< దినవృత్తాంతములు~ రెండవ~ గ్రంథము 30 >

1 హిజ్కియా ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు పస్కాపండగ ఆచరించడానికి యెరూషలేములో ఉన్న యెహోవా మందిరానికి రావాలని ఇశ్రాయేలు, యూదావారందరికీ వార్తాహరులనూ, ఎఫ్రాయిమీయులకు మనష్షే వారికి ఉత్తరాలనూ పంపాడు.
Ezequias enviou a todo Israel e Judá, e escreveu cartas também a Efraim e Manassés, para que viessem à casa de Iavé em Jerusalém, a fim de manter a Páscoa a Iavé, o Deus de Israel.
2 అప్పుడు తమను పవిత్రం చేసుకున్న యాజకులు చాలినంతమంది లేరు గనక ప్రజలు యెరూషలేములో సమకూడలేదు. కాబట్టి మొదటి నెలలో పస్కాపండగ జరపలేక పోయారు.
Pois o rei tinha tomado conselho com seus príncipes e toda a assembléia em Jerusalém para manter a Páscoa no segundo mês.
3 రాజూ, అతని అధికారులూ, యెరూషలేములో ఉన్న సమాజం వారంతా పస్కాను రెండవ నెలలో ఆచరించాలని నిర్ణయించారు.
Pois eles não podiam celebrá-la naquela época, porque os sacerdotes não se haviam santificado em número suficiente e o povo não se havia reunido em Jerusalém.
4 ఈ విషయం రాజుకూ సమాజం వారందరికీ సమంజసం అనిపించింది.
A coisa estava certa aos olhos do rei e de toda a assembléia.
5 చాలా కాలం నుంచి లేఖనంలో రాసినట్టు ఎక్కువమంది ప్రజలు పండగ ఆచరించ లేదు. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు యెరూషలేములో పస్కా పండగ ఆచరించడానికి రావాలని బెయేర్షెబా నుంచి దాను వరకూ ఇశ్రాయేలు దేశమంతా చాటించాలని వారు నిర్ణయించారు.
Assim, estabeleceram um decreto para fazer a proclamação em todo Israel, desde Berseba até Dan, de que deveriam vir para guardar a Páscoa a Javé, o Deus de Israel, em Jerusalém, pois não a tinham guardado em grande número da maneira como está escrita.
6 కాబట్టి వార్తాహరులు రాజు దగ్గరా అతని అధికారుల దగ్గరా ఉత్తరాలు తీసుకు, యూదా ఇశ్రాయేలు దేశాలంతా తిరిగి రాజాజ్ఞను ఇలా చాటించారు, “ఇశ్రాయేలు ప్రజలారా, అబ్రాహాము ఇస్సాకు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా వైపు తిరగండి. మీరు ఆయన వైపు తిరిగితే, అప్పుడు అష్షూరు రాజుల చేతిలోనుంచి తప్పించుకుని మిగిలిన మీ వైపు ఆయన తిరుగుతాడు.
Então os correios foram com as cartas do rei e seus príncipes por todo Israel e Judá, de acordo com o mandamento do rei, dizendo: “Vós, filhos de Israel, voltai para Javé, o Deus de Abraão, Isaac e Israel, para que ele possa voltar para o resto de vós que escapastes da mão dos reis da Assíria”.
7 తమ పూర్వీకుల దేవుడైన యెహోవా పట్ల ద్రోహంగా ప్రవర్తించిన మీ పూర్వీకులలాగా మీ సోదరులలాగా మీరు ప్రవర్తించవద్దు. మీరు చూస్తున్నట్టు ఆయన వారిని నాశనానికి అప్పగించాడు.
Não seja como seus pais e como seus irmãos, que transgrediram contra Javé, o Deus de seus pais, para que ele os entregasse à desolação, como você vê.
8 మీ పూర్వికుల్లాగా మీరు అవిధేయులుగ ప్రవర్తించ కండి. యెహోవాకు లోబడి, ఆయన శాశ్వతంగా పరిశుద్ధ పరచిన ఆయన పరిశుద్ధ మందిరంలో ప్రవేశించి, మీ దేవుడైన యెహోవా మహోగ్రత మీ మీది నుంచి తొలగి పోయేలా ఆయన్ని సేవించండి.
Agora não sejam de pescoço duro, como seus pais foram, mas entreguem-se a Javé, e entrem em seu santuário, que ele santificou para sempre, e sirvam a Javé, vosso Deus, para que sua raiva feroz se afaste de vocês.
9 మీరు యెహోవా వైపు తిరిగితే మీ సోదరుల పైనా, మీ పిల్లల పైనా వారిని బందీలుగా తీసుకు పోయిన వారికి దయ కలుగుతుంది. వారు ఈ దేశానికి తిరిగి వస్తారు. మీ దేవుడైన యెహోవా కృప, జాలి గలవాడు కాబట్టి మీరు ఆయనవైపు తిరిగితే ఆయన మీ వైపునుంచి తన ముఖం తిప్పుకోడు.”
