< దినవృత్తాంతములు~ రెండవ~ గ్రంథము 24 >
1 ౧ యోవాషు పరిపాలించడం మొదలు పెట్టినప్పుడు అతని వయస్సు ఏడేళ్ళు. అతడు యెరూషలేములో 40 ఏళ్ళు పాలించాడు. అతని తల్లి బెయేర్షెబాకు చెందిన జిబ్యా.
Yoas dii ɔhene no, na wadi mfeɛ nson, na ɔdii adeɛ Yerusalem mfirinhyia aduanan. Na ne maame din de Sibia a ɔfiri Beer-Seba.
2 ౨ యాజకుడు యెహోయాదా బతికిన రోజులన్నీ యోవాషు యెహోవా దృష్టికి యథార్ధంగా ప్రవర్తించాడు.
Yoas yɛɛ deɛ ɛsɔ Awurade ani, ɔsɔfoɔ Yehoiada nkwa nna nyinaa.
3 ౩ యెహోయాదా అతనికి ఇద్దరు స్త్రీలనిచ్చి పెళ్ళి చేశాడు. అతనికి కొడుకులూ, కూతుళ్ళూ కలిగారు.
Yehoiada maa Yoas ɔyerenom baanu a ɔne wɔn wowoo mmammarima ne mmammaa.
4 ౪ ఇదంతా జరిగిన తరువాత యెహోవా మందిరాన్ని బాగుచేయాలని యోవాషు నిర్ణయించుకున్నాడు.
Akyire no, Yoas yɛɛ nʼadwene sɛ ɔbɛsiesie Awurade Asɔredan no.
5 ౫ అతడు యాజకులనూ లేవీయులనూ ఒక చోట సమావేశపరచి వారితో ఇలా అన్నాడు “మీరు యూదా పట్టణాలకు పోయి మీ దేవుని మందిరం బాగుచేయడానికి ఇశ్రాయేలీయులందరి దగ్గర నుంచి ధనం ప్రతి సంవత్సరం పోగుచేయాలి. ఈ పని మీరు త్వరగా మొదలుపెట్టాలి.” మొదట్లో లేవీయులు ఆ పని త్వరగా చేయలేదు.
Enti, ɔfrɛfrɛɛ asɔfoɔ ne Lewifoɔ ka kyerɛɛ wɔn sɛ, “Monkɔ Yuda nkuro nyinaa so ntɛm, na monkɔgyegye afirinhyiatoɔ, sɛdeɛ yɛbɛtumi asiesie mo Onyankopɔn Asɔredan no. Monntwentwɛn koraa.” Nanso, Lewifoɔ no ankɔ prɛko pɛ.
6 ౬ అందుకు రాజు ప్రధాన యాజకుడు యెహోయాదాను పిలిపించాడు. “సాక్ష్యపు గుడారాన్ని బాగు చేయడానికి యూదాలో నుండీ, యెరూషలేములో నుండీ, ఇశ్రాయేలీయుల సమాజానికి యెహోవా సేవకుడైన మోషే నిర్ణయించిన కానుకను లేవీయులతో నీవెందుకు చెప్పి తెప్పించ లేదు?” అని అడిగాడు.
Na ɔhene no frɛɛ ɔsɔfopanin Yehoiada bisaa no sɛ, “Adɛn enti na wommisaa Lewifoɔ no deɛ enti a wɔnkɔɔ Yuda nkuro so ne Yerusalem nkɔgyegyee Asɔredan ho toɔ no? Mose, Awurade ɔsomfoɔ, gyegyee ɔman Israel saa toɔ yi, sɛdeɛ ɛbɛyɛ a, ɔbɛtumi asiesie Apam Ntomadan no.”
7 ౭ ఎందుకంటే దుర్మార్గురాలైన అతల్యా కొడుకులు దేవుని మందిరాన్ని పాడు చేసి, యెహోవా మందిర సంబంధమైన ప్రతిష్ఠ ఉపకరణాలన్నిటినీ బయలు దేవుడి పూజకు ఉపయోగించారు.
Mfeɛ pii mu no, otirimuɔdenfoɔ Atalia akyidifoɔ bɔ wuraa Onyankopɔn Asɔredan mu, na nneɛma a wɔahyira so wɔ Awurade Asɔredan no mu no nyinaa, wɔfa de somm Baal ahoni.
8 ౮ కాబట్టి రాజాజ్ఞ ప్రకారం వారు ఒక పెట్టెను చేయించి యెహోవా మందిర ద్వారం బయట ఉంచారు.
