< దినవృత్తాంతములు~ రెండవ~ గ్రంథము 30 >
1 ౧ హిజ్కియా ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు పస్కాపండగ ఆచరించడానికి యెరూషలేములో ఉన్న యెహోవా మందిరానికి రావాలని ఇశ్రాయేలు, యూదావారందరికీ వార్తాహరులనూ, ఎఫ్రాయిమీయులకు మనష్షే వారికి ఉత్తరాలనూ పంపాడు.
Ezekíja je poslal k vsemu Izraelu in Judu in napisal tudi pisma Efrájimu in Manáseju, da naj pridejo h Gospodovi hiši v Jeruzalemu, da praznujejo pasho Gospodu, Izraelovemu Bogu.
2 ౨ అప్పుడు తమను పవిత్రం చేసుకున్న యాజకులు చాలినంతమంది లేరు గనక ప్రజలు యెరూషలేములో సమకూడలేదు. కాబట్టి మొదటి నెలలో పస్కాపండగ జరపలేక పోయారు.
Kajti kralj je sprejel nasvet in njegovi princi in vsa skupnost v Jeruzalemu, da v drugem mesecu praznujejo pasho.
3 ౩ రాజూ, అతని అధికారులూ, యెరూషలేములో ఉన్న సమాజం వారంతా పస్కాను రెండవ నెలలో ఆచరించాలని నిర్ణయించారు.
Kajti niso je mogli imeti ob tistem času, ker se duhovniki niso zadosti posvetili niti se ljudstvo ni zbralo skupaj k Jeruzalemu.
4 ౪ ఈ విషయం రాజుకూ సమాజం వారందరికీ సమంజసం అనిపించింది.
Stvar je ugajala kralju in vsej skupnosti.
5 ౫ చాలా కాలం నుంచి లేఖనంలో రాసినట్టు ఎక్కువమంది ప్రజలు పండగ ఆచరించ లేదు. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు యెరూషలేములో పస్కా పండగ ఆచరించడానికి రావాలని బెయేర్షెబా నుంచి దాను వరకూ ఇశ్రాయేలు దేశమంతా చాటించాలని వారు నిర్ణయించారు.
Tako so potrdili odlok, da ga razglasijo po vsem Izraelu, od Beeršébe, celo do Dana, da bi prišli praznovat pasho Gospodu, Izraelovemu Bogu, v Jeruzalemu, kajti že dolgo časa tega niso storili na takšen način, kot je bilo to napisano.
6 ౬ కాబట్టి వార్తాహరులు రాజు దగ్గరా అతని అధికారుల దగ్గరా ఉత్తరాలు తీసుకు, యూదా ఇశ్రాయేలు దేశాలంతా తిరిగి రాజాజ్ఞను ఇలా చాటించారు, “ఇశ్రాయేలు ప్రజలారా, అబ్రాహాము ఇస్సాకు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా వైపు తిరగండి. మీరు ఆయన వైపు తిరిగితే, అప్పుడు అష్షూరు రాజుల చేతిలోనుంచి తప్పించుకుని మిగిలిన మీ వైపు ఆయన తిరుగుతాడు.
Tako so tekači odšli s pismi kralja in njegovih princev po vsem Izraelu in Judu in glede na kraljevo zapoved, rekoč: »Vi, Izraelovi otroci, se ponovno obrnite h Gospodu, Bogu Abrahama, Izaka in Izraela in on se bo obrnil k preostanku izmed vas, ki ste pobegnili iz roke asirskih kraljev.
7 ౭ తమ పూర్వీకుల దేవుడైన యెహోవా పట్ల ద్రోహంగా ప్రవర్తించిన మీ పూర్వీకులలాగా మీ సోదరులలాగా మీరు ప్రవర్తించవద్దు. మీరు చూస్తున్నట్టు ఆయన వారిని నాశనానికి అప్పగించాడు.
Vi pa ne bodite podobni svojim očetom in svojim bratim, ki so grešili zoper Gospoda, Boga svojih očetov, ki jih je zato izročil v opustošenje, kakor vidite.
8 ౮ మీ పూర్వికుల్లాగా మీరు అవిధేయులుగ ప్రవర్తించ కండి. యెహోవాకు లోబడి, ఆయన శాశ్వతంగా పరిశుద్ధ పరచిన ఆయన పరిశుద్ధ మందిరంలో ప్రవేశించి, మీ దేవుడైన యెహోవా మహోగ్రత మీ మీది నుంచి తొలగి పోయేలా ఆయన్ని సేవించండి.
Torej ne bodite trdovratni, kakor so bili vaši očetje, temveč se uklonite Gospodu in vstopite v njegovo svetišče, ki ga je posvetil na veke, in služite Gospodu, svojemu Bogu, da se okrutnost njegovega besa lahko odvrne od vas.