Pois se vocês se voltarem novamente para Javé, seus irmãos e seus filhos encontrarão compaixão por aqueles que os levaram cativos, e voltarão a esta terra, porque Javé, vosso Deus, é misericordioso e misericordioso, e não lhes virará o rosto se vocês voltarem para ele”.
10 ౧౦ వార్తాహరులు జెబూలూను దేశం వరకూ, ఎఫ్రాయిము మనష్షేల దేశాల్లో ఉన్న ప్రతి పట్టణానికీ వెళ్ళారు గాని అక్కడి వారు ఎగతాళి చేసి వారిని అపహసించారు.
Então os correios passaram de cidade em cidade pelo país de Ephraim e Manasseh, até mesmo para Zebulun, mas as pessoas os ridicularizaram e zombaram deles.
11 ౧౧ అయినా, ఆషేరు మనష్షే, జెబూలూను గోత్రాల్లో కొంతమంది తమను తాము తగ్గించుకుని యెరూషలేము వచ్చారు.
Mesmo assim, alguns homens de Asher, Manasseh e Zebulun se humilharam e vieram a Jerusalém.
12 ౧౨ యెహోవా ఆజ్ఞను బట్టి రాజు, అతని అధికారులు, ఆజ్ఞాపించిన వాటిని నెరవేర్చేలా యూదా వారికి ఏక మనస్సు కలిగించ డానికి దేవుని హస్తం వారి మీద ఉంది.
Também a mão de Deus veio sobre Judá para dar-lhes um só coração, para cumprir o mandamento do rei e dos príncipes pela palavra de Javé.
13 ౧౩ రెండవ నెలలో పొంగని రొట్టెల పండగ ఆచరించడానికి ప్రజలు గొప్ప సమూహంగా యెరూషలేములో సమకూడారు.
Muitas pessoas se reuniram em Jerusalém para manter a festa dos pães ázimos no segundo mês, uma grande assembléia.
14 ౧౪ యెరూషలేములో ఉన్న బలిపీఠాలను ధూపవేదికలను తీసివేసి, కిద్రోను వాగులో పారవేశారు.
Eles se levantaram e tiraram os altares que estavam em Jerusalém, tiraram todos os altares para incenso e os jogaram no riacho Kidron.
15 ౧౫ రెండవ నెల 14 వ రోజున వారు పస్కాగొర్రెపిల్లను వధించారు. యాజకులు లేవీయులు సిగ్గుపడి, తమను ప్రతిష్ఠించుకుని దహనబలిపశువులను యెహోవా మందిరంలోకి తీసుకు వచ్చారు.
Depois mataram a Páscoa no décimo quarto dia do segundo mês. Os sacerdotes e os levitas ficaram envergonhados, e se santificaram, e trouxeram holocaustos para a casa de Iavé.
16 ౧౬ దేవుని సేవకుడు మోషే నియమించిన ధర్మశాస్త్రంలోని ఉపదేశం ప్రకారం, వారు తమ స్థలం లో నిలబడ్డారు. యాజకులు, లేవీయుల చేతికి బాలి రక్తం అందించగా వారు దాన్ని చిలకరించారు.
Eles permaneceram em seu lugar após sua ordem, de acordo com a lei de Moisés, o homem de Deus. Os sacerdotes aspergiam o sangue que recebiam da mão dos levitas.
17 ౧౭ సమాజంలో తమను పరిశుద్ధ పరచుకొనని వారు అనేకమంది ఉన్నారు. అలా పరిశుద్ధ పరచుకొనని వారి కోసం పస్కా పశువులను లేవీయులు వధించాల్సి వచ్చింది.
Pois havia muitos na assembléia que não se tinham santificado; portanto os levitas estavam encarregados de matar a Páscoa para todos os que não estavam limpos, para santificá-los a Iavé.
18 ౧౮ ఎఫ్రాయిము మనష్షే ఇశ్శాఖారు జెబూలూను ప్రదేశాలనుంచి వచ్చిన ప్రజల్లో చాలామంది తమ్మును తాము ప్రతిష్ఠించుకొనకుండా లేఖనాలకు విరుద్ధంగా పస్కా భుజించారు. వారి కోసం హిజ్కియా ఇలా ప్రార్థించాడు,
Para uma multidão do povo, mesmo muitos de Efraim, Manasseh, Issachar e Zebulun, não se haviam purificado, mas comeram a Páscoa de outra forma que não a forma como está escrita. Pois Ezequias havia rezado por eles, dizendo: “Que o bom Javé perdoe a todos
19 ౧౯ “పరిశుద్ధమందిర శుద్ధీకరణ ప్రమాణాల ప్రకారం అశుద్ధంగా ఉన్నవారు, తమ పూర్వీకుల దేవుడైన యెహోవాను వెదకడానికి తమ హృదయాన్ని సిద్ధపరచుకుంటే, అలాటి వారినందరినీ దయ గల యెహోవా క్షమించును గాక.”
que põe seu coração em busca de Deus, Javé, o Deus de seus pais, mesmo que não estejam limpos de acordo com a purificação do santuário”.
