< 2 కొరింథీయులకు 10 >

1 స్వయంగా పౌలు అనే నేను క్రీస్తులో ఉన్న సాత్వీకంతో, మృదుత్వంతో మీకు విన్నపం చేస్తున్నాను. మీతో ఉన్నపుడు దీనునిగా, మీతో లేనపుడు ధైర్యశాలిగా ఉన్నాను గదా!
yuṣmatpratyakṣē namraḥ kintu parōkṣē pragalbhaḥ paulō'haṁ khrīṣṭasya kṣāntyā vinītyā ca yuṣmān prārthayē|
2 మేము శరీరానుసారంగా నడుస్తున్నామని కొందరంటున్నారు. అలాంటి వారితో నేను విభేధించి ధైర్యంతో వ్యవహరించాలని అనుకుంటున్నాను. అయితే మీతో ఉన్నపుడు నేనలా ఉండకుండాా చేయమని మిమ్మల్ని బతిమాలుతున్నాను.
mama prārthanīyamidaṁ vayaṁ yaiḥ śārīrikācāriṇō manyāmahē tān prati yāṁ pragalbhatāṁ prakāśayituṁ niścinōmi sā pragalbhatā samāgatēna mayācaritavyā na bhavatu|
3 మేము శరీరంతో జీవిస్తున్నా శరీరానుసారంగా యుద్ధం చేయం.
yataḥ śarīrē carantō'pi vayaṁ śārīrikaṁ yuddhaṁ na kurmmaḥ|
4 మా యుద్ధ పరికరాలు లోక సంబంధమైనవి కావు. కోటలను ధ్వంసం చేసి, మనుషులను పక్కదోవ పట్టించే వాదాలను ఓడించే దైవ శక్తి వాటికి ఉంది.
asmākaṁ yuddhāstrāṇi ca na śārīrikāni kintvīśvarēṇa durgabhañjanāya prabalāni bhavanti,
5 వాటితో దేవుని జ్ఞానాన్ని అడ్డగించే ప్రతి ఆటంకాన్నీ నాశనం చేసి, ప్రతి ఆలోచననూ వశపరచుకుని క్రీస్తుకు లోబడేలా చేస్తున్నాం.
taiśca vayaṁ vitarkān īśvarīyatattvajñānasya pratibandhikāṁ sarvvāṁ cittasamunnatiñca nipātayāmaḥ sarvvasaṅkalpañca bandinaṁ kr̥tvā khrīṣṭasyājñāgrāhiṇaṁ kurmmaḥ,
6 మీ విధేయత పూర్తి అయినప్పుడు అవిధేయతనంతటినీ శిక్షించడానికి సిద్ధపడి ఉన్నాం.
yuṣmākam ājñāgrāhitvē siddhē sati sarvvasyājñālaṅghanasya pratīkāraṁ karttum udyatā āsmahē ca|
7 మీ ముందున్న వాటిని స్పష్టంగా చూడండి. మీలో ఎవరైనా తాను క్రీస్తు వాడినని నమ్మకం కుదిరితే, అతనెలా క్రీస్తు వాడో మేము కూడా అలానే క్రీస్తు వారిమని తాను గుర్తుంచుకోవాలి.
yad dr̥ṣṭigōcaraṁ tad yuṣmābhi rdr̥śyatāṁ| ahaṁ khrīṣṭasya lōka iti svamanasi yēna vijñāyatē sa yathā khrīṣṭasya bhavati vayam api tathā khrīṣṭasya bhavāma iti punarvivicya tēna budhyatāṁ|
8 మీ నాశనం కోసం కాక మిమ్మల్ని కట్టడానికే ప్రభువు ఇచ్చిన అధికారాన్ని గురించి కాస్త ఎక్కువ అతిశయంగా చెప్పుకున్నా సిగ్గుపడను.
yuṣmākaṁ nipātāya tannahi kintu niṣṭhāyai prabhunā dattaṁ yadasmākaṁ sāmarthyaṁ tēna yadyapi kiñcid adhikaṁ ślāghē tathāpi tasmānna trapiṣyē|
9 నేను రాసే ఉత్తరాలతో మిమ్మల్ని భయపెట్టే వాడిలాగా ఉండకూడదు.
ahaṁ patrai ryuṣmān trāsayāmi yuṣmābhirētanna manyatāṁ|
10 ౧౦ కొందరు ఇలా అంటారు, “అతని ఉత్తరాలు గంభీరంగా బలీయంగా ఉన్నాయి, కానీ శరీరం బలహీనం, మాటలు చప్పగా ఉంటాయి.”