9 ౯ మీరు యెహోవా వైపు తిరిగితే మీ సోదరుల పైనా, మీ పిల్లల పైనా వారిని బందీలుగా తీసుకు పోయిన వారికి దయ కలుగుతుంది. వారు ఈ దేశానికి తిరిగి వస్తారు. మీ దేవుడైన యెహోవా కృప, జాలి గలవాడు కాబట్టి మీరు ఆయనవైపు తిరిగితే ఆయన మీ వైపునుంచి తన ముఖం తిప్పుకోడు.”
Kajti če se ponovno obrnete h Gospodu, bodo vaši bratje in vaši otroci našli sočutje pred tistimi, ki jih vodijo ujete, tako da se bodo ponovno vrnili v to deželo, kajti Gospod, vaš Bog, je usmiljen in milostljiv in svojega obraza ne bo odvrnil od vas, če se vi vrnete k njemu.
10 ౧౦ వార్తాహరులు జెబూలూను దేశం వరకూ, ఎఫ్రాయిము మనష్షేల దేశాల్లో ఉన్న ప్రతి పట్టణానికీ వెళ్ళారు గాని అక్కడి వారు ఎగతాళి చేసి వారిని అపహసించారు.
Tako je pošta šla od mesta do mesta po vsej deželi, od Efrájima in Manáseja, celo do Zábulona, toda smejali so se jim do norčevanja in jih zasmehovali.
11 ౧౧ అయినా, ఆషేరు మనష్షే, జెబూలూను గోత్రాల్లో కొంతమంది తమను తాము తగ్గించుకుని యెరూషలేము వచ్చారు.
Kljub temu so se številni izmed Aserja, Manáseja in Zábulona ponižali in prišli v Jeruzalem.
12 ౧౨ యెహోవా ఆజ్ఞను బట్టి రాజు, అతని అధికారులు, ఆజ్ఞాపించిన వాటిని నెరవేర్చేలా యూదా వారికి ఏక మనస్సు కలిగించ డానికి దేవుని హస్తం వారి మీద ఉంది.
Tudi v Judu je bila Božja roka, da jim da eno srce, da po Gospodovi besedi storijo zapoved kralja in princev.
13 ౧౩ రెండవ నెలలో పొంగని రొట్టెల పండగ ఆచరించడానికి ప్రజలు గొప్ప సమూహంగా యెరూషలేములో సమకూడారు.
V Jeruzalemu se je zbralo mnogo ljudstva, zelo velika skupnost, da bi v drugem mesecu praznovali praznik nekvašenega kruha.
14 ౧౪ యెరూషలేములో ఉన్న బలిపీఠాలను ధూపవేదికలను తీసివేసి, కిద్రోను వాగులో పారవేశారు.
Vzdignili so se in odnesli oltarje, ki so bili v Jeruzalemu in vse kadilne oltarje so odnesli proč in jih vrgli v potok Kidron.
15 ౧౫ రెండవ నెల 14 వ రోజున వారు పస్కాగొర్రెపిల్లను వధించారు. యాజకులు లేవీయులు సిగ్గుపడి, తమను ప్రతిష్ఠించుకుని దహనబలిపశువులను యెహోవా మందిరంలోకి తీసుకు వచ్చారు.
Potem so na štirinajsti dan drugega meseca zaklali pasho. Duhovniki in Lévijevci so bili osramočeni in se posvetili in prinesli so žgalne daritve v Gospodovo hišo.
16 ౧౬ దేవుని సేవకుడు మోషే నియమించిన ధర్మశాస్త్రంలోని ఉపదేశం ప్రకారం, వారు తమ స్థలం లో నిలబడ్డారు. యాజకులు, లేవీయుల చేతికి బాలి రక్తం అందించగా వారు దాన్ని చిలకరించారు.
Stali so na svojem mestu, po njihovem običaju, glede na postavo Mojzesa, Božjega moža. Duhovniki so poškropili kri, ki so jo prejeli iz rok Lévijevcev.
17 ౧౭ సమాజంలో తమను పరిశుద్ధ పరచుకొనని వారు అనేకమంది ఉన్నారు. అలా పరిశుద్ధ పరచుకొనని వారి కోసం పస్కా పశువులను లేవీయులు వధించాల్సి వచ్చింది.
Kajti v skupnosti so bili številni, ki niso bili posvečeni, zato so bili Lévijevci zadolženi za zakol pashe za vsakogar, ki ni bil čist, da jih posvetijo Gospodu.
18 ౧౮ ఎఫ్రాయిము మనష్షే ఇశ్శాఖారు జెబూలూను ప్రదేశాలనుంచి వచ్చిన ప్రజల్లో చాలామంది తమ్మును తాము ప్రతిష్ఠించుకొనకుండా లేఖనాలకు విరుద్ధంగా పస్కా భుజించారు. వారి కోసం హిజ్కియా ఇలా ప్రార్థించాడు,
Kajti množica ljudstva, celó številni izmed Efrájima, Manáseja, Isahárja in Zábulona se niso očistili, vendar so jedli pasho drugače, kot je bilo napisano. Toda Ezekíja je molil zanje, rekoč: »Dobri Gospod naj odpusti vsakomur,
19 ౧౯ “పరిశుద్ధమందిర శుద్ధీకరణ ప్రమాణాల ప్రకారం అశుద్ధంగా ఉన్నవారు, తమ పూర్వీకుల దేవుడైన యెహోవాను వెదకడానికి తమ హృదయాన్ని సిద్ధపరచుకుంటే, అలాటి వారినందరినీ దయ గల యెహోవా క్షమించును గాక.”
ki pripravlja svoje srce, da išče Boga, Gospoda Boga svojih očetov, čeprav ni očiščen glede na očiščevanje svetišča.«
20 ౨౦ యెహోవా హిజ్కియా చేసిన ప్రార్థన అంగీకరించి ప్రజలను బాగుచేశాడు.
