< దినవృత్తాంతములు~ రెండవ~ గ్రంథము 34 >
1 ౧ యోషీయా పరిపాలించడం మొదలుపెట్టినప్పుడు 8 ఏళ్ల వాడు. అతడు యెరూషలేములో 31 ఏళ్ళు పాలించాడు.
Josiah was eight years old when he became the king [of Judah]. He ruled from Jerusalem for 31 years.
2 ౨ అతడు యెహోవా దృష్టిలో సరిగా ప్రవర్తించాడు. తన పూర్వీకుడైన దావీదు మార్గాల్లో నడుస్తూ కుడికిగానీ ఎడమకుగానీ తొలగలేదు.
He did things that were pleasing to Yahweh and conducted his life like his ancestor King David had done. He fully obeyed [IDM] all the laws of God.
3 ౩ తన పాలన 8 వ సంవత్సరంలో తానింకా బాలుడుగా ఉండగానే అతడు తన పూర్వీకుడైన దావీదు దేవుణ్ణి వెతకడం మొదలుపెట్టాడు. తన 12 వ ఏట అతడు ఉన్నత పూజాస్థలాలనూ అషేరా దేవతాస్తంభాలనూ పడగొట్టి, చెక్కిన విగ్రహాలనూ పోత విగ్రహాలనూ తీసివేసి, యూదానూ యెరూషలేమునూ శుద్ధి చేయడం మొదలు పెట్టాడు.
When he had been ruling for almost eight years, while he was still a young man, he began to worship God like his ancestor [King] David had done. Four years later, he began to get rid of all the pagan shrines on hilltops in Jerusalem and in [other places in] Judah, and the poles to [honor the goddess] Asherah, and the carved idols and statues of gods.
4 ౪ అతడు చూస్తుండగానే ప్రజలు బయలు దేవుడి బలిపీఠాలను పడగొట్టారు. వాటిపైన ఉన్న ధూప వేదికలను నరికివేశారు. అషేరా దేవత స్తంభాలనూ, చెక్కిన విగ్రహాలనూ, పోతవిగ్రహాలనూ పగలగొట్టి పొడి చేసేశారు. వాటికి బలులు అర్పించిన వారి సమాధుల మీద ఆ పొడి చల్లారు.
While he directed them, his workers tore down the altars where people worshiped Baal. They smashed the altars that were near those altars, where people burned incense. They smashed the poles [honor the goddess] Asherah and the idols and statues. They smashed them to bits and scattered the bits over the graves of those who had offered sacrifices to them.
5 ౫ ఆ పూజారుల ఎముకలను వాళ్ళ బలిపీఠాల మీద అతడు కాల్పించి, యూదానూ యెరూషలేమునూ శుద్ధి చేశాడు.
They burned the bones of the priests [who had offered sacrifices]; they burned them on their own altars. In that way Josiah caused Jerusalem and other places in Judah to be acceptable places to worship Yahweh again.
6 ౬ అలాగే అతడు మనష్షే, ఎఫ్రాయిము, షిమ్యోను వారి పట్టణాల్లో నఫ్తాలి వరకూ వాటి చుట్టు పక్కల ఉన్న శిథిలాల్లో కూడా బలిపీఠాలను పడగొట్టాడు.
In the towns in [the tribes of] Manasseh, Ephraim, and Simeon, and as far [north] as [the tribe of] Naphtali and in the ruins around all those towns,
7 ౭ అతడు బలిపీఠాలనూ అషేరా దేవత స్తంభాలనూ పడగొట్టి చెక్కిన విగ్రహాలను పొడి చేసి, ఇశ్రాయేలీయుల దేశమంతటా ఉన్న ధూపవేదికలను నరికి వేసి, యెరూషలేముకు తిరిగి వచ్చాడు.
Josiah’s [workers] tore down the pagan altars and the poles to [honor the goddess] Asherah, and crushed the idols to powder. They also smashed to pieces all the altars for burning incense throughout Israel. Then Josiah returned to Jerusalem.
8 ౮ అతని పాలనలో 18 వ ఏట దేశాన్నీ మందిరాన్నీ బాగు చేయించిన తరువాత, అతడు అజల్యా కొడుకు షాఫానునూ పట్టణ అధిపతి మయశేయానునూ కార్యదర్శి యోహాహాజు కొడుకు యోవాహాజునూ తన దేవుడైన యెహోవా మందిరాన్ని బాగుచేయడానికి పంపాడు.
When Josiah had been ruling for almost 18 years, he [did something else to] cause the land and the temple to be acceptable places to worship Yahweh. He sent Shaphan the son of Azaliah and Maaseiah the governor of the city and Joah the son of Joahaz, who wrote on a scroll what happened in the city, to repair the temple of Yahweh.
