమ ఎదుట నిలవ లేకుండా యెహోవా వెళ్లగొట్టిన ప్రజల కట్టుబాట్లూ, ఇశ్రాయేలు రాజులు నిర్ణయించిన కట్టుబాట్లూ పాటిస్తూ ఉన్నారు.
і ходили уставами тих народів, що Госпо́дь повиганяв їх перед Ізраїлевими синами, та Ізраїлевих царів, які вони встановили,
9 ఇంకా ఇశ్రాయేలు వారు తమ దేవుడైన యెహోవాకు వ్యతిరేకమైన పనులు రహస్యంగా చేస్తూ, తమ పట్టణాలన్నిటిలో బురుజుల మీదా ప్రాకారాల మీదా పూజా స్థలాలు కట్టుకున్నారు.
а Ізраїлеві сини вимишляли на Господа, Бога свого, слова́, що не були слушні, і будували собі па́гірки по всіх своїх містах, від вартово́ї башти аж до тверди́нного міста,
10 ౧౦ ఎత్తయిన కొండలన్నిటి మీదా, ప్రతి పచ్చని చెట్టు కిందా విగ్రహాలు నిలబెట్టి దేవతా స్తంభాలు కట్టించారు.
і ставили собі стовпи для богів та Астарти на кожному високому взгі́р'ї та під усяким зеленим деревом,
11 ౧౧ తమ యెదుట నిలబడకుండా యెహోవా వెళ్లగొట్టిన ప్రజల ఆచారాల ప్రకారం ఉన్నత స్థలాల్లో ధూపం వేస్తూ, దుర్మార్గంగా ప్రవర్తించి యెహోవాకు కోపం పుట్టించారు.
і кадили там на всіх па́гірках, як ті люди, що Господь повиганяв перед ними, і робили злі речі, щоб гніви́ти Господа,
12 ౧౨ “చెయ్యకూడదు” అని వేటి గురించి యెహోవా తమకు ఆజ్ఞాపించాడో వాటినే చేస్తూ పూజిస్తూ ఉన్నారు.
і служили бовва́нам, про яких Господь говорив їм: „Не бу́дете робити цієї речі“,
13 ౧౩ “అయినా మీ గోపురాలను విడిచిపెట్టి, నేను మీ పితరులకు ఆజ్ఞాపించి, నా సేవకులైన ప్రవక్తల ద్వారా మీకు అప్పగించిన ధర్మశాస్త్రంలో ఉన్న నా ఆజ్ఞలు, కట్టడలు ఆచరించండి” అని ప్రవక్తలందరి ద్వారానూ, దీర్ఘదర్శుల ద్వారానూ యెహోవా ఇశ్రాయేలు వాళ్ళకూ, యూదా వాళ్ళకూ సాక్ష్యం పలికించాడు.
то Господь засві́дчив в Ізраїлі та в Юді через усіх Своїх пророків та всіх прозорли́вців, говорячи: „Верніться з ваших злих доріг, і додержуйте Моїх заповідей, уставів Моїх, згідно зо всім Зако́ном, якого Я наказав був вашим батькам, і якого послав до вас через Моїх рабів пророків“.
14 ౧౪ అయినా వారు వినలేదు. తమ దేవుడైన యెహోవాకు నమ్మకంగా లేని తమ పూర్వికుల వలే వారు కూడా తలబిరుసుగా ఉన్నారు.
Та не слухали вони, і робили твердо́ю свою шию, як шия їхніх батькі́в, що не вірили в Господа, Бога свого.
15 ౧౫ వారు ఆయన కట్టడలనూ, తమ పితరులతో ఆయన చేసిన నిబంధననూ, ఆయన తమకు నిర్ణయించిన ధర్మశాస్త్రాన్నీ విడిచి పెట్టి వ్యర్థమైన వాటిని చేశారు. “వాళ్ళ ఆచారాల ప్రకారం మీరు చెయ్యకూడదు” అని యెహోవా ఎవరి గురించి అయితే తమకు చెప్పాడో తమ చుట్టూ ఉన్న ఆ ప్రజల ఆచారాలనే వారు అనుసరించారు.
І не́хтували вони постанови Його, і заповіта Його, що склав з їхніми батька́ми, і свідо́цтва Його, що засві́дчив на них, і пішли за гидо́тою й марно́тами, та за наро́дами, що були навколо них, про яких Господь наказав був їм не робити, як вони.
16 ౧౬ వారు తమ దేవుడైన యెహోవా ఆజ్ఞలన్నిటినీ అనుసరించకుండా రెండు దూడల పోత విగ్రహాలను చేసి దేవతాస్తంభాలు నిలబెట్టి, నక్షత్రాలనూ, బయలు దేవుణ్ణి పూజించారు.
