< 2 కొరింథీయులకు 12 >
1 ౧ నేను అతిశయించాలి, అయితే దాని వలన ప్రయోజనమేమీ రాదు. ప్రభువు దర్శనాలూ ప్రత్యక్షతలూ మీకు తెలియజేస్తాను.
Surely it is not beneficial for me to boast, yet I will go on to visions and revelations from the Lord.
2 ౨ క్రీస్తులో ఉన్న ఒక వ్యక్తి నాకు తెలుసు. పద్నాలుగు సంవత్సరాల క్రితం దేవుడు అతణ్ణి మూడవ ఆకాశానికి కొనిపోయాడు. అతడు శరీరంతో వెళ్ళాడో లేకపోతే శరీరం లేకుండా వెళ్ళాడో నాకు తెలియదు. దేవునికే తెలుసు.
I know a man in Christ who fourteen years ago was caught up to the third heaven. (Whether it was in the body or out of the body I do not know; God knows.)
3 ౩ అలాంటి వ్యక్తి నాకు తెలుసు. అతడు శరీరంతో వెళ్ళాడో లేకపోతే శరీరం లేకుండా వెళ్ళాడో నాకు తెలియదు. దేవునికే తెలుసు.
And I know that this man (whether in the body or out of the body I do not know; God knows)
4 ౪ దేవుడు అతణ్ణి ఆనంద నివాసంలోకి కొనిపోయాడు. అతడక్కడ ఎవరూ పలకడానికి వీలు కాని అతి పవిత్రమైన విషయాలు విన్నాడు.
was caught up to Paradise and heard words too sacred to be spoken, which man is not permitted to utter.
5 ౫ అలాంటి వ్యక్తి తరపున నేను అతిశయిస్తాను. అయితే నా బలహీనతల విషయంలో తప్ప నా తరపున నేను అతిశయించను.
I will boast on behalf of that man, but on my own behalf I will not boast, except about my weaknesses.
6 ౬ ఒకవేళ అతిశయించాలనుకొన్నా అది తెలివి తక్కువతనమేమీ కాదు. ఎందుకంటే నేను సత్యమే చెబుతున్నాను. కానీ ఎవరైనా నాలో చూసినదాని కంటే, నేను చెప్పింది విన్నదాని కంటే నన్ను ఎక్కువ ఘనంగా ఎంచకుండా ఉండేలా అతిశయించడం మానుకుంటాను.
But even if I wanted to boast, I would not be a fool, for I would be speaking the truth. Nevertheless, I refrain so that no one will think more of me than what he sees in me or hears from me.
7 ౭ నాకు కలిగిన ప్రత్యక్షతలు అసాధారణమైనవి కాబట్టి నేను గర్వంతో రెచ్చిపోకుండా దేవుడు నా దేహంలో ఒక ముల్లు పెట్టాడు. అది నన్ను బాధించడానికి, అతిశయించకుండా ఉండటానికి ఉన్న సాతాను దూత.
And to keep me from becoming conceited because of the surpassing greatness of the revelations I received, there was given to me a thorn in the flesh, a messenger of Satan to harass me so that I would not become conceited.
8 ౮ అది నా దగ్గర నుండి తొలగిపోవాలని దాని గురించి మూడు సార్లు ప్రభువును బతిమాలాను.
Three times I pleaded with the Lord to take it away from me.
9 ౯ అప్పుడాయన నాతో ఇలా అన్నాడు, “నా కృప నీకు చాలు. బలహీనతలోనే బలం పరిపూర్ణమవుతుంది.” కాగా క్రీస్తు బలం నా మీద నిలిచి ఉండేలా, నేను నా బలహీనతల్లోనే అతిశయిస్తాను.
But he said to me, “My grace is sufficient for yoʋ, for my power is made perfect in weakness.” Therefore I will boast all the more gladly about my weaknesses, so that the power of Christ may rest upon me.
10 ౧౦ బలహీనంగా నేనెప్పుడున్నానో అప్పుడే బలవంతుడిని. అందుచేత క్రీస్తు కోసం నా బలహీనతల్లో అవమానాల్లో ఇబ్బందుల్లో హింసల్లో ఉపద్రవాల్లో నేను సంతృప్తిగా ఉన్నాను.
So I delight in weaknesses, in insults, in hardships, in persecutions, and in distresses for the sake of Christ. For when I am weak, then I am strong.
11 ౧౧ నేను బుద్ధిహీనుడినయ్యాను! మీరే నన్ను బలవంతం చేశారు. వాస్తవానికి మీరు నన్ను మెచ్చుకోవాల్సి ఉంది. ఎందుకంటే నేను వట్టివాడినైనా ఆ “గొప్ప అపొస్తలుల” కంటే ఏ మాత్రం తక్కువ వాణ్ణి కాను.
