< 2 కొరింథీయులకు 10 >
1 ౧ స్వయంగా పౌలు అనే నేను క్రీస్తులో ఉన్న సాత్వీకంతో, మృదుత్వంతో మీకు విన్నపం చేస్తున్నాను. మీతో ఉన్నపుడు దీనునిగా, మీతో లేనపుడు ధైర్యశాలిగా ఉన్నాను గదా!
Bet es, Pāvils, pats jūs lūdzu caur Kristus lēnprātību un laipnību, es, kas klāt būdams jūsu starpā gan esmu pazemīgs, bet no tālienes drošs pret jums,
2 ౨ మేము శరీరానుసారంగా నడుస్తున్నామని కొందరంటున్నారు. అలాంటి వారితో నేను విభేధించి ధైర్యంతో వ్యవహరించాలని అనుకుంటున్నాను. అయితే మీతో ఉన్నపుడు నేనలా ఉండకుండాా చేయమని మిమ్మల్ని బతిమాలుతున్నాను.
Es lūdzos, ka man pie jums nākot nevajadzētu būt bargam ar to drošību, ar ko es domāju pret citiem turēties, kam šķiet, ka mēs tā kā pēc miesas dzīvojam.
3 ౩ మేము శరీరంతో జీవిస్తున్నా శరీరానుసారంగా యుద్ధం చేయం.
Jo mēs miesā staigādami, tomēr pēc miesas necīnāmies;
4 ౪ మా యుద్ధ పరికరాలు లోక సంబంధమైనవి కావు. కోటలను ధ్వంసం చేసి, మనుషులను పక్కదోవ పట్టించే వాదాలను ఓడించే దైవ శక్తి వాటికి ఉంది.
Jo mūsu karošanas ieroči nav miesīgi, bet spēcīgi Dieva priekšā, nopostīt tos stiprumus.
5 ౫ వాటితో దేవుని జ్ఞానాన్ని అడ్డగించే ప్రతి ఆటంకాన్నీ నాశనం చేసి, ప్రతి ఆలోచననూ వశపరచుకుని క్రీస్తుకు లోబడేలా చేస్తున్నాం.
Mēs izpostām tos padomus un visu, kas augsti ceļas pret Dieva atzīšanu, un savaldām visas domas, lai Kristum paklausa,
6 ౬ మీ విధేయత పూర్తి అయినప్పుడు అవిధేయతనంతటినీ శిక్షించడానికి సిద్ధపడి ఉన్నాం.
Un esam gatavi, atriebt ikvienu neklausību, kad jūsu paklausība būs tapusi pilnīga.
7 ౭ మీ ముందున్న వాటిని స్పష్టంగా చూడండి. మీలో ఎవరైనా తాను క్రీస్తు వాడినని నమ్మకం కుదిరితే, అతనెలా క్రీస్తు వాడో మేము కూడా అలానే క్రీస్తు వారిమని తాను గుర్తుంచుకోవాలి.
Vai jūs raugiet uz to, kas priekš acīm? Ja kāds no sevis paša tic, ka Kristum piederot, lai tas atkal pie sevis paša tā domā, ka, tā kā viņš pieder Kristum, tāpat arī mēs piederam Kristum.
8 ౮ మీ నాశనం కోసం కాక మిమ్మల్ని కట్టడానికే ప్రభువు ఇచ్చిన అధికారాన్ని గురించి కాస్త ఎక్కువ అతిశయంగా చెప్పుకున్నా సిగ్గుపడను.
Jo lai es arī vēl vairāk lielītos ar mūsu varu, ko Tas Kungs mums devis jums par uztaisīšanu un ne par postīšanu, taču es nepalikšu kaunā;
9 ౯ నేను రాసే ఉత్తరాలతో మిమ్మల్ని భయపెట్టే వాడిలాగా ఉండకూడదు.
Lai mani netur par tādu, kas jūs gribētu baidīt caur grāmatām.
