< 2 కొరింథీయులకు 6 >

1 అందుచేత మేము దేవునితో కలిసి పని చేస్తూ దేవుని కృపను వ్యర్థం చేసుకోవద్దని మిమ్మల్ని వేడుకొంటున్నాము.
tasya sahAyA vayaM yuSmAn prArthayAmahe, IzvarasyAnugraho yuSmAbhi rvRthA na gRhyatAM|
2 “అనుకూల సమయంలో మీ ప్రార్థన విన్నాను. రక్షణ దినాన మీకు సాయం చేశాను,” అని ఆయన చెబుతున్నాడు. ఇదిగో, ఇప్పుడే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం.
tenoktametat, saMzroSyAmi zubhe kAle tvadIyAM prArthanAm ahaM| upakAraM kariSyAmi paritrANadine tava| pazyatAyaM zubhakAlaH pazyatedaM trANadinaM|
3 మా సేవకు ఎలాంటి నింద కలగకూడదని ఏ విషయంలోనూ అభ్యంతరం కలిగించం.
asmAkaM paricaryyA yanniSkalaGkA bhavet tadarthaM vayaM kutrApi vighnaM na janayAmaH,
4 దానికి బదులు మేము అన్ని విషయాల్లో దేవుని సేవకులంగా మమ్మును మేము రుజువు చేసుకుంటున్నాం. బాధల్లో ఇరుకుల్లో ఇబ్బందుల్లో
kintu pracurasahiSNutA klezo dainyaM vipat tADanA kArAbandhanaM nivAsahInatvaM parizramo jAgaraNam upavasanaM
5 దెబ్బల్లో చెరసాలల్లో అల్లర్లలో కాయకష్టంలో నిద్ర లేని రాత్రుల్లో ఆకలిలో-ఎంతో సహనం చూపాం.
nirmmalatvaM jJAnaM mRduzIlatA hitaiSitA
6 పవిత్రతలో జ్ఞానంలో దీర్ఘశాంతంలో దయలో పరిశుద్ధాత్మలో నిష్కపటమైన ప్రేమలో
pavitra AtmA niSkapaTaM prema satyAlApa IzvarIyazakti
7 సత్యవాక్యంలో దేవుని శక్తిలో-కుడి ఎడమ చేతుల్లో నీతి ఆయుధాలతో
rdakSiNavAmAbhyAM karAbhyAM dharmmAstradhAraNaM
8 ఘనతలో ఘనహీనతలో అపవాదుల్లో ప్రశంసల్లో మేము పని చేస్తున్నాం. మోసం చేస్తున్నామనే నింద మా మీద ఉంది, అయినా మేము యథార్థవంతులమే.
mAnApamAnayorakhyAtisukhyAtyo rbhAgitvam etaiH sarvvairIzvarasya prazaMsyAn paricArakAn svAn prakAzayAmaH|
9 అనామకులంగా మేము పని చేస్తున్నా, సుప్రసిద్ధులమే. చచ్చిపోతున్నట్టు ఉన్నాం, అయినా చూడండి, ఇంకా బతికే ఉన్నాం. మేము చేసే దాని వల్ల శిక్ష కలిగినా మరణ శిక్ష పడడం లేదు.
bhramakasamA vayaM satyavAdino bhavAmaH, aparicitasamA vayaM suparicitA bhavAmaH, mRtakalpA vayaM jIvAmaH, daNDyamAnA vayaM na hanyAmahe,
10 ౧౦ ఏడుస్తున్నాము కానీ ఎప్పుడూ ఆనందిస్తూనే ఉన్నాం. దరిద్రులంగా కనబడుతున్నా, అనేకమందిని ఐశ్వర్యవంతులుగా చేస్తున్నాం. ఏమీ లేని వాళ్ళంగా కనబడుతున్నా, అన్నీ ఉన్నవాళ్ళమే.
zokayuktAzca vayaM sadAnandAmaH, daridrA vayaM bahUn dhaninaH kurmmaH, akiJcanAzca vayaM sarvvaM dhArayAmaH|
11 ౧౧ కొరింతీయులారా, పూర్తి సత్యం మేము మీకు చెప్పాం, మా హృదయం విశాలంగా తెరిచి ఉంది.
he karinthinaH, yuSmAkaM prati mamAsyaM muktaM mamAntaHkaraNAJca vikasitaM|
12 ౧౨ మీ విషయంలో మా అంతరంగం సంకుచితంగా లేదు, మీ అంతరంగమే సంకుచితంగా ఉంది.
yUyaM mamAntare na saGkocitAH kiJca yUyameva saGkocitacittAH|
13 ౧౩ మేము చేసినట్టే మీరూ చేయండి. మీరూ మీ హృదయాలను విశాలంగా తెరవండి. నా పిల్లలకు చెప్పినట్టు చెబుతున్నాను.
kintu mahyaM nyAyyaphaladAnArthaM yuSmAbhirapi vikasitai rbhavitavyam ityahaM nijabAlakAniva yuSmAn vadAmi|
14 ౧౪ అవిశ్వాసులతో మీరు జతగా ఉండవద్దు. నీతికి దుర్నీతితో ఏమి సంబంధం? వెలుగుకు చీకటితో సహవాసమేమిటి?
aparam apratyayibhiH sArddhaM yUyam ekayuge baddhA mA bhUta, yasmAd dharmmAdharmmayoH kaH sambandho'sti? timireNa sarddhaM prabhAyA vA kA tulanAsti?
15 ౧౫ క్రీస్తుకు సాతానుతో ఒప్పందమేమిటి? అవిశ్వాసితో విశ్వాసికి భాగమేమిటి?
bilIyAladevena sAkaM khrISTasya vA kA sandhiH? avizvAsinA sArddhaM vA vizvAsilokasyAMzaH kaH?
16 ౧౬ దేవుని ఆలయానికి విగ్రహాలతో సంబంధం ఏమిటి? మనం జీవం గల దేవుని ఆలయం. అందుకు దేవుడు ఇలా సెలవిస్తున్నాడు. “నేను వారిలో నివసించి సంచరిస్తాను, నేను వారి దేవుడుగా ఉంటాను, వారు నా ప్రజలుగా ఉంటారు.”
Izvarasya mandireNa saha vA devapratimAnAM kA tulanA? amarasyezvarasya mandiraM yUyameva| IzvareNa taduktaM yathA, teSAM madhye'haM svAvAsaM nidhAsyAmi teSAM madhye ca yAtAyAtaM kurvvan teSAm Izvaro bhaviSyAmi te ca mallokA bhaviSyanti|
17 ౧౭ కాబట్టి, “మీరు వారిలో నుండి బయటికి వచ్చి ప్రత్యేకంగా ఉండండి. అపవిత్రమైన దాన్ని ముట్టవద్దు” అని ప్రభువు చెబుతున్నాడు.
ato hetoH paramezvaraH kathayati yUyaM teSAM madhyAd bahirbhUya pRthag bhavata, kimapyamedhyaM na spRzata; tenAhaM yuSmAn grahISyAmi,
18 ౧౮ “నేను మిమ్మల్ని చేర్చుకుంటాను, మీకు తండ్రిగా ఉంటాను. మీరు నాకు కొడుకులుగా కూతురులుగా ఉంటారు” అని సర్వశక్తి గల ప్రభువు చెబుతున్నాడు.
yuSmAkaM pitA bhaviSyAmi ca, yUyaJca mama kanyAputrA bhaviSyatheti sarvvazaktimatA paramezvareNoktaM|

< 2 కొరింథీయులకు 6 >