I have become a fool by boasting; you compelled me to do it. I ought to have been commended by you, for in no way have I been inferior to these “super-apostles,” even though I am nothing.
12 ౧౨ నాలో అసలైన అపొస్తలుని గురుతులు ఎంతో సహనంతో మీ మధ్య దేవుడు కనిపింపజేశాడు. సూచకక్రియలూ అద్భుతాలూ మహత్కార్యాలూ కనపరిచాడు.
The signs of a true apostle were performed among you with great perseverance, with signs, wonders, and miracles.
13 ౧౩ నేను మీకు భారంగా లేను అనే విషయంలో తప్ప, ఇతర సంఘాలకంటే మీరు ఏ విషయంలో తక్కువ వారయ్యారు? ఈ నా తప్పు క్షమించండి మరి!
In what way were you treated as inferior to the rest of the churches, except that I myself did not burden you? Forgive me this injustice!
14 ౧౪ ఇప్పుడు ఈ మూడవసారి మీ దగ్గరికి రావడానికి సిద్ధంగా ఉన్నాను. వచ్చినప్పుడు మీకు భారంగా ఉండను. మీకేముందో అది నాకు అక్కరలేదు. నాకు మీరే కావాలి. తల్లిదండ్రుల కోసం పిల్లలు దాచరు. కానీ తల్లిదండ్రులే పిల్లల కోసం దాచాలి.
Behold, I am ready to come to you a third time, and I will not burden you, for I do not seek what belongs to you, but you yourselves. For children are not obligated to save up for their parents, but parents for their children.
15 ౧౫ కాబట్టి మీ ఆత్మల కోసం ఎంతో ఆనందంగా ఖర్చు చేస్తాను. మీకోసం ఖర్చయిపోతాను. నేను మిమ్మల్ని అంత ఎక్కువగా ప్రేమిస్తుంటే మీరు నన్ను ఇంత తక్కువగా ప్రేమిస్తారా?
So I will most gladly spend and be entirely spent for the sake of your souls, even if the more I love you, the less I am loved.
16 ౧౬ అదలా ఉంచండి. నేను మీకు భారంగా ఉండలేదు గానీ నేను యుక్తిగా మాయోపాయం చేత మిమ్మల్ని పట్టుకున్నాను అని చెబుతారేమో!
Be that as it may, I did not burden you. But crafty fellow that I am, I apparently took you in by deceit!
17 ౧౭ నేను మీ దగ్గరికి పంపినవారి ద్వారా మిమ్మల్ని ఉపయోగించుకున్నానా?
Did I take advantage of you through any of the men I sent to you?
18 ౧౮ మీ దగ్గరికి వెళ్ళమని తీతును ప్రోత్సహించాను. అతనితో వేరొక సోదరుని పంపాను. తీతు మీ దగ్గర ఏమైనా సంపాదించాడా? మేము ఏక మనసుతో ఏక విధానంతో ప్రవర్తించలేదా?
I urged Titus to visit you and sent our brother with him. Did Titus take advantage of you? Did we not walk in the same spirit and in the same footsteps?
19 ౧౯ మేమింత వరకూ మా పక్షంగా మేము వాదించుకుంటున్నామని మీరు అనుకుంటున్నారా? దేవుని దృష్టిలో క్రీస్తును బట్టి మీ క్షేమాభివృద్ధి కోసం ఇవన్నీ చెబుతున్నాం.
Do you still think that we are defending ourselves to you? In the sight of God we are speaking in Christ, and everything we do, beloved, is for your edification.
20 ౨౦ ఎందుకంటే నేను వచ్చినప్పుడు మీరు నాకు ఇష్టులుగా ఉండరేమో అనీ, నేను మీకు ఇష్టుడనుగా ఉండనేమో అని భయపడుతున్నాను. కలహాలు, అసూయ, క్రోధాలు, కక్షలు, వదంతులు, గర్వం, అల్లర్లు ఉంటాయేమో.
For I fear that when I come I may not find you as I wish, and that you may not find me as you wish. I fear that there may be quarrels, jealousies, fits of anger, selfish ambitions, insults, words of gossip, puffed up behaviors, and disorderly actions.
21 ౨౧ నేను తిరిగి వచ్చినప్పుడు నా దేవుడు మీ మధ్య నన్ను చిన్నబుచ్చుతాడేమో అనీ, గతంలో పాపం చేసి తాము జరిగించిన అపవిత్రత, జారత్వం, ఇంద్రియలోలత్వం విషయంలో పశ్చాత్తాపం పొందని అనేకుల గురించి దుఖించాల్సి వస్తుందేమో అనీ భయపడుతున్నాను.
I fear that when I come again my God will humble me before you, and I may have to mourn over many who have previously sinned and not repented of the impurity, fornication, and sensuality they have practiced.