< దినవృత్తాంతములు~ రెండవ~ గ్రంథము 8 >
1 ౧ సొలొమోను యెహోవా మందిరాన్ని, తన అంతఃపురాన్నీ కట్టించడానికి 20 సంవత్సరాలు పట్టింది. ఆ తరవాత
Stalo se potom po přeběhnutí dvadcíti let, v nichž stavěl Šalomoun dům Hospodinův a dům svůj,
2 ౨ హీరాము తనకిచ్చిన పట్టణాలను సొలొమోను తిరిగి కట్టించి వాటిలో ఇశ్రాయేలీయులు నివాసం ఉండేలా చేశాడు.
Že vystavěl Šalomoun města, kteráž byl dal Chíram Šalomounovi, a osadil tam syny Izraelské.
3 ౩ తరువాత సొలొమోను హమాతుసొబా పై దాడి చేసి దాన్ని స్వాధీనం చేసుకున్నాడు.
Zatím táhl Šalomoun do Emat Soby, a zmocnil se jí.
4 ౪ అరణ్య ప్రాంతంలో ఉండే తద్మోరుకు, హమాతు దేశంలో ఖజానా ఉంచే పట్టణాలన్నిటికీ ప్రాకారాలు కట్టించాడు.
I ustavěl Tadmor na poušti, a všecka města skladů vystavěl v Emat.
5 ౫ ఇంకా అతడు ఎగువ బేత్ హోరోను, దిగువ బేత్ హోరోను పట్టణాలకి ప్రాకారాలు, ద్వారాలు, అడ్డగడలు కట్టించాడు.
Vystavěl i Betoron hořejší, též i Betoron dolejší, města ohrazená zdmi, branami i závorami.
6 ౬ బాలాతునూ, తనకున్న ధాన్యం నిలవచేసే ఊళ్ళనూ, తన రథాలు, గుర్రపు రౌతులు ఉండడానికి పట్టణాలనూ కట్టించాడు. ఇంకా యెరూషలేములో, లెబానోనులో, తాను పాలించే దేశాలన్నిటిలో తనకు నచ్చిన రీతిలో పట్టాణాలన్నిటినీ సొలొమోను కట్టించాడు.
Ano i Baalat a všecka města, v nichž měl sklady Šalomoun, a všecka města vozů, i města jízdných, všecko vedlé žádosti své, cožkoli chtěl stavěti v Jeruzalémě a na Libánu, i po vší zemi panování svého.
7 ౭ ఇశ్రాయేలీయులకు చెందని హిత్తీయులు, అమోరీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు, యెబూసీయులు అనే వారందరిలో మిగిలి ఉన్న వారిని
Všecken také lid, kterýž byl pozůstal z Hetejských, a Amorejských a Ferezejských, a Hevejských a Jebuzejských, kteříž nebyli z Izraele,
8 ౮ ఇశ్రాయేలీయులు నాశనం చేయకుండా విడిచిపెట్టిన వివిధ జాతుల ప్రజలనూ సొలొమోను ఇప్పటి వరకూ తనకు కట్టు బానిసలుగా చేసుకున్నాడు.
Z synů jejich, kteříž byli pozůstali po nich v zemi té, jichž byli nevyhubili synové Izraelští, uvedl Šalomoun pod plat až do tohoto dne.
9 ౯ అయితే ఇశ్రాయేలీయుల్లో ఒక్కణ్ణి కూడా సొలొమోను తన దగ్గర పనిచేయడానికి దాసుడుగా నియమించుకోలేదు. వారిని సైనికులుగా, ప్రధానులుగా, తన సైన్యాధిపతులుగా రథాలకీ గుర్రపు రౌతులకీ అధిపతులుగా నియమించాడు.
Ale z synů Izraelských, jichž nepodrobil Šalomoun v službu při díle svém, (nebo oni byli muži bojovní a přední knížata jeho, úředníci nad vozy a jezdci jeho),
10 ౧౦ వీరిలో సమర్ధులైన 250 మంది సొలొమోను రాజు కింద అధిపతులై ప్రజల మీద అధికారులుగా ఉన్నారు.
Z těch, pravím, bylo předních vládařů, kteréž měl král Šalomoun, dvě stě a padesáte, kteříž panovali nad lidem.
11 ౧౧ “ఇశ్రాయేలీయుల రాజైన దావీదు పట్టణంలో నా భార్య నివాసం చేయకూడదు. యెహోవా మందసం ఉన్న స్థలాలు పవిత్రమైనవి” అని చెప్పి, సొలొమోను ఫరో కుమార్తెను దావీదు పట్టణం నుండి తాను ఆమె కోసం కట్టించిన నగరానికి తీసుకు వచ్చాడు.
