< దినవృత్తాంతములు~ రెండవ~ గ్రంథము 33 >
1 ౧ మనష్షే పరిపాలించడం మొదలుపెట్టినప్పుడు అతని వయసు 12 ఏళ్ళు. అతడు యెరూషలేములో 55 ఏళ్ళు పాలించాడు.
Tizenkét éves volt Menasse, midőn király lett s ötvenöt évig uralkodott Jeruzsálemben.
2 ౨ ఇతడు ఇశ్రాయేలీయుల దగ్గర నుంచి యెహోవా వెళ్లగొట్టిన రాజ్యాల ప్రజలు చేసిన నీచమైన పనులు అనుసరించి, యెహోవా దృష్టికి చెడుగా ప్రవర్తించాడు.
És tette azt, ami rossz az Örökkévaló szemeiben, azon nemzetek utálatai szerint, melyeket elűzött az Örökkévaló Izrael fiai elől.
3 ౩ ఇతడు తన తండ్రియైన హిజ్కియా పడగొట్టిన ఉన్నత స్థలాలను తిరిగి కట్టించి, బయలు దేవతకు బలిపీఠాలను నిలిపి, అషేరా దేవతాస్తంభాలను చేయించి, ఆకాశనక్షత్రాలన్నిటిని పూజించి కొలిచాడు.
Újra építette a magaslatokat, melyeket lerombolt atyja Jechizkijáhú; felállított oltárokat a Báaloknak s készített asérákat s leborult az ég egész serege előtt s szolgálta azokat.
4 ౪ “యెరూషలేములో నా పేరు ఎప్పటికీ ఉంటుంది” అని యెహోవా ఏ స్థలాన్ని ఉద్దేశించి పలికాడో అదే యెహోవా మందిరంలో అతడు అన్య దేవుళ్ళకు బలిపీఠాలను కట్టించాడు.
És épített oltárokat az Örökkévaló házában, melyről azt mondta az Örökkévaló: Jeruzsálemben lesz a nevem örökre;
5 ౫ యెహోవా మందిరపు రెండు ఆవరణాల్లో అతడు ఆకాశ నక్షత్ర సమూహానికి బలిపీఠాలను కట్టించాడు.
épített ugyanis oltárokat az ég egész seregének az Örökkévaló házának mindkét udvarában.
6 ౬ బెన్ హిన్నోము లోయలో అతడు తన కొడుకులను దహనబలిగా అర్పించాడు. శకునాలు చూడడం, సోదె వినడం చేశాడు. మంత్ర విద్య చేయించాడు. చచ్చినవాళ్ళతో మాట్లాడే వారిని దయ్యాలతో మాట్లాడే వారిని సంప్రదించాడు. యెహోవా దృష్టిలో చాలా చెడ్డగా ప్రవర్తిస్తూ ఆయనకు కోపం పుట్టించాడు.
S ugyanő átvezette fiait a tűzön Ben-Hinnóm völgyében, jövendölést meg jósolgatást s kuruzslást űzött s tartott szellemidézőt és halottjóst; sokat tett olyat, ami rossz az Örökkévaló szemeiben az ő bosszantására.
7 ౭ “ఇశ్రాయేలీయుల గోత్రాలన్నిటిలో నేను ఎన్నుకున్న యెరూషలేములో నాపేరు ఎల్లప్పుడూ ఉంచుతాను.
Elhelyezte a bálvány képét, melyet készített, az Isten házában, melyről szólt az Isten Dávidhoz s fiához, Salamonhoz: ebbe a házba s Jeruzsálembe, melyet kiválasztottam mind az Izrael törzsei közül, helyezem el örökre a nevemet;
8 ౮ నేను మోషేద్వారా నియమించిన కట్టడలను విధులను ధర్మశాస్త్రమంతటిని అనుసరించి నడచుకొనడానికి వారు జాగ్రత్తపడితే, మీ పూర్వీకులకు నేను ఏర్పరచిన దేశం నుంచి ఇశ్రాయేలీయులను నేను ఇక ఎన్నటికీ తొలగించను” అని దావీదుతో అతని కొడుకు సొలొమోనుతో దేవుడు సెలవిచ్చిన మాటను లక్ష్యపెట్టక, ఆ మందిరంలో తాను చేయించిన అషేరా చెక్కుడు విగ్రహాన్ని నిలిపాడు.
