< దినవృత్తాంతములు~ రెండవ~ గ్రంథము 32 >

1 హిజ్కియా ఈ పనులను నమ్మకంగా జరిగించిన తరువాత, అష్షూరు రాజు సన్హెరీబు యూదా దేశం మీదికి దండెత్తి వచ్చాడు. కోటలూ గోడలూ ఉన్న పట్టణాలను లోపరచుకోడానికి వాటిని చుట్టుముట్టాడు.
[亞述來犯]這些忠貞之事作完之後,亞述王散乃黑黎布來進攻猶大,包圍一切堅城,企圖攻破,佔為己有。
2 సన్హెరీబు దండెత్తి వచ్చి యెరూషలేము మీద యుద్ధం చేయ ఉద్దేశించాడని హిజ్కియా గమనించి
希則克雅見散乃黑黎市前來,決意要進攻耶路撒冷,
3 తన అధికారులనూ సైన్యాధిపతులనూ సంప్రదించాడు. పట్టణం బయట ఉన్న నీటి ఊటలనుంచి నీళ్ళు సరఫరా కాకుండా చేయాలని వారు నిర్ణయించారు. వారు అతనికి తోడుగా నిలిచారు.
便與自己的將領和勇士商議,將城外的水泉杜塞;他們都贊成;
4 చాలామంది ప్రజలు పోగై “అష్షూరు రాజులు వచ్చినపుడు వారికి విస్తారమైన నీళ్ళు ఎందుకు దొరకాలి?” అనుకుని ఊటలన్నిటినీ ఆ ప్రాంతంలో పారే కాలువలనూ కట్టేశారు.
於是召集許多人,將水泉和通過田間的水渠都杜塞,說:「為什麼讓亞述王來,得到這樣多的水! 」
5 రాజు ధైర్యం తెచ్చుకుని, పాడైన గోడ అంతా తిరిగి కట్టించి, గోపురాల వరకూ దాన్ని ఎత్తు చేయించి, బయట మరొక గోడ కట్టించి, దావీదు పట్టణంలో మిల్లో కోట బాగు చేయించాడు. చాలా ఆయుధాలనూ డాళ్లనూ చేయించాడు.
希則克雅遂加強防禦工事,重修所有破裂的城牆,上面建上城樓,城外又築了一道牆,加強達味城的米羅,製造了許多箭矢和盾牌。
6 ప్రజల మీద సైన్యాధిపతులను నియమించి పట్టణ గుమ్మం దగ్గర ఉన్న విశాల స్థలం దగ్గరికి వారిని రప్పించి వారిని ఇలా హెచ్చరించాడు.
然後派了將官率領軍民,將他們集合到城門廣場他自己面前,鼓勵他們說:「
7 “ధైర్యంగా, నిబ్బరంగా ఉండండి. అష్షూరురాజు గురించి గానీ అతనితో ఉన్న సైన్యమంతటి గురించి గానీ మీరు భయపడవద్దు, హడలిపోవద్దు. అతనితో ఉన్న వాడి కంటే మనతో ఉన్నవాడు ఎంతో గొప్పవాడు.
你們應該勇敢大膽,不要害怕,不要因亞述王和他所統領的大軍而膽怯,因為那與我們同在的比與他同在的,更有能力。
8 అతనికి దేహ సంబంధమైన శక్తి మాత్రమే ఉంది, అయితే మన యుద్ధాల్లో పోరాడడానికి మన దేవుడైన యెహోవా మనకు తోడుగా ఉన్నాడు” అని చెప్పాడు. అప్పుడు ప్రజలు యూదారాజు హిజ్కియా చెప్పిన మాటలను బట్టి ఆదరణ పొందారు.
那與他同在的只是血肉的手臂,那與我們同在的卻是天主,我們的天主,他必要協助我們,為我們作戰。」眾人都因猶大王希則克雅這番話而得到鼓勵。[亞述王的侮辱]
9 ఆ తరువాత అష్షూరురాజు సన్హెరీబు తన సైన్యమంతటితో లాకీషు ముట్టడించాడు. యెరూషలేములోని యూదారాజు హిజ్కియా దగ్గరికీ యెరూషలేములో ఉన్న యూదావారందరి దగ్గరికీ తన సేవకులను పంపి ఇలా ప్రకటన చేయించాడు.