9 ౯ వారు ప్రధానయాజకుడైన హిల్కీయా దగ్గరికి వచ్చి, అంతకు ముందు దేవుని మందిరంలోకి తీసుకు వచ్చిన డబ్బును అతనికి అప్పగించారు. ద్వారపాలకులైన లేవీయులు మనష్షే ఎఫ్రాయిమీయుల దేశాల్లోని ఇశ్రాయేలు వారిలో మిగిలి ఉన్న వారందరి దగ్గరనుంచి, యూదా బెన్యామీనీయులందరి దగ్గరనుంచి ఆ డబ్బు సమకూర్చారు.
They went to Hilkiah the Supreme Priest and gave him the money that had been brought to the temple. That was the money that the descendants of Levi who guarded the doors of the temple had collected from the people of [the tribes of] Manasseh and Ephraim and [other places in northern] Israel, and also from all the people in Jerusalem and other places in the tribes of Judah and Benjamin.
10 ౧౦ వారు ఆ డబ్బుని యెహోవా మందిరపు పనిమీద ఉన్న తనిఖీదారులకు అప్పగించారు. వారు దాన్ని బాగు చేయడానికీ యూదా రాజులు నిర్లక్ష్యం చేసిన ఇళ్ళకు దూలాలను అమర్చడానికీ
Then Hilkiah gave some of the money to the men who had been appointed to supervise the work of repairing the temple. The supervisors paid the men who did the repair work.
11 ౧౧ చెక్కిన రాళ్లను జోడించడానికీ మ్రానులు కొనడానికీ యెహోవా మందిరంలో పనిచేసేవారికీ శిల్పకారులకూ ఆ డబ్బులిచ్చారు.
They also gave some of the money to the carpenters and builders to buy the cut stones and the timber for the joists and the beams for the buildings that the kings of Judah had allowed to decay.
12 ౧౨ ఆ మనుష్యులు నమ్మకంగా ఆ పని చేశారు. వారి మీద తనిఖీదారులు ఎవరంటే, లేవీ గోత్రీకుల్లో మెరారీ వంశం వారైన యహతు, ఓబద్యా, కహాతు వంశీకులు జెకర్యా, మెషుల్లాము. పని నడిపించడానికి ఏర్పాటైన లేవీయులంతా వాయిద్యాలు వాయించడంలో ఆరితేరిన వారు.
The workers did their work faithfully. Their supervisors were Jahath and Obadiah, who were descendants of [Levi’s son] Merari, and Zechariah and Meshullam, who were descendants of [Levi’s son] Kohath. All the other descendants of Levi, those who played musical instruments well,
13 ౧౩ బరువులు మోసేవారి మీదా ప్రతిరకమైన పని జరిగించేవారిమీదా ఆ లేవీయులను తనిఖీదారులుగా నియమించారు. లేవీయుల్లో కొంతమందిని కార్యదర్శకులుగానూ, పరిచారకులుగానూ, ద్వారపాలకులుగానూ నియమించారు.
supervised all the workers as they did their various jobs. Some of the descendants of Levi were secretaries and some kept records and some guarded the gates [of the temple].
14 ౧౪ యెహోవా మందిరంలోకి తెచ్చిన డబ్బును బయటికి తీసుకు వచ్చినప్పుడు, మోషేద్వారా యెహోవా అందించిన ధర్మశాస్త్రగ్రంథం యాజకుడైన హిల్కీయాకు కనిపించింది.
While they were giving to the supervisors the money that had been taken to the temple, Hilkiah the [Supreme] Priest found a scroll on which were written the laws that Yahweh had told Moses to give to the people.
15 ౧౫ అప్పుడు హిల్కీయా “యెహోవా మందిరంలో ధర్మశాస్త్ర గ్రంథం నాకు దొరికింది” అని శాస్త్రి అయిన షాఫానుతో చెప్పి ఆ గ్రంథాన్ని షాఫానుకు అప్పగించాడు.
So Hilkiah said to Shaphan, “I have found in the temple a scroll on which are written the laws [that God gave to Moses]!” Then Hilkiah gave the scroll to Shaphan.
16 ౧౬ షాఫాను ఆ గ్రంథాన్ని రాజు దగ్గరికి తీసుకుపోయి రాజుతో ఇలా అన్నాడు. “నీ సేవకులకు నీవు ఆజ్ఞాపించినదంతా వారు చేస్తున్నారు.
Shaphan [took the scroll] to the king and said to him, “Your officials are doing everything that you told them to do.
