< 2 కొరింథీయులకు 5 >
1 ౧ భూలోక నివాసులమైన మనం నివసిస్తున్న ఈ గుడారం, అంటే మన శరీరం నశిస్తే, పరలోకంలో మనం నివసించటానికి ఒక భవనం ఉంది. దాన్ని మానవుడు నిర్మించలేదు. శాశ్వతమైన ఆ భవనాన్ని దేవుడే నిర్మించాడు. (aiōnios )
Ми знаємо: навіть якщо наш земний намет буде знищено, ми маємо будівлю від Бога – нерукотворний вічний дім на небесах. (aiōnios )
2 ౨ పరలోక సంబంధమైన మన నివాసాన్ని ధరించుకోవాలని ఆశపడుతూ ఈ గుడారంలో మూలుగుతున్నాం.
Адже в цьому [наметі] ми зітхаємо, прагнучи зодягнутися в наше небесне житло,
3 ౩ ఎందుకంటే దాన్ని ధరించుకున్నపుడు మనం నగ్నంగా కనబడం.
звісно, якщо, зодягнувшись, не будемо виявлені голими.
4 ౪ ఈ గుడారంలో ఉన్న మనం బరువు మోస్తూ మూలుగుతూ ఉన్నాం. వీటిని తీసివేయాలని కాదు గాని చావుకు లోనయ్యేది జీవం చేత మింగివేయబడాలి అన్నట్టుగా, ఆ నివాసాన్ని దీని మీద ధరించుకోవాలని మన ఆశ.
Перебуваючи в цьому наметі, ми обтяжені та зітхаємо не тому, що хочемо роздягнутися, а [тому, що хочемо] зодягнутися, щоб смертне було поглинуте життям.
5 ౫ దీని కోసం మనలను సిద్ధపరచినవాడు దేవుడే. ఆయన తన ఆత్మను మనకు హామీగా ఇచ్చాడు.
І Бог, Який підготував нас саме для цього, дав нам завдаток Духа.
6 ౬ అందుచేత ఎప్పుడూ నిబ్బరంగా ఉండండి. ఈ దేహంలో నివసిస్తున్నంత కాలం, ప్రభువుకు దూరంగా ఉన్నామని మనకు తెలుసు.
Тож ми завжди впевнені та знаємо, що поки знаходимося в тілі, ми далеко від Господа,
7 ౭ కంటికి కనిపించే వాటిని బట్టి కాక విశ్వాసంతోనే మనం నడచుకుంటున్నాము.
бо живемо згідно з вірою, а не згідно з тим, що бачимо.
8 ౮ ఈ దేహాన్ని విడిచి పెట్టి ప్రభువు దగ్గర నివసించడానికి ఇష్టపడుతున్నాం కాబట్టి నిబ్బరంగా ఉన్నాం.
І все ж ми не втрачаємо мужності й хотіли б не бути вже в тілі, а оселитися з Господом.
9 ౯ అందుచేత దేహంలో ఉన్నా దేహాన్ని విడిచినా, ఆయనకు ఇష్టులంగా ఉండాలనేదే మా లక్ష్యం.
Тому ми й намагаємося бути Йому до вподоби, чи то перебуваємо вдома, чи то далеко від [нього].
10 ౧౦ మనమంతా క్రీస్తు న్యాయపీఠం ఎదుట కనబడాలి. ఎందుకంటే ప్రతివాడూ దేహంతో జరిగించిన వాటి ప్రకారం, అవి మంచివైనా చెడ్డవైనా, తగినట్టుగా ప్రతిఫలం పొందాలి.
Бо всі ми маємо з’явитися перед престолом Христа, щоб кожен отримав відплату згідно з тим, що зробив, поки був у тілі – добро чи зло.
11 ౧౧ కాబట్టి మేము ప్రభువు పట్ల భయభక్తులతో ప్రజలను ఒప్పిస్తున్నాము. మేమేంటో దేవుడు స్పష్టంగా చూస్తున్నాడు. మీ మనస్సాక్షికి కూడా అది స్పష్టంగా ఉండాలని మేము ఆశిస్తున్నాము.
