< రాజులు~ రెండవ~ గ్రంథము 10 >
1 ౧ అహాబుకి షోమ్రోనులో డెబ్భై మంది సంతానం ఉన్నారు. యెహూ షోమ్రోనులో ఉన్న యెజ్రెయేలు అధిపతులకూ, అక్కడి పెద్దలకూ, అహాబు సంతానం సంరక్షకులకూ ఉత్తరాలు రాసి పంపాడు.
U Samariji bijaše sedamdeset Ahabovih sinova. Jehu napisa pismo i posla ga u Samariju zapovjednicima grada, starješinama i skrbnicima Ahabove djece. Kazivaše u njemu:
2 ౨ ఆ ఉత్తరంలో ఇలా రాశాడు “మీ యజమాని వారసులు మీ దగ్గరే ఉన్నారు. మీ దగ్గర రథాలూ, గుర్రాలూ, ఆయుధాలూ ఉన్నాయి. అలాగే మీరు బలమైన ప్రాకారాలున్న పట్టణంలో ఉన్నారు.
“Sada, kad vam stigne ovo pismo - vi, u kojih su sinovi vašeg gospodara, koji imate kola i konje, tvrde gradove i oružje -
3 ౩ కాబట్టి ఈ ఉత్తరం మీకు అందిన వెంటనే మీ యజమాని వారసుల్లో శ్రేష్ఠమైన వాణ్ణీ, యోగ్యుణ్ణీ ఎంపిక చేసి అతణ్ణి తన తండ్రి సింహాసనంపై కూర్చోబెట్టండి. మీ యజమాని రాజ వంశం కోసం యుద్ధం చేయండి.”
pogledajte koji je između sinova vašeg gospodara najbolji i najdostojniji, pa ga postavite na prijestolje njegova oca i borite se za dom svoga gospodara.”
4 ౪ కానీ వారు చాలా భయపడిపోయారు. “ఇద్దరు రాజులు యెహూ ఎదుట నిలవలేక పోయారు. మనమెట్లా నిలవగలం?” అని చెప్పుకున్నారు.
Ali se oni veoma uplašiše i rekoše: “Eto, dva mu kralja nisu mogla odoljeti, kako ćemo mu mi odoljeti?”
5 ౫ అప్పుడు ఆ కుటుంబం బాధ్యతలు చూస్తున్న వ్యక్తీ, పట్టణం బాధ్యతలు చూస్తున్న వ్యక్తీ, పెద్దలూ, ఆ పిల్లలను పెంచిన వాళ్ళూ కలసి యెహూకి “మేము మీ సేవకులం. మీ ఆదేశాల ప్రకారమే అన్నీ చేస్తాం. మేము ఎవర్నీ రాజుగా చేసుకోం. మీకేది మంచిగా తోస్తే అదే చేయండి” అని జవాబు పంపారు.
Upravitelj dvora, zapovjednik grada, starješine i skrbnici poručiše ovo Jehuu: “Mi smo tvoje sluge, činit ćemo sve što nam budeš naredio; kraljem proglašavati nećemo nikoga. Čini što misliš da je dobro.”
6 ౬ అప్పుడు యెహూ రెండోసారి వాళ్లకు ఉత్తరం రాశాడు. దానిలో “మీరు నా వైపు ఉండి నా మాట వింటే మీ యజమాని వారసుల తలలు నరికి వాటితో రేపటికల్లా యెజ్రెయేలులో నా దగ్గరికి రండి” అని రాశాడు. రాకుమారులు మొత్తం డెబ్భై మంది ఆ పట్టణం పెద్దల సంరక్షణలో ఉన్నారు.
Jehu im napisa drugo pismo i u njemu reče: “Ako ste za mene i želite me slušati, uzmite glave ljudi, sinova svoga gospodara, i potražite me sutra u ovo doba u Jizreelu.” Sedamdeset je naime kraljevih sinova bilo kod uglednih građana koji su ih odgajali.
7 ౭ కాబట్టి ఆ ఉత్తరం అందిన తరువాత వారు ఆ డెబ్భైమందినీ పట్టుకుని చంపేశారు. వాళ్ళ తలలను బుట్టల్లో ఉంచి యెజ్రెయేలులో ఉన్న యెహూ దగ్గరికి పంపించారు.
