< రాజులు~ రెండవ~ గ్రంథము 15 >
1 ౧ ఇశ్రాయేలురాజు యరొబాము పరిపాలనలో 23 వ సంవత్సరంలో యూదారాజు అమజ్యా కొడుకు అజర్యా పరిపాలన ఆరంభించాడు.
Azariah, son of Amaziah, became king of Judah in the twenty-seventh year of the reign of Jeroboam, king of Israel.
2 ౨ అతడు 16 సంవత్సరాల వయస్సులో పరిపాలన ఆరంభించి యెరూషలేములో 52 సంవత్సరాలు రాజుగా ఉన్నాడు. అతని తల్లి యెరూషలేము నివాసి యెకొల్యా.
He was sixteen years old when he became king, and he reigned in Jerusalem for fifty-two years. His mother's name was Jecoliah of Jerusalem.
3 ౩ ఇతడు తన తండ్రి అమజ్యా చేసినట్టు చేసి యెహోవా దృష్టిలో నీతిగా ప్రవర్తించాడు.
He did what was right in the Lord's sight, just as his father Amaziah had done.
4 ౪ అయితే అతడు ఉన్నత స్థలాలను మాత్రం నాశనం చెయ్యలేదు. ఉన్నత స్థలాల్లో ప్రజలు ఇంకా బలులు అర్పిస్తూ ధూపం వేస్తూనే ఉన్నారు.
But the high places were not removed. The people still were sacrificing and presenting burnt offerings in those places.
5 ౫ యెహోవా ఈ రాజును దెబ్బ కొట్టిన కారణంగా అతడు చనిపోయే వరకూ కుష్టురోగిగా ఉంటూ వేరుగా ఒక భవనంలో నివాసం ఉన్నాడు గనుక యువరాజు యోతాము పట్టణం మీద అధికారిగా దేశ ప్రజలకు న్యాయం తీర్చే వాడిగా ఉన్నాడు.
The Lord touched the king and he had leprosy until the day he died. He lived in isolation in a separate house. His son Jotham was in charge of the palace and was the country's actual ruler.
6 ౬ అజర్యా చేసిన పనుల గురించి, అతడు చేసిన దానంతటి గురించి యూదారాజుల చరిత్ర గ్రంథంలో రాసి ఉంది.
The rest of what happened in Azariah's reign and all he did are recorded in the Book of Chronicles of the Kings of Judah.
7 ౭ అజర్యా చనిపోయినప్పుడు అతణ్ణి తన పూర్వీకులతోబాటు దావీదు పట్టణంలో తన పితరుల సమాధిలో పాతిపెట్టిన తరువాత అతని కొడుకు యోతాము అతని స్థానంలో రాజయ్యాడు.
Azariah died and was buried with his fore fathers in the City of David. His son Jotham succeeded him as king.
8 ౮ యూదారాజు అజర్యా పరిపాలనలో 38 వ సంవత్సరంలో యరొబాము కొడుకు జెకర్యా షోమ్రోనులో ఇశ్రాయేలు వాళ్ళను ఆరు నెలలు పరిపాలించాడు.
Zechariah, son of Jeroboam, became king of Israel in the thirty-eighth year of the reign of Azariah, king of Judah. He reigned in Samaria for six months.
9 ౯ ఇతడు ఇశ్రాయేలు వారు పాపం చెయ్యడానికి కారకుడైన నెబాతు కొడుకు యరొబాము చేసిన పాపాలు విడిచిపెట్టకుండా వాటినే అనుసరిస్తూ, తన పూర్వికులు చేసినట్టే తానూ యెహోవా దృష్టిలో చెడుతనం జరిగించాడు.
He did what was evil in the Lord's sight, as his forefathers had done. He did not end the sins that Jeroboam, son of Nebat, had made Israel commit.
10 ౧౦ యాబేషు కొడుకు షల్లూము అతని మీద కుట్రచేసి, ప్రజలు చూస్తూ ఉండగా అతని మీద దాడి చేసి అతన్ని చంపి అతని స్థానంలో రాజయ్యాడు.
Then Shallum, son of Jabesh, plotted against Zechariah. He attacked him, murdering him in front of the people, and took over as king.
11 ౧౧ జెకర్యా చేసిన పనులు గురించి ఇశ్రాయేలు రాజుల చరిత్ర గ్రంథంలో రాసి ఉంది.