Dceru pak Faraonovu přestěhoval Šalomoun z města Davidova do domu, kterýž jí byl vystavěl. Nebo řekl: Nemohlať by bydliti manželka má v domě Davida krále Izraelského, nebo svatý jest, proto že vešla do něho truhla Hospodinova.
12 ౧౨ అప్పటినుండి సొలొమోను తాను మంటపం ముందు కట్టించిన యెహోవా బలిపీఠం మీద దహనబలులు అర్పిస్తూ వచ్చాడు.
Tedy obětoval Šalomoun zápaly Hospodinu na oltáři Hospodinovu, kterýž byl vzdělal před síní,
13 ౧౩ అతడు అనుదిన ఏర్పాటు ప్రకారం మోషే ఇచ్చిన ఆజ్ఞను బట్టి విశ్రాంతి దినాల్లో, అమావాస్య రోజుల్లో, సంవత్సరానికి మూడు సార్లు జరిగే నియామక పండగ రోజుల్లో, అంటే పొంగని రొట్టెల పండగ, వారాల పండగ, పర్ణశాలల పండగ రోజుల్లో యెహోవాకు దహనబలులు అర్పిస్తూ వచ్చాడు.
Cokoli náležitě každého dne obětováno býti mělo podlé přikázaní Mojžíšova, ve dny sobotní, na novměsíce a na slavnosti, po třikrát do roka, na slavnost přesnic, na slavnost téhodnů, a na slavnost stánků.
14 ౧౪ అతడు తన తండ్రి దావీదు జారీ చేసిన ఆజ్ఞలననుసరించి వారి వారి సేవా కార్యాలు చేయడానికి వారి వారి వంతుల ప్రకారం యాజకులనూ, కట్టడను అనుసరించి ప్రతి రోజూ యాజకుల ముందు స్తుతి చేయడానికీ ఉపచారం చేయడానికీ వారి వంతుల ప్రకారం లేవీయులనూ ప్రతి ద్వారం దగ్గరా కాపలా ఉండడానికి వారి వంతుల ప్రకారం ద్వారపాలకులనూ నియమించాడు. దైవసేవకుడు దావీదు ఆ విధంగానే ఆజ్ఞాపించాడు.
Ustanovil také podlé nařízení Davida otce svého pořádky kněžské k úřadům jejich, a Levíty ku povinnostem jejich, aby chválili Boha, a přisluhovali při kněžích náležitě každého dne, a vrátné v pořádcích jejich u jedné každé brány; nebo tak byl rozkaz Davida muže Božího.
15 ౧౫ ఏ విషయం గూర్చి అయినా, ఖజానాల గూర్చి అయినా రాజు యాజకులకు, లేవీయులకు చేసిన ఏర్పాటు ప్రకారం వారు అన్ని విషయాలూ జరిగించేవారు.
Aniž se uchýlili od rozkázaní králova kněžím a Levítům při všeliké věci i při pokladích.
16 ౧౬ యెహోవా మందిరానికి పునాది వేసిన రోజు నుండి అది పూర్తయ్యే వరకూ సొలొమోను ఆ పని సంపూర్ణంగా చేయించాడు. ఆ విధంగా యెహోవా మందిరం పని సమాప్తమయ్యింది.
A když dostrojeno bylo všecko dílo Šalomounovo od toho dne, v němž založen byl dům Hospodinův, až do vystavení jeho, a tak dokonán byl dům Hospodinův,
17 ౧౭ సొలొమోను ఎదోము దేశపు సముద్ర తీరంలో ఉన్న ఎసోన్గెబెరుకు, ఏలతుకు వెళ్ళాడు.
Tedy jel Šalomoun do Aziongaber a do Elat při břehu mořském v zemi Idumejské.
18 ౧౮ హీరాము తన పనివారి ద్వారా ఓడలనూ ఓడ నడిపే నైపుణ్యం గల పనివారిని పంపాడు. వీరు సొలొమోను పనివారితో కలిసి ఓఫీరుకు వెళ్ళి అక్కడనుండి 900 మణుగుల బంగారాన్ని ఆ ఓడలపై ఎక్కించుకుని సొలొమోను రాజు కోసం తీసుకు వచ్చారు.
I poslal jemu Chíram po služebnících svých lodí, a služebníky umělé na moři, kteříž plavivše se s služebníky Šalomounovými do Ofir, nabrali odtud čtyři sta a padesáte centnéřů zlata, a přinesli je králi Šalomounovi.