< దినవృత్తాంతములు~ రెండవ~ గ్రంథము 21 >

1 యెహోషాపాతు చనిపోయినప్పుడు తన పూర్వీకులతో పాటు అతణ్ణి దావీదు పట్టణంలో పాతిపెట్టారు. అతని కొడుకు యెహోరాము అతని బదులు రాజయ్యాడు.
Потом почину Јосафат код отаца својих, и би погребен код отаца својих у граду Давидовом; а на његово се место зацари Јорам, син његов.
2 యెహోషాపాతు కుమారులైన అజర్యా, యెహీయేలు, జెకర్యా, అజర్యా, మిఖాయేలు, షెఫట్య అనేవారు ఇతనికి సోదరులు. వీరంతా ఇశ్రాయేలు రాజు యెహోషాపాతు కొడుకులు.
А браћа му, синови Јосафатови, беху: Азарија и Јехило и Захарија и Азарија и Михаило и Сефатија; ти сви беху синови Јосафата цара Израиљевог.
3 వారి తండ్రి బహుమానాలుగా, వెండి, బంగారం ఇంకా ఎన్నో విలువైన వస్తువులను, యూదాదేశంలో గోడలున్న పట్టణాలను వారికిచ్చాడు. అయితే యెహోరాము తనకు పెద్ద కొడుకు కాబట్టి అతనికి రాజ్యాన్ని ఇచ్చాడు.
И отац им даде велике дарове, сребра и злата и заклада с тврдим градовима у земљи Јудиној; царство пак даде Јораму, јер беше првенац.
4 యెహోరాము తన తండ్రి రాజ్యాన్ని పరిపాలించడం మొదలుపెట్టి తన అధికారం సుస్థిరం చేసుకున్న తరువాత తాను స్థిరపడి, తన సోదరులందరినీ ఇశ్రాయేలీయుల అధిపతుల్లో కొంత మందినీ చంపేసాడు.
А Јорам ступивши на царство оца свог и утврдивши се, поби сву браћу своју мачем и неке кнезове Израиљеве.
5 యెహోరాము పరిపాలించడం మొదలుపెట్టినప్పుడు అతనికి 32 ఏళ్ళు. అతడు యెరూషలేములో 8 ఏళ్ళు పాలించాడు.
Имаше Јорам тридесет и две године кад се зацари, и царова осам година у Јерусалиму.
6 అతడు అహాబు కూతుర్ని పెళ్లి చేసుకుని, అహాబు సంతతివారు నడచిన ప్రకారం ఇశ్రాయేలు రాజుల పద్ధతుల్లో నడిచాడు. అతడు యెహోవా దృష్టికి ప్రతికూలంగా ప్రవర్తించాడు.
И хођаше путем царева Израиљевих, као што чињаше дом Ахавов, јер се ожени кћерју Ахавовом; и чињаше што је зло пред Господом.
7 అయినా యెహోవా తాను దావీదుతో చేసిన నిబంధన బట్టి, అతనికీ అతని కుమారులకూ ఎప్పుడూ జీవమిస్తానని చేసిన వాగ్దానం కోసం దావీదు సంతతిని నాశనం చేయడానికి ఇష్టపడలేదు.
Али Господ не хте затрти дом Давидов ради завета који учини с Давидом и што му беше рекао да ће дати видело њему и синовима његовим увек.
8 యెహోరాము రోజుల్లో యూదా రాజుల అధికారానికి వ్యతిరేకంగా ఎదోమీయులు తిరుగుబాటు చేసి తమకు ఒక రాజును ఉంచుకున్నారు.
За његовог времена одврже се Едом да не буде под Јудом, и поставише себи цара.
9 యెహోరాము తన అధికారులను వెంటబెట్టుకుని, తన రథాలన్నిటితో బయలుదేరి రాత్రివేళ లేచి తనను చుట్టుముట్టిన ఎదోమీయులనూ రథాధిపతులను చంపేసాడు.
Зато отиде Јорам с војводама својим и са свим колима својим; и уста ноћу, те поби Едомце који га беху опколили, и заповеднике од кола.
10 ౧౦ కాబట్టి ఇప్పటి వరకూ ఎదోమీయులు యూదావారి అధికారం కింద ఉండక తిరుగుబాటు చేస్తూనే ఉన్నారు. యెహోరాము తన పూర్వీకుల దేవుడైన యెహోవాను విస్మరించినందుకు అదే సమయంలో లిబ్నా పట్టణం కూడా అతని అధికారం కింద ఉండకుండాా తిరుగుబాటు చేసింది.
Ипак се одвргоше Едомци да не буду под Јудом до данас. У исто време одврже се Ливна да не буде под њим, јер остави Господа Бога отаца својих.