The rest of the events of Zechariah's reign are recorded in the Book of Chronicles of the Kings of Israel.
12 ౧౨ నీ కొడుకులు నాలుగో తరం వరకూ ఇశ్రాయేలు సింహాసనం మీద కూర్చుంటారని యెహోవా యెహూతో చెప్పిన మాట ప్రకారం ఇది జరిగింది.
In this way what the Lord told Jehu came true: “Your descendants will sit on the throne of Israel to the fourth generation.”
13 ౧౩ యూదారాజు ఉజ్జియా పరిపాలనలో 39 వ సంవత్సరంలో యాబేషు కొడుకు షల్లూము పరిపాలన ఆరంభించి, షోమ్రోనులో నెల రోజులు ఏలాడు.
Shallum, son of Jabesh, became king in the thirty-ninth year of the reign of King Uzziah of Judah. He reigned in Samaria for one month.
14 ౧౪ గాదీ కొడుకు మెనహేము తిర్సాలో నుంచి బయలుదేరి షోమ్రోనునకు వచ్చి షోమ్రోనులో ఉండే యాబేషు కొడుకు షల్లూము మీద దాడి చేసి అతన్ని చంపి అతని స్థానంలో రాజయ్యాడు.
Then Menahem, son of Gadi, went from Tirzah to Samaria, attacked and murdered Shallum, son of Jabesh, and took over as king.
15 ౧౫ షల్లూము చేసిన ఇతర పనుల గురించి, అతడు చేసిన కుట్ర గురించి, ఇశ్రాయేలు రాజుల చరిత్ర గ్రంథంలో రాసి ఉంది.
The rest of the events of Shallum's reign and the rebellion he plotted are recorded in the Book of Chronicles of the Kings of Israel.
16 ౧౬ మెనహేము వచ్చినప్పుడు తిప్సహు పట్టణం వారు తమ తలుపులు తెరవలేదు గనుక అతడు వాళ్ళందర్నీ హతం చేసి, తిర్సానూ దాని చుట్టూ ఉన్న గ్రామాలన్నిటినీ దోచుకుని అక్కడ ఉన్న గర్భవతుల గర్భాలు కత్తితో చీరివేశాడు.
At that time Menahem, starting from Tirzah, attacked Tiphsah and the region nearby, because they would not surrender the town to him. So he destroyed Tiphsah and ripped open all the pregnant women.
17 ౧౭ యూదారాజు అజర్యా పరిపాలనలో 39 వ సంవత్సరంలో గాదీ కొడుకు మెనహేము ఇశ్రాయేలు వాళ్ళను ఏలడం ఆరంభించి షోమ్రోనులో 10 సంవత్సరాలు ఏలాడు.
Menahem, son of Gadi, became king of Israel in the thirty-ninth year of the reign of King Azariah of Judah. He reigned in Samaria for ten years.
18 ౧౮ ఇతడు కూడా తన కాలమంతా ఇశ్రాయేలు వారు పాపం చెయ్యడానికి కారకుడైన నెబాతు కొడుకు యరొబాము చేసిన పాపాలను విడిచిపెట్టకుండా వాటినే అనుసరిస్తూ యెహోవా దృష్టిలో చెడుతనం జరిగించాడు.
Throughout his reign he did what was evil in the Lord's sight. He did not end the sins that Jeroboam, son of Nebat, had made Israel commit.
19 ౧౯ అష్షూరు రాజు పూలు ఇశ్రాయేలు దేశం మీదికి దండెత్తి వచ్చినప్పుడు, మెనహేము, తన రాజ్యం నిలిచి ఉండేలా పూలుతో సంధి చేసుకోవాలని పూలుకు 2,000 మణుగుల వెండి ఇచ్చాడు.
Pul, king of Assyria, invaded the country. Menahem paid Pul a thousand talents of silver to support Menahem in consolidating his power over the kingdom.
20 ౨౦ మెనహేము, ఇశ్రాయేలులో ధనవంతులైన గొప్పవాళ్ళల్లో ప్రతి మనిషి దగ్గర 50 తులాల వెండి వసూలు చేసి ఈ ధనాన్ని అష్షూరు రాజుకు ఇచ్చాడు గనుక అష్షూరురాజు దేశాన్ని విడిచి వెళ్లిపోయాడు.
