< దినవృత్తాంతములు~ రెండవ~ గ్రంథము 3 >

1 తరువాత సొలొమోను యెరూషలేములో తన తండ్రి దావీదుకు యెహోవా ప్రత్యక్షమైనప్పుడు అతడు మోరీయా పర్వతంపై సిద్ధం చేసిన స్థలం లో ఒర్నాను అనే యెబూసీయుడికి చెందిన కళ్ళంలో యెహోవా మందిరం కట్టించడం మొదలుపెట్టాడు.
I poèe Solomun zidati dom Gospodnji u Jerusalimu na brdu Moriji, koje bi pokazano Davidu ocu njegovu na mjestu koje bješe pripravio David, na gumnu Ornana Jevusejina.
2 అతడు తన పాలనలో నాలుగో సంవత్సరం, రెండో నెల, రెండో రోజున దాన్ని ప్రారంభించాడు.
A poèe zidati drugoga dana drugoga mjeseca èetvrte godine carovanja svojega.
3 దేవుని మందిరానికి పునాదులు వేయించాడు. గతంలో ఉన్న కొలతల ప్రకారం దాని పొడవు అరవై మూరలు, వెడల్పు ఇరవై మూరలు.
A ovako zasnova Solomun da zida dom Božji: u dužinu šezdeset lakata po staroj mjeri, a u širinu dvadeset lakata.
4 మందిరం ముఖమంటపం వెడల్పు, పొడవు, ఎత్తు ఇరవై మూరలు. మూరలు. దాని లోపలి భాగాన్ని అతడు మేలిమి బంగారంతో పొదిగించాడు.
A trijem koji bijaše pred dužinom uz širinu doma imaše dvadeset lakata, a u visinu sto i dvadeset; i obloži ga iznutra èistijem zlatom.
5 మందిరం లోపలి పెద్ద గది పై కప్పును దేవదారు పలకలతో కప్పి వాటి పైన మేలిమి బంగారం పొదిగించి పై భాగంలో ఖర్జూరపు చెట్లు, గొలుసుల్లాంటి నగిషీ చెక్కించాడు.
A dom veliki obloži drvetom jelovijem, potom ga obloži èistijem zlatom, i ozgo naèini palme i lance.
6 ఆ మందిరాన్ని ప్రశస్తమైన రత్నాలతో అలంకరించాడు. దానికి వాడిన బంగారం పర్వాయీము నుండి వచ్చింది.
I obloži dom kamenjem dragim da je nakiæen, a zlato bijaše Parvajimsko.
7 మందిరం దూలాలనూ స్తంభాలనూ గోడలనూ తలుపులనూ బంగారంతో పొదిగించి గోడల మీద కెరూబు ఆకారాలు చెక్కించాడు.
Obloži zlatom dom, grede, pragove i zidove i vrata, i izreza heruvime po zidovima.
8 దానిలో సొలొమోను అతి పరిశుద్ధ స్థలాన్ని కట్టించాడు. దాని పొడవు మందిరపు వెడల్పును బట్టి ఇరవై మూరలు. దాని వెడల్పు ఇరవై మూరలు. ఇరవై వేల కిలోల మేలిమి బంగారంతో అతడు దాన్ని పొదిగించాడు.
I naèini dom za svetinju nad svetinjama, dug uz širinu doma dvadeset lakata i širok dvadeset lakata, i obloži ga èistijem zlatom, kojega otide do šest stotina talanata.
9 ఒక్కొక్క మేకు బరువు ఏభై తులాల బంగారం. గది పై భాగాలను అతడు బంగారంతో పొదిగించాడు.
A na kline dade pedeset sikala zlata; i klijeti obloži zlatom.
10 ౧౦ అతి పరిశుద్ధ స్థలం లో చెక్కడం పనితో రెండు కెరూబులు చేయించి వాటిని బంగారంతో పొదిగించాడు.
I naèini u domu svetinje nad svetinjama dva heruvima, naprave umjetnièke, i obloži ih zlatom.
11 ౧౧ ఆ కెరూబుల రెక్కల మొత్తం పొడుగు 20 మూరలు. కెరూబు ఒక రెక్క పొడుగు ఐదు మూరలు. అది మందిరం గోడకి తగులుతూ ఉంది. రెండో రెక్క దానికి జతగా ఉన్న కెరూబు రెక్కకి తగులుతూ ఉంది.
I krila tijeh heruvima imahu u dužinu dvadeset lakata: jedno krilo bijaše od pet lakata, i ticaše u zid od doma, i drugo krilo bijaše od pet lakata, i ticaše u krilo drugoga heruvima;
12 ౧౨ రెండో కెరూబు రెక్క పొడుగు కూడా ఐదు మూరలు. అది మందిరం గోడకి తగులుతూ ఉంది. రెండో రెక్క దానికి జతగా ఉన్న కెరూబు రెక్కకి తగులుతూ ఉంది
Tako i drugoga heruvima krilo bijaše od pet lakata, i ticaše u zid od doma, i drugo mu krilo bijaše od pet lakata i sastavljaše se s krilom drugoga heruvima.
13 ౧౩ ఈ విధంగా ఈ కెరూబులు చాచిన రెక్కలు ఇరవై మూరలు వ్యాపించాయి. ఆ కెరూబులు తమ పాదాల మీద నిలబెట్టి ఉన్నాయి. వారి ముఖాలు మందిరం ప్రధాన గది వైపుకు తిరిగి ఉన్నాయి.
Krila tijem heruvimima bijahu raširena na dvadeset lakata, a oni stajahu na nogama svojim, licem okrenutim u dom.
14 ౧౪ అతడు నీలి, ఊదా, ఎరుపు, సన్నని నార నూలుతో ఒక తెర చేయించి దాని మీద కెరూబు ఆకారాలను కుట్టించాడు.
I naèini zavjes od porfire, od skerleta, od crvca i od tankoga platna, i po njemu naèini heruvime.
15 ౧౫ అంతే గాక ముందు 35 మూరల పొడవున్న రెండు స్తంభాలూ, వాటి మీదకి ఐదు మూరల పొడవున్న పీటలూ చేయించాడు.
I naèini pred domom dva stupa, u visinu od trideset i pet lakata, i oglavlja ozgo na svakom od pet lakata.
16 ౧౬ గర్భాలయంలో చేసినట్టు గొలుసు పని చేయించి, స్తంభాల పైభాగంలో దాన్ని ఉంచి, నూరు దానిమ్మ కాయలు చేయించి ఆ గొలుసు పనికి తగిలించాడు.
I naèini lance kao u svetinji, i metnu ih na vrh stupova, i naèini sto šipaka, i metnu ih meðu lance.
17 ౧౭ ఆ రెండు స్తంభాలనూ దేవాలయం ముందు కుడి వైపున ఒకటీ ఎడమ వైపున ఒకటీ నిలబెట్టి, కుడి వైపు దానికి “యాకీను” అనీ, ఎడమ వైపు దానికి “బోయజు” అనీ పేర్లు పెట్టాడు.
I postavi stupove pred crkvom, jedan s desne strane a drugi s lijeve, i desni nazva Jahin a lijevi Voas.

< దినవృత్తాంతములు~ రెండవ~ గ్రంథము 3 >