І полишили вони всі заповіді Господа, Бога свого, і зробили собі литого бовва́на, двох телят, і зробили Астарту, і вклонялися всьому небесному ві́йськові та служили Ваалові.
17 ౧౭ ఇంకా, తమ కొడుకులనూ, కూతుళ్ళనూ దహన బలులుగా అర్పించి, భూతవైద్యం, మంత్రాలు, అలవాటు చేసుకుని యెహోవా దృష్టిలో చెడుతనం చెయ్యడానికి తమ్మును తాము అమ్ముకుని, ఆయనకు కోపం పుట్టించారు.
І вони перево́дили через огонь своїх синів та дочо́к своїх, і чарува́ли ча́рами, і ворожили, і віддавалися робити зло в Господніх оча́х, щоб гнівити Його.
18 ౧౮ కాబట్టి యెహోవా ఇశ్రాయేలు వాళ్ళ మీద చాలా కోపంతో తన ఎదుట నుంచి వాళ్ళను వెళ్లగొట్టాడు గనుక యూదా గోత్రం తప్ప ఇంక ఏ గోత్రమూ మిగలలేదు.
І сильно розгнівався Господь на Ізраїля, і відкинув їх від Свого лиця, — не позостало ніко́го, тільки саме Юдине пле́м'я.
19 ౧౯ అయితే యూదా వారు కూడా తమ దేవుడైన యెహోవా ఆజ్ఞలను విడిచిపెట్టి ఇశ్రాయేలు వారు పెట్టుకొన్న కట్టడలనే అనుసరించారు.
Та й Юда не додержував заповідей Господа, Бога свого, — і ходили вони Ізраїлевими постановами, які вони встанови́ли.
20 ౨౦ అప్పుడు యెహోవా ఇశ్రాయేలు వంశస్థులను తృణీకరించి, వాళ్ళను బాధపెట్టి, దోపిడీగాళ్ళ చేతికి అప్పగించి, వాళ్ళను తన ఎదుట నుంచి వెళ్లగొట్టాడు.
І відвернувся Господь від усього Ізраїлевого насіння, і впокоря́в їх, і давав їх у руку грабі́жників, аж поки не кинув їх від лиця Свого,
21 ౨౧ ఆయన ఇశ్రాయేలు గోత్రాలను దావీదు సంతానం నుంచి విడగొట్టినప్పుడు వారు నెబాతు కొడుకు యరొబామును రాజుగా చేసుకున్నారు. యరొబాము ఇశ్రాయేలు వారు యెహోవాను అనుసరించకుండా, వారు ఆయన మీద తిరుగుబాటు చేసేలా చేసి, ఘోరమైన పాపం చెయ్యడానికి కారకుడయ్యాడు.
бо Ізраїль розірвав з Давидовим домом, і вони зробили царем Єровоама, Неватового сина, а Єровоам відвернув Ізраїля від Господа, і вводив їх у великий гріх.
22 ౨౨ ఇశ్రాయేలు వారు యరొబాము చేసిన పాపాల్లో దేన్నీ విడిచిపెట్టకుండా వాటిని అనుసరిస్తూనే ఉన్నారు.
І ходили Ізраїлеві сини в усіх Єровоамових гріхах, які він робив, не відсту́палися з того,
23 ౨౩ తన సేవకులైన ప్రవక్తల ద్వారా యెహోవా చెప్పిన మాట ప్రకారం ఆయన ఇశ్రాయేలు వాళ్ళను తన ఎదుట నుంచి వెళ్ళగొట్టాడు. అందువల్ల వారు తమ స్వదేశం నుంచి అష్షూరు దేశానికి బందీలుగా వెళ్ళారు. ఈ రోజు వరకూ వారు అక్కడే ఉన్నారు.
аж поки Господь не відкинув Ізраїля від лиця Свого, як говорив був через усіх Своїх рабів пророків. І пішов Ізраїль на вигна́ння з своєї землі до Асирії, і він там аж до цього дня.
24 ౨౪ అష్షూరు రాజు బబులోను, కూతా, అవ్వా, హమాతు, సెపర్వయీము అనే తన దేశాల్లో నుంచి మనుషులను రప్పించి, ఇశ్రాయేలు వాళ్లకు బదులుగా షోమ్రోను పట్టణాల్లో వాళ్ళను ఉంచాడు. వారు షోమ్రోను ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుని, ఆ పట్టణాల్లో కాపురం ఉన్నారు.
