< దినవృత్తాంతములు~ రెండవ~ గ్రంథము 1 >
1 ౧ దావీదు కుమారుడు సొలొమోను తన పరిపాలనలో చక్కగా స్థిరపడ్డాడు. అతని దేవుడు యెహోవా అతనికి తోడుగా ఉండి అతణ్ణి చాలా శక్తిశాలిగా చేశాడు.
Ɔhene Dawid babarima Salomo sɔɔ ahennie no mu den, ɛfiri sɛ Awurade, ne Onyankopɔn kaa ne ho maa no tumi a ɛso.
2 ౨ సొలొమోను దాని గురించి ఇశ్రాయేలీయులందరికీ అంటే సహస్రాధిపతులతో శతాధిపతులతో న్యాయాధిపతులతో ఇశ్రాయేలీయుల పూర్వీకుల కుటుంబాల పెద్దలతో మాట్లాడాడు.
Ɔfrɛɛ Israel nyinaa, asahene ne asraadɔm ntuanofoɔ, atemmufoɔ, amanyɛ ne mmusua ntuanofoɔ nyinaa.
3 ౩ అప్పుడు వారంతా సొలొమోనుతో కలసి గిబియోనులో ఉన్న బలిపీఠం దగ్గరికి వెళ్ళారు. యెహోవా సేవకుడు మోషే అరణ్యంలో చేయించిన దేవుని ప్రత్యక్ష గుడారం గిబియోనులో ఉంది.
Na Salomo dii nnipa no nyinaa anim kɔɔ bepɔ Gibeon so hɔ baabi a wɔde Onyankopɔn Ahyiaeɛ Ntomadan no asie. Yei yɛ Ntomadan a Mose a ɔyɛ Awurade ɔsomfoɔ sii wɔ ɛserɛ no so no.
4 ౪ దావీదు రాజుగా ఉన్నప్పుడు అతడు దేవుని మందసాన్ని కిర్యత్యారీము నుండి తెప్పించి యెరూషలేములో తాను సిద్ధం చేసిన చోట గుడారం వేసి అక్కడ ఉంచాడు.
Na Dawid ayi Onyankopɔn Adaka no afiri Kiriat-Yearim de kɔ ntomadan sononko bi a wasi wɔ Yerusalem mu.
5 ౫ అక్కడ యెహోవా నివాసస్థలం ముందు హూరు మనవడు ఊరీ కొడుకు బెసలేలు చేసిన ఇత్తడి బలిపీఠం ఉంది. సొలొమోను, సమాజం వారంతా దాని దగ్గర విచారణ చేశారు.
Nanso, na kɔbere mfrafraeɛ afɔrebukyia a Hur nana a ɔyɛ Uri babarima Besaleel siiɛ no da so wɔ Gibeon, wɔ Awurade Asɔredan no anim. Enti, Salomo ne nnipa no boaa wɔn ho ano wɔ hɔ, bisaa Awurade akwankyerɛ.
6 ౬ సొలొమోను ప్రత్యక్ష గుడారం దగ్గర యెహోవా సన్నిధి లోని ఇత్తడి బలిపీఠం దగ్గరకి వెళ్లి దాని మీద వెయ్యి దహనబలులు అర్పించాడు.
Hyiadan no anim hɔ, Salomo foro kɔɔ kɔbere mfrafraeɛ afɔrebukyia no ho wɔ Awurade anim, bɔɔ ɔhyeɛ afɔdeɛ ahodoɔ apem wɔ so.
7 ౭ ఆ రాత్రి దేవుడు సొలొమోనుకు ప్రత్యక్షమయ్యాడు. “నేను నీకు ఏమి ఇవ్వాలో అడుగు” అన్నాడు.
Ɛda no anadwo, Onyankopɔn yii ne ho adi wɔ daeɛ mu kyerɛɛ Salomo, bisaa no sɛ, “Ɛdeɛn na wopɛ? Bisa na mede bɛma wo!”
8 ౮ సొలొమోను దేవునితో ఇలా మనవి చేశాడు. “నీవు నా తండ్రి దావీదు మీద ఎంతో నిబంధన కృప చూపించి అతని స్థానంలో నన్ను రాజుగా నియమించావు.
Salomo buaa Onyankopɔn sɛ, “Wodii mʼagya Dawid nokorɛ na woyɛɛ no adɔeɛ, na afei wode me asi nʼanan mu sɛ ɔhene.
9 ౯ కాబట్టి యెహోవా దేవా, నీవు నా తండ్రి దావీదుకు చేసిన వాగ్దానాన్ని నెరవేర్చు. నేల ధూళి వలే ఉన్న విస్తారమైన ప్రజలకు నీవు నన్ను రాజును చేశావు.
Na afei Awurade Onyankopɔn, mesrɛ wo di ɛbɔ a wohyɛɛ mʼagya Dawid no so, ɛfiri sɛ wode me asi nnipa a wɔn dodoɔ te sɛ asase so mfuturo so ɔhene.