此後,亞述王散乃黑黎布派自己的臣僕到耶路撒冷來,─他本人偕全軍駐在拉基士─向猶大王希則克雅,和在耶路撒冷所有的猶大人說:「
10 ౧౦ “అష్షూరురాజు సన్హెరీబు తెలియచేసేది ఏంటంటే, దేనిని నమ్మి మీరు ముట్టిడిలో ఉన్న యెరూషలేములో నిలిచి ఉన్నారు?
亞述王散乃黑黎布這樣說:你們在耶路撒冷受困,還依靠什麼呢﹖
11 ౧౧ కరువుతో దాహంతో మిమ్మల్ని చంపడానికి ‘మన దేవుడైన యెహోవా అష్షూరురాజు చేతిలో నుంచి మనలను విడిపిస్తాడు’ అని చెప్పి హిజ్కియా మిమ్మల్ని తప్పుదారి పట్టిస్తున్నాడు గదా?
希則克雅曾對你們說過:雅威我們的天主必要救我們脫離亞述王的手,這豈不是誘惑你們,使你們餓死渴死嗎﹖
12 ౧౨ ఆ హిజ్కియా, ‘మీరు ఒక్క బలిపీఠం ముందు నమస్కరించి దాని మీద ధూపం వేయాలి’ అని యూదావారికి యెరూషలేము వారికి ఆజ్ఞ ఇచ్చి, యెహోవా ఉన్నత స్థలాలను బలిపీఠాలను తీసివేశాడు కదా?
希則克雅豈不是將高丘和鄉壇推翻,且吩咐猶大和耶路撒冷人說:你們應在一個壇前朝拜,單在這上面焚香嗎﹖
13 ౧౩ నేనూ నా పూర్వీకులూ ఇతర దేశాల ప్రజలందరికీ ఏమేమి చేశామో మీకు తెలియదా? ఇతర జాతి ప్రజల దేవుళ్ళు వారి దేశాలను ఎప్పుడైనా నా చేతిలోనుంచి విడిపించగలిగారా?
難道你們不知道我與我的祖先,對各列邦民所作的事嗎﹖列邦各地的神,是否曾能拯救自己的國土,脫離我的手﹖
14 ౧౪ నా పూర్వీకులు బొత్తిగా నిర్మూలం చేసిన ప్రజల దేవుళ్లలో ఏ దేవుడు తన ప్రజలను నా చేతిలోనుంచి విడిపించగలిగాడు? మీ దేవుడు మిమ్మల్ని నా చేతిలోనుంచి ఎలా విడిపిస్తాడు?
我祖先所消滅的那些邦國的諸神中,有那一個曾能夠拯救自己的百姓,脫離我的手﹖難道你們的神就能拯救你們脫離我的手嗎﹖
15 ౧౫ కాబట్టి ఈ విధంగా ఇప్పుడు మీరు హిజ్కియా చేత మోసపోవద్దు. మీరు అతని మాట నమ్మవద్దు. ఏ ప్రజల దేవుడైనా ఏ రాజ్యపు దేవుడైనా తన ప్రజలను నా చేతిలోనుంచి గాని నా పూర్వీకుల చేతిలోనుంచి గాని విడిపించలేకపోయాడు. అలాంటప్పుడు మీ దేవుడు నా చేతిలోనుంచి మిమ్మల్ని ఏమాత్రం విడిపించలేడు గదా.”
所以現在,不要讓希則克雅這樣欺騙你們,迷惑你們;你們也不要相信他,因為任何一個國家,一個民族的神,都不能拯救自己的百姓,脫離我的手,和我祖先的手;何況你們的神﹖他更不能拯救你們脫離我的手! 」
16 ౧౬ సన్హెరీబు సేవకులు దేవుడైన యెహోవా మీదా ఆయన సేవకుడైన హిజ్కియా మీదా వ్యతిరేకంగా ఇంకా మాట్లాడారు.
散乃黑黎布的臣僕,還說了許多譭謗上主天主,和他僕人希則克雅的話。
17 ౧౭ అంతేగాక “ఇతర దేశాల ప్రజల దేవుళ్ళు తమ ప్రజలను నా చేతిలోనుంచి ఎలా విడిపించలేకపోయారో అలాగే హిజ్కియా సేవించే దేవుడు కూడా తన ప్రజలను నా చేతిలోనుంచి విడిపించలేడు” అని ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను నిందించడానికి, ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడడానికి సన్హెరీబు ఉత్తరాలు కూడా రాసి పంపాడు.