I kad im je stiglo ovo pismo, uzeli su kraljeve sinove i pobili ih svih sedamdeset. Njihove su glave metnuli u košare i poslali su ih njemu u Jizreel.
8 ౮ ఒక వార్తాహరుడు యెహూ దగ్గరికి వచ్చి “వారు రాకుమారుల తలలు తీసుకు వచ్చారు” అని చెప్పాడు. అతడు “వాటిని ఉదయం వరకూ పట్టణ ద్వారం దగ్గర రెండు కుప్పలుగా వేయండి” అన్నాడు.
Glasnik dođe i javi mu: “Donijeli su glave kraljevih sinova.” On reče: “Stavite ih do sutra kod ulaznih vrata, u dvije hrpe.”
9 ౯ ఉదయం అతడు బయటకు వచ్చి అక్కడ నిలబడి ఉన్న మనుషులను చూసి “మీరంతా నిర్దోషులు. నేను నా రాజు పై కుట్ర చేసి అతణ్ణి చంపేశాను. అయితే వీళ్ళనెవరు చంపారు?
Ujutro iziđe, stade i reče svomu narodu: “Vi ste pravedni! Ja sam se urotio protiv svoga gospodara i ja sam ga ubio, ali tko pobi sve ove?
10 ౧౦ తన సేవకుడు ఏలీయా ద్వారా యెహోవా అహాబు కుటుంబాన్ని గురించి పలికిన మాటలను ఆయన నెరవేర్చాడు. యెహోవా అహాబు కుటుంబాన్ని గురించి పలికిన మాటల్లో ఏ ఒక్కటీ వ్యర్థంగా పోదని మీరు తెలుసుకోవాలి.”
Znajte, dakle, da nije izostala nijedna riječ koju reče Jahve o obitelji Ahabovoj; nego je Jahve izvršio sve što je rekao preko sluge svoga Ilije.”
11 ౧౧ ఈ విధంగా యెహూ యెజ్రెయేలులో ఉన్న అహాబు కుటుంబ సభ్యులందర్నీ, అతనితో సంబంధం ఉన్న ప్రముఖమైన వ్యక్తులనూ, అతనికి సన్నిహితమైన స్నేహితులనూ, అతని పూజారులు అందర్నీ చంపివేశాడు. అలాంటి వారు ఇక ఒక్కరు కూడా లేకుండా చేశాడు.
I Jehu pobi sve koji su u Jizreelu ostali iz kuće Ahabove, sve velikaše njegove, pouzdanike i svećenike njegove. Nije poštedio nikoga.
12 ౧౨ ఇది జరిగాక అతడు షోమ్రోను పట్టణానికి ప్రయాణమయ్యాడు. దారిలో అతడు గొర్రెల బొచ్చు కత్తెర వేసే ఇంటికి దగ్గరలో ఉన్నప్పుడు
Potom usta Jehu i pođe u Samariju. Kad je bio na cesti kod Bet Ekeda pastirskoga,
13 ౧౩ యూదా రాజు అహజ్యా అన్నదమ్ములు ఎదురయ్యారు. యెహూ వాళ్ళను “మీరు ఎవరు?” అని అడిగాడు. వారు “మేము అహజ్యా అన్నదమ్ములం. మేము రాజు గారి పిల్లలనూ, రాణి యెజెబెలు పిల్లలనూ పలకరించడానికి వెళ్తున్నాం” అని చెప్పారు.
nađe braću judejskog kralja Ahazje te ih upita: “Tko ste?” Oni mu odgovoriše: “Mi smo braća Ahazjina, a silazimo da pozdravimo sinove kraljeve i sinove kraljičine.”
14 ౧౪ అతడు “వాళ్ళను ప్రాణాలతో పట్టుకోండి” అని తన వాళ్ళను ఆదేశించాడు. దాంతో వారు అందర్నీ సజీవంగా పట్టుకుని నలభై రెండు మందిని గొర్రెల బొచ్చు కత్తెర వేసే ఇంటికి దగ్గరలో ఉన్న ఒక బావి దగ్గర చంపారు. వాళ్ళలో ఒక్కణ్ణి కూడా ప్రాణాలతో వదిలిపెట్టలేదు.
Tada zapovjedi: “Pohvatajte ih žive!” I žive ih pohvataše i pobiše ih na studencu kod Bet Ekeda, njih četrdeset i dvojicu. Nije ostavio ni jednoga od njih.
