< 2 కొరింథీయులకు 2 >
1 ౧ నేను బాధ కలిగించేలా మీ దగ్గరికి తిరిగి రాకూడదని నా అంతట నేనే నిశ్చయించుకున్నాను.
Linu china zeza kalwangu kuti kazi nikezi chezila isasamisa.
2 ౨ నేను మీకు బాధ కలిగిస్తే బాధ పొందినవాడు తప్ప ఇంకెవరు నన్ను సంతోషపరచగలరు?
Heva niva mi sasamisi, vava kuni susuweza nji vona vani vachisi.
3 ౩ నేను వచ్చేటప్పుడు ఎవరి వలన నాకు సంతోషం కలగాలో వారి వలన నాకు దుఃఖం కలగకుండా ఉండాలని ఈ సంగతి మీకు రాశాను. నా సంతోషమే మీ అందరి సంతోషమని నా నమ్మకం.
Na ñola muna ñolela njokuti kanzi ni chiswa kwavo vava kuswanela kuni tavisa. Nina insepo kuamana inwe muvonse kuti intavo yangu njiyona imukwete nenwe.
4 ౪ మీకు బాధ కలగాలని కాదు, మీ పట్ల నాకున్న అత్యధికమైన ప్రేమను మీరు తెలుసుకోవాలని, ఎంతో బాధతో, హృదయ వేదనతో, కన్నీళ్ళు కారుస్తూ రాశాను.
Linu niva miñoleli ni manyando makando, mi ninina mubukavo vwe nkulo, ni zinsozi zingi. kena ni vali kusaka kumi sasamisa. kono, nibali kusaka kuti mwizibe ilato likando lini kwete kwenu.
5 ౫ ఎవరైనా నాకు బాధ కలగజేసి ఉంటే, నాకు మాత్రమే కాదు, కొంతవరకూ మీకందరికీ బాధ కలగజేశాడు (ఇంతకంటే కఠినంగా మాట్లాడడం నాకిష్టం లేదు).
Haiba zumwi waleta kuchisa, kena leta bulyo kwangu, kono kamukwa umwi, noti kwi tula chabukali, kono waleta kwenu mwese.
6 ౬ అలాంటి వాడికి మీలో ఎక్కువమంది వలన కలిగిన ఈ శిక్ష చాలు.
Kuli kene uzo mutu hahewa Inkoto bulyo ku vantu bangi.
7 ౭ కాబట్టి మీరిక అతణ్ణి శిక్షించకుండా క్షమించి, ఆదరించడం మంచిది. లేకపోతే అతడు అధిక దుఃఖంలో మునిగిపోతాడేమో.
Lya hanu hasa muha ikoto, mwina noku swalela niku muomba-omba. wina v, unjo nange ehaiwe vukando bwa maswavi akwe.
8 ౮ అందుచేత అతని పట్ల మీ ప్రేమ స్థిరపరచమని మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను.
Linu ni misusuweza kuti muwole ku patalaza ilato lyenu kwali.
9 ౯ మీరన్ని విషయాల్లో విధేయులై ఉంటారో లేదో అని మిమ్మల్ని పరీక్షించేందుకే అలా రాశాను.
Ili nji vaka hani va ñoli, linu chingi nali kumilika kubona nandi mwi chilila onse.
10 ౧౦ మీరు ఎవరినైనా దేని గురించి అయినా క్షమిస్తే నేనూ అతన్ని క్షమిస్తాను.
Heba uswalela zumwi, nimu swalela zuna muntu name. China swalela- haiva kwina china swalela-chaswalelwa kwineku lyenu havusu bwa Kreste.
11 ౧౧ నేను దేనినైనా క్షమించి ఉంటే సాతాను మనలను మోసపరచకుండా, మీ కోసం, క్రీస్తు ముఖం చూసి క్షమించాను. సాతాను ఎత్తుగడలు మనకు తెలియనివి కావు.
Ili kuti Satani sazi atu zwisi mwizila, kaho twizi hande milelo yakwe.
12 ౧౨ క్రీస్తు సువార్త ప్రకటించడానికి నేను త్రోయ పట్టణానికి వచ్చినప్పుడు, ప్రభువు నాకు ద్వారం తెరిచాడు. అయినా నా సోదరుడు తీతు కనిపించకపోవడంతో
Simwine ava ni yalwili mulyango haniya mwi tolopo ya Troas kuka kutaza ivangeli ya Keresite uko.
13 ౧౩ నాకు మనశ్శాంతి లేక, వారి దగ్గర సెలవు తీసుకుని అక్కడ నుండి మాసిదోనియకు బయలుదేరాను.
Nanga vulyo, kena ni vena ni nkozo yo muhupulo, ka kuli kena ni vezi kuwana mukulwangu Titi uko. Cwale chi navasiya niku volela kwa Macedonia.
14 ౧౪ దేవుడు క్రీస్తులో విజయ సూచకమైన తన ఊరేగింపులో మమ్మల్ని ఎప్పుడూ నడిపిస్తున్నాడు. క్రీస్తును గురించిన జ్ఞాన పరిమళాన్ని మా ద్వారా అంతటా గుబాళించేలా చేస్తున్న ఆయనకు ధన్యవాదాలు.
Kono vuitumelo vuve kwa Ireeza, umo mwa Kreste utuyendisa mu miliko. Ketu usansaila munko yenzivo yakwe konse.
15 ౧౫ విమోచన పొందుతున్న వారిమధ్య, నాశనమైపోతున్న వారిమధ్య, మేము దేవునికి క్రీస్తు పరిమళంగా ఉన్నాము.
Kakuli twina kwa Ireeza ina munko munati ya Kreste, bonse abo bakwete ku hazwa nabo ba kwete sinyeha.
16 ౧౬ నాశనమైపోతున్న వారికి మరణపు వాసనగా, విమోచన పొందుతున్న వారికి జీవపు సువాసనగా ఉన్నాము. వీటికి యోగ్యులెవరు?
Ku vantu va vasinyehi, mi munko uzwa kwi fuu ni fuu, kwabo va kweta hazwa, mi munko uzwa kwi vuhalo ni vuhalo. Yo swanelwa izo zitu?
17 ౧౭ దేవుని వాక్యాన్ని లాభం కోసం చాలామంది అమ్మేస్తున్నారు. మేము అలాంటి వాళ్ళం కాదు. మేమైతే సదుద్దేశంతో ఉన్నాం. దేవుడు మమ్మల్ని పంపించాడు. క్రీస్తులో దేవుని ఎదుట బోధిస్తున్నాం.
Mukuti katu swani ni vungi bwa vatu va vali kuwuza izwi lya Ireeza cho vu polofiti. Niha kuti, ka kujolola kwa mulelo, tuwamba mwa Keresite, sina hatu kwe tumitwe kwe Ireeza, ha busu bwe Ireeza.