Отже, знаючи, що таке страх Господній, ми переконуємо людей. А перед Богом ми відкриті, і сподіваюся, що й перед вашим сумлінням ми відкриті.
12 ౧౨ మాకు మేమే మీ ఎదుట మళ్ళీ మెప్పించుకోవడం లేదు, హృదయంలో ఉన్న విషయాలను బట్టి కాక పై రూపాన్ని బట్టే అతిశయించే వారికి మీరు జవాబు చెప్పగలిగేలా మా విషయమై మీకు అతిశయ కారణం కలిగిస్తున్నాము.
Ми вам не рекомендуємо себе знову, а даємо вам можливість хвалитися нами, щоб ви могли відповісти тим, що вихваляються обличчям, а не серцем.
13 ౧౩ మాకు మతి తప్పింది అని ఎవరైనా అంటే అది దేవుని కోసమే. మేము స్థిర చిత్తులం అంటే అది మీ కోసమే.
Бо якщо ми зійшли з розуму, [то це] для Бога, а якщо ми при своєму розумі, [то це] для вас.
14 ౧౪ క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతం చేస్తూ ఉంది. ఎలాగంటే, అందరి కోసం ఒకడు చనిపోయాడు కాబట్టి అందరూ చనిపోయారనే విషయం కచ్చితం.
Адже любов Христа спонукає нас, бо ми вважаємо так: коли Один помер за всіх, то всі померли.
15 ౧౫ బతికే వారు ఇక నుంచి తమ కోసం బతకకుండా తమ కోసం చనిపోయి సజీవంగా తిరిగి లేచిన వాడి కోసమే బతకాలని ఆయన అందరి కోసం చనిపోయాడు.
І Він помер за всіх, щоб ті, хто живе, жили вже не для себе, а для Того, Хто помер і воскрес.
16 ౧౬ ఈ కారణం చేత ఇప్పటి నుండి మేము ఎవరితోనూ ఈ లోక ప్రమాణాల ప్రకారం వ్యవహరించం. ఒకప్పుడు మేము క్రీస్తును ఇలాగే చూశాం. అయితే ఇప్పటి నుండి ఇలా వ్యవహరించం.
Тому віднині ми нікого не знаємо з людської [точки зору]. Навіть якщо ми колись і знали Христа з людської [точки зору], то тепер більше [так] не знаємо.
17 ౧౭ కాబట్టి ఎవరైనా క్రీస్తులో ఉంటే వారు కొత్త సృష్టి. పాతవి గతించి పోయాయి. కొత్తవి వచ్చాయి.
Отже, коли хтось у Христі, [той] нове творіння. Давнє минуло. Ось усе стало новим!
18 ౧౮ అంతా దేవుని వల్లనే అయ్యింది. ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరచుకుని, ఆ సమాధాన పరచే సేవను మాకిచ్చాడు.
І все це від Бога, Який через Христа примирив нас із Собою і дав нам служіння примирення.
19 ౧౯ అంటే, దేవుడు వారి అతిక్రమాలను వారి మీద మోపక, క్రీస్తులో లోకాన్ని తనతో సమాధానపరచుకుంటూ, ఆ సమాధాన ఉపదేశాన్ని మాకు అప్పగించాడు.
Згідно з ним Бог був у Христі, примирив світ із Собою, не враховуючи [людям] їхніх проступків, і доручив нам [нести] Слово примирення.
20 ౨౦ కాబట్టి మేము క్రీస్తు ప్రతినిధులం. దేవుడే మా ద్వారా మిమ్మల్ని బతిమాలుకొంటున్నట్టుంది. దేవునితో సమాధానపడమని క్రీస్తు పక్షంగా మిమ్మల్ని బతిమాలుతున్నాం.
Отже, ми – посланці Христові, і тому наче Сам Бог просить через нас. Благаємо вас заради Христа: примиріться з Богом!
21 ౨౧ ఎందుకంటే మనం ఆయనలో దేవుని నీతి అయ్యేలా పాపమెరుగని ఆయనను దేవుడు మన కోసం పాపంగా చేశాడు.
Того, Хто не пізнав гріха, Він зробив гріхом заради нас, щоб у Ньому ми стали Божою праведністю.