< రాజులు~ రెండవ~ గ్రంథము 13 >
1 ౧ యూదా రాజు అహజ్యా కుమారుడు యోవాషు పరిపాలనలో 23 వ సంవత్సరంలో యెహూ కుమారుడు యెహోయాహాజు షోమ్రోనులో ఇశ్రాయేలుపై తన పరిపాలన మొదలు పెట్టాడు. అతడు 15 సంవత్సరాలు ఏలాడు.
E higa mar piero ariyo gadek mar loch Joash wuod Ahazia ruodh Juda, Jehoahaz wuod Jehu nobedo ruodh Israel ka en Samaria kendo nobedo e ruoth kuom higni apar gabiriyo.
2 ౨ ఇతడు ఇశ్రాయేలు వారు పాపం చేయడానికి కారకుడైన నెబాతు కుమారుడు యరొబాము పాపాలను వదలకుండా అనుసరిస్తూ యెహోవా దృష్టిలో దుర్మార్గంగా ప్రవర్తించాడు.
Notimo gik mamono e nyim wangʼ Jehova Nyasaye, kane oluwo timbe maricho mag Jeroboam wuod Nebat, mane omiyo jo-Israel odonje kendo ne ok olokore weyo gigo.
3 ౩ కాబట్టి యెహోవా కోపం ఇశ్రాయేలు వారిపై రగులుకుంది. ఆయన సిరియా రాజు హజాయేలు కాలంలోనూ హజాయేలు కుమారుడు బెన్హదదు కాలంలోనూ ఇశ్రాయేలు వారిని వారి వశం చేశాడు.
Kuom mano Jehova Nyasaye nokecho gi jo-Israel kendo kuom ndalo mangʼeny noweyogi e bwo loch Hazael ruodh Aram kod Ben-Hadad wuode.
4 ౪ అయితే యెహోయాహాజు యెహోవాను వేడుకున్నప్పుడు యెహోవా సిరియా రాజు మూలంగా బాధలు పడుతున్న ఇశ్రాయేలు వారిని కనికరించి అతని మనవి అంగీకరించాడు.
Eka Jehoahaz nokwayo Jehova Nyasaye kendo Jehova Nyasaye nowinje, nimar noneno kaka ruodh Aram ne sando jo-Israel malit.
5 ౫ ఎలాగంటే యెహోవా ఇశ్రాయేలు వారికి ఒక రక్షకుణ్ణి ఇచ్చాడు. అతని మూలంగా ఇశ్రాయేలు వారు సిరియా వారి వశంలోనుండి తప్పించుకుని మునుపటి లాగానే తమ సొంత పల్లెల్లో కాపురం ఉన్నారు.
Jehova Nyasaye nochiwo ne jo-Israel jares, mi gitony gia e loch jo-Aram. Eka jo-Israel nochako odok modak e miechgi mana kaka ne gisebetie mokwongo.
6 ౬ అయినా ఇశ్రాయేలు వారు పాపం చేయడానికి కారణభూతుడైన యరొబాము కుటుంబికులు చేసిన పాపాలనే వారు కూడా వదలకుండా అనుసరించారు. ఆ దేవతాస్తంభాలు షోమ్రోనులో అలానే నిలిచి ఉన్నాయి.
To kata kamano ne ok gilokore giweyo richo mane ni e od Jeroboam, mane omiyo jo-Israel otimo, to negidhi nyime mana gi timbegi. Kendo siro mar nyasaye madhako miluongo ni Ashera nosiko kochungʼ Samaria.
7 ౭ అశ్వికులు 50 మంది, రథాలు పది, కాల్బలం పదివేలమంది మాత్రమే యెహోయాహాజు దగ్గర మిగిలారు. మిగిలిన వారిని సిరియా రాజు తూర్పారబట్టిన పొట్టు లాగా నాశనం చేశాడు.
Jolweny mag Jehoahaz notieki makmana joidh farese piero abich, geche mag lweny apar kod jolweny mawuotho gi tiendgi alufu apar ema ne odongʼ, nikech ruodh Aram nosetieko mamoko duto kendo nomiyo gichalo mihudhwe.
8 ౮ యెహోయాహాజు గురించిన మిగతా విషయాలు, అతడు చేసిన మిగతా పనులు, అతడు చూపిన పరాక్రమం ఇశ్రాయేలు రాజుల వృత్తాంత గ్రంథంలో రాసి ఉంది కదా.
To kuom gik mamoko duto mane ondiki e ndalo loch Jehoahaz gi gik moko duto mane otimo, donge ondikgi e kitepe mag weche ruodhi mag Israel?
