< రాజులు~ రెండవ~ గ్రంథము 11 >
1 ౧ అహజ్యా తల్లి అతల్యాకి తన కొడుకు చనిపోయాడని తెలిసింది. అప్పుడు ఆమె రాకుమారులనందరినీ హతమార్చింది.
Atalja pedig, Achazjáhú anyja, látta, hogy meghalt a fia, akkor fölkelt és kipusztította a királyi ház minden magzatját.
2 ౨ యెహోరాము రాజు కూతురూ అహజ్యాకి సోదరి అయిన యెహోషెబ అహజ్యా కొడుకుల్లో ఒకడైన యోవాషును హతమైన రాకుమారులతో కూడా చావకుండా వేరు చేసి అతని ఆయాతో సహా అతణ్ణి దాచిపెట్టింది. ఆమె వారిని పడక గదిలో అతల్యా కంటపడకుండా ఉంచింది.
De Jehósébá, Jórám király leánya, Achazjáhú nővére, vette Jóást, Achazja fiát, és ellopta a megölésre szánt királyfiak közül, őt meg a dajkáját, be az ágyak termébe; és elrejtették őt Ataljáhú elől és nem öletett meg.
3 ౩ దేశాన్ని అతల్యా పరిపాలిస్తూ ఉన్నప్పుడు ఆరు సంవత్సరాలు యెహోవా మందిరంలో రహస్యంగా అతణ్ణి దాచి ఉంచారు.
És volt vele elrejtőzve az Örökkévaló házában hat évig, míg Atalja uralkodott az ország fölött.
4 ౪ ఏడో సంవత్సరంలో యాజకుడైన యెహోయాదా కాపలాదారుల పైనా, కెరీతీయులు అని పిలిచే సంరక్షకుల పైనా ఉండే అనేకమంది శతాధిపతులను పిలిపించాడు. వారు వచ్చినప్పుడు వాళ్ళను యెహోవా మందిరం లోకి తీసుకువెళ్ళాడు. అతడు వాళ్ళతో ఒప్పందం చేసుకుని యెహోవా మందిరంలో వాళ్ళతో ఒక ప్రమాణం చేయించాడు. ఆ తరువాత వాళ్ళకు యువ రాజును చూపించాడు.
A hetedik évben pedig küldtött Jehójádá, hozatta a testőrök és futárok századainak tisztjeit és bevezette őket magához, az Örökkévaló házába, szövetséget kötött velük, megeskette őket az Örökkévaló házában, és megmutatta nekik a király fiát.
5 ౫ వాళ్ళతో ఇలా అన్నాడు. “మీరు చేయాల్సిందేమిటంటే మీలో విశ్రాంతి దినం పరిచర్య కోసం వచ్చే వారు మూడు బృందాలై ఒక బృందం రాజు ఇంటికి కాపలాగా ఉండాలి.
Erre megparancsolta nekik, mondván: Ez az, a mit tegyetek: a harmadrész közületek, a kik szombaton bevonulnak, őrizői legyenek a király háza őrizetének.
6 ౬ మరో బృందం సూర్ గుమ్మం దగ్గరా మరో బృందం మందిరం వెనుక ఉన్న ద్వారం దగ్గరా ఉండాలి. ఇలా మీరు మందిరాన్ని భద్రపరచాలి.
Egy harmadrész pedig a Szúr kapuján s egy harmadrész a futárok mögötti kapuban; így őrizzétek meg a ház őrizetét fölbontott sorrenddel.
7 ౭ ఇక విశ్రాంతి దినం పరిచర్య లేని వారు రెండు బృందాలుగా రాజు ఉన్న యెహోవా మందిరానికి కాపలా కాయాలి.
A két rész tehát közületek, azok, kik szombaton kivonulnak, őrizzék az Örökkévaló házának őrizetét a király mellett.