散乃黑黎布也寫信嘲笑上主以色列的天主,侮辱他說:「就如列邦民族的神沒有拯救自己的百姓脫離我的手,同樣希則克雅的神也不能救自己的百姓脫離我的手。」
18 ౧౮ అప్పుడు వారు పట్టణాన్ని పట్టుకోవాలన్న ఉద్దేశంతో, గోడమీదున్న యెరూషలేము ప్రజలను బెదరించడానికీ బాధపెట్టడానికీ యూదా భాషలో బిగ్గరగా వారితో మాట్లాడారు.
隨後,他們用猶大方言向耶路撒冷城牆上的軍民呼喊,想驚嚇他們,令他們恐懼,以便奪取京城。
19 ౧౯ మిగతా ప్రజల దేవుళ్ళతో వారు (అవి మనుష్యుల చేతులతో చేసినవి) మాట్లాడినట్టు, యెరూషలేము దేవుని మీద కూడా మాట్లాడారు.
他們論及耶路撒冷的天主,好似論及列邦民族的神一樣,當作了人手的造物。[希則克雅祈禱獲允]
20 ౨౦ రాజైన హిజ్కియా, ఆమోజు కొడుకూ, ప్రవక్తా అయిన యెషయా ఈ విషయం గురించి ప్రార్థించి ఆకాశం వైపు మొర్రపెట్టారు.
希則克雅王與阿摩茲的兒子依撒意亞先知為此巷天祈求呼籲。
21 ౨౧ యెహోవా ఒక దూతను పంపాడు. అతడు అష్షూరు రాజు దండులోని పరాక్రమశాలులందరినీ సేనా నాయకులనూ అధికారులనూ చంపేశాడు. అష్షూరు రాజు అవమానంతో తన దేశానికి తిరిగి వెళ్లిపోయాడు. అతడు తన దేవుని గుడిలోకి వెళితే అతని సొంత కొడుకులే అతణ్ణి అక్కడ కత్తితో చంపేశారు.
上主便派一位天使進入亞述王的營爭,將所有的兵士、將軍和統帥,予以殲滅,使亞述王含羞回了本國。當他進入自己的神廟時,為他親生的兒子用劍所殺。
22 ౨౨ ఈ విధంగా యెహోవా, హిజ్కియానూ యెరూషలేము నివాసులనూ అష్షూరు రాజు సన్హెరీబు చేతిలోనుంచి, మిగతావారందరి చేతిలోనుంచి కాపాడి, అన్ని రకాలుగా వారిని నడిపించాడు.
這樣,上主救了希則克雅和耶路撒冷的居民,脫離了亞述王散乃黑黎布和所有敵人的手,使他們四境獲得了安寧。
23 ౨౩ చాలామంది యెరూషలేములో యెహోవాకు అర్పణలను యూదారాజు హిజ్కియాకు విలువైన వస్తువులను తెచ్చారు. అందువలన అతడు అప్పటినుంచి అన్ని రాజ్యాల దృష్టిలో ఘనత పొందాడు.
眾人就都到耶路撒冷向上主獻上禮品也贈予猶大王希則克雅禮物;從此以後,希則克雅乃為個國所敬重。
24 ౨౪ ఆ రోజుల్లో హిజ్కియాకు జబ్బుచేసి చనిపోయేలా ఉన్నాడు. అతడు యెహోవాకు ప్రార్థన చేస్తే, ఆయన అతనితో మాట్లాడి, అతడు బాగుపడతాడనేదానికి ఒక గురుతు ఇచ్చాడు.
那時,希則克雅害病要死,他哀求了上主,上主便應允了他,給了他一個異兆。
25 ౨౫ అయితే హిజ్కియా గర్వించి తనకు చేసిన మేలుకు తగినట్లు ప్రవర్తించలేదు. కాబట్టి అతని మీదికీ యూదా యెరూషలేము మీదికీ యెహోవా కోపం వచ్చింది.