15 ౧౫ అక్కడనుండి యెహూ ముందుకు వెళ్ళాడు. తనను కలుసుకోడానికి వస్తున్న రేకాబు కొడుకు యెహోనాదాబుని చూశాడు. అతనితో మంచీ చెడూ మాట్లాడి “నా హృదయం నీ విషయంలో నిజాయితీగా ఉన్నట్టు నీ హృదయం నా విషయంలో ఉందా?” అని అడిగాడు. దానికి యెహోనాదాబు “ఉంది” అన్నాడు. యెహూ “ఆలాగైతే నా చేతిలో నీ చెయ్యి వేయి” అన్నాడు. యెహోనాదాబు యెహూ చేతిలో తన చెయ్యి వేశాడు. యెహూ అతణ్ణి తన రథం మీద ఎక్కించుకున్నాడు.
Otišavši odatle, nađe Jonadaba, sina Rekabova, koji mu je dolazio u susret. On ga pozdravi i reče mu: “Je li tvoje srce iskreno prema mome, kao što je moje prema tvome srcu?” Jonadab odgovori: “Jest.” - “Ako je tako, daj mi ruku.” Jonadab mu pruži ruku i Jehu ga posadi kraj sebe na kola.
16 ౧౬ యెహూ అతనితో “యెహోవా కోసం నాకు ఎంత ఉత్సాహం ఉందో చూద్దువుగాని రా” అన్నాడు. తన రథంలో అతణ్ణి కూర్చోబెట్టాడు.
I reče mu: “Hodi sa mnom, divit ćeš se mojoj revnosti za Jahvu.” I odvede ga na svojim kolima.
17 ౧౭ అతడు షోమ్రోను చేరుకుని అక్కడ అహాబుకు చెందిన మిగిలిన రాజవంశీకులందర్నీ చంపివేశాడు. యెహోవా ఏలీయాకు చెప్పిన మాట నెరవేర్చాడు.
Ušao je u Samariju i poubijao sve preživjele iz obitelji Ahabove u Samariji. Sve ih je iskorijenio po riječi koju Jahve bijaše rekao Iliji.
18 ౧౮ ఆ తరువాత యెహూ ప్రజలందర్నీ సమకూర్చాడు. వారితో “అహాబు బయలు దేవుతకి స్వల్పంగానే సేవ చేసాడు. కాని యెహూ ఎంతో గొప్ప సేవ చేయబోతున్నాడు.
Jehu je sakupio sav narod i rekao mu: “Ahab je malo poštivao Baala; Jehu će ga više poštivati.
19 ౧౯ కాబట్టి బయలు దేవుడి ప్రవక్తలందర్నీ, ఆరాధకులందర్నీ, పూజారులందర్నీ నా దగ్గరికి పిలుచుకు రండి. బయలు దేవుడికి ఒక మహా బలి చేయబోతున్నాను. కాబట్టి ఎవరూ రాకుండా ఉండిపోకూడదు. అలా రాని వాణ్ణి నేను బతకనివ్వను” అన్నాడు. బయలు ఆరాధకులందర్నీ చంపాలనే ఉద్దేశ్యంతో యెహూ ఈ మోసపూరితమైన ప్రకటన చేశాడు.
Sada mi pozovite sve proroke Baalove, sve njegove sluge i sve njegove svećenike, neka ni jedan ne izostane, jer ću žrtvovati veliku žrtvu Baalu. Tko izostane, izgubit će život.” Jehu je radio lukavo, da bi uništio Baalove vjernike.
20 ౨౦ ఇంకా యెహూ “బయలు దేవుడికి ఒక ప్రత్యేకమైన పండగ జరుగబోతున్నదని ప్రకటించండి” అన్నాడు. అతని సేవకులు ఆ విధంగానే ప్రకటించారు.
Jehu reče: “Sazovite svečani zbor Baalu.” I sazvaše ga.
21 ౨౧ యెహూ ఇశ్రాయేలు దేశం అన్ని ప్రాంతాల్లో ఈ ప్రకటన చేయించాడు. బయలు ఆరాధకులందరూ తరలి వచ్చారు. అక్కడకు రానివాడు అంటూ ఎవడూ లేడు. వాళ్ళంతా బయలు గుడిలో ప్రవేశించారు. ఆ పక్క నుండి ఈ పక్క వరకూ ఎక్కడా ఖాళీ లేకుండా గుడి కిక్కిరిసి పోయింది.