8 ౮ మీలో ప్రతి ఒక్కరూ చేతిలో ఆయుధాలు పట్టి రాజు చుట్టూ కంచెలా ఉండాలి. ఎవడైనా మీ పంక్తుల్లోకి చొచ్చుకుని వస్తే, వాణ్ణి చంపేయండి. రాజు ఇంటా బయటా సంచరిస్తున్నప్పుడు మీరు అతని దగ్గర ఉండాలి.”
Vegyétek körül a királyt, kiki fegyverével a kezében, s aki behatol a sorokba, ölessék meg; így legyetek a királynál, mikor kimegy s mikor bemegy.
9 ౯ యాజకుడైన యెహోయాదా శతాధిపతులకు ఇచ్చిన ఆదేశాలను వారు తుచ తప్పక పాటించారు. ప్రతి ఒక్కరూ తన మనుషులను తీసుకుని యాజకుడైన యెహోయాదా దగ్గరికి వచ్చారు. పరిచర్య చేసేవాళ్ళూ, విశ్రాంతి దినం పరిచర్యను ఆపి వేసిన వాళ్ళూ వారిలో ఉన్నారు.
És cselekedtek a századok tisztjei, egészen a mint parancsolta Jéhójádá pap; vették kiki a maga embereit, a szombaton bevonulókat a szombaton kivonulókkal együtt és bementek Jehójádá paphoz.
10 ౧౦ యాజకుడైన యెహోయాదా యెహోవా మందిరంలో ఉన్న దావీదు ఈటెలనూ, డాళ్లనీ శతాధిపతులకు అందించాడు.
Ekkor adta a pap a századok tisztjeinek a lándzsákat és a pajzsokat, a Dávid királytól valókat, melyek az Örökkévaló házában voltak.
11 ౧౧ కాబట్టి కాపలా కాసే వారు తమ చేతుల్లో ఆయుధాలతో నిలిచారు. వారు రాజు చుట్టూ మందిరం కుడి వైపునుండి ఎడమ వైపు వరకూ మందిరానికీ బలిపీఠం వేదికకీ సమీపంలో నిలబడ్డారు.
És felálltak a futárok, kiki fegyvereivel a kezében, a háznak jobb oldalától a háznak baloldaláig, az oltár mellé és a ház mellé, körülfogva a királyt.
12 ౧౨ అప్పుడు యెహోయాదా యువ రాజు యోవాషుని బయటకు తీసుకు వచ్చాడు. అతని తలపై కిరీటం పెట్టారు. అతని చేతుల్లో ధర్మశాస్త్ర ప్రతిని ఉంచారు. తరువాత వారు అతనికి పట్టాభిషేకం చేసారు. అంతా చప్పట్లు కొట్టి “రాజు చిరకాలం జీవించాలి” అంటూ నినాదాలు చేశారు.
Erre kivezette a király fiát, reáadta a koronát és a díszt, királlyá tették őt, és fölkenték, tenyerükkel tapsoltak és mondták: Éljen a király!
13 ౧౩ కాపలా కాసే వాళ్ళూ, ఇంకా ప్రజలందరూ చేస్తున్న శబ్దాలు అతల్యాకు వినిపించాయి. అప్పుడు ఆమె యెహోవా మందిరం దగ్గర ఉన్న ప్రజల దగ్గరికి వచ్చింది.
Midőn Atalja hallotta a futárok meg a nép hangját, bement a néphez az Örökkévaló házába.
14 ౧౪ రాజు సంప్రదాయ పద్ధతిలో స్తంభం పక్కన నిలబడి ఉండటమూ, అధికారులూ, బూరలు ఊదేవాళ్ళూ రాజు దగ్గర నిలబడి ఉండటమూ చూసింది. దేశ ప్రజలందరూ బూరలు ఊదుతూ సంబరాల్లో మునిగి ఉండటం చూసింది. అప్పుడామె తన బట్టలు చించుకుని “రాజ ద్రోహం! రాజ ద్రోహం!” అంటూ కేకలు పెట్టింది.
És látta, íme a király ott áll az oszlop mellett, a szokás szerint, a vezérek pedig és a trombitások a király mellett és mind az ország népe örvend és fújják a trombitákat; ekkor megszaggatta Atalja a ruháit és felkiáltotta: Összeesküvés, összeesküvés!
