< 2 కొరింథీయులకు 4 >

1 కనికరం ఎలా పొందామో అలానే ఈ సేవ కూడా పొందాము, కాబట్టి నిరుత్సాహపడము.
aparanjca vayaM karuNAbhAjO bhUtvA yad Etat paricArakapadam alabhAmahi nAtra klAmyAmaH,
2 అయితే సిగ్గుకరమైన రహస్య విషయాలను నిరాకరించాము. మేము కుయుక్తిగా ప్రవర్తించడం లేదు, దేవుని వాక్యాన్ని వక్రం చేయడం లేదు. దేవుని దృష్టిలో ప్రతివాడి మనస్సాక్షికీ మమ్మల్ని మేమే అప్పగించుకొంటూ సత్యం ప్రకటిస్తున్నాము.
kintu trapAyuktAni pracchannakarmmANi vihAya kuTilatAcaraNamakurvvanta IzvarIyavAkyaM mithyAvAkyairamizrayantaH satyadharmmasya prakAzanEnEzvarasya sAkSAt sarvvamAnavAnAM saMvEdagOcarE svAn prazaMsanIyAn darzayAmaH|
3 ఒకవేళ మా సువార్త అగోచరంగా ఉంది అంటే అది కేవలం నాశనమై పోతున్నవారికే.
asmAbhi rghOSitaH susaMvAdO yadi pracchannaH; syAt tarhi yE vinaMkSyanti tESAmEva dRSTitaH sa pracchannaH;
4 దేవుని స్వరూపమైన క్రీస్తు వైభవాన్ని చూపే సువార్త వెలుగు చూడకుండా, ఈ లోక దేవుడు వారి అవిశ్వాస మనో నేత్రాలకు గుడ్డితనం కలగజేశాడు. (aiōn g165)
yata Izvarasya pratimUrtti ryaH khrISTastasya tEjasaH susaMvAdasya prabhA yat tAn na dIpayEt tadartham iha lOkasya dEvO'vizvAsinAM jnjAnanayanam andhIkRtavAn EtasyOdAharaNaM tE bhavanti| (aiōn g165)
5 కాబట్టి మమ్మల్ని మేము ప్రకటించుకోకుండా క్రీస్తు యేసును మా ప్రభువుగా, యేసు కోసం మీ పనివాళ్ళంగా ప్రకటిస్తున్నాము.
vayaM svAn ghOSayAma iti nahi kintu khrISTaM yIzuM prabhumEvAsmAMzca yIzOH kRtE yuSmAkaM paricArakAn ghOSayAmaH|
6 “చీకట్లో నుండి వెలుగు ప్రకాశిస్తుంది” అని చెప్పిన దేవుడే తన జ్ఞాన వైభవపు వెలుగును ఇవ్వడానికి మా హృదయాల్లో ప్రకాశించాడు. ఆ వెలుగు యేసు క్రీస్తు ముఖంలో ప్రకాశిస్తోంది.
ya IzvarO madhyEtimiraM prabhAM dIpanAyAdizat sa yIzukhrISTasyAsya IzvarIyatEjasO jnjAnaprabhAyA udayArtham asmAkam antaHkaraNESu dIpitavAn|
7 అయితే ఈ సంపద మాకు మట్టి కుండల్లో ఉంది కాబట్టి ఈ అత్యధికమైన శక్తి దేవునిదే తప్ప మాది కాదు అని స్పష్టంగా తెలుస్తూ ఉంది.
aparaM tad dhanam asmAbhi rmRNmayESu bhAjanESu dhAryyatE yataH sAdbhutA zakti rnAsmAkaM kintvIzvarasyaivEti jnjAtavyaM|
8 అన్ని రకాలుగా బాధలు పడుతున్నా మేము చితికిపోవడం లేదు. ఎటూ పాలుబోని పరిస్థితుల్లో ఉంటున్నాం గానీ కృంగిపోవడం లేదు.
vayaM padE padE pIPyAmahE kintu nAvasIdAmaH, vayaM vyAkulAH santO'pi nirupAyA na bhavAmaH;
9 చిత్రహింసలు అనుభవించాం గానీ దిక్కుమాలిన వాళ్ళం కాము. మమ్మల్ని కొట్టి పడేశారు కానీ నాశనం అయిపోవడం లేదు.