Enti, afei, Yoas hyɛɛ sɛ wɔnyɛ adaka bi mfa nsi ɛkwan a ɛkɔ Awurade Asɔredan no akyi.
9 ౯ దేవుని సేవకుడైన మోషే, అరణ్యంలో ఉన్నప్పుడు ఇశ్రాయేలీయులకు నిర్ణయించిన కానుకను యెహోవా దగ్గరికి ప్రజలు తీసుకు రావాలని యూదాలోనూ యెరూషలేములోనూ వారు చాటించారు.
Enti, wɔde too Yudafoɔ ne Yerusalemfoɔ anim sɛ, wɔmfa ɛtoɔ a Mose, Onyankopɔn ɔsomfoɔ gyegyee Israelfoɔ wɔ ɛserɛ so no mmrɛ Awurade.
10 ౧౦ అధికారులందరూ ప్రజలందరూ సంతోషంగా కానుకలు తెచ్చి, పెట్టె నిండేంత వరకూ దానిలో వేశారు.
Ntuanofoɔ no ne ɔmanfoɔ no penee so, enti wɔde anigyeɛ de wɔn sika bɛhyɛɛ adaka no ma.
11 ౧౧ లేవీయులు ఆ పెట్టెను రాజు అధికారుల దగ్గరికి తీసుకువచ్చిన ప్రతిసారీ, అందులో చాలా ధనం కనిపించినప్పుడల్లా రాజు కార్యదర్శి, ప్రధాన యాజకుని అధికారీ వచ్చి, పెట్టె ఖాళీ చేసి దాన్ని యథాస్థానంలో ఉంచేవారు. అనుదినం వారు ఇలా చేస్తూ చాలా ధనం సమకూర్చారు.
Ɛberɛ biara a adaka no bɛyɛ ma no, Lewifoɔ no soa de kɔma ɔhene mpanimfoɔ. Na asɛnniiɛ twerɛfoɔ ne ɔsɔfopanin ananmusini bi akan sika no, na wɔasane de adaka no akɔsi Asɔredan no ɛpono ano bio. Wɔyɛɛ saa daa, na wɔnyaa sika bebree.
12 ౧౨ అప్పుడు రాజు, యెహోయాదా, యెహోవా మందిరంలో పనిచేసే వారికి ఆ ధనాన్ని ఇచ్చారు. యెహోవా మందిరాన్ని బాగుచేయడానికి రాతి పని చేసే వారిని, వడ్రంగి వారిని, ఇనుప పనీ, ఇత్తడి పనీ చేసే వారిని కూలికి తీసుకున్నారు.
Ɔhene no ne Yehoiada de sika no maa adansie sohwɛfoɔ, ma wɔfaa adansifoɔ ne nnua dwumfoɔ, ma wɔsiesiee Awurade Asɔredan no. Afei, wɔfaa nnadeɛ adwumfoɔ maa wɔde nnadeɛ ne kɔbere mfrafraeɛ yɛɛ Awurade Asɔredan no ho nneɛma.
13 ౧౩ ఈ విధంగా పనివారు కష్టించి పనిచేస్తుంటే మందిర మరమ్మత్తు చక్కగా కొనసాగింది. వారు దేవుని మందిరాన్ని దాని పూర్వస్థితికి తెచ్చి దాన్ని దృఢపరచారు.
Na mmarima a wɔhwɛ ɛdan no nsiesie so no yɛɛ adwumaden ma adwuma no kɔɔ so sɛdeɛ ɛfata. Wɔsii Onyankopɔn Asɔredan no wɔ ne tebea dada no sɛso na wɔhyɛɛ mu den.
14 ౧౪ వారు దాన్ని పూర్తి చేసిన తరువాత మిగిలిన ధనాన్ని రాజు దగ్గరికీ, యెహోయాదా దగ్గరికీ తీసుకువచ్చారు. ఆ డబ్బుతో వారు యెహోవా మందిరానికి సంబంధించిన వస్తువులనూ, సేవకు ఉపయోగపడే వస్తువులనూ, దహనబలికి ఉపయోగపడే వస్తువులనూ, గరిటెలనూ, వెండీ బంగారు ఉపకరణాలనూ చేయించారు. యెహోయాదా జీవించి ఉన్న రోజులన్నిటిలో వారు యెహోవా మందిరంలో దహనబలులను కొనసాగించారు.