11 ౧౧ యెహోరాము యూదా కొండల్లో బలిపీఠాలు కట్టించి యెరూషలేము నివాసులు వేశ్యలా ప్రవర్తించేలా చేశాడు. ఈ విధంగా అతడు యూదావారిని తప్పుదారి పట్టించాడు.
Још и висине начини по брдима Јудиним, и наведе на прељубу Јерусалимљане и преласти Јуду.
12 ౧౨ ఏలీయా ప్రవక్త నుంచి ఒక ఉత్తరం యెహోరాముకు వచ్చింది. దానిలో ఇలా ఉంది. “నీ పితరుడైన దావీదు దేవుడైన యెహోవా ఇలా చెబుతున్నాడు. ‘నీవు నీ తండ్రియైన యెహోషాపాతు మార్గాల్లో గానీ యూదారాజు ఆసా మార్గాల్లో గానీ నడుచుకోకుండా
Тада му дође књига од Илије пророка, где му говораше: Овако вели Господ Бог Давида оца твог: Што ниси ходио путевима Јосафата, оца свог и путевима Асе, цара Јудиног,
13 ౧౩ ఇశ్రాయేలు రాజుల మార్గాల్లో నడచి అహాబు సంతతివారు చేసిన ప్రకారం యూదానూ యెరూషలేము నివాసులనూ వ్యభిచరింపజేసి, నీకంటే యోగ్యులైన నీ తండ్రి సంతానమైన నీ సోదరులను చంపావు.
Него си ходио путем царева Израиљевих и навео си на прељубу Јуду и Јерусалимљане, као што је дом Ахавов навео на прељубу Израиља, и још си побио браћу своју, дом оца свог, боље од себе,
14 ౧౪ కాబట్టి గొప్ప తెగులుతో యెహోవా నీ ప్రజలనూ నీ పిల్లలనూ నీ భార్యలనూ నీ సంపదనంతటినీ దెబ్బ తీస్తాడు.
Ево, Господ ће ударити великим злом народ твој и синове твоје и жене твоје и све што имаш.
15 ౧౫ నీవు పేగుల్లో ఘోరమైన జబ్బుతో రోగిష్టిగా ఉంటావు. రోజురోజుకూ ఆ జబ్బుతో నీ పేగులు చెడిపోతాయి.’”
И ти ћеш боловати тешко, од болести у цревима, да ће ти црева изаћи од болести, која ће трајати две године.
16 ౧౬ యెహోవా యెహోరాము మీదికి ఫిలిష్తీయులను, ఇతియోపియాకు దగ్గరగా ఉన్న అరబీయులను రేపాడు.
И тако подиже Господ на Јорама дух Филистејима и Арапима који живе од Етиопљана.
17 ౧౭ వారు యూదాదేశంపై దాడి చేసి దానిలో చొరబడి రాజనగరులో దొరికిన సంపదనంతా, అతని కొడుకులనూ భార్యలనూ పట్టుకెళ్ళారు. అతని కొడుకుల్లో చివరి వాడైన యెహోయాహాజు తప్ప అతనికి ఒక్క కొడుకును కూడా విడిచిపెట్టలేదు.
И они дошавши на земљу Јудину продреше у њу, и однесоше све благо што се нађе у дому царевом, и синове његове и жене његове, да му не оста ниједан син осим Јоахаза најмлађег сина његовог.
18 ౧౮ ఇదంతా జరిగిన తరువాత యెహోవా అతని కడుపులో నయం కాని జబ్బు కలిగించాడు.
И после свега тога удари га Господ болешћу у цревима, којој не беше лека.
19 ౧౯ రెండేళ్ళ తరువాత ఆ జబ్బు ముదిరి అతని పేగులు చెడిపోయి దుర్భరంగా చనిపోయాడు. అతని ప్రజలు అతని పూర్వీకులకు చేసిన అంత్యక్రియలు అతనికి చేయలేదు.
И дан по дан пролажаше, и кад се навршише две године, изиђоше му црева с болешћу и умре од тешких болова и народ му не пали мириса као што је чинио оцима његовим.
20 ౨౦ అతడు పరిపాలన చేయడం మొదలుపెట్టినప్పుడు 32 ఏళ్లవాడు. యెరూషలేములో 8 ఏళ్ళు పాలించి చనిపోయాడు. అతని మృతికి ఎవరూ విలపించలేదు. రాజుల సమాధుల్లో గాక దావీదు పట్టణంలో వేరే చోట ప్రజలు అతణ్ణి పాతిపెట్టారు.
Имаше тридесет и две године кад поче царовати, и царова осам година у Јерусалиму, и премину да нико не зажали за њим; и погребоше га у граду Давидовом, али не у гробу царском.

< దినవృత్తాంతములు~ రెండవ~ గ్రంథము 21 >