vayaM pradrAvyamAnA api na klAmyAmaH, nipAtitA api na vinazyAmaH|
10 ౧౦ యేసు జీవం మా దేహాల్లో కనబడేలా యేసు మరణాన్ని మా దేహంలో ఎప్పుడూ మోసుకుపోతున్నాము.
asmAkaM zarIrE khrISTasya jIvanaM yat prakAzEta tadarthaM tasmin zarIrE yIzO rmaraNamapi dhArayAmaH|
11 ౧౧ యేసు జీవం మా మానవ దేహాల్లో కనబడేలా, బతికి ఉన్న మేము ఎప్పుడూ యేసు కోసం చావుకు లోనవుతూనే ఉన్నాము.
yIzO rjIvanaM yad asmAkaM marttyadEhE prakAzEta tadarthaM jIvantO vayaM yIzOH kRtE nityaM mRtyau samarpyAmahE|
12 ౧౨ ఈ విధంగా మాలో చావూ, మీలో జీవమూ పని చేస్తున్నాయి.
itthaM vayaM mRtyAkrAntA yUyanjca jIvanAkrAntAH|
13 ౧౩ కాగా, “నమ్మాను కాబట్టి మాట్లాడాను” అని రాసినట్టుగా అలాంటి విశ్వాసం గల మనసు కలిగి మేము కూడా నమ్ముతున్నాము కాబట్టి మాట్లాడుతున్నాము.
vizvAsakAraNAdEva samabhASi mayA vacaH| iti yathA zAstrE likhitaM tathaivAsmAbhirapi vizvAsajanakam AtmAnaM prApya vizvAsaH kriyatE tasmAcca vacAMsi bhASyantE|
14 ౧౪ ప్రభువైన యేసును లేపినవాడు యేసుతో మమ్మల్ని కూడా లేపి, మీతో తన ఎదుట నిలబెడతాడని మాకు తెలుసు.
prabhu ryIzu ryEnOtthApitaH sa yIzunAsmAnapyutthApayiSyati yuSmAbhiH sArddhaM svasamIpa upasthApayiSyati ca, vayam Etat jAnImaH|
15 ౧౫ కృప చాలామందికి విస్తరించినట్టుగా దేవుని మహిమ కోసం కృతజ్ఞత విస్తరించేలా అన్నీ మీ కోసమే జరిగాయి.
ataEva yuSmAkaM hitAya sarvvamEva bhavati tasmAd bahUnAM pracurAnugrahaprAptE rbahulOkAnAM dhanyavAdEnEzvarasya mahimA samyak prakAziSyatE|
16 ౧౬ అందుచేత మేము నిరుత్సాహపడడం లేదు. మా దేహాలు రోజురోజుకీ క్షీణించి పోతున్నా లోలోపల ప్రతి రోజూ దేవుడు మమ్మల్ని కొత్తవారినిగా చేస్తున్నాడు.
tatO hEtO rvayaM na klAmyAmaH kintu bAhyapuruSO yadyapi kSIyatE tathApyAntarikaH puruSO dinE dinE nUtanAyatE|
17 ౧౭ మేము కనిపించే వాటి కోసం కాకుండా కనిపించని వాటి కోసం ఎదురు చూస్తున్నాము. కాబట్టి క్షణమాత్రం ఉండే స్వల్ప బాధ, దానికి ఎన్నో రెట్లు అధికమైన అద్భుతమైన వైభవానికి మమ్మల్ని సిద్ధం చేస్తూ ఉంది. అది ఎప్పటికీ ఉండే వైభవం. (aiōnios g166)
kSaNamAtrasthAyi yadEtat laghiSThaM duHkhaM tad atibAhulyEnAsmAkam anantakAlasthAyi gariSThasukhaM sAdhayati, (aiōnios g166)
18 ౧౮ కనిపించేవి కొంత కాలమే ఉంటాయి కానీ కనిపించనివి శాశ్వతంగా ఉంటాయి. (aiōnios g166)
yatO vayaM pratyakSAn viSayAn anuddizyApratyakSAn uddizAmaH| yatO hEtOH pratyakSaviSayAH kSaNamAtrasthAyinaH kintvapratyakSA anantakAlasthAyinaH| (aiōnios g166)

< 2 కొరింథీయులకు 4 >