17 ౧౭ యెహోవా మందిరంలో దొరికిన డబ్బుని వారు పోగు చేసి తనిఖీదారుల చేతికీ పనివారి చేతికీ అప్పగించారు.”
They have taken the money that was in the temple, and they have given it to the men who will supervise the workers who will repair the temple.”
18 ౧౮ “యాజకుడైన హిల్కీయా నాకు ఒక గ్రంథం ఇచ్చాడు” అని లేఖకుడు షాఫాను, రాజుకు చెప్పి, దాన్ని రాజు ఎదుట చదివి వినిపించాడు.
Then Shaphan said to the king, “[I have brought to you] a scroll [that] Hilkiah gave to me.” And Shaphan started to read it to the king.
19 ౧౯ అతడు ధర్మశాస్త్రపు మాటలు చదివి వినిపించినప్పుడు రాజు విని తన బట్టలు చించుకుని
When the king heard the laws [that were written in the scroll], he tore his clothes [because he was very dismayed/worried].
20 ౨౦ హిల్కీయాకూ, షాఫాను కొడుకు అహీకాముకూ, మీకా కొడుకు అబ్దోనుకూ, శాస్త్రి అయిన షాఫానుకూ, రాజు సేవకుడు అశాయాకూ ఇలా ఆజ్ఞాపించాడు,
Then he gave these instructions to Hilkiah, to Shaphan’s son Ahikam, to Micah’s son Abdon, to Shaphan, and to Asaiah the king’s special advisor:
21 ౨౧ “మీరు వెళ్లి దొరకిన ఈ గ్రంథంలోని మాటల గురించి నాకోసం ఇశ్రాయేలు యూదాలో మిగిలిన వారి కోసం యెహోవా చిత్తాన్ని అడగండి. మన పూర్వీకులు ఈ గ్రంథంలో రాసిన మాటలను పట్టించుకోలేదు, దానిలో రాసిన వాటన్నిటి ప్రకారం చేయలేదు కాబట్టి యెహోవా మనమీద తన కోపాన్ని చాలా ఎక్కువగా కుమ్మరించాడు.”
“Go and ask Yahweh for me, and for all his people who are still alive in Judah and Israel, about what is written in this scroll that has been found. Because [it is clear that] Yahweh is very angry with us because our ancestors disobeyed what Yahweh said; they did not obey the laws that are written on this scroll.”
22 ౨౨ అప్పుడు హిల్కీయా, రాజు నియమించినవారూ హుల్దా అనే ప్రవక్త్రి దగ్గరికి వెళ్ళారు. ఆమె షల్లూము భార్య. అతడు తిక్వా కొడుకు, వస్త్రశాల తనిఖీదారుడైన హస్రా మనుమడు. ఆమె అప్పుడు యెరూషలేముకు చెందిన రెండవ భాగంలో నివసించేది. వారు ఆమెతో విషయం చెప్పారు.
So Hilkiah and the others went to talk with a woman whose name was Huldah, who was a prophetess who lived in the newer part of Jerusalem. Her husband Shallum who was the son of Tikvah, took care of the robes that were worn [in the temple].
23 ౨౩ ఆమె వారితో ఇలా చెప్పింది. “ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా చెప్పేది ఏంటంటే,
[When they told her what the king had said, ] she said to them, “This is what Yahweh, the God whom we Israelis [worship], says: ‘Go back and tell the king who sent you
24 ౨౪ ‘వినండి, నేను ఈ స్థలం మీదికీ, దానిలో నివసించేవారి మీదికీ విపత్తు తీసుకు రాబోతున్నాను, యూదా రాజు ఎదుట చదివి వినిపించిన గ్రంథంలో రాసిన శాపాలన్నీ రప్పిస్తాను.
that this is what Yahweh says: “Listen to this carefully. I am going to cause a disaster to strike Jerusalem and all the people who live here. I will cause them to experience the curses that were written in the scroll that was read to the king of Judah.
25 ౨౫ వారు నన్ను విడిచి పెట్టి ఇతర దేవుళ్ళకు ధూపం వేసి, తమ పనులతో నాకు కోపం పుట్టించారు కాబట్టి నా కోపాన్ని ఈ స్థలం మీద కుమ్మరిస్తాను. అది ఆరదు.’ అయితే, యెహోవా చిత్తాన్ని తెలుసుకోడానికి నాదగ్గరికి మిమ్మల్ని పంపిన యూదా రాజుకు ఈ విషయం తెలియచేయండి,
I will do that because they have rejected me, and they burn incense to [honor] other gods. They have caused me to become very angry because of all the idols that they have made (OR, because of all the wicked things that they have done), [and my anger is like] a fire that will not be extinguished.