І спрова́див асирійський цар людей з Вавилону, і з Кути, і з Авви, і з Гамоту, і з Сефарваїму, й осели́в по містах Самарії замість Ізраїлевих синів. І посіли вони Самарію, й осілися по містах її.
25 ౨౫ అయితే వారు అలా ఉండడం ఆరంభించినప్పుడు వారు యెహోవా పట్ల భయభక్తులు లేని వారు గనుక యెహోవా వాళ్ళ మధ్యకు సింహాలను పంపాడు. అవి వాళ్ళల్లో కొంతమందిని చంపాయి.
І сталося, на поча́тку пробува́ння їх там не боялися вони Господа, — і Господь послав на них левів, і вони нищили їх.
26 ౨౬ అప్పుడు వారు “మీరు పట్టుకొన్న షోమ్రోను పట్టణాల్లో మీరు ఉంచిన ప్రజలకు ఆ దేశపు దేవుని ఆచారాలు తెలియదు గనక ఆయన సింహాలను పంపించాడు. ఇశ్రాయేలు దేవుని ఆచారాలు వాళ్లకు తెలియని కారణంగా సింహాలు వాళ్ళను చంపుతున్నాయి” అని అష్షూరు రాజుతో చెప్పారు.
І сказали вони до асирійського царя, говорячи: „Ті люди, яких ти вигнав та осели́в по містах Самарії, не знають прав Бога цього Кра́ю, і Він послав на них оцих левів, і ось вони нищать їх, бо вони не знають права Бога цього Кра́ю“.
27 ౨౭ అష్షూరు రాజు “అక్కడ నుంచి తెచ్చిన యాజకుల్లో ఒకణ్ణి మీరు అక్కడికి తీసుకెళ్ళండి. అతడు అక్కడికి వెళ్లి కాపురం ఉండి, ఆ దేశపు దేవుని ఆచారాలను వాళ్లకు నేర్పాలి” అని ఆజ్ఞాపించాడు.
І наказав асирійський цар, говорячи: „Відведіть туди одно́го зо священиків, яких вигнали звідти, і пі́дуть, і осядуть там, і він навчатиме їх пра́ва Бога цього кра́ю“.
28 ౨౮ అప్పుడు షోమ్రోనులోనుంచి వారు పట్టుకు వచ్చిన యాజకుల్లో ఒకడు వచ్చి బేతేలు ఊళ్ళో కాపురం ఉండి యెహోవా పట్ల భయభక్తులుగా ఉండవలసిన విధానాన్ని వాళ్లకు బోధించాడు.
І прибув один із священиків, яких вигнали з Самарії, й осівся в Бет-Елі, і він навчав їх, як мають боятися Господа.
29 ౨౯ అయితే కొంతమంది ప్రజలు తమ సొంత దేవుళ్ళను పెట్టుకుని షోమ్రోనీయులు కట్టుకొన్న ఉన్నత స్థలాల మందిరాల్లో వాటిని ఉంచుకున్నారు. ఇంకా, వారు తమ తమ పట్టణాల్లో తమ కోసం దేవుళ్ళను తయారు చేసుకున్నారు.
Та крім того кожен народ робив свого бога, і ставили їх у па́гірковому місці, що робили попередні самаряни, кожен народ по своїх містах, де вони сиділи.
30 ౩౦ బబులోను వారు సుక్కో తు బెనోతు దేవుణ్ణి, కూతా వారు నెర్గలు దేవుణ్ణి, హమాతు వారు అషీమా దేవుణ్ణి,
А вавилоняни зробили Суккот-Бенота, а кутяни зробили Нереґала, а гаматяни зробили Ашіму,
31 ౩౧ ఆవీయులు నిబ్హజు దేవుణ్ణి, తర్తాకు దేవుణ్ణి, ఎవరి దేవుళ్ళను వారు పెట్టుకుంటూ ఉన్నారు. సెపర్వీయులు తమ పిల్లలను ఆద్రమ్మెలెకు, అనెమ్మెలెకు అనే సెపర్వయీము దేవుళ్ళకు అగ్నిలో బలిగా అర్పిస్తూ ఉన్నారు.
а авв'яни зробили Нівхаза та Тартака, а ме́шканці Сефарваїму палили синів своїх ув огні Адраммелехові й Анаммелехові, сефарваїмським богам.
32 ౩౨ ఆ ప్రజలు యెహోవాను కూడా పూజించారు. ఉన్నత స్థలాల్లో సామాన్యుల్లో కొంతమందిని యాజకులుగా చేసుకున్నారు. అ యాజకులు ప్రజల పక్షంగా ఆ ఉన్నత స్థలాల్లో కట్టిన మందిరాల్లో బలులు అర్పిస్తూ ఉన్నారు.