Menahem demanded payment from all the wealthy men of Israel, fifty shekels of silver each, to give to the king of Assyria. So the king of Assyria retreated and did not stay in the country.
21 ౨౧ మెనహేము చేసిన ఇతర పనుల గురించి, అతడు చేసిన దానంతటి గురించి ఇశ్రాయేలు రాజుల చరిత్ర గ్రంథంలో రాసి ఉంది.
The rest of what happened in Menahem's reign and all he did are recorded in the Book of Chronicles of the Kings of Israel.
22 ౨౨ మెనహేము తన పూర్వీకులతోబాటు తానూ చనిపోయిన తరువాత అతని కొడుకు పెకహ్యా అతని స్థానంలో రాజయ్యాడు.
Menahem died, and his son Pekahiah succeeded him as king.
23 ౨౩ యూదారాజు అజర్యా పరిపాలనలో 50 వ సంవత్సరంలో మెనహేము కొడుకు పెకహ్యా షోమ్రోనులో ఇశ్రాయేలు వాళ్ళను ఏలడం ఆరంభించి రెండు సంవత్సరాలు ఏలాడు.
Pekahiah, son of Menahem, became king of Israel in Samaria in the fiftieth year of the reign of King Azariah of Judah, and he reigned for two years.
24 ౨౪ ఇతడు కూడా తన కాలమంతా ఇశ్రాయేలు వారు పాపం చెయ్యడానికి కారకుడైన నెబాతు కొడుకు యరొబాము చేసిన పాపాలను విడిచి పెట్టకుండా వాటినే అనుసరిస్తూ యెహోవా దృష్టిలో చెడుతనం జరిగించాడు.
He did what was evil in the Lord's sight. He did not end the sins that Jeroboam, son of Nebat, had made Israel commit.
25 ౨౫ ఇతని కింద ఉన్న అధిపతీ రెమల్యా కొడుకూ అయిన పెకహు కుట్ర చేసి, తన దగ్గరున్న 50 మంది గిలాదు వారితోనూ, అర్గోబుతోనూ, అరీహేనుతోనూ చేతులు కలిపి షోమ్రోనులో ఉన్న రాజ నగరులోని అంతఃపురంలో పెకహ్యాను చంపి, అతని స్థానంలో రాజయ్యాడు.
Pekah, son of Remaliah, one of his officers plotted against him together with Argob, Arieh, and fifty men from Gilead. Pekah attacked and killed Pekahiah in the fortress of the king's palace in Samaria, and took over as king.
26 ౨౬ పెకహ్యా చేసిన ఇతర పనుల గురించి, అతడు చేసిన దానంతటి గురించి ఇశ్రాయేలు రాజుల చరిత్ర గ్రంథంలో రాసి ఉంది.
The rest of what happened in Pekahiah's reign and all he did are recorded in the Book of Chronicles of the Kings of Israel.
27 ౨౭ యూదా రాజు అజర్యా పరిపాలనలో 52 వ సంవత్సరంలో రెమల్యా కొడుకు పెకహు షోమ్రోనులో ఇశ్రాయేలును ఏలడం ఆరంభించి 20 సంవత్సరాలు ఏలాడు.
Pekah, son of Remaliah, became king of Israel in the fifty-second year of the reign of King Azariah of Judah. He reigned in Samaria for twenty years.
28 ౨౮ ఇతడు కూడా తన కాలమంతా ఇశ్రాయేలు వారు పాపం చెయ్యడానికి కారకుడైన నెబాతు కొడుకు యరొబాము చేసిన పాపాలను విడిచి పెట్టకుండా వాటినే అనుసరిస్తూ యెహోవా దృష్టిలో చెడుతనం జరిగించాడు.
He did what was evil in the Lord's sight. He did not end the sins that Jeroboam, son of Nebat, had made Israel commit.
29 ౨౯ ఇశ్రాయేలు రాజు పెకహు రోజుల్లో అష్షూరు రాజు తిగ్లతు పిలేసెరు వచ్చి ఈయోను పట్టణాన్ని, ఆబేల్బేత్మయకా పట్టణాన్ని, యానోయహు పట్టణాన్ని, కెదెషు పట్టణాన్ని, హాసోరు పట్టణాన్ని, గిలాదు ప్రాంతాన్ని, గలిలయ ప్రాంతాన్ని, నఫ్తాలీ ప్రాంతమంతా చెరపట్టుకుని అక్కడ ఉన్నవాళ్ళను అష్షూరు దేశానికి బందీలుగా తీసుకు పోయాడు.
