< దినవృత్తాంతములు~ రెండవ~ గ్రంథము 22 >
1 ౧ యెరూషలేము నివాసులు యెహోరాము ఆఖరి కొడుకు అహజ్యాను అతనికి బదులు రాజుగా చేశారు. ఎందుకంటే, అరబీయులతో కూడ శిబిరం పైకి దండెత్తి వచ్చినవారు అతని పెద్దకొడుకులందరినీ చంపేశారు. ఈ విధంగా యూదారాజు యెహోరాము కొడుకు అహజ్యా రాజయ్యాడు.
Àwọn ènìyàn Jerusalẹmu mú Ahasiah, ọmọ Jehoramu tí ó kéré jùlọ, jẹ ọba ní ipò rẹ̀, láti ìgbà tí àwọn onísùnmọ̀mí, tí ó wá pẹ̀lú àwọn ará Arabia sínú ibùdó, tí wọn sì ti pa àwọn ọmọkùnrin àgbà. Bẹ́ẹ̀ ni Ahasiah ọmọ Jehoramu ọba Juda bẹ̀rẹ̀ sí ní jẹ ọba.
2 ౨ అహజ్యా పరిపాలన మొదలు పెట్టినప్పుడు 42 ఏళ్ల వయసులో యెరూషలేములో ఒక్క సంవత్సరం పాలించాడు. అతని తల్లి ఒమ్రీ కుమార్తె, ఆమె పేరు అతల్యా.
Ahasiah jẹ́ ẹni ọdún méjìlélógún nígbà tí ó di ọba. Ó sì jẹ ọba ní Jerusalẹmu fún ọdún kan. Orúkọ ìyá rẹ̀ a máa jẹ́ Ataliah, ọmọ ọmọbìnrin Omri.
3 ౩ దుర్మార్గంగా ప్రవర్తించడం అతని తల్లి అతనికి నేర్పిస్తూ వచ్చింది, కాబట్టి అతడు కూడా అహాబు ఇంటి వారి పద్ధతుల్లో నడిచాడు.
Ó mú ìrìn ní ọ̀nà ilé Ahabu. Nítorí tí ìyá rẹ̀ kì í láyà nínú ṣíṣe búburú.
4 ౪ అహాబు ఇంటివారు చేసినట్లుగా అతడు యెహోవా దృష్టిలో దుర్మార్గంగా ప్రవర్తించాడు. అతని తండ్రి చనిపోయిన తరువాత వారు అతనికి సలహాదారులుగా ఉండి అతని నాశనానికి కారణమయ్యారు.
Ó ṣe búburú ní ojú Olúwa, gẹ́gẹ́ bí ilé Ahabu ti ṣe, nítorí lẹ́yìn ikú baba a rẹ̀, wọ́n di olùgbani nímọ̀ràn rẹ̀ sí ṣíṣe rẹ̀.
5 ౫ వారి సలహా ప్రకారమే అతడు కూడా ప్రవర్తించాడు. అతడు రామోతు గిలాదులో అరాము రాజు హజాయేలుతో యుద్ధం చేయడానికి అహాబు కొడుకూ, ఇశ్రాయేలు రాజూ అయిన యెహోరాముతో కూడా వెళ్ళాడు. అరామీయులు యెహోరామును గాయపరిచారు.
Ó tẹ̀lé ìgbìmọ̀ wọn nígbà tí ó lọ pẹ̀lú Joramu ọmọ Ahabu ọba Israẹli láti gbógun ti Hasaeli ọba Aramu ní Ramoti Gileadi. Àwọn ará Aramu ṣá Joramu ní ọgbẹ́;
6 ౬ అరాము రాజు అయిన హజాయేలుతో తాను రమాలో చేసిన యుద్ధంలో తనకు తగిలిన గాయాలను బాగుచేసుకోడానికి అతడు యెజ్రెయేలుకు తిరిగి వచ్చాడు. అహాబు కొడుకు యెహోరాము గాయపడ్డాడని విని యూదా రాజు యెహోరాము కొడుకు అహజ్యా అతనిని చూడడానికి యెజ్రెయేలు వెళ్ళాడు.
bẹ́ẹ̀ ni ó padà sí Jesreeli láti wo ọgbẹ́ rẹ̀ sàn tí wọ́n ti dá sí i lára ní Rama ní ojú ogun rẹ̀ pẹ̀lú Hasaeli ọba Siria. Nígbà náà, Ahasiah, ọmọ Jehoramu ọba Juda lọ sí Jesreeli láti lọ rí Joramu ọmọ Ahabu nítorí a ti ṣá a lọ́gbẹ́.
7 ౭ యెహోరాము దగ్గరికి అహజ్యా రావడం వలన దేవుడు అతనికి నాశనం కలిగించాడు. అతడు వచ్చినప్పుడు అహాబు సంతతి వారిని నిర్మూలం చేయడానికి యెహోవా అభిషేకించిన నింషీ కొడుకు యెహూ మీదికి అతడు యెహోరాముతో కలిసి వెళ్ళాడు.
