< 2 కొరింథీయులకు 9 >

1 పరిశుద్ధుల కోసమైన ఈ సేవ గురించి నేను మీకు రాయనవసరం లేదు.
Pero no es necesario que diga nada en mi carta sobre la colecta para los santos:
2 మీ ఆసక్తి నాకు తెలుసు. దాన్ని గురించి మాసిదోనియ ప్రజల ముందు మిమ్మల్ని పొగిడాను గదా! పోయిన సంవత్సరం నుండి అకయ ప్రాంతం వారు సిద్ధంగా ఉన్నారని వారికి చెప్పాను. మీ ఆసక్తి వారిలో చాలా మందిని ప్రోత్సహించింది.
Porque antes les he aclarado a los de Macedonia mi orgullo de nuestra buena voluntad, diciéndoles que Acaya ha estado dispuesto a ayudar; y un gran número ha sido movido a hacer lo mismo con su ejemplo.
3 అయితే మీ గురించి మేము గొప్పగా చెప్పిన సంగతులు ఈ విషయంలో వ్యర్థం కాకూడదనీ నేను చెప్పినట్టు మీరు సిద్ధంగా ఉండాలనీ సోదరులను పంపాను.
Pero he enviado a los hermanos, para que se vea que las cosas buenas que dijimos acerca de ustedes son verdad, y que, como dije, pueden estar listo:
4 ఒకవేళ మాసిదోనియ వారెవరైనా నాతో వచ్చి మీరు సిద్ధంగా లేరని తెలుసుకుంటే మీకే కాదు, మీ మీద ఇంత నమ్మకం ఉంచిన మాకు కూడా అవమానం కలుగుతుంది.
Por temor a que, si alguno de Macedonia venga conmigo, y no están listo, nosotros (por no decir, ustedes) podríamos avergonzarnos en esto.
5 అందుచేత సోదరులు ముందుగానే మీ దగ్గరికి వచ్చి పూర్వం మీరు వాగ్దానం చేసిన విరాళం పోగుచేయాలని ప్రోత్సహించడానికి వారిని పంపడం అవసరమని నేను భావించాను. తద్వారా మీ విరాళం బలవంతంగా ఇచ్చింది కాకుండా స్వచ్ఛందంగా ఉంటుందని నేను నమ్ముతున్నాను.
Así que me pareció prudente que los hermanos fueran antes, y vean que la cantidad que se habían comprometido a dar estaba lista, de modo que podría ser motivo de alabanza, y no como si estuviéramos sacando provecho de ustedes.
6 “కొద్దిగా చల్లేవాడు కొద్ది పంట కోస్తాడు. విస్తారంగా చల్లేవాడు విస్తారమైన పంట కోస్తాడు” అని దీని గురించి చెప్పవచ్చు.
Pero en los Escrituras dice: Aquel que pone solo un pequeño número de semillas, recogerá lo mismo; y el que los pone de una mano completa, producirá en gran medida.
7 సణుక్కోకుండా బలవంతం లేకుండా తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారం ప్రతి ఒక్కరూ ఇవ్వాలి. ఎందుకంటే, దేవుడు ఉత్సాహంగా ఇచ్చే వ్యక్తిని ప్రేమిస్తాడు.
cada uno haga según el propósito de su corazón; no dando con pena o por la fuerza: porque Dios se complace en un dador alegre.
8 అన్నిటిలో మీకు చాలినంతగా ఎప్పుడూ ఉండేలా, ప్రతి మంచి పని కోసమూ మీకు సమృద్ధి ఉండేలా దేవుడు మీలో తన కృపను అధికం చేయగలడు.
Y poderoso es Dios para darte toda la gracia en toda su medida; para que, teniendo siempre suficiente de todas las cosas, puedas estar lleno de toda buena obra:
9 దీని గురించి “అతడు తన సంపద దరిద్రులకు పంచి ఇచ్చాడు. అతని నీతి ఎప్పటికీ నిలిచి ఉంటుంది” అని లేఖనంలో రాసి ఉంది. (aiōn g165)
Como se dice en los Escrituras, ha enviado lejos y ampliamente, ha dado a los pobres; su justicia es para siempre. (aiōn g165)
10 ౧౦ విత్తనాలు చల్లేవారికి విత్తనాన్నీ తినడానికి ఆహారాన్నీ దయచేసే దేవుడు మీకు విత్తనాన్ని దయచేసి వృద్ధి చేస్తాడు. మీ నీతి ఫలాన్ని అధికం చేస్తాడు.
Y el que da semilla para poner en el campo y pan para comer, cuidará del crecimiento de su semilla, al mismo tiempo que aumentará los frutos de su justicia;
11 ౧౧ ఎప్పుడూ ఉదారంగా ఇవ్వడానికి మీకు సర్వ సమృద్ధి కలుగుతుంది. దాన్ని బట్టి మా ద్వారా దేవునికి కృతజ్ఞత తెలియజేసే కారణం దొరుకుతుంది.
Siendo enriquecidos en todo, y podrán dar generosamente, lo cual causa alabanza a Dios a través de nosotros.
12 ౧౨ మీరు చేసే ఈ సేవ పరిశుద్ధుల అక్కరలు తీర్చడమే కాకుండా దేవునికి కృతజ్ఞత చెల్లించేలా చేస్తుంది.
Porque esta obra de dar no solo se ocupa de las necesidades de los santos, sino que es causa de mucha alabanza a Dios;
13 ౧౩ ఈ సేవ ద్వారా మీ యోగ్యత కనబడుతుంది. క్రీస్తు సువార్తను ఒప్పుకుని విధేయులై, ఇంత ఉదారంగా వారికీ, అందరికీ పంచిపెట్టడం బట్టి, వారు కూడా దేవుణ్ణి మహిమ పరుస్తారు.
Porque cuando, por esta obra de dar, ven lo que son, dan gloria a Dios por la manera en que se han entregado a las buenas nuevas de Cristo, y por la riqueza de su ofrenda a ellos y a todos;
14 ౧౪ మీ పట్ల దేవుడు కనపరచిన అత్యధికమైన కృపను చూసి, వారు మీ కోసం ప్రార్థన చేస్తూ, మిమ్మల్ని చూడాలని ఎంతో కోరికతో ఉన్నారు.
Mientras sus corazones están con ustedes en amor y en oración por ustedes, por la gran gracia de Dios que está en ustedes.
15 ౧౫ వర్ణించ శక్యం గాని ఆయన బహుమానానికి దేవునికి ధన్యవాదాలు.
Alabado sea Dios porque gran generosidad, que no hay palabras para expresarlo.

< 2 కొరింథీయులకు 9 >