< దినవృత్తాంతములు~ రెండవ~ గ్రంథము 3 >
1 ౧ తరువాత సొలొమోను యెరూషలేములో తన తండ్రి దావీదుకు యెహోవా ప్రత్యక్షమైనప్పుడు అతడు మోరీయా పర్వతంపై సిద్ధం చేసిన స్థలం లో ఒర్నాను అనే యెబూసీయుడికి చెందిన కళ్ళంలో యెహోవా మందిరం కట్టించడం మొదలుపెట్టాడు.
И поче Соломун зидати дом Господњи у Јерусалиму на брду Морији, које би показано Давиду оцу његовом на месту које беше приправио Давид, на гумну Орнана Јевусејина.
2 ౨ అతడు తన పాలనలో నాలుగో సంవత్సరం, రెండో నెల, రెండో రోజున దాన్ని ప్రారంభించాడు.
И поче зидати другог дана другог месеца четврте године царовања свог.
3 ౩ దేవుని మందిరానికి పునాదులు వేయించాడు. గతంలో ఉన్న కొలతల ప్రకారం దాని పొడవు అరవై మూరలు, వెడల్పు ఇరవై మూరలు.
А овако заснова Соломун да зида дом Божји: у дужину шездесет лаката по старој мери, а у ширину двадесет лаката.
4 ౪ మందిరం ముఖమంటపం వెడల్పు, పొడవు, ఎత్తు ఇరవై మూరలు. మూరలు. దాని లోపలి భాగాన్ని అతడు మేలిమి బంగారంతో పొదిగించాడు.
А трем који беше пред дужином уз ширину дома имаше двадесет лаката, а у висину сто и двадесет; и обложи га изнутра чистим златом.
5 ౫ మందిరం లోపలి పెద్ద గది పై కప్పును దేవదారు పలకలతో కప్పి వాటి పైన మేలిమి బంగారం పొదిగించి పై భాగంలో ఖర్జూరపు చెట్లు, గొలుసుల్లాంటి నగిషీ చెక్కించాడు.
А дом велики обложи дрветом јеловим, потом га обложи чистим златом, и озго начини палме и ланце.
6 ౬ ఆ మందిరాన్ని ప్రశస్తమైన రత్నాలతో అలంకరించాడు. దానికి వాడిన బంగారం పర్వాయీము నుండి వచ్చింది.
И обложи дом камењем драгим да је накићен, а злато беше парвајимско.
7 ౭ మందిరం దూలాలనూ స్తంభాలనూ గోడలనూ తలుపులనూ బంగారంతో పొదిగించి గోడల మీద కెరూబు ఆకారాలు చెక్కించాడు.
Обложи златом дом, греде, прагове и зидове и врата, и изреза херувиме по зидовима.
8 ౮ దానిలో సొలొమోను అతి పరిశుద్ధ స్థలాన్ని కట్టించాడు. దాని పొడవు మందిరపు వెడల్పును బట్టి ఇరవై మూరలు. దాని వెడల్పు ఇరవై మూరలు. ఇరవై వేల కిలోల మేలిమి బంగారంతో అతడు దాన్ని పొదిగించాడు.
И начини дом за светињу над светињама, дуг уз ширину дома двадесет лаката, и широк двадесет лаката и обложи га чистим златом, ког отиде до шест стотина таланата.
9 ౯ ఒక్కొక్క మేకు బరువు ఏభై తులాల బంగారం. గది పై భాగాలను అతడు బంగారంతో పొదిగించాడు.
А на клине даде педесет сикала злата; и клети обложи златом.
10 ౧౦ అతి పరిశుద్ధ స్థలం లో చెక్కడం పనితో రెండు కెరూబులు చేయించి వాటిని బంగారంతో పొదిగించాడు.
И начини у дому светиње над светињама два херувима, направе уметничке, и обложи их златом.
11 ౧౧ ఆ కెరూబుల రెక్కల మొత్తం పొడుగు 20 మూరలు. కెరూబు ఒక రెక్క పొడుగు ఐదు మూరలు. అది మందిరం గోడకి తగులుతూ ఉంది. రెండో రెక్క దానికి జతగా ఉన్న కెరూబు రెక్కకి తగులుతూ ఉంది.
И крила тих херувима имаху у дужину двадесет лаката: једно крило беше од пет лаката, и тицаше у зид од дома и друго крило беше од пет лаката, и тицаше у крило другог херувима;
12 ౧౨ రెండో కెరూబు రెక్క పొడుగు కూడా ఐదు మూరలు. అది మందిరం గోడకి తగులుతూ ఉంది. రెండో రెక్క దానికి జతగా ఉన్న కెరూబు రెక్కకి తగులుతూ ఉంది
Тако и другог херувима крило беше од пет лаката, и тицаше у зид од дома, и друго му крило беше од пет лаката и састављаше се с крилом другог херувима.
13 ౧౩ ఈ విధంగా ఈ కెరూబులు చాచిన రెక్కలు ఇరవై మూరలు వ్యాపించాయి. ఆ కెరూబులు తమ పాదాల మీద నిలబెట్టి ఉన్నాయి. వారి ముఖాలు మందిరం ప్రధాన గది వైపుకు తిరిగి ఉన్నాయి.
Крила тим херувимима беху раширена на двадесет лаката, а они стајаху на ногама својим, лицем окренутим у дом.
14 ౧౪ అతడు నీలి, ఊదా, ఎరుపు, సన్నని నార నూలుతో ఒక తెర చేయించి దాని మీద కెరూబు ఆకారాలను కుట్టించాడు.
И начини завес од порфире, од скерлета, од црвца и од танког платна, и по њему начини херувиме.
15 ౧౫ అంతే గాక ముందు 35 మూరల పొడవున్న రెండు స్తంభాలూ, వాటి మీదకి ఐదు మూరల పొడవున్న పీటలూ చేయించాడు.
И начини пред домом два ступа, у висину од тридесет и пет лаката, и оглавља озго на сваком од пет лаката.
16 ౧౬ గర్భాలయంలో చేసినట్టు గొలుసు పని చేయించి, స్తంభాల పైభాగంలో దాన్ని ఉంచి, నూరు దానిమ్మ కాయలు చేయించి ఆ గొలుసు పనికి తగిలించాడు.
И начини ланце као у светињи, и метну их на врх ступова, и начини сто шипака, и метну их међу ланце.
17 ౧౭ ఆ రెండు స్తంభాలనూ దేవాలయం ముందు కుడి వైపున ఒకటీ ఎడమ వైపున ఒకటీ నిలబెట్టి, కుడి వైపు దానికి “యాకీను” అనీ, ఎడమ వైపు దానికి “బోయజు” అనీ పేర్లు పెట్టాడు.
И постави ступове пред црквом, један с десне стране а други с леве, и десни назва Јахин, а леви Воас.