20 ౨౦ యెహోవా హిజ్కియా చేసిన ప్రార్థన అంగీకరించి ప్రజలను బాగుచేశాడు.
Yahweh ouviu Hezekiah, e curou o povo.
21 ౨౧ యెరూషలేములో ఉన్న ఇశ్రాయేలువారు ఏడు రోజులు తను పరిశుద్ధ పరచుకోకుండా ఉండిపోయిన వారు అనేకమంది ఉన్నారు. అలా పరిశుద్ధ పరచుకొనని వారి కోసం పస్కా పశువులను లేవీయులు వధించాల్సి వచ్చింది. ఏడూ రోజులపాటు రొట్టెల పండగను చాలా ఆనందంగా ఆచరించారు. లేవీయులూ, యాజకులూ సంగీత వాద్యాలతో పాటలు పాడుతూ ప్రతిరోజూ యెహోవాను స్తుతించారు.
As crianças de Israel que estavam presentes em Jerusalém celebraram a festa dos pães ázimos sete dias com grande alegria. Os levitas e os sacerdotes elogiaram a Iavé dia após dia, cantando com instrumentos altos a Iavé.
22 ౨౨ యెహోవా సేవను అర్థం చేసుకున్న లేవీయులందరితో హిజ్కియా ప్రోత్సాహకరమైన మాటలు పలికాడు. ఏడురోజులపాటు వారు సమాధాన బలులు అర్పిస్తూ, తమ పూర్వీకుల దేవుడైన యెహోవాకు కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తూ ఏడు రోజులు పస్కా పండగ సమయమంతా తమ నియమిత భాగం తింటూ ఆచరించారు.
Hezekiah falou encorajadoramente a todos os levitas que tinham bom entendimento no serviço de Iavé. Assim, eles comeram durante os sete dias da festa, oferecendo sacrifícios de ofertas de paz e fazendo confissão a Iavé, o Deus de seus pais.
23 ౨౩ సమాజమంతా ఇది చూసి, ఇంకా 7 రోజులు పండగ ఆచరించాలని ఆలోచించి మరి 7 రోజులు ఆనందంగా దాన్ని ఆచరించారు.
Toda a assembléia se aconselhou a manter outros sete dias, e eles mantiveram outros sete dias com alegria.
24 ౨౪ యూదా రాజు హిజ్కియా, సమాజానికి బలి అర్పణల కోసం 1,000 కోడెలను, 7,000 గొర్రెలను ఇచ్చాడు. అధికారులు 1,000 కోడెలను, 10,000 గొర్రెలూ మేకలూ ఇచ్చారు. చాలామంది యాజకులు తమ్మును తాము ప్రతిష్ఠించుకున్నారు.
Pois Ezequias, rei de Judá, deu à assembléia para ofertas mil touros e sete mil ovelhas; e os príncipes deram à assembléia mil touros e dez mil ovelhas; e um grande número de sacerdotes se santificou.
25 ౨౫ అప్పుడు యాజకులు, లేవీయులు, యూదా, ఇశ్రాయేలువారిలో నుంచి వచ్చిన సమాజమంతా, ఇశ్రాయేలు దేశంలోనుంచి వచ్చి యూదాలో నివాసమున్న అన్యులు కూడా సంతోషించారు.
Toda a assembléia de Judá, com os sacerdotes e levitas, e toda a assembléia que saiu de Israel, e os estrangeiros que saíram da terra de Israel e que viveram em Judá, se regozijaram.
26 ౨౬ యెరూషలేము నివాసులు ఎంతో ఆనందించారు. ఇశ్రాయేలు రాజు దావీదు కొడుకు సొలొమోను కాలం తరువాత ఇలా జరగలేదు.
Portanto, houve grande alegria em Jerusalém; pois desde o tempo de Salomão, filho de Davi, rei de Israel, não havia nada assim em Jerusalém.
27 ౨౭ అప్పుడు లేవీయులైన యాజకులు లేచి ప్రజలను దీవిస్తే వారి మాటలు వినబడ్డాయి. వారి ప్రార్థన దేవుడు ఉండే పరిశుద్ధ స్థలం, అంటే పరలోకానికి చేరింది.
Então os sacerdotes levíticos se levantaram e abençoaram o povo. Sua voz foi ouvida, e suas orações chegaram até sua morada santa, até o céu.

< దినవృత్తాంతములు~ రెండవ~ గ్రంథము 30 >