15 ౧౫ అప్పుడు యాజకుడైన యెహోయాదా సైన్యంలోని శతాధిపతులకు ఇలా ఆజ్ఞ ఇచ్చాడు. “ఆమెను సైనికుల వరుసల్లోనుండి బయటకు తీసుకు రండి. ఆమె సహాయకులెవరైనా ఆమెతో వస్తే వాళ్ళను కత్తితో చంపండి.” అతడు అంతకుముందు “యెహోవా మందిరంలో ఆమెను చంపవద్దు” అని వాళ్ళను ఆదేశించాడు.
És megparancsolta Jehójádá pap a századok tisztjeinek, a sereg fölé rendelteknek és szólt hozzájuk: Vezessétek őt ki a sorok között, s aki utána megy, öljétek meg karddal! Mert ezt mondta a pap: ne ölessék meg az Örökkévaló házában.
16 ౧౬ కాబట్టి వారు ఆమెకు దారి ఇచ్చారు. రాజ గృహంలోకి గుర్రాలు వచ్చే దారిగుండా ఆమెను పోనిచ్చారు. ఆమె బయటకు రాగానే ఆమెను పట్టుకుని చంపేశారు.
És engedtek neki helyet, hogy bemehetett a lovak bejáratán át a királyi házba, és megöletett ott.
17 ౧౭ అప్పుడు యెహోయాదా “ప్రజలు యెహోవాకి చెందిన వారు” అంటూ దేవుని పేర రాజుతో, ప్రజలతో నిబంధన చేయించాడు. అలాగే రాజుకీ ప్రజలకీ మధ్య ఒక నిబంధన చేయించాడు.
Ekkor megkötötte Jehójádá a szövetséget az Örökkévaló meg a király és a nép között, hogy népévé legyen az Örökkévalónak, valamint a király és a nép között.
18 ౧౮ కాబట్టి దేశంలోని ప్రజలంతా బయలు దేవుడి గుడికి వెళ్ళారు. దాన్ని ధ్వంసం చేసారు. బయలు గుడిలో బలిపీఠం వేదికలనూ, విగ్రహాలనూ నేలమట్టం చేశారు. బయలు దేవుడికి పూజారి అయిన మత్తాను అనేవాణ్ణి బలిపీఠం ఎదుట చంపి వేశారు. అప్పుడు యాజకుడైన యెహోయాదా యెహోవా మందిరాన్ని కాపలా కాయడానికి మనుషులను నియమించాడు.
Erre bement mind az ország népe a Báal házába és lerombolták oltárait és szobrait teljesen összetörték, Mattánt pedig, a Báal papját, agyonütötték az oltárok előtt; és rendelt a pap tisztségeket az Örökkévaló háza fölé.
19 ౧౯ యెహోయాదా శతాధిపతులనూ, కేరేతీయులనూ, కావలి వారిని ఇంకా ప్రజలందర్నీ పిలిపించాడు. వారు యెహోవా మందిరంలో ఉన్న రాజుకు కావలిగా ఉన్న వారి ద్వారం గుండా రాజగృహానికి తీసుకు వచ్చారు. అప్పుడు రాజు సింహాసనంపై కూర్చున్నాడు.
Vették a századok tisztjeit, a testőröket és a futárokat, meg mind az ország népét, levezették a királyt az Örökkévaló házából és bementek a futárok kapuján át a király házába és a királyok trónjára ült.
20 ౨౦ కావలి వారు అతల్యాను రాజగృహం దగ్గర కత్తితో చంపారు. చంపిన తరువాత పట్టణం అంతా ప్రశాంతంగా ఉంది. దేశంలో ప్రజలంతా సంతోషించారు.
És örült mind az ország népe, a város pedig csöndes volt. Ataljáhút pedig megölték karddal a király házában.
21 ౨౧ యోవాషు పరిపాలన ప్రారంభమైనప్పుడు అతని వయస్సు ఏడేళ్లు.
Hét éves volt Jehóás, mikor király lett.