Jehu je nato poslao glasnike po svem Izraelu i došli su svi Baalovi vjernici: nije bilo ni jednoga da bi izostao. Skupili su se u Baalov hram, koji se ispunio od jednoga zida do drugoga.
22 ౨౨ అక్కడ పూజారుల దుస్తులను దాచే అధికారిని యెహూ పిలిపించి “బయలు ఆరాధకులందరికీ ప్రత్యేక దుస్తులు తీసుకు రా” అని చెప్పాడు. అతడు ఆ దుస్తులను బయటకు తీసి తెప్పించాడు.
Jehu reče čuvaru haljina: “Iznesi haljine svim Baalovim vjernicima.” I iznese im haljine.
23 ౨౩ తరువాత యెహూ, రేకాబు కొడుకు యెహోనాదాబూ బయలు దేవుడి గుడిలో ప్రవేశించారు. అప్పుడు యెహూ “బాగా వెదకండి. బయలు దేవుడి ఆరాధకులు తప్ప ఇక్కడ యెహోవా సేవకులు ఎవరూ ఉండకుండాా జాగ్రత పడండి” అంటూ బయలు దేవుడి ఆరాధకులను ఆదేశించాడు.
Jehu uđe u hram Baalov s Jonadabom, sinom Rekabovim, i reče Baalovim vjernicima: “Provjerite dobro da nema ovdje među vama Jahvina sluge nego samih Baalovih vjernika.”
24 ౨౪ అప్పుడు వాళ్ళంతా అర్పణలూ, దహనబలులూ చెల్లించడానికి లోపలి వెళ్ళారు. యెహూ తన మనుషుల్లో ఎనభై మందిని ఎంపిక చేసి వాళ్ళను బయట నిలబెట్టాడు. వాళ్ళతో “నేను మీ చేతికప్పగించిన వాళ్ళను ఎవర్నీ తప్పించుకు పోనివ్వద్దు. అలా ఎవడైనా తప్పించుకుంటే వాడి ప్రాణానికి బదులుగా వాడు తప్పించుకోడానికి కారణమైన వాడి ప్రాణం తీసుకుంటాను” అని చెప్పాడు.
I pođe žrtvovati klanice i paljenice. Ali je Jehu postavio vani osamdeset svojih ljudi i rekao im: “Ako koji od vas pusti da utekne i jedan od ovih ljudi što ih predajem u vaše ruke, svojim će životom platiti njegov život.”
25 ౨౫ దహనబలులు అర్పించడం ముగిసిన తరువాత యెహూ అక్కడి కాపలా వాళ్ళతోనూ, అధికారులతోనూ “లోపలికి వెళ్లి అందర్నీ చంపేయండి. ఏ ఒక్కడూ బయటకు రావడానికి వీల్లేదు” అన్నాడు. వారు కత్తులతో అందర్నీ హతమార్చారు. కాపలా వాళ్ళూ, అధికారులూ వాళ్ళను బయటకు విసిరేసి బయలు దేవుడి గర్భగుడి లోకి వెళ్ళారు.
Kad je Jehu završio prinos paljenice, naredi tjelesnoj straži i dvoranima: “Uđite, pobijte ih! Nitko neka ne iziđe!” Tjelesna straža i dvorani uđoše, pobiše ih oštricom mača i prodriješe sve do svetišta Baalova hrama.
26 ౨౬ అక్కడ పవిత్రంగా ఎంచే బయలు దేవుడి స్తంభాలను బయటకు లాక్కొచ్చి తగలబెట్టారు.
Iznesoše Baalov lik iz hrama i spališe ga.
27 ౨౭ వారు బయలు దేవుడి విగ్రహాన్ని పగలగొట్టి గుడిని ధ్వంసం చేశారు. ఆ గుడిని చెత్తకుప్పలా చేశారు. అది ఈ రోజు వరకూ అలాగే ఉంది.
Raskopaše žrtvenik Baalov, srušiše i hram Baalov i pretvoriše ga u jame za nečist, koje su ostale do danas.