26 ౨౬ నీవు విన్న మాటల గురించి ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా తెలియచేసేదేంటంటే,
The king of Judah sent you to ask what I, Yahweh, want. Go and tell him that this is what I, Yahweh, the God whom you Israelis worship, say about what you read:
27 ౨౭ ‘నీ మనస్సు మెత్తనిది కాబట్టి, ఈ స్థలం మీదా దానిలో నివసించే వారి మీదా దేవుని మాటలను నీవు విని, నా ముందు నిన్ను నీవు తగ్గించుకుని నీ బట్టలు చించుకుని నా ముందు ఏడ్చావు కాబట్టి నేను కూడా నీ మాట విన్నాను’ ఇది యెహోవా ప్రకటన.
“Because you heeded [what was written in the scroll], and you humbled yourself when you heard what I said to warn [about what would happen to] this city and the people who live here, and because you tore your robes and wept in my presence, I have heard you.
28 ౨౮ ‘నేను నీ పూర్వీకుల దగ్గరికి నిన్ను చేరుస్తాను. నీవు ప్రశాంతంగా నీ సమాధికి చేరతావు. ఈ స్థలం మీదా దానిలో నివసించే వారి మీదా నేను రప్పించే విపత్తు నీవు నీ కంటితో చూడవు.’” వారు రాజు దగ్గరికి ఈ సందేశం తీసికెళ్లారు.
So I will allow you to die and be buried peacefully. I will cause a great disaster to strike this place and the people who live here, but you will not [be alive to] see it.”’” So they reported her reply to the king.
29 ౨౯ రాజు, యూదా, యెరూషలేములలోని పెద్దలందరినీ పిలిపించాడు.
Then the king summoned all the elders of Jerusalem and [other places in] Judea.
30 ౩౦ రాజూ, యూదావారంతా, యెరూషలేము నివాసులంతా, యాజకులూ, లేవీయులూ, ప్రజల్లో గొప్పవారూ, సామాన్యులూ యెహోవా మందిరానికి వచ్చారు. ఆప్పుడు అతడు యెహోవా మందిరంలో దొరికిన నిబంధన గ్రంథపు మాటలన్నీ వారికి చదివి వినిపించాడు.
They went up together to the temple with the leaders of Judah and many other people of Jerusalem and the priests and other descendants of Levi, from the least important to the most important ones. And while they listened, the king read to them everything that was in the scroll containing God’s laws that had been found in the temple.
31 ౩౧ రాజు తన స్థలం లో నిలబడి, ఆయనను అనుసరిస్తూ ఆయన ఇచ్చిన ఆజ్ఞలనూ శాసనాలనూ కట్టడలనూ పూర్ణమనస్సుతో పూర్ణహృదయంతో అనుసరిస్తూ ఈ గ్రంథంలో రాసిన నిబంధన మాటల ప్రకారం ప్రవర్తిస్తానని యెహోవా ముందు నిబంధన చేసుకున్నాడు.
Then the king stood next to the pillar [at the entrance to the temple, where kings stood when they announced something important], and while Yahweh was listening, he repeated his promise to very sincerely and completely obey Yahweh and all his commands and regulations and decrees that were written on the scroll.
32 ౩౨ అతడు యెరూషలేములో ఉన్న వారందరినీ బెన్యామీనీయులందరినీ ఆ నిబంధనకు సమ్మతించేలా చేశాడు. యెరూషలేము నివాసులు తమ పూర్వీకుల దేవుడైన దేవుని నిబంధన ప్రకారం ప్రవర్తించారు.
Then the king said that everyone who lived in Jerusalem and from [the tribe of] Benjamin should promise that they also would obey those laws. And they did that, agreeing that they would keep the agreement that God, whom their ancestors had worshiped, had made with them.
33 ౩౩ యోషీయా ఇశ్రాయేలీయులకు చెందిన ప్రాంతాలన్నిటిలోనుంచి అసహ్యమైన వాటన్నిటినీ తీసివేశాడు. ఇశ్రాయేలీయులంతా తమ దేవుడైన యెహోవాను సేవించేలా చేశాడు. అతడు బతికిన రోజులన్నీ వారు తమ పూర్వీకుల దేవుడైన యెహోవాను అనుసరించడం మానలేదు.
Josiah [instructed his workers to] remove all the detestable idols from everywhere in the land of the Israeli people, and he commanded that all the people from Israel who were there should worship [only] Yahweh their God. And as long as Josiah was alive, the people did what was pleasing to Yahweh, the God whom their ancestors [worshiped].