9 ౯ యెహోయాహాజు తన పూర్వికులతో కన్ను మూశాడు. అతణ్ణి షోమ్రోనులో పాతిపెట్టారు. అతని కుమారుడు యెహోయాషు అతని స్థానంలో రాజయ్యాడు.
Jehoahaz nonindo moyweyo gi kwerene mi noyike Samaria kendo wuode ma Jehoash nobedo ruoth kare.
10 ౧౦ యూదారాజు యోవాషు పరిపాలనలో 37 వ సంవత్సరాన యెహోయాహాజు కుమారుడు యెహోయాషు షోమ్రోనులో ఇశ్రాయేలుపై పరిపాలన మొదలు పెట్టి 16 సంవత్సరాలు ఏలాడు.
E higa mar piero adek gabiriyo mar loch Joash ruodh Juda, Jehoash wuod Jehoahaz nobedo ruodh Israel ka en piny Samaria kendo nobedo ruoth kuom higni apar gauchiel.
11 ౧౧ ఇతడు కూడా ఇశ్రాయేలు వారు పాపం చేయడానికి కారణభూతుడైన నెబాతు కుమారుడు యరొబాము చేసిన పాపాలను వదలకుండా వాటినే అనుసరిస్తూ యెహోవా దృష్టికి దుర్మార్గంగా ప్రవర్తించాడు.
Notimo timbe mamono e wangʼ Jehova Nyasaye kendo ne ok oweyo timbe mag richo mar Jeroboam wuod Nebat, mane omiyo jo-Israel otimo; nodhi nyime kotimogi.
12 ౧౨ యెహోయాషు చేసిన మిగతా పనులు, అతని చర్యలన్నిటి గురించీ యూదా రాజు అమజ్యాతో యుద్ధమాడినప్పుడు అతడు కనుపరచిన పరాక్రమం గూర్చి ఇశ్రాయేలు రాజుల వృత్తాంత గ్రంథంలో రాసి ఉంది కదా.
To kuom weche duto mane ondiki e ndalo loch Jehoash; gi gik moko duto mane otimo, kod teko mane okedogo gi Amazia ruodh Juda, donge ondikgi e kitepe mag weche ruodhi mag Israel?
13 ౧౩ యెహోయాషు తన పూర్వికులతో కన్నుమూసిన తరవాత అతని సింహాసనంపై యరొబాము ఆసీనుడయ్యాడు. యెహోయాషును షోమ్రోనులో ఇశ్రాయేలు రాజుల సమాధిలో పాతిపెట్టారు.
Jehoash nonindo moyweyo gi kwerene kendo Jeroboam nobedo ruoth kare. Jehoash noiki e piny Samaria gi ruodhi mag Israel.
14 ౧౪ ఎలీషా మరణాంతక వ్యాధి బారిన పడ్డాడు. ఇశ్రాయేలు రాజు యెహోయాషు అతని దగ్గరికి వచ్చి అతణ్ణి చూసి కన్నీరు కారుస్తూ “నా తండ్రీ, నా తండ్రీ, ఇశ్రాయేలు ప్రజలకు రథం, అశ్వికదళం నువ్వే కదా” అని విలపించాడు.
Kane Elisha tuo gi tuo mane biro nege, Jehoash ruodh Israel nodhi nene moywage niya, “Wuora! Wuora isebedonwa kaka geche lweny kod joidh farese mag Israel!”
15 ౧౫ అప్పుడు ఎలీషా “విల్లంబులు తీసుకురా” అని అతనితో చెప్పాడు. అతడు అలానే చేశాడు.
Eka Elisha nowachone niya, “Kaw atungʼ kod aserni moko,” kendo notimo kamano.
16 ౧౬ “నీ చెయ్యి విల్లుపై వెయ్యి” అని అతడు ఇశ్రాయేలు రాజుతో చెప్పాడు. అతడు తన చెయ్యి విల్లుపై ఉంచాడు. ఎలీషా రాజు చేతుల మీద తన చేతులు పెట్టి
Eka nowachone ruodh Israel niya, “Kaw atungʼ e lweti.” Kane osekawo atungʼno, Elisha noketo lwetene kuom lwete ruoth.
17 ౧౭ “తూర్పు వైపు కిటికీ తెరువు” అన్నాడు. రాజు అలానే చేశాడు. అప్పుడు ఎలీషా “బాణం వెయ్యి” అని చెప్పగా అతడు బాణం వేశాడు. అతడు “ఇది యెహోవా రక్షణ బాణం. సిరియనుల చేతిలో నుండి మిమ్మల్ని రక్షించే బాణం. సిరియనులు నాశనమయ్యేలా నీవు ఆఫెకులో వారిని హతమారుస్తావు” అని చెప్పాడు.
