< 2 కొరింథీయులకు 1 >

1 కొరింతులోని దేవుని సంఘానికీ అకయ ప్రాంతమంతటా ఉన్న పరిశుద్ధులందరికీ దేవుని సంకల్పం వలన క్రీస్తు యేసు అపొస్తలుడు అయిన పౌలు, మన సోదరుడు తిమోతి రాస్తున్న విషయాలు.
Xoossa shene mala Yesus Kiristoosas kitetida Phawulosapene nu isha Xiinttossape Qoronttosen diza Xoossa woosa keetheys qasseka Akaya biittan ammaniza kumetha asas.
2 మన తండ్రి అయిన దేవుని నుండీ యేసు క్రీస్తు ప్రభువు నుండీ మీకు కృప, శాంతి కలుగు గాక.
Nu Aawa Xoossafe Goda Yesus Kiristoossape kiyatethine saroy intes gido.
3 మన ప్రభువైన యేసు క్రీస్తు తండ్రి అయిన దేవునికి స్తుతి కలుగు గాక. ఆయన దయగల తండ్రి, అన్ని విధాలా ఆదరించే దేవుడు.
Maariza Aawasine wursika mintthethiza nu Goda Yesus Kiristoossa Aawas Xoossas galatay gido.
4 ఆయన మా కష్టాలన్నిటిలో మమ్మల్ని ఆదరిస్తున్నాడు. దేవుడు మాకు చూపిన ఆ ఆదరణ మేమూ చూపి ఎలాంటి కష్టాల్లో ఉన్నవారినైనా ఆదరించగలిగేలా ఆయన మమ్మల్ని ఆదరిస్తున్నాడు.
Nuka nu baggara Xoossafe demmida minotethan metotetizayta mintthethanas danda7ana mala nu meton izi nuna mintthethees.
5 క్రీస్తు పడిన బాధలు మాలో అధికమయ్యే కొద్దీ, క్రీస్తు ఆదరణ కూడా మాలో అంతకంతకూ అధికం అవుతూ ఉంది.
Kiristoosa waayey nu bolla daridaysa mala nuusika Kirstoossa baggara mintthethoy darees.
6 మాకు కష్టాలు వస్తే అవి మీ విమోచన కోసం, మీ ఆదరణ కోసం. మాకు ఆదరణ కలిగితే అది కూడా మీ ఆదరణ కోసమే. మాలాగే మీరూ పడుతున్న కష్టాలను సహించడానికి కావలసిన ఓర్పును ఈ ఆదరణ కలిగిస్తున్నది.
Nu meton inte atotethine minoteth demmista. Nuni metotishin qasse inteka kase ekida metoza mala gencci ekkid ministandista.
7 మీరు మా కష్టాలను ఎలా పంచుకుంటున్నారో అలాగే మా ఆదరణ కూడా పంచుకుంటున్నారని మాకు తెలుసు. అందుచేత మీ గురించి మాకు దృఢమైన ఆశాభావం ఉంది.
Nu meto inte nunara shaaki ekkida mala nunaraka inte ministanaysa nuni eriza gishshi nuusi inte bolla diza ufays gitako.
8 సోదరులారా, ఆసియ ప్రాంతంలో మేము పడిన బాధలు మీకు తెలియకుండా ఉండడం మాకిష్టం లేదు. మేము బతుకుతామనే నమ్మకం లేక, మా శక్తికి మించిన భారంతో పూర్తిగా కుంగిపోయాము.
Ta ishato Isiya biittan nu bolla gakida meto gishshi inte erana mala nu koyoos. He nu bolla gakida metozi nu tokkanape deexo gidida gishshi hayqontta paxxa daana giidi qopibeyko.
9 వాస్తవంగా, మాకు మరణదండన విధించినట్టు అనిపించింది. అయితే చనిపోయిన వారిని లేపే దేవుని మీద తప్ప, మా మీద మేము నమ్మకం ఉంచకుండేలా అలా జరిగింది.
Adafeka nuus nu bolla hayqo piriday piirdetida milatides; Hess wurikka nu bolla gakkida gaasoy nuni hayqidayta dentthiza Xoossan ammanetanassafe attin nu woliqan ammanetontta mala hanides.
10 ౧౦ ఆయన అలాటి భయంకరమైన ఆపద నుండి మమ్మల్నిరక్షించాడు, మళ్లీ రక్షిస్తాడు. ఆయన మీద మా నమ్మకం పెట్టుకున్నాము. మళ్ళీ మళ్ళీ ఆయన మమ్మల్ని తప్పిస్తాడు.
Izi nuna hessa mala qopontta hayqope ashides. Ha7ika wodepeka izi nuna ashanaysa nu amanetosu.
11 ౧౧ మా కోసం మీరు ప్రార్థన ద్వారా సహాయం చేస్తూ ఉంటే ఆయన దీన్ని చేస్తాడు. చాలామంది ప్రార్థనల వల్ల దేవుడు మమ్మల్ని కనికరించినందుకు ఎంతోమంది మా తరపున కృతజ్ఞత చెబుతారు.
Inteka nuna inte woossan madite. Daro asa woossan nuusu imetida imotasine nu gishshi daroti Xoossa galatetes.
12 ౧౨ మా అతిశయం ఇదే! దీనికి మా మనస్సాక్షి సాక్ష్యం. లౌకిక జ్ఞానంతో కాక దేవుడు ప్రసాదించే సదుద్దేశంతో యథార్థతతో దేవుని కృపనే అనుసరించి, లోకంలో మరి ముఖ్యంగా మీ పట్ల నడుచుకున్నాము.