10 ౧౦ కొందరు ఇలా అంటారు, “అతని ఉత్తరాలు గంభీరంగా బలీయంగా ఉన్నాయి, కానీ శరీరం బలహీనం, మాటలు చప్పగా ఉంటాయి.”
Jo tie saka, ka tās grāmatas gan ir svarīgas un stipras, bet tas cilvēks pats klāt būdams nespēcīgs un viņa valoda nievājama.
11 ౧౧ అలాంటి వారు తెలుసుకోవలసింది ఏంటంటే మేమక్కడ లేనపుడు ఉత్తరాల్లో రాసిన మాటల ప్రకారం ఏమి చెప్పామో మేమక్కడ ఉన్నప్పుడూ అలానే చేస్తాము.
Tas tāds lai zin, kādi mēs no tālienes esam ar vārdiem grāmatās, tādi pat mēs arī klāt būdami ar darbu.
12 ౧౨ తమను తామే మెచ్చుకొనే వారిలో ఒకరిగా ఉండడానికి గానీ వారితో పోల్చుకోడానికి గానీ మేము తెగించం. అయితే వారు తమకు తాము ఒకరిని బట్టి మరొకరు బేరీజు వేసుకుంటూ ఒకరితో ఒకరు పోల్చుకుంటూ ఉంటే వారు తెలివిలేని పని చేస్తున్నట్టు.
Jo nedrīkstam pieskaitīties jeb sevi līdzināt tādiem, kas paši sevi uzteic; bet viņi paši pie sevis mērodamies un paši sevi ar sevi līdzinādami ir neprātīgi.
13 ౧౩ మేమైతే మా స్థాయికి మించి అతిశయపడం, మిమ్మల్ని చేరగలిగేలా దేవుడు మాకు ఏర్పరచిన హద్దుల్లోనే ఉంటాం.
Bet mēs nelielīsimies pārlieku, bet pēc tā robežu mēra, ko Dievs mums ir nolicis, ka arī līdz pat jums esam nonākuši.
14 ౧౪ మేము మీ దగ్గరికి వచ్చినపుడు మా హద్దులు మీరలేదు. క్రీస్తు సువార్త మోసుకుంటూ మీ దాకా మొట్టమొదట వచ్చింది మేమే.
Jo mēs neizstiepjamies pārlieku, tā kā līdz jums nebūtu nonākuši, jo mēs arī līdz pat jums esam tikuši ar Kristus evaņģēliju;
15 ౧౫ మేము మా హద్దు మీరి ఇతరుల కష్ట ఫలంలో మాకు వంతు ఉన్నట్టు అతిశయపడము. అయితే మీ విశ్వాసం అభివృద్ధి అయ్యే కొద్దీ మా పరిధిలో పని ఇంకా ఎక్కువగా అభివృద్ది అవుతుందనీ, దాని వలన
Ne pārlieku lielīdamies ar cita darbiem, bet cerēdami, ka jūsu ticībai augot mēs pie jums savās robežās jo vairāk augsim lielumā,
16 ౧౬ మీకు అవతల ఉన్న ప్రాంతాల్లో కూడా సువార్త ప్రకటించాలనీ మా ఆశ. మరొకరి పరిధిలో జరుగుతున్న పని గురించి మేము అతిశయించం.
Tā ka mēs evaņģēliju varam pasludināt tiem, kas aiz jūsu robežām, un nelielīsimies ar to, kas svešā daļā jau pastrādāts.
17 ౧౭ అయితే, “అతిశయించేవాడు ప్రభువులోనే అతిశయించాలి.”
Bet kas lielās, lai lielās iekš Tā Kunga.
18 ౧౮ ప్రభువు మెచ్చుకొనే వాడే యోగ్యుడు గానీ తనను తానే మెచ్చుకొనేవాడు యోగ్యుడు కాడు.
Jo ne tas, kas pats sevi uzteic, ir derīgs, bet ko Tas Kungs uzteic.