és nem távolítom el többé Izrael lábát azon földről, melyet fenntartottam őseiteknek, csak úgy, ha vigyáznak, hogy megtegyék mindazt, amit parancsoltam nekik mind a Mózes által adott tan és törvények és rendeletek szerint.
9 ౯ యూదావారిని యెరూషలేము నివాసులనూ ఇశ్రాయేలీయుల ముందు నుంచి యెహోవా నాశనం చేసిన రాజ్యాలకంటే వారు మరింత దుర్మార్గంగా ప్రవర్తించేలా మనష్షే వారిని నడిపించాడు.
De eltévelyítette Menasse Jehúdát és Jeruzsálem lakóit, hogy még rosszabbat cselekedtek ama nemzeteknél, melyeket kipusztított az Örökkévaló Izrael fiai elől.
10 ౧౦ యెహోవా మనష్షేతో అతని ప్రజలతో మాట్లాడాడు కానీ వారు పట్టించుకోలేదు.
És beszélt az Örökkévaló Menasséhez s népéhez, de nem figyeltek rá.
11 ౧౧ కాబట్టి యెహోవా అష్షూరురాజు సైన్యాధిపతులను వారిమీదికి రప్పించాడు. వారు మనష్షేను పట్టుకుని, గొలుసులతో బంధించి అతణ్ణి బబులోను తీసుకు వెళ్ళారు.
És rájuk hozta az Örökkévaló Assúr királya hadvezéreit, s elfogták Mennassét kampókkal s megkötözték őt bilincsekkel s elvitték Bábelbe.
12 ౧౨ బాధతో అతడు తన దేవుడైన యెహోవాను బతిమాలి, తన పూర్వీకుల దేవుని సన్నిధిలో తన్ను తాను ఎంతో తగ్గించుకున్నాడు.
S midőn megszorult, könyörgött az Örökkévalóhoz, az ő Istenéhez s nagyon megalázkodott ősei Istene előtt.
13 ౧౩ అతడు ప్రార్థన చేసినప్పుడు ఆయన అతని విన్నపాలు ఆలకించి యెరూషలేముకు, అతని రాజ్యానికి అతణ్ణి తిరిగి తీసుకువచ్చాడు. అప్పుడు యెహోవాయే దేవుడని మనష్షే తెలుసుకున్నాడు.
És imádkozott hozzá, és engedett fohászának s meghallotta könyörgését s visszavitte őt Jeruzsálembe a királyságába; ekkor megtudta Menasse, hogy az Örökkévaló az Isten.
14 ౧౪ దీని తరువాత అతడు దావీదు పట్టణం బయట గిహోనుకు పడమరగా, లోయలో చేప గుమ్మం వరకూ ఓపెలు చుట్టూ చాలా ఎత్తయిన గోడ కట్టించాడు. యూదా దేశంలోని బలమైన పట్టణాలన్నిటిలో సేనాధిపతులను ఉంచాడు.
Ezután épített külső falat Dávid városának nyugatra a Gíchontól, a völgyben, és amerre a halak kapuja felé mennek, s fordult az Ófel felé, s nagyon magasbította azt; s elhelyezett hadvezéreket mind az erősített városokban Jehúdában.
15 ౧౫ యెహోవా మందిరం నుంచి అన్యుల దేవతా విగ్రహం తీసివేసి, యెరూషలేములో యెహోవా మందిరం ఉన్న కొండ మీద తాను కట్టించిన బలిపీఠాలన్నిటినీ తీసి పట్టణం బయట పారవేయించాడు.
És eltávolította az idegen isteneket s a bálványt az Örökkévaló házából s mind az oltárokat, amelyeket épített volt az Örökkévaló háza hegyén és Jeruzsálemben, s kidobta a városon kívülre.
16 ౧౬ అతడు యెహోవా బలిపీఠంను బాగుచేసి, దాని మీద సమాధానబలులు, కృతజ్ఞతార్పణలు అర్పిస్తూ, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాను సేవించమని యూదా వారికి ఆజ్ఞాపించాడు.