Ní gbogbo ìgbà ìbẹ̀wò Ahasiah sí Joramu, Ọlọ́run mú ìṣubú Ahasiah wá. Nígbà tí Ahasiah dé, ó jáde lọ pẹ̀lú Jehoramu láti lọ bá Jehu ọmọ Nimṣi, ẹni tí Olúwa ti fi àmì òróró yàn láti pa ìdílé Ahabu run.
8 ౮ యెహూ అహాబు సంతతి వారి మీద తీర్పు తీర్చడానికి వచ్చినప్పుడు అతడు యూదావారి అధికారులనూ, అహజ్యాకు సేవచేస్తున్న అహజ్యా సోదరుల కొడుకులనూ చూసి వారిని చంపేశాడు.
Nígbà tí Jehu ń ṣe ìdájọ́ lórí ilé Ahabu, ó rí àwọn ọmọbìnrin ọba ti Juda àti àwọn ọmọkùnrin ìbátan Ahasi, tí ó ń tọ́jú Ahasiah, ó sì pa wọ́n.
9 ౯ తరువాత అతడు అహజ్యా కోసం వెతికాడు. అతడు షోమ్రోనులో దాగి ఉంటే వారు అతణ్ణి పట్టుకుని యెహూ దగ్గరికి తీసుకువచ్చారు. వారు అతణ్ణి చంపిన తరువాత “ఇతడు యెహోవాను హృదయపూర్వకంగా వెతికిన యెహోషాపాతు కొడుకు గదా” అనుకుని అతణ్ణి పాతిపెట్టారు. కాబట్టి రాజ్యమేలడానికి అహజ్యా ఇంట్లో ఎవరూ లేకుండా పోయారు.
Ó lọ láti wá Ahasiah, àti àwọn ọkùnrin rẹ̀. Àwọn arákùnrin rẹ̀ ṣẹ́gun rẹ̀ nígbà tí ó sá pamọ́ ní Samaria. A gbé e wá sí ọ̀dọ̀ Jehu, a sì pa á. Wọ́n sin ín nítorí wọ́n wí pé, “Ọmọkùnrin Jehoṣafati ni, ẹni tí ó wá Olúwa pẹ̀lú gbogbo ọkàn rẹ̀.” Bẹ́ẹ̀ ni kò sí ẹnìkan ní ilé Ahasiah tí ó lágbára láti gbé ìjọba náà dúró.
10 ౧౦ అహజ్యా తల్లి అతల్యా తన కొడుకు చనిపోయాడని విని, యూదావారి సంబంధులైన రాజ వంశస్తులందరినీ చంపేసింది.
Nígbà tí Ataliah ìyá Ahasiah rí i wí pé ọmọkùnrin rẹ̀ ti kú, ó tẹ̀síwájú láti pa gbogbo ìdílé ọba ti ilẹ̀ Juda run.
11 ౧౧ అయితే రాజైన యెహోరాము కుమార్తె యెహోషబతు అహజ్యా కొడుకు యోవాషును, మరణమైన రాకుమారుల్లోనుండి రహస్యంగా తెచ్చి, అతనిని, అతని దాదిని ఒక పడకగదిలో దాచింది. యెహోరాము రాజు కుమార్తె, యెహోయాదా అనే యాజకుని భార్య యెహోషబతు అతల్యాకు కనబడకుండా అతణ్ణి దాచిపెట్టింది గనక అతల్యా ఆ పసివాణ్ణి చంపలేకపోయింది. ఈ యెహోషబతు అహజ్యాకు సోదరి.
Ṣùgbọ́n Jehoṣeba ọmọbìnrin ọba Jehoramu mú Joaṣi, ọmọkùnrin Ahasiah ó sì jí gbé lọ kúrò láàrín àwọn ọmọbìnrin ọba, àwọn tí ó kù díẹ̀ kí wọn pa. Wọn gbé òun àti olùtọ́jú rẹ̀ sínú ìyẹ̀wù. Nítorí Jehoṣeba ọmọbìnrin ọba Jehoramu àti ìyàwó àlùfáà Jehoiada jẹ́ arábìnrin Ahasiah. Ó fi ọmọ náà pamọ́ kúrò fún Ataliah, kí ó má ba à pa á.
12 ౧౨ ఆరు సంవత్సరాలు అతణ్ణి వారితో కూడా దేవుని మందిరంలో దాచారు. అప్పుడు అతల్యా దేశాన్ని పరిపాలించింది.
Ó wà ní ìpamọ́ pẹ̀lú wọn ni ilé Ọlọ́run fún ọdún mẹ́fà nígbà tí Ataliah ṣàkóso ilẹ̀ náà.