І при тому вони боялися Господа, і настанови́ли собі з-серед себе священиків па́гірків, і вони прино́сили їм жертви в пагірковому місці.
33 ౩౩ ఈ విధంగా వారు యెహోవా పట్ల భయభక్తులు చూపుతూనే, తాము ఏ ప్రజల్లో నుంచి వచ్చారో ఆ ప్రజల ఆచారాల ప్రకారం తమ దేవుళ్ళను కూడా పూజిస్తూ ఉన్నారు.
Вони боялися Господа, і богам своїм служили за правом тих народів, звідки повиганя́ли їх.
34 ౩౪ ఈ రోజు వరకూ తమ పూర్వాచారాల ప్రకారం వారు చేస్తున్నారు. ఇశ్రాయేలు అని పేరు పెట్టిన యాకోబు సంతానం, యెహోవా పట్ల భయభక్తులు చూపలేదు. ఆయన ఆజ్ఞాపించిన కట్టడలు గాని, విధులు గాని, ధర్మశాస్త్రం గాని, ఆజ్ఞల్లో దేనినీ గానీ అనుసరించలేదు.
Аж до цього дня вони роблять за колишнім правом, — вони не бояться Господа, і не роблять за уставами своїми та за правом своїм, ані за Зако́ном, ані за заповіддю, як наказав був Господь синам Якова, якому дав ім'я́ Ізраїля.
35 ౩౫ ఆయన ఎవరితోనైతే నిబంధన చేసి “మీరు ఇతర దేవుళ్ళకు భయపడకూడదు. వాటికి మొక్కకూడదు. పూజ చేయకూడదు. బలులు అర్పించకూడదు.
І склав Господь із ними заповіта, і наказав їм, говорячи: „Не будете боятися інших богів, і не будете вклонятися їм, і не будете служити їм, і не будете прино́сити жертов їм,
36 ౩౬ ఎవరైతే మిమ్మల్ని ఐగుప్తు దేశం నుంచి గొప్ప బలప్రభావాలతో చాచిన తన బహువుతో బయటికి తెచ్చాడో ఆయన్నే మీరు పూజించాలి. ఆయనకే మొక్కాలి. ఆయనకే బలులు అర్పించాలి.
а тільки Господа, що вивів вас із єгипетського кра́ю великою силою та ви́тягненим раме́ном, Його будете боятися, і Йому будете вклонятися, і Йому будете прино́сити жертви.
37 ౩౭ శాశ్వతంగా మోషే మీకు రాసి ఇచ్చిన కట్టడలు, విధులు, అంటే ధర్మశాస్త్రం, ఆజ్ఞలు, అన్నీ మీరు పాటించాలి. ఇతర దేవుళ్ళకు భయపడ కూడదు.
І устави, і права́, і Зако́на, і заповідь, які написав вам, бу́дете доде́ржувати, щоб вико́нувати по всі дні, а богів інших не будете боятися.
38 ౩౮ నేను మీతో చేసిన నిబంధన మర్చిపోకుండా, ఇతర దేవుళ్ళను పూజించకుండా ఉండాలి.
А заповіта, що Я склав із вами, не забудете, і не будете боятися інших богів,
39 ౩౯ మీరు భయభక్తులు చూపవలసింది యెహోవా దేవుని పైనే. ఆయన మీ శత్రువుల బలం నుండి మిమ్మల్ని రక్షిస్తాడు” అని యెహోవా చెప్పాడు.
а тільки Господа, Бога вашого, будете боятися, і Він вирятує вас із руки всіх ваших ворогів“.
40 ౪౦ అయినా వారు ఆయన మాట వినకుండా తాము గతంలో చేసినట్టే చేశారు.
Та не послухали вони, бо все робили за своїм попереднім зви́чаєм.
41 ౪౧ ఆ ప్రజలు ఆ విధంగా యెహోవా పట్ల భయ భక్తులు కలిగి ఉంటూనే, తమ చెక్కిన విగ్రహాలను కూడా పూజిస్తూ వచ్చారు. వారి పిల్లలూ, పిల్లల పిల్లలూ అలానే చేశారు. వారి పూర్వికులు చేసినట్టే ఈ రోజు వరకూ చేస్తూనే ఉన్నారు.
І ті народи все боялися Господа, але служили бовва́нам своїм. Так само сини їхні та сини їхніх синів, — як робили батьки їхні, так роблять вони аж до цього дня.

< రాజులు~ రెండవ~ గ్రంథము 17 >