但是,希則克雅不但沒有照他所受的恩惠還報,反而心高氣傲,於是上主的怒火降於他和猶大並耶路撒冷。
26 ౨౬ అయితే చివరకూ హిజ్కియా తన హృదయ గర్వం విడిచి, తానూ యెరూషలేము నివాసులూ తమను తాము తగ్గించుకున్నారు. కాబట్టి హిజ్కియా రోజుల్లో యెహోవా కోపం ప్రజల మీదికి రాలేదు.
以後,希則克雅抑制了自己的驕傲,他和耶路撒冷居民都自謙自卑,因此上主的怒氣,在希則克雅生時,沒有向他們發作。[希則克雅一生概略]
27 ౨౭ హిజ్కియాకు అత్యంత సంపదా, ఘనతా కలిగాయి. వెండీ, బంగారం, రత్నాలూ సుగంధద్రవ్యాలూ, డాళ్ళూ, అన్ని రకాల విలువైన వస్తువులు భద్రం చేయడానికి గదులు కట్టించాడు.
希則克雅享盡富貴榮華,建造了府庫,儲藏金銀、寶石、香料、盾牌和各種珍器;
28 ౨౮ ధాన్యం, కొత్తద్రాక్షారసం నూనె నిల్వ చేయడానికి గోదాములు కట్టించాడు. వివిధ రకాల పశువులకు కొట్టాలూ, మందలకు దొడ్లూ కట్టించాడు.
修建了倉廩,儲藏五穀、新酒和油;修蓋了棚欄,為養各類牲畜;為羊群修了羊棧;
29 ౨౯ దేవుడు అతనికి అతి విస్తారమైన సంపద దయ చేశాడు కాబట్టి ఊళ్ళను కూడా కట్టించుకున్నాడు. ఎన్నో గొర్రెల మందలనూ పశువుల మందలనూ అతడు సంపాదించాడు.
又畜養了驢,以及許多大小牲畜;天主實在賜給了他極多的財物。
30 ౩౦ ఈ హిజ్కియా గిహోను ఊటమీది కాలువకు ఎగువ ఆనకట్ట వేయించి దావీదు పట్టణపు పడమరగా దాన్ని మళ్ళించాడు. హిజ్కియా జరిగించిన ప్రతి పనిలోనూ వర్దిల్లాడు.
希則克雅堵住基紅泉上邊的水,將水直引到達味城西。希則克雅所作所為無不順利。
31 ౩౧ అయితే, అతని దేశంలో జరిగిన అద్భుతమైన ప్రగతి గురించి తెలుసుకోడానికి బబులోను పరిపాలకులు అతని దగ్గరికి రాయబారులను పంపారు. అతని హృదయంలోని ఉద్దేశమంతా తెలుసుకోవాలని దేవుడు అతణ్ణి పరీక్షకు విడిచిపెట్టాడు.
甚至巴比倫王公大人派使者來見希則克雅,詢問他國內發生的奇事時,天主也讓他自由,藉以考驗他,好知道他心中的一切。
32 ౩౨ హిజ్కియా గురించిన ఇతర విషయాలూ భక్తితో చేసిన పనులూ ఆమోజు కుమారుడూ ప్రవక్త అయిన యెషయాకు కలిగిన దర్శనాల గ్రంథంలోనూ యూదా ఇశ్రాయేలు రాజుల గ్రంథంలోనూ రాసి ఉన్నాయి.
希則克雅其餘的事蹟,以及他的善行,都記載在阿摩茲的兒子依撒意亞先知的神視錄及猶大和以色列列王實錄上。
33 ౩౩ హిజ్కియా చనిపోయి తన పూర్వికుల దగ్గరికి చేరాడు. ప్రజలు దావీదు సంతతివారి శ్మశానభూమిలోని పై భాగంలో అతణ్ణి పాతిపెట్టారు. అతడు చనిపోయినప్పుడు యూదావారంతా యెరూషలేము నివాసులంతా అతనికి అంత్యక్రియలు ఘనంగా జరిగించారు. అతని స్థానంలో అతని కొడుకు మనష్షే రాజయ్యాడు.
希則克雅與他的祖先同眠,葬在達味子孫墓地的斜坡上;他死了,全猶大和耶路撒冷居民都為他舉哀致敬;他的兒子默納舍繼位為王。

< దినవృత్తాంతములు~ రెండవ~ గ్రంథము 32 >