< 2 యోహాను 1 >

1 పెద్దనైన నేను ఎన్నికైన తల్లికీ, ఆమె పిల్లలకూ, నిజంగా మిమ్మల్ని ప్రేమిస్తూ, రాస్తున్న సంగతులు. నేను మాత్రమే కాక సత్యాన్ని ఎరిగిన వారందరూ మిమ్మల్ని ప్రేమిస్తున్నారు.
Kuzwa kumukulwana kuya kumwanakazi yoketetwe nivana vakwe, uzo unisaka mubuniti- mi isiñi fera ime, Linu nikwavo bonse vezi buniti-
2 ఎందుకంటే మనలో సత్యం నిలిచి ఉంది, అది శాశ్వతంగా నిలిచి ఉంటుంది. (aiōn g165)
Vakenyi chavuniti bwikalilile kwentu nintato iyenda kusamani. (aiōn g165)
3 తండ్రి అయిన దేవుని నుండీ, కుమారుడు యేసు క్రీస్తు నుండీ సత్యంలో, ప్రేమలో మనకు కృప, దయ, శాంతి తోడుగా ఉండు గాక.
Imi chisemu, kuluka, inkozo muive naswe niku nsuna kuzwa kwa Ireeza kuzwa kwe Shetu kuzwila kwa Jesu Kereste, mwana weshetu, muvuniti nirato.
4 తండ్రి నుండి మనం పొందిన ఆజ్ఞ ప్రకారం మీ పిల్లల్లో కొందరు సత్యమార్గంలో ఉన్నారని తెలిసి నేను చాలా సంతోషిస్తున్నాను.
Nisanga chavu kando kuti nivawani vamwi vanavenu bayenda mwiniti, sina mutuvatambwili iyi intayelo izwila kweshetu.
5 అమ్మా, కొత్త ఆజ్ఞ మీకు రాసినట్టు కాదు, ఒకరిని ఒకరు ప్రేమించాలన్న ఆజ్ఞ ఆరంభం నుండి మనకు ఉన్నదాన్ని బట్టి మీకు విజ్ఞప్తి చేస్తున్నాను.
Imi hanu niku kumila, mwanakazi- isikuti niku ñolela intayelo ihya, kona itubazuwi kuzwa kutazi-mukuti tusakane,
6 ఆయన ఆజ్ఞలను విధేయతతో పాటించడమే ప్రేమ. ఆరంభం నుండి మీరు విన్న ఆజ్ఞ ప్రకారం నడుచుకోవాలి.
Imi ilinji rato, Ilikuti tuyende chetaelo yakwe. Iyi nji ntayelo, sina hamubazuwi kumatangilo kuti muyenda muyili.
7 యేసు క్రీస్తు రక్తమాంసాలతో వచ్చాడని ఒప్పుకోని మోసగాళ్ళు చాలా మంది ఈ లోకంలో బయలుదేరారు. అలాటి వాడు వంచకుడు, క్రీస్తు విరోధి.
Mukuti vangi vachengi bachi vavayendi mwikanda, linu kavawambi kuti Jesu kereste avezi mwinyma, uzu njimuchengi mukuti kahena nji Jesu.
8 మనందరం పని చేసినందుకు రావలసినవి పోగొట్టుకోకుండా, సంపూర్ణ ప్రతిఫలం పొందేలా చూసుకోవాలి.
Mulilole inwe muvene, ilikuti kanji musinyehelwa icho chitu vasevelezi. kono Ilikuti tuka tambule mupuzo wizwile.
9 క్రీస్తు బోధలో నిలిచి ఉండక దాన్ని విడిచి ముందుకు సాగే ప్రతివాడూ దేవుడు లేనివాడు. ఈ బోధలో నిలిచి ఉండే వాడికి తండ్రి, కుమారుడు కూడా ఉన్నారు.
Yense yoyenda havunsu nasekali mwituto za Jesu kena Ireeza. imi wikala mwitunto, Linu uzu njiwina Ishentu ni mwanakwe,
10 ౧౦ ఈ ఉపదేశం కాకుండా మరొక ఉపదేశంతో ఎవరైనా మీ దగ్గరికి వస్తే, అతన్ని కుశల ప్రశ్నలు వేయవద్దు. మీ ఇంటికి ఆహ్వానించవద్దు.
linu iye wiza kwenu nasena yinu itunto, kanji mu mutambuli mwizuvo yenu kanji mu mulumeresa.
11 ౧౧ అతన్ని పలకరించినవాడు అతని చెడ్డ పనుల్లో పాలిభాగస్తుడే.
Mukuti iyemwine yo mutambula uwanika muchive cha mitendo yakwe.
12 ౧౨ ఇంకా ఎన్నో సంగతులు మీకు రాయాలని ఉంది. కాని కాగితం, సిరా వాడడం నాకు ఇష్టం లేదు. మన ఆనందం సంపూర్ణం అయ్యేలా మీ దగ్గరికి వచ్చి మీతో ముఖాముఖి మాట్లాడాలని ఆశగా ఉంది.
Nikwete zintu zingi zinilukela kuminolela, nina zintu zingi kono kani nsuni kuzi nola hepapili ni inke. Nihakuvabulyo, nilakaza kwiza kwenu zeni wambole nitulilolete, Ilikuti kusanga kwentu.
13 ౧౩ ఎన్నికైన మీ సోదరి పిల్లలు మీకు శుభాలు తెలుపుతున్నారు.
Bana vamwachako wachikazana vakurumelesa.

< 2 యోహాను 1 >