Wɔwiee nsiesie no, wɔde sika no nkaeɛ brɛɛ ɔhene no ne Yehoiada. Wɔde yɛɛ nneɛma ahodoɔ a wɔde bi som, de bi bɔ ɔhyeɛ afɔdeɛ a nkwankoraa ne atam ahodoɔ a wɔde sikakɔkɔɔ ne dwetɛ ayɛ nso ka ho. Na wɔde kɔguu Awurade asɔredan no mu. Ɛberɛ a na ɔsɔfoɔ Yehoiada te ase no, na wɔtaa bɔ ɔhyeɛ afɔdeɛ wɔ Awurade Asɔredan mu hɔ.
15 ౧౫ యెహోయాదా వయసు మీరి పండు వృద్ధాప్యంలో చనిపోయాడు. అతడు చనిపోయినప్పుడు అతని వయస్సు 130 ఏళ్ళు.
Yehoiada nyinii yie, ɔwuiɛ no na wadi mfirinhyia ɔha ne aduasa.
16 ౧౬ అతడు ఇశ్రాయేలీయుల్లో దేవుని కోసం, దేవుని ఇంటి కోసం మంచి మేలు చేశాడు కాబట్టి వారు అతణ్ణి దావీదు పట్టణంలో రాజుల దగ్గర పాతిపెట్టారు.
Wɔsiee no ahemfo asieeɛ wɔ Dawid kurom, ɛfiri sɛ, na wayɛ adwuma pa wɔ Israel, ama Onyankopɔn ne nʼAsɔredan no.
17 ౧౭ యెహోయాదా చనిపోయిన తరువాత యూదా అధికారులు వచ్చి రాజును గౌరవించారు. రాజు వారి మాటలు విన్నాడు.
Yehoiada owuo akyi no, Yuda ntuanofoɔ bɛkotoo ɔhene Yoas anim, srɛɛ no sɛ ɔntie wɔn afotuo.
18 ౧౮ ప్రజలు తమ పూర్వీకుల దేవుడైన యెహోవా మందిరాన్ని విడిచి, అషేరా దేవతాస్తంభాలను, విగ్రహాలను పూజించారు. వారు చేసిన ఈ దుర్మార్గానికి యూదావారి మీదికీ యెరూషలేము నివాసుల మీదికీ దేవుని కోపం వచ్చింది.
Wɔyɛɛ wɔn adwene sɛ wɔbɛgya Awurade, wɔn agyanom Onyankopɔn Asɔredan no, na wɔasom Asera afɔrebukyia no ne ahoni no mmom. Na Onyankopɔn abufuo baa Yuda ne Yerusalem so wɔ wɔn bɔne enti.
19 ౧౯ అయినా తన వైపు వారిని మళ్లించడానికి యెహోవా వారి దగ్గరికి ప్రవక్తలను పంపాడు. ఆ ప్రవక్తలు వారికి వ్యతిరేకంగా సాక్ష్యం పలికారు గానీ ప్రజలు వారి మాట వినలేదు.
Awurade somaa adiyifoɔ sɛ wɔnkɔfa wɔn mmrɛ no, nanso nnipa no ampene.
20 ౨౦ అప్పుడు దేవుని ఆత్మ యాజకుడు యెహోయాదా కొడుకూ అయిన జెకర్యా మీదికి వచ్చాడు. అతడు ప్రజల ముందు నిలబడి “మీరెందుకు యెహోవా ఆజ్ఞలను ధిక్కరిస్తున్నారు? మీరు వర్ధిల్లరు. మీరు యెహోవాను వదిలివేశారు కాబట్టి ఆయన మిమ్మల్ని వదిలివేశాడని దేవుడు చెబుతున్నాడు” అన్నాడు.
Afei, Onyankopɔn Honhom baa ɔsɔfoɔ Yehoiada babarima Sakaria so. Ɔgyinaa nnipa no anim kaa sɛ, “Sɛdeɛ Onyankopɔn seɛ nie: Adɛn enti na monni Awurade ahyɛdeɛ so? Morennya nkɔsoɔ ɛfiri sɛ, moagya Awurade ama ɔno nso agya mo!”
21 ౨౧ అయితే వారతని మీద కుట్ర పన్ని రాజాజ్ఞతో యెహోవా మందిర ఆవరణం లోపల రాళ్ళు రువ్వి అతణ్ణి చంపేశారు.
Na ntuanofoɔ no yɛɛ apam wɔ Sakaria ho sɛ wɔbɛkum no. Na ɔhene Yoas ankasa hyɛ ma wɔsii no aboɔ, kumm no wɔ Awurade Asɔredan no adihɔ hɔ.