During the reign of Pekah, king of Israel, Tiglath-pileser, king of Assyria, invaded and captured Ijon, Abel-beth-maacah, Janoah, Kedesh, Hazor, Gilead, Galilee, and all the land of Naphtali, and he took the people to Assyria as prisoners.
30 ౩౦ అప్పుడు ఇశ్రాయేలు రాజు, రెమల్యా కొడుకు అయిన పెకహు మీద ఏలా కొడుకు హోషేయ కుట్ర చేసి, అతనిపై దాడి చేసి చంపి అతని స్థానంలో తాను రాజయ్యాడు. ఇది యూదా రాజు ఉజ్జియా కొడుకు యోతాము పరిపాలనలో 20 వ సంవత్సరంలో జరిగింది.
Then Hoshea, son of Elah, plotted against Pekah, son of Remaliah. In the twentieth year of the reign of Jotham, son of Uzziah, Hoshea attacked Pekah, killed him, and took over as king.
31 ౩౧ పెకహు చేసిన ఇతర పనుల గురించి, అతడు చేసిన దానంతటి గురించి ఇశ్రాయేలు రాజుల చరిత్ర గ్రంథంలో రాసి ఉంది.
The rest of what happened in Pekah's reign and all he did are recorded in the Book of Chronicles of the Kings of Israel.
32 ౩౨ ఇశ్రాయేలు రాజు, రెమల్యా కొడుకు అయిన పెకహు పరిపాలనలో రెండో సంవత్సరంలో యూదా రాజు ఉజ్జియా కొడుకు యోతాము పరిపాలన ఆరంభించాడు.
Jotham, son of Uzziah, became king of Judah in the second year of the reign of Pekah son of Remaliah, king of Israel.
33 ౩౩ అతడు 25 సంవత్సరాల వయస్సులో యెరూషలేములో రాజై 16 సంవత్సరాలు ఏలాడు. అతని తల్లి సాదోకు కూతురు యెరూషా.
He was twenty-five when he became king, and he reigned in Jerusalem for sixteen years. His mother's name was Jerusha, daughter of Zadok.
34 ౩౪ ఇతడు యెహోవా దృష్టిలో నీతిగా ప్రవర్తించి తన తండ్రి ఉజ్జియా ఆదర్శాన్ని పూర్తిగా అనుసరించాడు.
He did what was right in the Lord's sight, just as his father Uzziah had done.
35 ౩౫ అయినా ఉన్నత స్థలాలను కూల్చివేయలేదు. ప్రజలు ఉన్నత స్థలాల్లో ఇంకా బలులు అర్పిస్తూ ధూపం వేస్తూనే ఉన్నారు. ఇతడు యెహోవా మందిరానికి ఉన్న ఎత్తయిన ద్వారాన్ని కట్టించాడు.
But the high places were not removed. The people still were sacrificing and presenting burnt offerings in those places. He rebuilt the upper gate of the Lord's Temple.
36 ౩౬ యోతాము చేసిన ఇతర పనుల గురించి, అతడు చేసిన దానంతటి గురించి యూదా రాజుల చరిత్ర గ్రంథంలో రాసి ఉంది.
The rest of the events of Jotham's reign are recorded in the Book of Chronicles of the Kings of Judah.
37 ౩౭ ఆ కాలంలో యెహోవా సిరియా రాజు రెజీనునూ, రెమల్యా కొడుకు పెకహునూ యూదా దేశం మీదికి పంపించడం ఆరంభించాడు.
During that time the Lord started sending Rezin, king of Aram, and Pekah, son of Remaliah, to attack Judah.
38 ౩౮ యోతాము తన పూర్వీకులతోబాటు చనిపోగా, అతని పూర్వీకుడు దావీదు పట్టణంలో అతని పితరుల సమాధిలో పాతిపెట్టారు. అతని కొడుకు ఆహాజు అతని స్థానంలో రాజయ్యాడు.
Jotham died and was buried with his forefathers in the City of David, his ancestor. His son Ahaz succeeded him as king.