< దినవృత్తాంతములు~ రెండవ~ గ్రంథము 31 >

1 ఇదంతా అయిపోయిన తరువాత అక్కడ ఉన్న ఇశ్రాయేలు ప్రజలంతా యూదా పట్టణాలకు వెళ్లి, విగ్రహాలను ముక్కలు ముక్కలు చేసి, అషేరా దేవతాస్తంభాలను విరగగొట్టి, యూదా బెన్యామీను దేశాలంతటా ఉన్నఉన్నత పూజా స్థలాలను, బలిపీఠాలను, పడగొట్టారు. తరువాత ఎఫ్రాయిమూ, మనష్షే ప్రాంతాల్లో కూడా ఇలానే పూర్తిగా నాశనం చేశారు. అప్పుడు ఇశ్రాయేలు ప్రజలంతా తమ తమ పట్టణాలకూ, గ్రామాలకూ తిరిగి వెళ్లిపోయారు.
بعد از پایان عید پِسَح، اسرائیلی‌هایی که برای شرکت در عید به اورشلیم آمده بودند به شهرهای یهودا، بنیامین، افرایم و منسی رفتند و بتکده‌های روی تپه‌ها را ویران کرده، تمام بتها، مذبحها و مجسمه‌های شرم‌آور اشیره را در هم کوبیدند. سپس همگی به خانه‌های خود بازگشتند.
2 హిజ్కియా యాజకులకూ, లేవీయులకూ వారి వారి సేవాధర్మం ప్రకారం, వారి వారి వరసలు నియమించాడు. దహనబలులూ సమాధాన బలులూ, శాంతి బలులూ అర్పించడానికీ, ఇతర సేవలూ చేయడానికీ యెహోవా మందిర గుమ్మాల దగ్గర కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికీ, స్తుతులు చెల్లించడానికీవారిని నియమించాడు.
حِزِقیا دسته‌های کاهنان و لاویان را برحسب نوع خدمتی که داشتند دوباره سر خدمت قرار داد. خدمات ایشان عبارت بودند از: تقدیم قربانیهای سوختنی و قربانیهای سلامتی، رهبری مراسم عبادتی و شکرگزاری و خواندن سرود در خانهٔ خداوند.
3 యెహోవా ధర్మశాస్త్రంలో రాసినట్టుగా ఉదయ సాయంత్రాలు అర్పించవలసిన దహనబలుల కోసం విశ్రాంతిదినాలకూ, అమావాస్యలకూ నియామక కాలాలకూ అర్పించవలసిన దహనబలుల కోసం తన సొంత ఆస్తిలోనుంచి రాజు ఒక భాగాన్ని ఏర్పాటు చేశాడు.
همچنین برای قربانیهای سوختنی صبح و عصر، قربانیهای روزهای شَبّات و جشنهای ماه نو و سایر عیدها که در تورات خداوند مقرر شده بود، پادشاه از اموال خود حیواناتی هدیه کرد.
4 యెహోవా ధర్మశాస్త్రం ప్రకారం యాజకులూ, లేవీయులూ తమ పని శ్రద్ధగా జరుపుకొనేలా, వారికి చెందవలసిన భాగం ఇవ్వాలని యెరూషలేములో నివసిస్తున్న ప్రజలకు అతడు ఆజ్ఞాపించాడు.
علاوه بر این، برای اینکه کاهنان و لاویان بتوانند تمام وقت مشغول انجام وظیفه‌ای باشند که در تورات خدا برای آنها مقرر شده بود، از مردم اورشلیم خواست تا سهم مقرر شدهٔ کاهنان و لاویان را به آنها بدهند.
5 ఆ ఆజ్ఞ జారీ అయిన వెంటనే ఇశ్రాయేలీయులు తమ మొదటి పంట ధాన్యం, కొత్త ద్రాక్షారసం, నూనె, తేనె, పొలంలోని పంటనూ విస్తారంగా తీసుకు వచ్చారు. అంతే కాక అన్నిటిలోనుంచి పదవ వంతును విస్తారంగా తెచ్చారు.
به محض صدور فرمان پادشاه، مردم اسرائیل با کمال سخاوتمندی نوبر غله، شراب، روغن زیتون و عسل و نیز ده‌یک تمام محصولات زمین خود را آورده، هدیه کردند.