28 ౨౮ ఈ విధంగా యెహూ బయలు దేవుణ్ణి ఇశ్రాయేలులో లేకుండా నాశనం చేశాడు.
Tako je Jehu istrijebio Baala iz Izraela.
29 ౨౯ కానీ బేతేలు, దాను అనే స్థలాల్లో బంగారు దూడలను ప్రతిష్టించి, వాటిని పూజించడానికి ప్రేరేపించి ఇశ్రాయేలు ప్రజలు పాపం చేయడానికి కారకుడైన నెబాతు కొడుకు యరొబాము వలె యెహూ కూడా ఆ బంగారు దూడలను పూజించడం మానలేదు.
Ali se Jehu nije okrenuo od grijeha Jeroboama, sina Nebatova, kojima je zavodio Izraela, od zlatnih telaca u Betelu i Danu.
30 ౩౦ కాబట్టి యెహోవా యెహూతో “అహాబు కుటుంబం విషయంలో నీవు నా హృదయంలో ఉన్నదే చేసి నా దృష్టికి న్యాయమైనది చేశావు కాబట్టి నీ సంతానం నాలుగవ తరం వరకూ ఇశ్రాయేలును పరిపాలిస్తారు” అని చెప్పాడు.
Jahve je rekao Jehuu: “Zato što si dobro izvršio ono što mi je po volji i što si učinio sve što sam nosio u srcu protiv kuće Ahabove, tvoji će sinovi sve do četvrtoga koljena sjediti na prijestolju Izraelovu.”
31 ౩౧ అయితే యెహూ ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ధర్మశాస్త్రం ప్రకారం పూర్ణ హృదయంతో జీవించడంలో ఎలాటి శ్రద్ధా చూపించలేదు. ఇశ్రాయేలు ప్రజలు పాపం చేయడానికి కారకుడైన యరోబాము చేసిన పాపాలను వదిలి పెట్టలేదు.
Ali Jehu nije vjerno i svim srcem svojim slijedio zakon Jahve, Boga Izraelova. Nije se odvratio od grijeha kojima je Jeroboam zavodio Izraela.
32 ౩౨ ఆ రోజుల్లో యెహోవా ఇశ్రాయేలు రాజ్యాన్ని తగ్గించడం మొదలుపెట్టాడు. హజాయేలు ఇశ్రాయేలు సరిహద్దుల్లో యొర్దాను నదికి తూర్పుగా ఉన్న ప్రాంతంలో వాళ్ళను ఓడించాడు.
U ono je vrijeme Jahve počeo krnjiti zemlju izraelsku, i Hazael se tukao s Izraelcima na svom području,
33 ౩౩ గిలాదు ప్రాంతం, అర్నోను లోయలోని అరోయేరు నుండి గాదు, రూబేను, మనష్షె గోత్రాల ప్రజలు నివసించిన గిలాదు, బాషాను ప్రాంతాల్లో వాళ్ళను హజాయేలు ఓడించాడు.
od Jordana prema sunčevu izlasku, u svoj zemlji Gileadu, u zemlji Gadovoj, Rubenovoj i Manašeovoj, sve od Aroera na obali Arnona, do Gileada i Bašana.
34 ౩౪ యెహూ చేసిన మిగిలిన పనులూ, అతణ్ణి గూర్చిన మిగతా విషయాలూ, అతని శూరత్వం గూర్చిన విషయాలూ ఇశ్రాయేలు రాజుల చరిత్ర గ్రంథంలో రాసి ఉంచారు.
Ostala povijest Jehuova, sve što je učinio, sva njegova djela, zar to nije zapisano u knjizi Ljetopisa kraljeva izraelskih?
35 ౩౫ తరువాత యెహూ తన పూర్వీకులతో నిద్రించాడు. అతణ్ణి షోమ్రోనులో సమాధి చేశారు. అతని కొడుకు యెహోయాహాజు అతని స్థానంలో రాజు అయ్యాడు.
Počinuo je kraj svojih otaca i pokopaše ga u Samariji. Joahaz, sin njegov, zakralji se mjesto njega.
36 ౩౬ యెహూ షోమ్రోనులో ఇశ్రాయేలును ఇరవై ఎనిమిదేళ్ళు పరిపాలించాడు.
Jehu je vladao u Samariji nad Izraelom dvadeset i osam godina.