Elisha nokone niya, “Yaw dirisa mochomo yo wuok chiengʼ,” minoyawe. Bangʼ mano nokone niya, “Dir asere.” Kane osediro asere, Elisha nokone niya, “Mano asech loch Jehova Nyasaye kendo onyiso adier ni ibiro loyo jo-Aram modak Afek.”
18 ౧౮ ఈసారి ఎలీషా “బాణాలు పట్టుకో” అని చెప్పగా అతడు పట్టుకున్నాడు. అప్పుడు ఎలీషా ఇశ్రాయేలు రాజుతో “నేలను కొట్టు” అన్నాడు. అతడు మూడు సార్లు కొట్టి ఊరుకున్నాడు.
Eka nowachone niya, “Kaw aserni kendo ruoth nokawo asernigo.” Elisha nokone niya, “Chwo asernigo piny, mine otimo kamano nyadidek bangʼe oweyo.”
19 ౧౯ అది చూసి దైవసేవకుడు అతనిపై మండిపడి “నీవు ఐదారు సార్లు కొట్టి ఉంటే సిరియనులు నాశనమయ్యే దాకా నీవు వారిని నిర్మూలం చేసి ఉండే వాడివి. అయితే ఇప్పుడు మూడు సార్లు మాత్రమే సిరియనులను ఓడిస్తావు” అని చెప్పాడు.
Elisha ngʼat Nyasaye nokecho kode mowacho niya, “Nonego ichwogi piny nyadibich kata nyadiuchiel; eka dine iloyo jo-Aram mitiekogi chuth, to sani to ibiro loyogi mana nyadidek kende.”
20 ౨౦ తరువాత ఎలీషా చనిపోయాడు. వారు అతణ్ణి సమాధిలో పెట్టారు. ఒక సంవత్సరం తరవాత మోయాబీ దోపిడీ దారుల గుంపులు దేశంపై దండెత్తారు.
Elisha notho moike. E ndalogo jolwenj Moab nohero monjo pinyno e ndalo mag chwiri.
21 ౨౧ కొందరు ఒక శవాన్ని పాతిపెడుతూ శత్రు సైన్యానికి భయపడి ఆ శవాన్ని ఎలీషా సమాధిలో పెట్టారు. సమాధిలో దింపిన ఆ మృతదేహం ఎలీషా ఎముకలు తగలగానే తిరిగి బతికి అతడు తన కాళ్ళపై నిలబడ్డాడు.
Chiengʼ moro kane jo-Israel yiko ngʼato, negipo ka gineno wasigu kabiro, mi negibolo ringre ngʼatno e bur mane oike Elisha. Kane ringre ngʼatno olwar e choke Elisha, nopo ka chunye odwogo mochungʼ gi tiendene.
22 ౨౨ యెహోయాహాజు కాలమంతా సిరియారాజు హజాయేలు ఇశ్రాయేలు వారిని బాధించాడు.
Hazael ruodh Aram ne osando jo-Israel ndalo duto mag loch Jehoahaz.
23 ౨౩ అయితే యెహోవా వారిపై జాలిపడి దయ చూపి అబ్రాహాము ఇస్సాకు యాకోబులతో తాను చేసిన నిబంధనను బట్టి వారిపై శ్రద్ధ చూపి, వారిని నాశనం చేయడానికి ఇష్టపడలేదు. ఇప్పటికీ తన సముఖం లోనుండి వారిని వెళ్లగొట్టలేదు.
To Jehova Nyasaye notimonegi ngʼwono, kech kod miwafu koparo singruok mane otimo gi Ibrahim, Isaka kod Jakobo. To nyaka chil kawuono Jehova Nyasaye pok obedo gi paro mar tiekogi kata riembogi e wangʼe.
24 ౨౪ సిరియారాజు హజాయేలు చనిపోగా అతని కుమారుడు బెన్హదదు అతనికి స్థానంలో రాజయ్యాడు.
Hazael ruodh Aram notho kendo Ben-Hadad wuode nobedo ruoth kare.
25 ౨౫ యెహోయాహాజు కొడుకు యెహోయాషు హజాయేలు కొడుకు బెన్హదదు తన తండ్రి యెహోయాహాజు చేతిలో నుండి యుద్ధంలో స్వాధీనం చేసుకున్న పట్టణాలను తిరిగి వశపరచుకున్నాడు. యెహోయాషు అతణ్ణి మూడు సార్లు జయించి ఇశ్రాయేలు నగరాలను తిరిగి వశపరచుకున్నాడు.
Eka Jehoash wuod Jehoahaz noduogo mier mane oyudo Ben-Hadad wuod Hazael nosemayo Jehoahaz wuon mare e lweny. Jehoash noloyo Ben-Hadad nyadidek e lweny mine odwoko miergo duto e lwet jo-Israel.