6 యూదా పట్టణాల్లో నివసిస్తున్న ఇశ్రాయేలువారు, యూదావారు ఎద్దులు గొర్రెల్లో పదవవంతు, తమ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠితమైన వస్తువుల్లో పదవ వంతు తీసుకు వచ్చి కుప్పలుగా పోశారు.
تمام کسانی که در یهودا ساکن بودند علاوه بر ده‌یک گله‌ها و رمه‌ها، مقدار زیادی هدایای دیگر آوردند و برای خداوند، خدای خود وقف کردند.
7 వారు మూడవ నెలలో కుప్పలు వేయడం మొదలుపెట్టి ఏడవ నెలలో ముగించారు.
این کار را از ماه سوم شروع کردند و در ماه هفتم به پایان رساندند.
8 హిజ్కియా, అతని అధికారులూ వచ్చి ఆ కుప్పలను చూసి యెహోవాను స్తుతించి ఆయన ప్రజలైన ఇశ్రాయేలీయులను దీవించారు.
وقتی حِزِقیا و بزرگان قوم آمدند و این هدایا را دیدند خداوند را شکر و سپاس گفتند و برای قوم اسرائیل برکت طلبیدند.
9 హిజ్కియా ఆ కుప్పలను గురించి యాజకులను లేవీయులను ప్రశ్నించాడు. సాదోకు సంతతివాడు ప్రధానయాజకుడైన అజర్యా అతనికి ఇలా జవాబిచ్చాడు.
حِزِقیا از کاهنان و لاویان دربارهٔ هدایا سؤال کرد،
10 ౧౦ “యెహోవా మందిరంలోకి ప్రజలు కానుకలు తీసుకురావడం మొదలుపెట్టినప్పటి నుంచి మేము సమృద్ధిగా భోజనం చేసినా ఇంకా చాలా మిగిలి పోతున్నది. యెహోవా తన ప్రజలను ఆశీర్వదించినందుకు ఇంత గొప్పరాశి మిగిలింది.”
و عزریا، کاهن اعظم، که از طایفهٔ صادوق بود جواب داد: «از وقتی که مردم شروع کردند به آوردن این هدایای خوراکی به خانهٔ خداوند، ما از آنها خوردیم و سیر شدیم و مقدار زیادی نیز باقی مانده است، زیرا خداوند قوم خود را برکت داده است.»
11 ౧౧ హిజ్కియా యెహోవా మందిరంలో కొట్లను సిద్ధపరచాలని ఆజ్ఞ ఇచ్చాడు.
حِزِقیا دستور داد که در خانهٔ خداوند انبارهایی بسازند.
12 ౧౨ తరువాత వారు కానుకలనూ పదవ భాగాలనూ ప్రతిష్ట చేసిన వస్తువులనూ నమ్మకంగా లోపలకు తెచ్చారు. లేవీయుడైన కొనన్యా వాటికి నిర్వహణాధికారి. అతని సోదరుడైన షిమీ అతనికి సహకారి.
پس از آماده شدن انبارها، تمام مواد خوراکی اهدا شده را در آنجا انبار کردند. مسئولیت نگهداری انبارها به عهدهٔ کننیای لاوی بود و برادرش شمعی نیز او را کمک می‌کرد.
13 ౧౩ యెహీయేలు, అజజ్యా, నహతు. అశాహేలు, యెరీమోతు, యోజాబాదు, ఎలీయేలు, ఇస్మక్యా, మహతు, బెనాయా అనేవారు కొనన్యా చేతి కింద, అతని సోదరుడు షిమీ చేతి కింద తనిఖీ చేసేవారుగా ఉన్నారు. రాజైన హిజ్కియా దేవుని మందిరానికి అధికారిగా ఉన్న అజర్యా వారిని నియమించారు.
ده لاوی دیگر نیز از طرف حِزِقیای پادشاه و عزریا، کاهن اعظم، تعیین شدند تا زیر نظر این دو برادر خدمت کنند. این لاویان عبارت بودند از: یحی‌ئیل، عزریا، نحت، عسائیل، یریموت، یوزاباد، ایلی‌ئیل، یسمخیا، محت و بنایا.
14 ౧౪ తూర్పువైపు గుమ్మం దగ్గర పాలకుడూ లేవీయుడైన ఇమ్నా కొడుకు కోరే, దేవునికి సమర్పించిన స్వేచ్ఛార్పణల మీద అధికారి. ప్రజలు యెహోవాకు తెచ్చిన కానుకలనూ ప్రతిష్టిత వస్తువులనూ పంచిపెట్టడం అతని పని.