És helyreállította az Örökkévaló oltárát s áldozott rajta békeáldozatokat és hálaáldozatot; és meghagyta Jehúdának, hogy szolgálják az Örökkévalót, Izrael Istenét.
17 ౧౭ అయినా ప్రజలు ఎత్తయిన స్థలాల్లో ఇంకా బలులు అర్పిస్తూనే ఉన్నారు గాని అవి తమ దేవుడైన యెహోవాకే అర్పించారు.
Azonban még mindig áldozott a nép a magaslatokon, bárcsak az Örökkévalónak, Istenüknek.
18 ౧౮ మనష్షే గురించిన ఇతర విషయాలు, అతడు దేవునికి చేసిన ప్రార్థన గురించి, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా పేరట అతనితో పలికిన దీర్ఘ దర్శకుల మాటలను గురించి ఇశ్రాయేలు రాజుల గ్రంథంలో రాసి ఉంది.
Menassénak egyéb dolgai pedig s imádsága az ő Istenéhez s a látók beszédei, akik beszéltek hozzá az Örökkévalónak, Izrael Istenének nevében, íme azok meg vannak Izrael királyai történetében.
19 ౧౯ అతని ప్రార్థన, దేవునికి ఎలా మొర్రపెట్టాడో, తనను తాను తగ్గించు కొనక ముందు అతని పాపం గురించి, అతడు చేసిన ద్రోహం గురించి, కట్టించిన ఎతైన పూజా స్థలాలూ అషేరాదేవి స్తంభాలు, చెక్కిన విగ్రహాలను నిలపడం గురించి, దీర్ఘదర్శకుడలు రచించిన గ్రంథాల్లో రాసి వుంది.
És imádsága s fohászának elfogadása s minden vétke s hűtlensége s a helyek, amelyeken magaslatokat épített s fölállította az asérákat s a faragott képeket megalázkodása előtt: íme azok meg vannak írva a látók beszédjeiben.
20 ౨౦ మనష్షే చనిపోయినప్పుడు తన పూర్వీకులతో కూడ తన సొంత భవనంలో అతణ్ణి పాతిపెట్టారు. అతని కొడుకు ఆమోను అతనికి బదులు రాజయ్యాడు.
És feküdt Menasse az ősei mellé s eltemették őt a házában. S király lett helyette fia, Ámón.
21 ౨౧ ఆమోను పరిపాలించడం మొదలుపెట్టినప్పుడు అతడు 22 ఏళ్ల వాడు. అతడు యెరూషలేములో రెండేళ్ళు పాలించాడు.
Huszonkét éves volt Ámon, mikor király lett s két évig uralkodott Jeruzsálemben.
22 ౨౨ అతడు తన తండ్రి మనష్షే నడచినట్టు యెహోవా దృష్టికి చెడ్డగా ప్రవర్తించాడు. తన తండ్రియైన మనష్షే చేయించిన చెక్కుడు విగ్రహాలన్నిటికీ బలులు అర్పిస్తూ పూజిస్తూ ఉండేవాడు.
És tette azt, ami rossz az Örökkévaló szemeiben, amint tette atyja Menasse; mind a faragott képeknek is, amelyeket atyja Menasse készített, áldozott Ámón s szolgálta azokat.
23 ౨౩ తన తండ్రియైన మనష్షేలాగా యెహోవా సన్నిధిలో తనను తాను తగ్గించుకోలేదు. దానికి బదులు ఇంకా ఎక్కువ పాపం చేశాడు.
De meg nem alázkodott az Örökkévaló előtt, amint megalázkodott atyja Menasse, mert ő, Ámón, sok bűnt követett el.
24 ౨౪ అతని సేవకులు అతని మీద కుట్ర చేసి అతని సొంత భవనంలోనే అతణ్ణి చంపేశారు.
És összeesküdtek ellene a szolgái s megölték őt a házában.
25 ౨౫ అయితే దేశప్రజలు ఆమోను రాజుమీద కుట్ర చేసిన వారందరినీ చంపి అతని కొడుకు యోషీయాను అతని స్థానంలో రాజుగా నియమించారు.
De az ország népe megölte mindazokat, kik összeesküdtek Ámón király ellen s helyébe királlyá tette az ország népe fiát, Jósijáhút.