tasya patrāṇi gurutarāṇi prabalāni ca bhavanti kintu tasya śārīrasākṣātkārō durbbala ālāpaśca tucchanīya iti kaiścid ucyatē|
11 ౧౧ అలాంటి వారు తెలుసుకోవలసింది ఏంటంటే మేమక్కడ లేనపుడు ఉత్తరాల్లో రాసిన మాటల ప్రకారం ఏమి చెప్పామో మేమక్కడ ఉన్నప్పుడూ అలానే చేస్తాము.
kintu parōkṣē patrai rbhāṣamāṇā vayaṁ yādr̥śāḥ prakāśāmahē pratyakṣē karmma kurvvantō'pi tādr̥śā ēva prakāśiṣyāmahē tat tādr̥śēna vācālēna jñāyatāṁ|
12 ౧౨ తమను తామే మెచ్చుకొనే వారిలో ఒకరిగా ఉండడానికి గానీ వారితో పోల్చుకోడానికి గానీ మేము తెగించం. అయితే వారు తమకు తాము ఒకరిని బట్టి మరొకరు బేరీజు వేసుకుంటూ ఒకరితో ఒకరు పోల్చుకుంటూ ఉంటే వారు తెలివిలేని పని చేస్తున్నట్టు.
svapraśaṁsakānāṁ kēṣāñcinmadhyē svān gaṇayituṁ taiḥ svān upamātuṁ vā vayaṁ pragalbhā na bhavāmaḥ, yatastē svaparimāṇēna svān parimimatē svaiśca svān upamibhatē tasmāt nirbbōdhā bhavanti ca|
13 ౧౩ మేమైతే మా స్థాయికి మించి అతిశయపడం, మిమ్మల్ని చేరగలిగేలా దేవుడు మాకు ఏర్పరచిన హద్దుల్లోనే ఉంటాం.
vayam aparimitēna na ślāghiṣyāmahē kintvīśvarēṇa svarajjvā yuṣmaddēśagāmi yat parimāṇam asmadarthaṁ nirūpitaṁ tēnaiva ślāghiṣyāmahē|
14 ౧౪ మేము మీ దగ్గరికి వచ్చినపుడు మా హద్దులు మీరలేదు. క్రీస్తు సువార్త మోసుకుంటూ మీ దాకా మొట్టమొదట వచ్చింది మేమే.
yuṣmākaṁ dēśō'smābhiragantavyastasmād vayaṁ svasīmām ullaṅghāmahē tannahi yataḥ khrīṣṭasya susaṁvādēnāparēṣāṁ prāg vayamēva yuṣmān prāptavantaḥ|
15 ౧౫ మేము మా హద్దు మీరి ఇతరుల కష్ట ఫలంలో మాకు వంతు ఉన్నట్టు అతిశయపడము. అయితే మీ విశ్వాసం అభివృద్ధి అయ్యే కొద్దీ మా పరిధిలో పని ఇంకా ఎక్కువగా అభివృద్ది అవుతుందనీ, దాని వలన
vayaṁ svasīmām ullaṅghya parakṣētrēṇa ślāghāmahē tannahi, kiñca yuṣmākaṁ viśvāsē vr̥ddhiṁ gatē yuṣmaddēśē'smākaṁ sīmā yuṣmābhirdīrghaṁ vistārayiṣyatē,
16 ౧౬ మీకు అవతల ఉన్న ప్రాంతాల్లో కూడా సువార్త ప్రకటించాలనీ మా ఆశ. మరొకరి పరిధిలో జరుగుతున్న పని గురించి మేము అతిశయించం.
tēna vayaṁ yuṣmākaṁ paścimadiksthēṣu sthānēṣu susaṁvādaṁ ghōṣayiṣyāmaḥ, itthaṁ parasīmāyāṁ parēṇa yat pariṣkr̥taṁ tēna na ślāghiṣyāmahē|
17 ౧౭ అయితే, “అతిశయించేవాడు ప్రభువులోనే అతిశయించాలి.”
yaḥ kaścit ślāghamānaḥ syāt ślāghatāṁ prabhunā sa hi|
18 ౧౮ ప్రభువు మెచ్చుకొనే వాడే యోగ్యుడు గానీ తనను తానే మెచ్చుకొనేవాడు యోగ్యుడు కాడు.
svēna yaḥ praśaṁsyatē sa parīkṣitō nahi kintu prabhunā yaḥ praśaṁsyatē sa ēva parīkṣitaḥ|

< 2 కొరింథీయులకు 10 >