22 ౨౨ ఈ విధంగా రాజైన యోవాషు జెకర్యా తండ్రి యెహోయాదా తనకు చేసిన ఉపకారాన్ని మరిచిపోయి అతని కొడుకుని చంపించాడు. అతడు చనిపోయేటప్పుడు “యెహోవా దీన్ని చూసి విచారణ చేస్తాడు గాక” అన్నాడు.
Na ɔhene Yoas ankae adɔeɛ a nʼagya Yehoiada de yɛɛ no no, na ɔkumm ne babarima. Sakaria rewuo no, nsɛm a ɔka twaa toɔ ne sɛ, “Awurade nhunu deɛ wɔreyɛ na ɔmma wɔmmu ho akonta!”
23 ౨౩ ఆ సంవత్సరం చివరిలో అరాము సైన్యం యోవాషు మీదికి వచ్చింది. వారు యూదా మీదికీ యెరూషలేము మీదికీ వచ్చి, ప్రజల అధికారులందరినీ హతమార్చి, దోపిడీ సొమ్మంతా దమస్కు రాజు దగ్గరికి పంపారు.
Afe no ahyɛaseɛ no, Aram akodɔm bɔɔ nsra baa Yoas so. Wɔkaa Yuda ne Yerusalem hyɛeɛ, kunkumm ntuanofoɔ a wɔwɔ ɔman no mu nyinaa. Na wɔfaa asadeɛ a wɔnyaeɛ nyinaa, de kɔmaa wɔn ɔhene wɔ Damasko.
24 ౨౪ అరామీయుల సైన్యం చిన్నదే అయినా యెహోవా ఒక గొప్ప సైన్యంపై వారికి విజయం దయచేశాడు. ఎందుకంటే, యూదావారు తమ పూర్వీకుల దేవుడైన యెహోవాను వదిలి వేశారు. ఈ విధంగా అరామీయులు యోవాషుకు శిక్ష అమలు చేశారు.
Ɛwom sɛ Aram dɔm a wɔkɔto hyɛɛ wɔn so no sua deɛ, nanso, Awurade boaa wɔn maa wɔdii Yuda akodɔm kɛseɛ no so nkonim. Yudafoɔ gyaa Awurade, wɔn agyanom Onyankopɔn, ɛno enti Awurade buu atɛn tiaa Yoas.
25 ౨౫ అరామీయులు వెళ్ళిపోయేటప్పటికి యోవాషు తీవ్ర గాయాలతో ఉన్నాడు. యాజకుడైన యెహోయాదా కొడుకులను చంపించినందుకు అతని సొంత సేవకులు అతని మీద కుట్ర చేశారు. అతని పడక మీదే అతణ్ణి చంపేశారు. అతడు చనిపోయిన తరువాత ప్రజలు దావీదు పట్టణంలో అతణ్ణి పాతిపెట్టారు గానీ రాజుల సమాధుల్లో అతణ్ణి పాతిపెట్టలేదు.
Aramfoɔ twee wɔn ho na wɔgyaa Yoas a na wapira yie no hɔ. Nanso, ɔno ankasa mpanimfoɔ dwenee ho sɛ, ɛsiane sɛ ɔkumm ɔsɔfoɔ Yehoiada babarima enti, wɔbɛkum no. Wɔkumm no wɔ ɛberɛ a ɔda mpa so. Na wɔsiee no Dawid kurom a wɔankɔsie no wɔ adehyeɛ amusieeɛ.
26 ౨౬ అమ్మోనీయురాలైన షిమాతు కొడుకు జాబాదు, మోయాబీయురాలు అయిన షిమ్రీతు కొడుకు యెహోజాబాదు అనేవారు అతని మీద కుట్ర చేశారు.
Na awudifoɔ no yɛ Yosabat a ɔyɛ Amonni baa Simeat babarima, ne Somer a ɔyɛ Moabni baa Simrit babarima.
27 ౨౭ యోవాషు కొడుకులను గురించీ, అతని గురించి చెప్పిన ముఖ్యమైన ప్రవచనాల గురించీ, దేవుని మందిరాన్ని పునర్నిర్మించడం గురించీ, రాజుల గ్రంథ వ్యాఖ్యానంలో రాసి ఉంది. అతనికి బదులు అతని కొడుకు అమజ్యా రాజయ్యాడు.
Wɔatwerɛ nsɛm a ɛfa Yoas mmammarima, ne ho nkɔmhyɛ, ne Onyankopɔn Asɔredan no nsiesie wɔ Ahene nwoma nkyerɛmu no mu. Yoas wuiɛ no, ne babarima Amasia dii nʼadeɛ sɛ ɔhene.