10 ౧౦ ఇంత గొప్ప జన సమూహానికి న్యాయం తీర్చే శక్తి ఎవరికుంది? నేను ఈ ప్రజల మధ్య పనులు చక్కపెట్టడానికి సరిపడిన జ్ఞానమూ తెలివీ నాకు దయచెయ్యి.”
Ma me nyansa ne nimdeɛ, na memfa nni wɔn so yie, na hwan koraa na ɔbɛtumi adi wo ɔman kɛseɛ sei so?”
11 ౧౧ అందుకు దేవుడు సొలొమోనుతో ఇలా అన్నాడు. “నీవు ఈ విధంగా ఆలోచించి, ఐశ్వర్యాన్నీ ధనాన్నీ ఘనతనీ నీ శత్రువుల ప్రాణాన్నీ దీర్ఘాయుష్షునూ అడగకుండా, నేను ఎవరి మీదైతే నిన్ను రాజుగా నియమించానో ఆ నా ప్రజలకి న్యాయం తీర్చడానికి కావలసిన జ్ఞానాన్నీ తెలివినీ అడిగావు.
Onyankopɔn ka kyerɛɛ Salomo sɛ, “Esiane sɛ wʼahiasɛm kɛseɛ ne sɛ wopɛ sɛ woboa wo manfoɔ, na woammisa ahodeɛ, animuonyam anaa wʼatamfoɔ wuo anaa nkwa tenten, na mmom, wobisaa nyansa ne nimdeɛ a wode bɛdi me nkurɔfoɔ so yie enti,
12 ౧౨ కాబట్టి జ్ఞానం, తెలివీ రెండూ నీకిస్తాను. అంతేగాక నీకు ముందు గానీ, నీ తరవాత గానీ వచ్చే రాజులకెవరికీ లేనంత ఐశ్వర్యాన్నీ ధనాన్నీ గొప్ప పేరునూ నీకిస్తాను.”
mɛma wo nyansa ne nimdeɛ a wobisaeɛ no. Afei, mɛma wo sika, ahodeɛ ne animuonyam a ɔhene biara a wadi wʼanim no nnyaa bi da, nanso ɔrennya no saa da biara da.”
13 ౧౩ తరువాత సొలొమోను గిబియోనులో ఉన్న సమాజపు గుడారం ముందున్న బలిపీఠం దగ్గర నుంచి యెరూషలేముకు వచ్చి ఇశ్రాయేలీయులను పరిపాలించసాగాడు.
Na Salomo firii hyiadan a ɛwɔ Gibeon bepɔ no so no mu sane kɔɔ Yerusalem kɔdii ɔhene wɔ Israel so.
14 ౧౪ సొలొమోను, రథాలనూ గుర్రపు రౌతులనూ సమకూర్చుకున్నాడు. అతనికి 1, 400 రథాలుండేవి. 12,000 గుర్రపు రౌతులూ ఉండేవారు. వీటిలో కొన్నిటిని రథాలుండే పట్టణాల్లో, కొన్నిటిని తన దగ్గర ఉండటానికి యెరూషలేములో ఉంచాడు.
Salomo boaboaa asraadɔm a wɔdɔɔso yie a na nteaseɛnamkafoɔ apem ahanan ne apɔnkɔ ɔpedumienu ka ho ano. Ɔmaa wɔn mu dodoɔ no tenaa nteaseɛnam nkuropɔn mu, na ebi nso tena bɛnee no wɔ Yerusalem.
15 ౧౫ రాజు యెరూషలేములో వెండి బంగారాలను రాళ్ళ వలె విస్తారంగా, సరళ మాను కలపను కొండ ప్రాంతాల్లో దొరికే మేడిచెట్లంత విస్తారంగా పోగుచేశాడు.
Salomo ɛberɛ so no, dwetɛ ne sikakɔkɔɔ buu so sɛ aboɔ wɔ Yerusalem. Na ntweneduro aboɔden nnua nso buu so sɛ akyee nnua a na abu so wɔ Yuda mmepɔ ayaase no.
16 ౧౬ సొలొమోను తన గుర్రాలను ఐగుప్తు నుండీ కవే ప్రాంతం నుండీ తెప్పించాడు. రాజు పంపిన వర్తకులు తగిన ధర చెల్లించి కవే ప్రాంతం నుండి వాటిని తెచ్చారు.
Na wɔkra Salomo apɔnkɔ no firi Misraim ne Kilikia, ɛfiri sɛ, na ɔhene adwadifoɔ no nya no yie wɔ Kilikia.
17 ౧౭ వారు ఐగుప్తు నుండి తెచ్చిన రథం ఒక్కదానికి 600 తులాల వెండినీ, గుర్రం ఒక్కదానికి 150 తులాల వెండినీ ధరగా చెల్లించారు. వారు వాటిని హిత్తీయులకూ, సిరియా రాజులకూ కూడా ఎగుమతి చేశారు.
Saa ɛberɛ no, na wɔtumi tɔ Misraim nteaseɛnam a wɔde ba Yerusalem no nnwetɛbena kilogram nson, na apɔnkɔ nso, wɔtumi tɔ no nnwetɛbena kilogram mmienu. Wɔn nso kɔtontɔnn wɔn mu pii nso maa Hetifoɔ ne Aram ahemfo.