Histiko nu ceqeteth hayssa malako. Ha alamezan harapeka intesara nusara diza gaytotethan, Xoossafe gidida geeshatethaninne suretethan nu deydayssa nu wozinay nuusu markatees. Hessika asa cinccatethan giddontta Xoossa kiiyatethanko.
13 ౧౩ మీరు చదివి అర్థం చేసుకోలేని సంగతులేవీ మీకు రాయడం లేదు.
Inte nababid eranas danda7ontta miishi nu intes xaafoko. Inte wursika nababid eranaysa nu erosu.
14 ౧౪ మీరు ఇప్పటికే కొంతవరకూ మమ్మల్ని అర్థం చేసుకున్నారు. కడవరకూ అర్థం చేసుకుంటారని ఆశాభావంతో ఉన్నాం. మన యేసు ప్రభువు దినాన, మీరు మాకూ, మేము మీకూ గర్వ కారణంగా ఉంటాం.
Inte nunan ceeqetizayssa mala nuka intenan ceeqetizayssa ha7i wurs erontta aggikoka Goda Yesusay simmi yiza gallas wursika erandista.
15 ౧౫ ఈ నమ్మకంతో నేను మొదట మీ దగ్గరికి రావాలనుకున్నాను. దీనివలన మీకు రెండు సార్లు ప్రయోజనం కలగాలని నా ఉద్దేశం.
Tani hayssa shaaka eriza gishshi nam77uto inte go7etana mala koyro intena beyana qofadis.
16 ౧౬ మాసిదోనియకు వెళ్తూ ఉన్నపుడు మిమ్మల్ని కలుసుకుని మాసిదోనియ నుండి మళ్ళీ మీ దగ్గరికి రావాలనీ, తరువాత మీరు నన్ను యూదయకు సాగనంపగలరనీ అనుకున్నాను.
Hessika ta kase maqedoniya bashe intena beyada Maqedoniyapeka simmashe inte achara adhada ta Yuda bishin inte tana maadana mala qopadisikoshin.
17 ౧౭ నేను ఇలా ఆలోచించి చపలచిత్తంగా నడచుకున్నానా? నేను “అవును, అవును” అన్న తరువాత, “కాదు, కాదు” అంటూ లౌక్యంగా ప్రవర్తిస్తున్నానా?
Hayssi ta qofay intes ta lo7etha qopontta qofa milatizee? Woyko hanko dere asas dose gididayssatho taka issito ero ero qasseka akaye akaye giza milatizee?
18 ౧౮ అయితే దేవుడు నమ్మదగినవాడు. మేము, “అవును” అని చెప్పి, “కాదు” అనం.
Xoossi ammanetida Xoossu gidida mala nu intes yootiza qalayka “Ee” giid “Akaye” gizaz gidena.
19 ౧౯ నేనూ, సిల్వానూ, తిమోతీ, మీకు ప్రకటించిన దేవుని కుమారుడు యేసు క్రీస్తు “అవును” అని చెప్పి, “కాదు” అనేవానిగా ఉండలేదు. ఆయన ఎప్పుడూ, “అవును” అనేవానిగానే ఉన్నాడు.
Gaasoyka tana gidin woykko silasene Xiinttosa gidin nu intes sabakida Xoossa na Yesus Kiristossay “Eenne” “Akaye” gidena. Gido attin wurso wode izan “Ee” xalalay dees.
20 ౨౦ దేవుని వాగ్దానాలన్నీ క్రీస్తులో, “అవును” గానే ఉన్నాయి. కాబట్టి దేవుని మహిమ కోసం ఆయన ద్వారా మనం, “ఆమెన్” అంటున్నాం.
Xoossafe imetida ufaysati wurikka “Ee” gididay izanko. Nuka iza baggara Xoossa bonchosu “Amini7i” gizay hessa gishshikko.
21 ౨౧ క్రీస్తులో మిమ్మల్నీ మమ్మల్నీ స్థిరపరిచేది దేవుడే. ఆయనే మనలను అభిషేకించి
Hessa gishshi inteka nunika Kiristoossan minni eqana malane ba oothos dooriday Xoossuko.
22 ౨౨ మనం తన వాళ్ళమన్న ముద్ర మనపై వేసాడు, మన హృదయాల్లో తన ఆత్మను హామీగా ఇచ్చాడు.
Nu izayta gididayssa erisanas ba matame nu bolla shoccidayne nu sintthafe demana miishshas ayana waseteth nu wozinan wothiday izako.
23 ౨౩ మిమ్మల్ని నొప్పించడం ఇష్టం లేక నేను కొరింతుకు మళ్ళీ రాలేదు. దీనికి దేవుడే నా సాక్షి.
Tani Qoronttosa simmada inteko yoontta agiday intena mishisike gaadako qasse hessi tumu gidontta wordo gidiko Xoossi ta bolla markato.
24 ౨౪ మీ విశ్వాసం మీద పెత్తనం చెలాయించే ఉద్దేశం మాకు లేదు. మీరు మీ విశ్వాసంలో నిలిచి ఉండగా మీ ఆనందం కోసం మీతో కలిసి పని చేస్తున్నాము.
Inte ammanon eqida gishshi intena ufaysanas nu intenara oothana attin inte ammano bolla godatanas gidena.

< 2 కొరింథీయులకు 1 >