Gospod je prisluhnil Ezekíju ter ozdravil ljudstvo.
21 ౨౧ యెరూషలేములో ఉన్న ఇశ్రాయేలువారు ఏడు రోజులు తను పరిశుద్ధ పరచుకోకుండా ఉండిపోయిన వారు అనేకమంది ఉన్నారు. అలా పరిశుద్ధ పరచుకొనని వారి కోసం పస్కా పశువులను లేవీయులు వధించాల్సి వచ్చింది. ఏడూ రోజులపాటు రొట్టెల పండగను చాలా ఆనందంగా ఆచరించారు. లేవీయులూ, యాజకులూ సంగీత వాద్యాలతో పాటలు పాడుతూ ప్రతిరోజూ యెహోవాను స్తుతించారు.
Izraelovi otroci, ki so bili prisotni v Jeruzalemu, so z velikim veseljem sedem dni imeli praznik nekvašenega kruha. Lévijevci in duhovniki so dan za dnem hvalili Gospoda, pojoč Gospodu z glasnimi glasbili.
22 ౨౨ యెహోవా సేవను అర్థం చేసుకున్న లేవీయులందరితో హిజ్కియా ప్రోత్సాహకరమైన మాటలు పలికాడు. ఏడురోజులపాటు వారు సమాధాన బలులు అర్పిస్తూ, తమ పూర్వీకుల దేవుడైన యెహోవాకు కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తూ ఏడు రోజులు పస్కా పండగ సమయమంతా తమ నియమిత భాగం తింటూ ఆచరించారు.
Ezekíja je tolažilno govoril vsem Lévijevcem, ki so učili dobrega Gospodovega spoznanja. Jedli so vseh sedem prazničnih dni, žrtvovali mirovne daritve in delali priznanje Gospodu, Bogu svojih očetov.
23 ౨౩ సమాజమంతా ఇది చూసి, ఇంకా 7 రోజులు పండగ ఆచరించాలని ఆలోచించి మరి 7 రోజులు ఆనందంగా దాన్ని ఆచరించారు.
Celoten zbor se je posvetoval, da praznuje [še] drugih sedem dni. In z veseljem so praznovali [še] drugih sedem dni.
24 ౨౪ యూదా రాజు హిజ్కియా, సమాజానికి బలి అర్పణల కోసం 1,000 కోడెలను, 7,000 గొర్రెలను ఇచ్చాడు. అధికారులు 1,000 కోడెలను, 10,000 గొర్రెలూ మేకలూ ఇచ్చారు. చాలామంది యాజకులు తమ్మును తాము ప్రతిష్ఠించుకున్నారు.
Kajti Judov kralj Ezekíja je dal skupnosti tisoč bikcev in sedem tisoč ovc, in princi so dali skupnosti tisoč bikcev in deset tisoč ovc. In veliko število duhovnikov se je posvetilo.
25 ౨౫ అప్పుడు యాజకులు, లేవీయులు, యూదా, ఇశ్రాయేలువారిలో నుంచి వచ్చిన సమాజమంతా, ఇశ్రాయేలు దేశంలోనుంచి వచ్చి యూదాలో నివాసమున్న అన్యులు కూడా సంతోషించారు.
Vsa Judova skupnost, z duhovniki in Lévijevci in ves zbor, ki je prišel iz Izraela in tujci, ki so prišli iz Izraelove dežele in tisti, ki so prebivali v Judu, so se veselili.
26 ౨౬ యెరూషలేము నివాసులు ఎంతో ఆనందించారు. ఇశ్రాయేలు రాజు దావీదు కొడుకు సొలొమోను కాలం తరువాత ఇలా జరగలేదు.
Tako je bila v Jeruzalemu velika radost, kajti od časa Salomona, Davidovega sina, Izraelovega kralja, ni bilo v Jeruzalemu ničesar podobnega.
27 ౨౭ అప్పుడు లేవీయులైన యాజకులు లేచి ప్రజలను దీవిస్తే వారి మాటలు వినబడ్డాయి. వారి ప్రార్థన దేవుడు ఉండే పరిశుద్ధ స్థలం, అంటే పరలోకానికి చేరింది.
Potem so duhovniki, Lévijevci, vstali, blagoslovili ljudstvo in njihov glas je bil slišan in njihova molitev je prišla gor do njegovega svetega prebivališča, celó do nebes.