قوری (پسر یمنهٔ لاوی) که نگهبان دروازهٔ شرقی بود، مسئول توزیع هدایا در میان کاهنان شد. دستیاران او اینها بودند: عیدن، منیامین، یشوع، شمعیا، امریا و شکنیا. ایشان هدایا را به شهرهای کاهنان بردند و میان گروه‌های مختلف کاهنان تقسیم می‌کردند و سهم پیر و جوان را به طور مساوی می‌دادند.
15 ౧౫ అతని చేతి కింద ఏదెను, మిన్యామీను, యేషూవ, షెమయా, అమర్యా, షెకన్యా అనేవారున్నారు. వారు నమ్మకమైనవారు కాబట్టి యాజకుల పట్టణాల్లో ప్రముఖులనీ సామాన్యులనీ తేడా లేకుండా తమ సోదరులకు వరస క్రమాల ప్రకారం వారి భాగాలను పంచిపెట్టడానికి వారిని నియమించారు.
16 ౧౬ అంతేకాక మూడేళ్ళు మొదలు అంతకు పైవయసుండి వంశవృక్షాల్లో నమోదైన మగపిల్లలకు కూడా వంతుల ప్రకారం పంచిపెట్టారు. వారి వారి వరసల ప్రకారం బాధ్యతల ప్రకారం సేవచేయడానికి ప్రతిరోజూ యెహోవా మందిరంలోకి వచ్చేవారందరికీ పంచిపెట్టారు.
در ضمن به خانوادهٔ کاهنان نیز سهمی تعلق می‌گرفت.
17 ౧౭ ఇరవై ఏళ్ళు మొదలు అంతకు పై వయసుండి వంతుల ప్రకారం సేవచేయడానికి తమ తమ పూర్వీకుల వంశాల ప్రకారం యాజకుల్లో సరిచూడబడిన లేవీయులకు పంచిపెట్టారు.
نام کاهنان برحسب طایفه‌هایشان و نام لاویان بیست ساله و بالاتر نیز برحسب وظایفی که در گروه‌های مختلف داشتند، ثبت شده بود.
18 ౧౮ అంటే నమ్మకమైనవారై తమ్మును ప్రతిష్ఠించుకునిన లేవీయులకు తమ పిల్లలతో భార్యలతో కొడుకులతో కూతుర్లతో
به خانواده‌های کاهنانی که نامشان ثبت شده بود، به طور مرتب سهمیه‌ای داده می‌شد زیرا این کاهنان خود را وقف خدمت خدا کرده بودند.
19 ౧౯ సమాజమంతా సరిచూడబడినవారికి, ఆ యా పట్టణాలకు చేరిన గ్రామాల్లో ఉన్న అహరోను వంశస్థులైన యాజకులకు, వంతులు ఏర్పరచడానికి వారిని నియమించారు. పేరుల ప్రకారం చెప్పబడిన ఆ ప్రజలు యాజకుల్లో పురుషులందరికి, లేవీయుల్లో వంశాల ప్రకారం సరిచూడబడిన వారందరికి వంతులు ఏర్పరచడానికి వారిని నియమించారు.
افرادی نیز تعیین شدند تا هدایای خوراکی را بین کاهنان نسل هارون که در مزارع اطراف شهرها زندگی می‌کردند و نیز بین کسانی که نامشان در نسب نامهٔ لاویان ثبت شده بود، توزیع کنند.
20 ౨౦ హిజ్కియా యూదా దేశమంతటా ఇలా జరిగించాడు. తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలంగా యధార్థంగా నమ్మకం గా ప్రవర్తించాడు.
به این ترتیب حِزِقیای پادشاه در مورد توزیع هدایا در سراسر یهودا اقدام نمود و آنچه در نظر خداوند، خدایش پسندیده و درست بود بجا آورد.
21 ౨౧ దేవుని మందిర సేవకోసం, ధర్మశాస్త్రం కోసం, ఆజ్ఞల కోసం మొదలుపెట్టిన ప్రతి పనిలో అతడు తన దేవుణ్ణి వెతికి అనుసరించాడు. హృదయపూర్వకంగా అనులు జరిగించాడు గనక వర్ధిల్లాడు.
او با تمام دل و جان آنچه برای خانهٔ خدا لازم بود انجام می‌داد و از شریعت و احکام خدا پیروی می‌نمود و به همین جهت همیشه موفق بود.

< దినవృత్తాంతములు~ రెండవ~ గ్రంథము 31 >